కరెంట్ అఫైర్స్


Wed,November 28, 2018 06:07 AM

Telanagana
ampasayya-naveen

తెలంగాణకు ఇండియా టుడే అవార్డు

తెలంగాణకు ఇండియా టుడే స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ అవార్డు లభించింది. నవంబర్ 22న ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ అవార్డును అందజేశారు. సుపరిపాలనలో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ అత్యంత మెరుగైన పెద్ద రాష్ట్రం అవార్డును అందుకుంది.

జస్టిస్ రాఘవేంద్రచౌహాన్

హైదరాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్రచౌహాన్ నవంబర్ 22న ప్రమాణం చేశారు. ఆయన చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బీ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు.

నవీన్‌కు లోక్‌నాయక్ పురస్కారం

లోక్‌నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ నవలా రచయిత అంపశయ్య నవీన్‌కు అందించనున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నవంబర్ 24న ప్రకటించారు. ఈ పురస్కారం కింద ఆయనకు రూ. 1.5 లక్షల నగదు అందజేస్తారు. దివ్యాంగులకు విస్తృత సేవలు అందిస్తున్న హైదరాబాద్‌కు చెందిన వంశీ రామరాజుకు జీవన సాఫల్య పురస్కారంతో పాటు రూ. 50 వేల నగదు అందించనున్నారు. ఈ అవార్డులను జనవరి 19న ప్రదానం చేయనున్నారు.

Persons
nahid-afrin

నహిద్ అఫ్రీన్

అసోం రాష్ర్టానికి చెందిన యువ గాయని నహిద్ అఫ్రీన్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యునిసెఫ్) యువ ప్రచారకర్తగా నియమించింది. బాలల హక్కుల కోసం గళం విప్పుతున్న అఫ్రీన్ ఈశాన్యరాష్ర్టాల నుంచి ఈ గౌరవం పొందిన మొదటివ్యక్తి కావటం విశేషం. 2016లో వచ్చిన బాలీవుడ్ చిత్రం అకీరా ద్వారా అఫ్రీన్ ప్లేబ్యాక్ సింగర్‌గా మంచి గుర్తింపు పొందారు.

ఇమ్రత్ ఖాన్ మృతి

ప్రముఖ శాస్త్రీయ సంగీతకారుడు 83 ఏండ్ల ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్ నవంబర్ 23న మరణించారు. సితార్, సుర్‌బహర్‌లను వాయించడంలో ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తిం పు పొందారు. కేంద్రప్రభుత్వం 2017లో పద్మశ్రీ ఇవ్వగా, తన ప్రతిభను కేంద్రం ఆలస్యంగా గుర్తించిందంటూ ఈ అవార్డును ఆయన తిరస్కరించారు.

ఇక్రిశాట్ సైంటిస్టుకు ఏఎస్‌ఏ ఫెలోషిప్

ఇక్రిశాట్ సైంటిస్ట్ డాక్టర్ రాజీవ్ కే వర్షణేకు అమెరికన్ సొసైటీ ఆఫ్ ఆగ్రానమీ (ఏఎస్‌ఏ) ఫెలోషిప్-2018 ఇస్తున్నట్లు నవంబర్ 22న ఆ సంస్థ ప్రకటించింది. జెనెటిక్స్ విభాగంలో డైరెక్టర్‌గా పనిచేస్తున్న రాజీవ్ పంటల అభివృద్ధిలో భాగంగా జీనోమిక్స్, మాలిక్యులార్ బ్రీడింగ్ అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు. 2018కు గాను 14 మందికి ఏఎస్‌ఏ ఫెలోషిప్‌ను ప్రకటించింది.

అత్యంత ధనిక రియల్టర్‌గా లోధా

దేశంలో అత్యంత ధనిక రియల్టర్‌గా లోధా గ్రూప్‌నకు చెందిన మంగల్ ప్రభాత్ లోధా నిలిచారు. గ్రోహె-హరున్ ఇండియా రియల్ ఎస్టేట్ 2018కు గాను జాబితాను నవంబర్ 21న విడుదల చేసింది. రూ. 27,150 కోట్లతో ప్రభాత్ లోధా అగ్రస్థానంలో ఉండగా, రూ.23,160 కోట్లతో ఎంబసీ అధినేత జితేంద్ర విర్వాణీ రెండో స్థానంలో ఉన్నారు. తెలంగాణ నుంచి మై హోమ్ కన్‌స్ట్రక్షన్ అధినేత జూపల్లి రామేశ్వరరావు 14వ స్థానంలో నిలిచారు. హైదరాబాద్ నుంచి తొలి స్థానంలో ఉన్నారు.

ఇంటర్‌పోల్ అధ్యక్షుడిగా కిమ్ యాంగ్

అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్‌పోల్ కొత్త అధ్యక్షుడిగా కిమ్ జాంగ్ యాంగ్ (దక్షిణ కొరియా) నియమితులయ్యారు. యూఏఈలోని దుబాయ్‌లో నవంబర్ 21న జరిగిన వార్షిక సమావేశంలో కిమ్‌ను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ఇంటర్‌పోల్ తెలిపింది. ఆయన 2020 వరకు ఈ పదవిలో ఉంటారు.

