ఎంబీఏలో విభిన్నం


Wed,November 28, 2018 05:43 AM

ఏదైనా డిగ్రీ అర్హత గల వారు ఎంబీఏ రూరల్ మేనేజ్ చేయవచ్చు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వ రూరల్ డెవలప్ ప్రాజెక్టులు, ఎన్జీవోలు, గ్రామాల పరిశోధన చేసే సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. సరాసరి ఏడాదికి రూ. 8.70 లక్షల వేతనం పొందే అవకాశం ఉన్నది.

డిగ్రీ పూర్తయిన తర్వాత పీజీలో ప్రొఫెనల్ కోర్సు అంటే ఎక్కువ మంది ఆసక్తి చూపేది మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్ కోర్సు పూర్తయిన తర్వాత అపారమైన ఉద్యోగాకాశాలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అయితే, ఎక్కువ మందికి ఎంబీఏలో స్పెషలైజేషన్ అంటే ఫైనాన్స్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ తెలుసు. ఎక్కువ మంది వాటి వైపే ఆసక్తి చూపుతుంటారు కూడా. కానీ, మన రాష్ట్రంలో కొన్ని కళాశాలలు ఎంబీఏలో ప్రత్యేకమైన స్పెషలైజేషన్లను అందిస్తున్నాయి. ఇందులో హెల్త్ మేనేజ్ ఇంటర్నేషనల్ బిజినెస్, రూరల్ మేనేజ్ అగ్రి బిజినెస్ మేనేజ్ ఆపరేషనల్ మేనేజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉన్నాయి. ఆయా రంగాలపై అభిరుచి, అందరికీ విభిన్నంగా ఉండాలనుకునే వారు ఈ కోర్సులను చేయవచ్చు. అయితే ఇవి ఖర్చుతో కూడుకున్నా... కోర్సు పూర్తిచేసిన తర్వాత ఉద్యోగం కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదు. ఆ స్థాయిలో అవకాశాలు ఉంటాయి. ఎంబీఏలోని విభిన్నమైన స్పెషలైజేషన్ కోర్సులు నిపుణ పాఠకుల కోసం...
rural-management

ఎంబీఏ రూరల్ మేనేజ్


- దేశంలో నేటికీ 60 శాతం ప్రజలు గ్రామాల్లో నివసిస్తున్నారు. గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఎన్నో సంస్థలు కృషి చేస్తున్నాయి. ఆయా సంస్థల్లో మేనేజర్లుగా, గ్రామీణ ఉత్పత్తులకు మార్కెట్ చేయగల నిపుణులకు విస్తృతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన కోర్సే ఎంబీఏ రూరల్ మేనేజ్ ఏదైనా డిగ్రీ అర్హత గల వారు ఎంబీఏ రూరల్ మేనేజ్ చేయవచ్చు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వ రూరల్ డెవలప్ ప్రాజెక్టులు, ఎన్జీవోలు, గ్రామాల పరిశోధన చేసే సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. సరాసరి ఏడాదికి రూ. 8.70 లక్షల వేతనం పొందే అవకాశం ఉన్నది.
- దేశవ్యాప్తంగా ఎంబీఏ రూరల్ మేనేజ్ కోర్సును అందించే కళాశాలలు పరిమిత సంఖ్యలో ఉన్నాయి. ఆదిత్య ఇన్ ఆఫ్ మేనేజ్ (పుణె), జస్వంత్ ఇన్ ఆఫ్ మేనేజ్ స్టడీస్ (పుణె), కళింగ ఇన్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (భువనేశ్వర్), ఛందేర్ జైన్ ఇన్ ఆఫ్ మేనేజ్ (ఢిల్లీ), కృపానిధి స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్ (బెంగళూరు) తదితర మొత్తం 47 కళాశాలలు ఉన్నాయి. కొన్ని కళాశాలలు డిగ్రీలో రూరల్ మేనేజ్ చదివిన వారికి ప్రవేశాలు కల్పిస్తుండగా, కొన్ని కళాశాలు ఏదైనా డిగ్రీతోపాటు క్యాట్, గ్జాట్, మ్యాట్, సీమ్యాట్, ఐఐఎఫ్ అర్హతతో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

it

ఎంబీఏ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)


- సమాచార, సాంకేతికతకు సంబంధించి ప్రణాళిక రూపకల్పన, ఎంపిక, అమలు వినియోగం, పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించగల మేనేజర్లను అభివృద్ధి చేయడానికి ఎంబీఏ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి రూపకల్పన చేశారు. హార్డ్ సాఫ్ట్ సొల్యూషన్స్ రూపకల్పన, అమలు, సాధారణ వ్యాపార సమస్యల పరిష్కారం, వ్యాపార బృందంలో ఐటీ గ్రాడ్యుయేట్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. రెండేండ్ల ఎంబీఏ కోర్సు కాలంలో కంప్యూటర్ సెక్యూరిటీ, లీగల్ అండ్ ఎథికల్ బిజినెస్ ప్రాక్టీస్, సిస్టమ్ అనాలిసిస్, డిజైన్, మేనేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, డేటాబేస్ మేనేజ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ ఫర్ టెక్నాలజీ మేనేజర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ నైపుణ్యం సాధిస్తారు. ఏదైనా సబ్జెక్టులో డిగ్రీ పూరిచేసిన వారు ఎంబీఏ ఐటీ చేయవచ్చు. విజయంవంతంగా కోర్సు పూర్తిచేసిన వారికి ఐటీ లేదా సంబంధిత కంపెనీల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి.
- రాష్ట్రంలో 33కు పైగా కళాశాలలు ఎంబీఏ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సు అందిస్తున్నాయి. అందులో కొన్ని.. పద్మశ్రీ బీవీ రాజు ఇన్ ఆఫ్ టెక్నాలజీ, సీఎంఆర్ ఇన్ ఆఫ్ టెక్నాలజీ, చైతన్యభారతి ఇన్ ఆఫ్ టెక్నాలజీ, ఐటీ బిజినెస్ స్కూల్ హైదరాబాద్, ఇంటర్నేషనల్ ఇన్ ఆఫ్ టెలికాం మేనేజ్ పెండేకంటి ఇన్ ఆఫ్ మేనేజ్ తదితర కళాశాలలు.
ib

ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ (ఐబీ)


- అంతర్జాతీయ వ్యాపారంపై సునిశిత పరిజ్ఞానాన్ని అందిస్తుంది ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్. ప్రపంచీకరణతో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ వ్యాపారానికి ప్రాధాన్యం పెరిగింది. ఇందుకు అవసరమైన నైపుణ్యాన్ని అందిస్తున్నది రెండేండ్ల ఎంబీఏ ఐబీ. ఎక్స్ ఇంపోర్ట్ మేనేజ్ ఫారెన్ ఎక్సేంజ్ మేనేజ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ మార్కెటింగ్, ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్ తదితర అంశాలపై లోతైన పరిజ్ఞానం అందించేలా కోర్సు ఉంటుంది. విజయవంతంగా కోర్సు పూర్తిచేసిన వారికి ముఖ్యంగా మల్టీనేషనల్ కంపెనీల్లో అవకాశాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ మార్కెటింగ్ డైరెక్టర్, ఫైనాన్షియల్ కంట్రోలర్, మల్టీనేషనల్ మేనేజర్, బిజినెస్ డెవలప్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ ట్రేడ్, కస్టమ్స్ మేనేజర్, ఇంటర్నేషనల్ పాలసీ అడ్వైజర్ ఉద్యోగ బాధ్యతలు చేపట్టవచ్చు.
- రాష్ట్రంలో పరిమిత సంఖ్యలో కాలేజీలు ఎంబీఏ ఐబీ కోర్సును అందిస్తున్నాయి. కార్లటన్ బిజినెస్ స్కూల్, ఇన్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ జేఎన్ గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్, ఐసీబీఎం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెన్స్, విశ్వ విశ్వాని ఇన్ ఆఫ్ సిస్టమ్స్ మేనేజ్ దిశ సెంటర్ ఫర్ మేనేజ్ స్టడీస్ తదితర కళాశాలల్లో ఈ కోర్సు ఉన్నది. క్యాట్ మరో ఐదు ప్రవేశ పరీక్షల ఆధారంగా ప్రవేశాలను కల్పిస్తున్నారు. ఈ కోర్సు ఖర్చు కొంచెం ఎక్కువే.
oparetion

ఎంబీఏ ఆపరేషన్ మేనేజ్


- ప్రొడక్షన్ మేనేజ్ లేదా షాప్ ఫ్లోర్ మేనేజ్ సంస్థల్లో ఉద్యోగ సంబంధిత కోర్సు ఎంబీఏ ఆపరేషన్ మేనేజ్ రెండేండ్ల కోర్సు కాలంలో ఇంటర్ డిపార్ట్ రిలేషన్ ప్రాసెస్ ఫ్లోస్, డెవలప్ వెండ ర్ వంటి అంశాలను నేర్చుకోవచ్చు. ఇంజినీరింగ్ సంబంధిత డిగ్రీ పూర్తిచేసిన వారే ఎక్కువగా ఎంబీఏ ఆపరేషనల్ మేనేజ్ కోర్సు చేస్తుంటారు. కానీ, ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఎంబీఏ ఆపరేషన్ మేనేజ్ చేయవచ్చు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసిన తర్వాత మంచి జీతభత్యాలు పొందడానికి అవకాశం ఉంటుంది.
- మన రాష్ట్రంలో ఇన్ ఆఫ్ ఇన్నోవేటివ్ ట్రైనింగ్, డెవలప్ వైష్ణవి కాలేజ్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ తదితర కళాశాలలు ఎంబీఏ ఆపరేషనల్ మేనేజ్ అందిస్తున్నాయి.
helthcare

ఎంబీఏ హెల్త్ మేనేజ్


- సేవా దృక్పథం కలిగి ఉండి, హాస్పిటల్ నిర్వహణలో కీలక పాత్ర పోషించాలనుకునేవారికి చక్కని కోర్సు ఎంబీఏ హెల్త్ మేనేజ్ హాస్పిటల్ నిర్వహణ ప్రధాన అంశంగా కోర్సు ఉంటుంది. హాస్పిటల్ నిత్యం జరిగే కార్యకలాపాలు, వ్యాపార నిర్వహణపై నైపుణ్యం సాధించేలా రెండేండ్ల కోర్సు ఉంటుంది. కోర్సు పూర్తయిన తర్వాత హాస్పిటల్ నిర్వాహకుడు, మెడికల్ ప్రాక్టీస్ మేనేజర్, బీమా కంపెనీల్లో ఎగ్జిక్యూటివ్ తదితర కీలక ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన వారు ఎంబీఏ హెల్త్ మేనేజ్ చేయవచ్చు. కోర్సు పూర్తిచేసిన వారికి ఉద్యోగం కోసం వేచి చూసే అవసరం ఉండదు. ఆ స్థాయిలో విస్తృతమైన అవకాశాలు ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు, మెడికల్ టూరిజం కంపెనీలు, డయాగ్నోస్టిక్ ల్యాబోరేటరీలు, హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మార్కెట్ పరిశోధన సంస్థలు, వెల్ కేంద్రాల్లో అపారమైన ఉద్యోగావకాశాలు ఉంటాయి.
- రాష్ట్రంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, అపోలో ఇన్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, విశ్వవిశ్వాని ఇన్ ఆఫ్ సిస్టమ్ అండ్ మేనేజ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్ ఆఫ్ కన్ మేనేజ్ అండ్ రిసెర్చ్, అరోరా బిజినెస్ స్కూల్, స్కూల్ ఆఫ్ మేనేజ్ స్టడీస్, ఆంగ్లోపైల్ బిజినెస్ స్కూల్, జీబీఎస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్ తదితర కళాశాలలు ఎంబీఏ హెల్త్ మేనేజ్ అందిస్తున్నాయి. ఎక్కువగా క్యాట్, మ్యాట్, గ్జాట్, జీమ్యాట్, సీమ్యాట్, ఏటీఎంఏ ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కేవలం విశ్వవిశ్వాని ఇన్ ఆఫ్ సిస్టమ్ అండ్ మేనేజ్ మాత్రమే పై పరీక్షలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఐసెట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నది.

agriculture

ఎంబీఏ అగ్రి బిజినెస్ మేనేజ్


- గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు పెద్ద ఎత్తున స్థాపించారు. వ్యవసాయ సంబంధిత ఉత్పత్తుల ప్రాసెస్ మొదలుకొని మార్కెటింగ్, వ్యాపారం వరకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఇందుకు అవసరమైన నిపుణులను అందిస్తున్నది ఎంబీఏ అగ్రి బిజినెస్ మేనేజ్ విద్యార్థులకు ప్రధానంగా వ్యవసాయ సంబంధిత ఉత్పత్తుల వ్యాపార నిర్వహణ, మార్కెటింగ్, ఫైనాన్స్ దృష్టిలో పెట్టుకుని రెండేండ్ల కోర్సు ఉంటుంది. ఏదైనా సబ్జెక్టులో డిగ్రీ పూర్తిచేసిన వారు ఎంబీఏ అగ్రి బిజినెస్ మేనేజ్ చేయవచ్చు. కోర్సు పూర్తిచేసిన తర్వాత అగ్రి ఇన్ ఇండస్ట్రీ, హార్టికల్చరల్ ఇండస్ట్రీ, ఫుడ్, లైవ్ ఇండస్ట్రీలో, ఫామ్ ఇంజినీరింగ్ ఉద్యోగావకాశాలు ఉంటాయి.
- రాష్ట్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ మేనేజ్ సాగర్ గ్రూప్ ఆఫ్ ఇన్ విశ్వ విశ్వాని ఇన్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్ నేషనల్ ఇన్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్ మేనేజ్ సింబయాసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ తదితర కళాశాలలు ఎంబీఏ అగ్రి బిజినెస్ మనేజ్ అందిస్తున్నాయి. కొన్ని కళాశాలలు క్యాట్, సీమ్యాట్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తుండగా మరికొన్ని కళాశాలలు ఐసెట్, గ్జాట్, ఏటీఎంఏ, జీమ్యాట్ ర్యాంక్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
వేముల సాయికిరణ్

603
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles