సీఎంఏకు సిద్ధమవ్వండిలా


Wed,November 28, 2018 04:48 AM

అకడమిక్ టిప్స్
ఉద్యోగ అవకాశాలపరంగా సీఏ తర్వాత కార్పొరేట్ ప్రపంచంలో ఎక్కువగా వినిపించే కోర్సు పేరు సీఎంఏ. సీఎంఏ కోర్సును ఇంతకుముందు ఐసీడబ్ల్యూ కోర్సు అని పిలిచేవారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వరంగంలో సీఎంఏలకు ఉద్యోగావకాశాలు విస్తృతంగా పెరిగాయి. సీఏ కోర్సుతోపాటు సీఎంఏ కోర్సుకు కూడా ఇటీవల ఆదరణ బాగా పెరుగుతున్నది. ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ కోర్సు చదవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతి ఏడాది జూన్, డిసెంబర్ నెలల్లో సీఎంఏ ఇంటర్, సీఎంఏ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారు. మరికొన్ని రోజుల్లో సీఎంఏ ఇంటర్, సీఎంఏ ఫైనల్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ తరుణంలో సీఎంఏ ఇంటర్, సీఎంఏ ఫైనల్ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు ఎలాంటి వ్యూహంతో పరీక్షలకు సన్నద్ధం కావాలి? ఏయే సబ్జెక్టుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పరీక్షల్లో ఎలాంటి మెళుకువలు పాటించాలి? అనే అంశాలపై సమగ్ర సమాచారం అందిస్తున్నాం.
graduating-students
సీఎంఏ ఇంటర్ సబ్జెక్టులు

పేపర్ 5 ఫైనాన్షియల్ అకౌంటింగ్ (100 మార్కులు)


- ఈ పేపర్లో అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి.
- స్టడీ మెటీరియల్, స్కానర్ అన్ని లెక్కలు సాధనచేస్తే మంచిది. కొన్ని సందర్భాల్లో అలాంటి లెక్కలనే ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉన్నది.
- ప్రిపరేషన్ ఆఫ్ అకౌంట్స్, అకౌంటింగ్ ఫర్ స్పెషల్ ట్రాన్షక్షన్స్, అకౌంటింగ్ ఫర్ బ్యాంకింగ్, ఎలక్ట్రిసిటీ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వంటి చాప్టర్ల నుంచి ఎక్కువ మార్కులకు ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాప్టర్ల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి.
- ఈ పేపర్లో విద్యార్థి పరీక్ష రాసే విధానాన్ని బట్టి మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిర్దేశిత సమయంలో సమాధానాలన్నీ వీలైనంత క్లుప్తంగా అంశాల వారీగా రాయాలి. పరీక్షలో తుది జవాబు కు మాత్రమే కాకుండా ప్రశ్నలోని అన్ని దశలకు మార్కులు ఉంటాయి. కాబట్టి వీలైనంత వివరంగా సమాధానం రాస్తే మంచిది.

పేపర్ 6‘లా’స్, ఎథిక్స్ అండ్ గవర్నెన్స్ (100 మార్కులు)


-యాక్ట్ ఉండే నిబంధనలను క్షుణ్ణంగా చదవాలి.
- చదివిన నిబంధనలు ఎప్పటికప్పుడు చూడకుండా రాస్తే గుర్తుంటుంది.
- పరీక్ష రాసేటప్పుడు నిబంధనలు, ఉదాహరణలు, లాండ్ మార్క్ కేసెస్ కూడా మిళితం చేస్తే బాగుంటుం ది. ఇలా రాయడంవల్ల పరీక్ష రాసే మిగతావారితో పోలిస్తే మీ పేపర్ ప్రత్యేకంగా ఉంటుంది. దానివల్ల మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది.
- పరీక్షల్లో సెక్షన్ నెంబర్లు రాసేటప్పుడు కచ్చితత్వం ఉండాలి. సెక్షన్ నెంబర్లు గుర్తులేనప్పుడు తప్పులు రాసేబదులు అసలు రాయకుండా ఉండటం మంచిది.
- కార్పొరేట్ లాకు సంబంధించి ఫాస్ట్ పుస్తకాన్ని తయారు చేసుకుని చదివితే పున:శ్చరణ సులువుగా చేసుకోవచ్చు.
- కంపెనీ యాక్ట్ 2013కు సంబంధించిన నిబంధనలు కూడా జాగ్రత్తగా చదవాలి. పరీక్షలకు ముందు ఆరు నెలల్లో చేసిన సవరణలు పరీక్షల్లో వస్తాయి. కాబట్టి విద్యార్థులు వాటిపై ఎక్కువగా దృష్టి పెట్టాలి.

పేపర్ 7డైరెక్ట్ టాక్సేషన్ (100 మార్కులు)


- డైరెక్ట్ టాక్సేషన్ సంబంధించి ప్రతి అంశంపై లోతైన అవగాహన అవసరం.
- హెడ్స్ ఆఫ్ ఇన్ అసెస్ ఆఫ్ డిఫరెంట్ పర్సన్స్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తే ఎక్కువ మార్కులు సులువుగా సాధించవచ్చు.
- పబ్లిక్ పరీక్షల్లో ప్రతి ప్రశ్నను చిన్నచిన్న ప్రశ్నలుగా విభజిస్తారు. ఆ ప్రశ్నలకు రెండు లేదా నాలుగు మార్కులు ఉంటాయి. కాబట్టి ఎక్కువ అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది.
- డిసెంబర్ 2018 పరీక్షలకు ఫైనాన్స్ యాక్ట్ 2017 వర్తిస్తుంది. 2018, డిసెంబర్ 31 వరకు విడుదల చేసిన నోటిఫికేషన్లు, సర్క్యులర్లు కూడా వర్తిస్తాయి. (సవరణల పూర్తి వివరాలకు icmai.in/Studentswebsite/Syl-2016.php వెబ్ చూడవచ్చు)

పేపర్ 8 కాస్ట్ అకౌంటింగ్ (100 మార్కులు)


- విద్యార్థులు కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్షల్లో వీటిపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది.
- ఈ పేపర్లో థియరీకి కూడా ఎక్కువ ప్రాధా న్యం ఇవ్వాలి.
- ముఖ్యమైన సూత్రాలను, సైడ్ హెడ్డింగ్స్ ముందుగానే రాసి ఉంచుకుంటే, పరీక్ష ముందురోజు సబ్జెక్టు మొత్తాన్ని సులువుగా పునఃశ్చరణ చేసుకోవడానికి వీలుంటుంది.
- పరీక్ష రాసేటప్పుడు ప్రశ్నను జాగ్రత్తగా చదివి అర్థం చేసుకున్న తర్వాతే సమాధానం రాయాలి.
సీఎంఏ ఇంటర్, సీఎంఏ ఫైనల్ పరీక్షలు డిసెంబర్ 10న ప్రారంభమై డిసెంబర్ 17న ముగుస్తాయి.

పేపర్ 9 ఆపరేషన్స్ మేనేజ్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్ (100 మార్కులు) ఆపరేషన్స్ మేనేజ్


- ఆపరేషన్స్ మేనేజ్ విషయంలో విద్యార్థులు థియరీ, ప్రాబ్లమ్స్ సమానమైన ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రాబ్లమ్స్ సంబంధించి పబ్లిక్ పరీక్షల్లో తరచుగా అడిగిన మోడల్స్ అధ్యయనం చేయాలి.
- ఆపరేషన్స్ మేనేజ్ గణిత ఆధారిత సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇందులో ఎక్కువ స్కోర్ చేయవచ్చు.
- సమస్యలకు సరైన, ఆమోదయోగ్యమైన పద్ధతుల్లో సమాధానం రాయాల్సి ఉంటుంది.
- పబ్లిక్ పరీక్షల్లో ప్రత్యామ్నాయ (ఆల్టర్ సమాధా నాలు, పని గమనికలు (వర్కింగ్ నోట్స్) సమాధానం లో భాగంగా రాయాలి.
స్ట్రాటజిక్ మేనేజ్
- ఈ సబ్జెక్టులో ప్రశ్నలు తికమకగా అడుగుతారు. అంటే ప్రశ్నలను నేరుగా ఉండవు. ప్రిపరేషన్ సమయంలో ఇలాంటి ప్రశ్నలు వీలైనన్ని ఎక్కువ చదివితే ఎలాంటి భయం లేకుండా పరీక్ష రాయవచ్చు.
- చాలావరకు విద్యార్థి ప్రశ్నలకు సొంతంగా సమాధానం రాయాల్సి ఉంటుంది. ప్రశ్నలు కచ్చితంగా ఇవే వస్తాయని గానీ, ఈ చాప్టర్ నుంచే వస్తాయని గానీ ఆశించలేం. కాబట్టి విద్యార్థి అన్ని చాప్టర్లపై పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలి.
- గత మూడు పరీక్షలకు సంబంధించిన MTPలు, RTPలు చదివితే మంచిది.
- వర్క్ కాన్సెప్ట్ అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