ఎస్‌పీ గంగూలీ

భారతీయ విద్యావేత్త శ్యామాప్రసాద్ గంగూలీకి మెక్సికో ప్రభుత్వం ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ మెక్సికానా డెల్ ఆగ్విలా అజ్‌టెకా అవార్డుతో సత్కరించింది. మెక్సికో- ఇండియా సాంస్కృతిక సంబంధాల్లో భాగంగా స్పానిష్ భాష, మెక్సికో సంస్కృతి ప్రచారానికి విశేష కృషి చేసినందుకు గంగూలీకి ఈ బహుమతి ప్రదానం చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో గంగూలీ స్పానిష్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. లాటిన్ అమెరికన్ సంస్కృతిపై విశేష పరిశోధన చేసిన ఆయన 25 వరకు పుస్తకాలు రాశారు.

National
Buddha-Statue

70 ఫీట్ల బుద్ధ విగ్రహం

బౌద్ధమతానికి పుట్టినిల్లులాంటి బీహార్ రాష్ట్రంలో బుద్ధుడి భారీ విగ్రహాన్ని నవంబర్ 25న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ఆవిష్కరించారు. నలంద జిల్లాలోని రాజ్‌గిర్‌లో 70 అడుగుల బుద్ధ విగ్రహాన్ని నెలకొల్పారు. దేశంలో ఇది రెండో అతి ఎత్తైన బుద్ధ విగ్రహం. ఘోరా కటోరా సరస్సు మధ్యలో నెలకొల్పిన ఈ విగ్రహ ప్రాంతానికి పెట్రోల్, డీజిల్ వాహనాలను అనుమతించరు. కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.

ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్

అంతర్జాతీయ టూరిజం ఏడో ఎడిషన్ త్రిపుర రాజధాని అగర్తలాలో నవంబర్ 23న ప్రారంభమైంది. ఈశాన్య రాష్టాలు, త్రిపుర టూరిజం శాఖ, కేంద్ర టూరిజం శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు అడ్వెంచర్ టూరిజం అనే నినాదాన్ని తీసుకున్నారు. ఈశాన్య రాష్ర్టాల్లో టూరిజం అభివ్రృద్ధి కోసం ప్రతి ఏటా అంతర్జాతీయ టూరిజం మార్ట్‌ను నిర్వహిస్తున్నారు. గతంలో ఈ ఉత్సవాలు గువాహటి, తవాంగ్, షిల్లాంగ్, గాంగ్‌టక్, ఇంఫాల్ నగరాల్లో నిర్వహించారు.

ఎక్రాస్ పథకం

ఎట్మాస్ఫియర్ అండ్ ైక్లెమేట్ రిసెర్చ్ మోడలింగ్ అబ్జర్వింగ్ సిస్టమ్ అండ్ సర్వీసెస్ (ఎక్రాస్) పథకానికి నవంబర్ 22న ప్రధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. 8 పథకాలతో కూడిన ఉమ్మడి పథకమైన ఎక్రాస్‌ను 2017-2020 మధ్య కొనసాగించాలని నిర్ణయించారు. స్వీయ సమృద్ధమైన పరిశోధన, అభివృద్ధి ద్వారా దేశంలో వాతావరణం, పర్యావరణం అంచనా, పరిశీలనలో నైపుణ్యాలను పెంచేందుకు ఈ పథకాన్ని చేపట్టారు.

సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్

సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్రమోదీ నవంబర్ 22న శంకుస్థాపన చేశారు. కేంద్ర పెట్రోలియం సహజ వాయుశాఖ ఆధ్వర్యంలో 129 జిల్లాల్లోని 65 ప్రాంతాల్లో ఈ కేంద్రాలను నిర్మిస్తారు. తొమ్మిదో సీజీడీ బిడ్డింగ్‌లో భాగంగా వీటిని నిర్మించనున్నారు. మరో 124 జిల్లాల్లో 50 సీజీడీ ఏర్పాటుకు సంబంధించిన 10వ రౌండ్ బిడ్డింగ్‌ను కూడా ప్రధాని ప్రారంభించారు. 2018 సెప్టెంబర్ నాటికి దేశంలోని 96 నగరాలు, జిల్లాల్లో సీజీడీ నెట్‌వర్క్‌ను పూర్తిచేశారు.

ఓబీసీ కమిషన్

ఇతర వెనుకబడిన కులాల్లో (ఓబీసీ) వర్గీకరణ అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటుచేసిన జస్టిస్ రోహిణి కమిషన్ కాలపరిమితిని కేంద్ర ప్రభుత్వం 2019 మార్చి 31 వరకు పొడిగించింది. ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి నేతృత్వంలోని ఈ కమిషన్‌లో మరో ఐదుగురు సభ్యులు ఉంటారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 340 ప్రకారం 2017 అక్టోబర్‌లో ఏర్పాటుచేసిన ఈ కమిషన్ కాలపరిమితి 2018 నవంబర్ 30తో ముగియనుండగా మరో ఆరు నెలలు పొడిగించారు.

