ఎయిమ్స్ ఎంబీబీఎస్ రెండుదశల్లో దరఖాస్తు


Wed,November 28, 2018 05:08 AM

దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక పరీక్షల్లో ఎయిమ్స్ ఒకటి. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రెన్స్ దరఖాస్తు విధానాల్లో ఈ ఏడాది నుంచి మార్పులు చేశారు. వాటికి సంబంధించిన ప్రకటన వివరాలు సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం...

-2019 ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం ఎయిమ్స్ కొత్త పద్ధతిని ప్రారంభించింది. దీన్ని ప్రాస్పెక్టివ్ అప్లికెంట్స్ అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ (పార్)గా వ్యవహరిస్తారు. ఇప్పటివరకు నేరుగా దరఖాస్తు చేసుకునే విధానం ఉండేది. ఈసారి నుంచి దీన్ని మార్చి మొదట ఆన్ అడ్వాన్స్ రిజిస్ట్రేషన్స్ రెండు దశల్లో నిర్వహించనున్నారు.
రెండు దశలు ఎందుకు?
-బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఫీజును తీసుకోరు.
-బేసిక్ రిజిస్ట్రేషన్ అన్ని సరిగ్గా పూర్తిచేసిన తర్వాత యూనిక్ ఐడెంటిఫికెషన్ నంబర్ ఇస్తారు.
-బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోనివారు ఫైనల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనుమతించరు.
-బేసిక్ రిజిస్ట్రేషన్ తర్వాత ఫైనల్ రిజిస్ట్రేషన్ అవసరమైన ఇతర వివరాలు, ఫీజు చెల్లింపులు ఉంటాయి. ఆ తర్వాత అడ్మిట్ ఇస్తారు.
-ఒక్కసారి బేసిక్ రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్నవారు తర్వాతి సంవత్సరాల్లో ఎయిమ్స్ ఎంబీబీఎస్ ఎంట్రెన్స్ రాయలన్నా ఈ యూనిక్ నంబర్ ఉపయోగించుకుంటే సరిపోతుంది.
-దరఖాస్తుకు ప్రతిసారి ఫొటోలు, కాపీలను అప్ చేయాల్సిన అవసరం లేదు.

ఎయిమ్స్ ఎంబీబీఎస్-2019


ఎంబీబీఎస్-2019 ఎంట్రెన్స్ ఎగ్జామ్ ప్రకటన ఆల్ ఇండియా ఇన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) విడుదల చేసింది.
-కోర్సు: ఎంబీబీఎస్
-ప్రవేశాలు కల్పించే సంస్థలు: ఎయిమ్స్- న్యూఢిల్లీ, భటిండా, భోపాల్, భువనేశ్వర్, డియోఘర్, గోరఖ్ జోధ్ కళ్యాణి, మంగళగిరి, నాగ్ పట్నా, రాయపూర్, రాయబరేలీ, రిషికేష్, బీబీనగర్ (తెలంగాణ).
బేసిక్ రిజిస్ట్రేషన్ ఎవరు చేసుకోవచ్చు:
-కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్ (ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) ఉత్తీర్ణులు. ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయనున్నవారు లేదా తత్సమాన కోర్సు చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం. పీహెచ్ విద్యార్థులకు 45 శాతం మార్కులు వస్తే సరిపోతుంది.
-బేసిక్ రిజిస్ట్రేషన్ (పార్): ప్రారంభమైంది.
-చివరితేదీ: 2019, జనవరి 3
-స్టేటస్ అప్ (బేసిక్ రిజిస్ట్రేషన్ అమోదించింది/లేనిది)- 2019, జనవరి 7
-బేసిక్ రిజిస్ట్రేషన్ సవరణలు: 2019, జనవరి 8 నుంచి 18 వరకు
-బేసిక్ రిజిస్ట్రేషన్ ఫైనల్ స్టేటస్: 2019, జనవరి 22
-ప్రాస్పెక్టస్ అప్ 2019, జనవరి 29
-ఫైనల్ రిజిస్ట్రేషన్ కోడ్ జనరేటింగ్: 2019, జనవరి 29 - ఫిబ్రవరి 17 (సాయంత్రం 5 వరకు)
-ఫైనల్ రిజిస్ట్రేషన్ (ఫీజు చెల్లింపు, పరీక్ష పట్టణం ఎంపిక): 2019, ఫిబ్రవరి 21 నుంచి మార్చి 12 వరకు.
-అడ్మిట్ అప్ 2019, మే 15
-పరీక్షతేదీ: 2019, మే 25, 26
-పూర్తి వివరాల కోసం www.aiimsexams.org

276
Tags

More News

VIRAL NEWS

Featured Articles