పేపర్ 10 కాస్ట్ అండ్ మేనేజ్ అకౌంటెన్సీ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్ (100 మార్కులు)


- స్టడీ మెటీరియల్ ఉండే ఉదాహరణలను తప్పని సరిగా అధ్యయనం చేయాలి.
- సీఎంఏ ఇంటర్మీడియట్ కోర్సులోని ఫైనాన్షియల్ మేనేజ్ కాస్ట్ అండ్ మేనేజ్ అకౌంటెన్సీ తో పోలిస్తే కొంచెం సులువు. కాబట్టి విద్యార్థులు సులువుగా 50 మార్కులు సాధించవచ్చు.
- కాస్ట్ రికార్డ్, కాస్ట్ ఆడిట్ విభాగంపై అశ్రద్ధ చూపొద్దు. దాని నుంచి 20 మార్కులు ఈజీగా సాధించవచ్చు.
- గత మూడు పరీక్షలకు సంబంధించిన MTPలు, RTPలు చదివితే మంచిది.
- కాస్ట్ అకౌంట్ రికార్డ్స్, కాస్ట్ ఆడిట్ వంటి అంశాలపట్ల జాగ్రత్త వహించాలి.
- వర్క్ కాన్సెప్ట్ అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

పేపర్ 11ఇన్ టాక్సేషన్ (100 మార్కులు)


- భావనలు (కాన్సెప్ట్స్), విధానాలు అర్థం చేసుకోవాలి. స్టడీ మెటీరియల్ ఇచ్చిన ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి.
- సమస్యాపూరితమైన ప్రశ్నలకు సూచించిన/వర్తించే చట్టప్రకారం సమాధానం ఇవ్వాలి.
- డిసెంబర్ 2018 పరీక్షలకు ఫైనాన్స్ యాక్ట్ 2017 వర్తిస్తుంది. 2018, డిసెంబర్ 31 వరకు విడుదల చేసిన నోటిఫికేషన్స్, సర్క్యులర్లు కూడా వర్తిస్తాయి.
(సవరణల పూర్తి సమాచారం కోసం icma.in/studentswebsite/syl-2016.phpవెబ్ సందర్శించాలి)
- సమాధానం మొదలుపెట్టే ముందు ప్రశ్నను ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చదవాలి.
- విద్యార్థులు మంచి మార్కుల కోసం జీఎస్టీపై ఎక్కువ దృష్టి పెట్టాలి.
- కస్టమ్స్ డ్యూటీస్ ప్రాబ్లమ్స్ సంబంధించిన ప్రశ్నల పై ఎక్కువ దృష్టి పెట్టాలి.

పేపర్ 12కంపెనీ అకౌంట్స్ అండ్ ఆడిట్ (100 మార్కులు)


- ఈ పేపర్లో అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి.
- షెడ్యూల్ 3 (ఫార్మాట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్)పై దృష్టి పెట్టాలి.
- ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి.
- ఆడిటింగ్ థియరీ సబ్జెక్టు. ఈ సబ్జెక్టులో నేరుగా వచ్చే ప్రశ్నలను ముందుగానే ఊహించవచ్చు. స్కానర్లో ఉండే ప్రశ్నలను పరీక్షల్లో నేరుగా ఇచ్చే అవకాశం ఉన్నది. నిబంధనలు వర్తించే చట్టాలు, అకౌంటింగ్ స్టాండర్డ్స్, స్టాండర్డ్స్ ఇన్ ఆడిటింగ్, విధానాలు, ప్రక్రియలపై దృష్టి పెట్టాలి.
- 2017, డిసెంబర్ 20 వరకు కంపెనీస్ (కాస్ట్ రికార్డ్స్ & ఆడిట్) రూల్స్, 2014లో వచ్చిన ప్రతి సవరణ ఈ పరీక్షకు వర్తిస్తుంది. వివరాల కోసం http://icmai.in/upload/Students/Circulars/Relevant-Info-Dec-2018.pdfను చూడాలి.
చాలామంది విద్యార్థులు సీఎంఏ కోర్సులో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంటుందని భావిస్తుంటారు. 2018, జూన్ సీఎంఏ ఫలితాల్లో సీఎంఏ ఫైనల్లో 21.83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. దీన్ని బట్టి సీఎంఏ కోర్సులో ఉత్తీర్ణత శాతం తక్కువేమీ ఉండదని అర్థం చేసుకోవచ్చు.

సీఎంఏ ఫైనల్ సబ్జెక్టులు పేపర్ 13 కార్పొరేట్ లాస్ అండ్ కైంప్లెన్స్ (100 మార్కులు)


- సాధారణంగా కంపెనీస్ యాక్ట్ 2013కు సంబంధిం చిన నిబంధనలను కూడా జాగ్రత్తగా చదవాలి.
- పరీక్షల ముందు ఆరునెలల్లో చేసిన సవరణలు పరీక్ష ల్లో వస్తాయి. కంపెనీస్ యాక్ట్ 2013లో చాలా సవరణలు జరిగాయి. కాబట్టి విద్యార్థులు వాటిపై ఎక్కువ దృష్టి పెట్టాలి.
- పెనాల్టీ బేస్డ్ ప్రశ్నలు చదవాలి.
- ఆచరణ ప్రశ్నలపై (ప్రాక్టికల్ ప్రశ్నలు) దృష్టి పెట్టాలి.
- విధానాలు, సమ్మతి సమస్యలపై (ప్రొసీజర్ అండ్ కైంప్లెన్స్ ఇష్యూస్) దృష్టి పెట్టాలి. సందర్భ పరిశీలన (కేస్ స్టడీ) ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే నియమ విశ్లేషణ (ఎనాలిసిస్ ఆఫ్ ప్రొవిజన్) చేయాలి.

పేపర్ 14స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్ (100 మార్కులు)


- సెక్యూరిటీ అనాలిసిస్ అండ్ పోర్ట్ మేనేజ్ ట్, ఇన్వెస్టిమెంట్ డెసిషన్స్ చాలా సులువైన అధ్యాయా లు. వీటి నుంచి ఎక్కువ మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నది.
- విద్యార్థులు ఎవరికి వారు సొంతంగా ఫాస్ట్ ట్రాక్ నోట్స్ సిద్ధం చేసుకోవడం మేలు.
- ఫార్ములాలన్నింటిని ఒక నోట్ రాసుకోవాలి.
- గత ఐదేండ్లుగా ఇస్తున్న పాత ప్రశ్నాపత్రాలను అభ్యాసం చేయడం ప్రయోజనకరం. స్టడీ మెటీరియల్, MTPలు, RTPలలోని ప్రాబ్లమ్స్ సాధన చేయాలి.

పేపర్ 15స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్ అండ్ డెసిషన్ మేకింగ్ (100 మార్కులు)


-స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్ డెసిషన్ మేకింగ్ రెండు విభాగాలకు సమానమైన ప్రాధాన్యం ఇవ్వాలి.
- డెసిషన్ మేకింగ్ అప్లికేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ టెక్నిక్స్ ఇన్ బిజినెస్ డెసిషన్స్ ఎక్కువ ప్రాధానం ఇవ్వాలి.
- స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్ పాక్షికంగా థియరీ, సమస్యాత్మక ప్రశ్నలు ఉంటాయి. స్కానర్ ఉండే ప్రాబ్లమ్స్ సాధన చేయాలి.
- రెండు అంశాల్లో థియరీకి ఎక్కువ ప్రాధాన్యమిస్తూ, ప్రధాన శీర్షికలను ఒక పుస్తకంలో రాసుకుని పరీక్ష ముందు రోజు పునఃశ్చరణ చేసుకోవాలి.