International
Morocco

మొరాకో ఉపగ్రహం

ఆఫ్రికా దేశమైన మొరాకో తన భూ పర్యవేక్షణ ఉపగ్రహం మొహమ్మద్-6బిని నవంబర్ 21న విజయవంతంగా ప్రయోగించింది. ఫ్రెంచ్ గయానాలోని కౌరూ అంతరిక్ష ప్రయోగకేంద్రం నుంచి ఏరియన్ స్పేస్ వెగా రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. మొరాకో తన మొదటి ఉపగ్రహం మొహమ్మద్-6ఏని 2017 నవంబర్‌లో ప్రయోగించింది.

ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం

ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యునెప్) నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా టాంజానియా దేశస్థుడు జోయిస్ ఎంసు యా నియమితులయ్యారు. ప్రస్తుత డైరెక్టర్ ఎరిక్ సోల్హెమ్ రాజీనామా చేయడంతో ఎంసుయా ఆ పదవి చేపట్టారు. యునెప్‌ను 1972లో ఏర్పాటుచేశారు.

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా

భారత విమానాశ్రయాల నియంత్రణ సంస్థ (ఏఏఐ) ఎయిర్ ట్రాఫిక్ సర్వీసుల ఆధునికీకరణ కోసం అమెరికాకు చెందిన వాణిజ్య, అభివృద్ధి సంస్థ (యూఎస్‌టీడీఎ)తో నవంబర్ 20న ఒప్పందం చేసుకుంది.

Awards
award-winners

నాసి అవార్డులు 2018

నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఇండియా (నాసి) స్కోపస్ యంగ్ సైంటిస్ట్ అవార్డులు-2018లను నవంబర్ 21న ఢిల్లీలో ప్రదానంచేశారు. ఈ ఏడాది వ్యవసాయం, ప్లాంట్ సైన్సెస్ రూరల్ డెవలప్‌మెంట్, ఉమెన్ ఇన్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్లీ సౌండ్, సైస్టెనబుల్ డెవలప్‌మెంట్, బయో మెడికల్ రిసెర్చ్, హెల్త్‌కేర్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ ఇంజినీరింగ్,ఫిజికల్‌సైన్స్ వంటి ఐదు విభాగాల్లో అవార్డులను అందించారు.

అగ్రికల్చర్, ప్లాంట్‌సైన్స్, రూరల్ డెవలప్‌మెంట్ విభాగంలో ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జినోమ్ రిసెర్చ్ పరిశోధకుడు జితేందర్‌సింగ్‌కు అవార్డు లభించింది.బయోమెడికల్ రిసెర్చ్, హెల్త్‌కేర్ విభాగంలో హైదరాబాద్‌లోని సీడీఎఫ్డీ సైంటిస్ట్ మద్దిక సుబ్బారెడ్డికి లభించింది.ఎన్విరాన్‌మెంటల్లీ సౌండ్ సైస్టెనబుల్ డెవలప్‌మెంట్ విభాగంలో రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన విమల్‌చంద్ర శ్రీవాస్తవకు లభించింది.ఇన్నోవేషన్ ఇన్ ఇంజినీరింగ్, ఫిజికల్ సైన్స్ విభాగంలో అహ్మదాబాద్ యూనివర్సిటీకి చెందిన అజయ్ ఎస్ కరాకటికి ప్రకటించారు. ఉమెన్ ఇన్ సైన్స్ విభాగంలో కోల్‌కతాలోని భోస్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన జుముర్‌ఘోష్‌కు లభించింది.

డబ్ల్యూసీసీబీ

దేశాల సరిహద్దుల్లో పర్యావరణ నేరాలను అదుపుచేసేందుకు కృషిచేస్తున్న వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (డబ్ల్యూసీసీబీ) సంస్థకు 2018కి గాను ఆసియా ఎన్విరాన్‌మెంటల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అవార్డు లభించింది. వ్యక్తిగత విభాగంలో అదే సంస్థకు చెందిన ఆర్‌ఎస్ శరత్‌కు కూడా అవార్డు లభించింది.

Sports

మేరీ కోమ్‌కు స్వర్ణం

భారత బాక్సర్ మేరీ కోమ్ మహిళల వరల్డ్ చాంపియన్‌షిప్ 48 కిలోల ఫైనల్లో విజయం సాధించి స్వర్ణం సాధించింది. 57 కిలోల విభాగంలో సోనియా చాహల్ రజతం దక్కించుకుంది. మేరీ కోమ్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో అత్యధిక పతకాలు (5 స్వర్ణాలు, ఒక కాంస్యం) గెలిచిన మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.
Saidulu

మహిళల క్రికెట్ టీ20 ప్రపంచకప్

మహిళల క్రికెట్ టీ20 ప్రపంచకప్ విజేతగా ఆస్ట్రేలియా జట్టు నాలుగోసారి నిలిచింది. కరీబియన్ దీవుల్లోని ఆంటిగ్వాలో నవంబర్ 25న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అమ్మాయిల జట్టు ఇంగ్లండ్ జట్టును ఓడించి విజేతగా అవతరించింది.

2274
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles