పక్కాగా కొలువులిచ్చే పాపులేషన్ స్టడీస్


Wed,November 28, 2018 06:18 AM

Students
సంప్రదాయ కోర్సులకు భిన్నంగా కొత్తదనం కావాలనుకునేవారికి, నిత్యనూతనంగా ఉండే కెరీర్ కోసం పలు భిన్నమైన కోర్సులు ఉన్నాయి. అయితే కేవలం కోర్సు చేస్తే సరిపోదు. అ తర్వాత ఉపాధి అవకాశాలు అవసరమే. ఉపాధికి, ఉన్నత విద్యకు, నిత్యనూతనత్వానికి, సమాజసేవకు అవకాశం కల్పించే విభిన్నమైన కోర్సుల వేదిక ఐఐపీఎస్. 2019 విద్యాసంవత్సరానికిగాను ఈ సంస్థలో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైన నేపథ్యంలో సంస్థ వివరాలు, అందించే కోర్సులు, ఉపాధి అవకాశాలపై సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం...

- ఐఐపీఎస్: ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్. ఈ రంగంలో నిపుణులను తయారుచేయటం, శాస్త్రీయ సమాచారాన్ని, జ్ఞానాన్ని, రూపొందించడం, పరస్పర జ్ఞానమార్పిడి, అవగాహన పెంపొందించడం మిషన్‌గా దీన్ని ప్రారంభించారు.

ఎక్కడ- ఎప్పుడు

- 1956, జూలైలో దీన్ని డెమోగ్రఫిక్ ట్రెయినింగ్ అండ్ రిసెర్చ్ సెంటర్‌గా ముంబైలో ప్రారంభించారు. అనంతరం 1970లో దీన్ని ఐఐపీఎస్‌గా మార్చారు. టాటా ట్రస్ట్, భారత ప్రభుత్వం, యూఎన్‌వో సంయుక్త సంస్థ ఇది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పరిధిలో ఈ సంస్థ పనిచేస్తుంది. 1985లో ఈ సంస్థను డీమ్డ్ యూనివర్సిటీగా కేంద్రం ప్రకటించింది.
image

ప్రత్యేకతలు

- పాపులేషన్, హెల్త్ సంబంధ బోధన, రిసెర్చ్‌కు ఐఐపీఎస్ హబ్‌గా మారింది. గత కొన్నేండ్లుగా ఆసియా, పసిఫిక్ రీజియన్, ఆఫ్రికా, నార్త్ అమెరికా దేశాల విద్యార్థులు ఇక్కడ కోర్సులు చేయడానికి వస్తున్నారు. జాతీయ, అంతర్జాతీస్థాయిలో ఈ సంస్థ పేరుగాంచింది.

ఉపాధి అవకాశాలు

- ఇక్కడ పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ చదివిన విద్యార్థులకు అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పలు ప్రభుత్వ, ప్రైవేట్, ఎన్‌జీవోలు ఉద్యోగాలను ఇస్తున్నాయి. ఆకర్షణీయమైన జీతభత్యాలు, మంచి హోదాను ఇస్తున్నట్లు సంస్థ గత రికార్డులు పేర్కొంటున్నాయి. కోర్సులు పూర్తయిన తర్వాత సొంతంగా కూడా ఉపాధి పొందవచ్చు.

ముఖ్యతేదీలు

- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: 2019, జనవరి 4
- హార్డ్‌కాపీలు పంపడానికి: 2019, జనవరి 11
- ఆన్‌లైన్ టెస్ట్ తేదీ: 2019, ఫిబ్రవరి 1
- తరగతులు ప్రారంభం: 3 జూలై 2019 నుంచి
- వెబ్‌సైట్: http//www.iipsindia.org

- కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

597
Tags

More News

VIRAL NEWS

Featured Articles