పేపర్ 16డైరెక్ట్ టాక్స్ లాస్ అండ్ ఇంటర్నేషనల్ టాక్సేషన్ (100 మార్కులు)


-డైరెక్ట్ టాక్స్, ఇంటర్నేషనల్ టాక్సేషన్ రెండూ కూడా ఈ సబ్జెక్టులో మిళితమై ఉంటాయి.
- మీ సన్నద్ధత ప్రణాళికాబద్ధంగా ఉండాలి. ఎందుకంటే 100 మార్కులకు ఎక్కువ సిలబస్ కవర్ చేస్తారు.
- ఇంటర్నేషనల్ టాక్సేషన్ అసెస్ ఆఫ్ వేరియస్ పర్సన్స్, కేస్ స్టడీస్ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
- సందర్భ పరిశీలన (కేస్ స్టడీ) ప్రశ్నలను ఆశించవచ్చు.
- డిసెంబర్ 2018 పరీక్షలకు ‘ఫైనాన్స్ యాక్ట్ 2017’ వర్తిస్తుంది. 2018, డిసెంబర్ 31 వరకు విడుదల చేసిన నోటిఫికేషన్లు, సర్క్యులర్లు కూడా వర్తిస్తాయి. (సవరణల పూర్తి సమాచారం కోసం icmai.in/studentswebsite/syl-2016.php వెబ్ సందర్శించాలి).

పేపర్ 17కార్పొరేట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ (100 మార్కులు)


-ఈ పేపర్లో ఐదు విభాగాలు ఉంటాయి. (సెక్షన్ ఏ- అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపుల్స్ 10 మార్కులు, సెక్షన్ బీ- బిజినెస్ కాంబినేషన్స్- అకౌంటింగ్ అండ్ రిపోర్టిం గ్ 25 మార్కులు, సెక్షన్ సీ- గ్రూప్ ఫైనాన్షియల్ స్టేట్ 25 మార్కులు, సెక్షన్ డీ- డెవలప్ మెంట్ ఇన్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ 25 మార్కులు, సెక్షన్ ఈ- గవర్నమెంట్ అకౌంటింగ్ ఇన్ ఇండియా 15 మార్కులు).
- ప్రథమంగా దృష్టి పెట్టాల్సిన విషయాలు సెక్షన్ డీ, సెక్షన్ ఈ. వీటి తర్వాత సెక్షన్ ఏ.
- సెక్షన్ బీ, సెక్షన్ సీ నుంచి 10 లేదా 15 మార్కుల ప్రశ్నను వచ్చే అవకాశం ఉంది. ఈ సెక్షన్లలో చిన్న చిన్న కాన్సెప్ట్స్ కూడా వదిలేయకూడదు.
- 2018, డిసెంబర్ పరీక్షకు కొత్తగా ఐదు ఇండ్-అకౌంటింగ్ స్టాండర్డ్స్ (ఇండ్ ఏఎస్- 27, 28, 105, 110, 111 & 112) లను చేర్చారు. కాబట్టి ఈ అంశాలపై విద్యార్థులు పత్యేకమైన దృష్టి కేంద్రీకరించాలి.

పేపర్ 18ఇన్ ట్యాక్స్ లాస్ అండ్ ప్రాక్టీస్ (100 మార్కులు)


- కాన్సెప్టులు, విధానాలు అర్థం చేసుకోవాలి. స్టడీ మెటీరియల్ ఇచ్చిన ప్రశ్నలను అధ్యయనం చేయాలి.
- సమస్యాపూరితమైన ప్రశ్నలకు సూచించిన లేదా వర్తించే చట్టప్రకారం సమాధానం ఇవ్వాలి.
- వచ్చే నెలలో జరిగే పరీక్షలకు ‘ఫైనాన్స్ యాక్ట్- 2017’తోపాటు, డిసెంబర్ 31 వరకు విడుదలచేసే నోటిఫికేషన్లు, సర్క్యులర్లు కూడా వర్తిస్తాయి. (సవరణల పూర్తి సమాచారం కోసంicmai.in/ studentswebsite/syl-2016.php వెబ్ చూడవచ్చు).
- జవాబు రాసేముందు ప్రశ్నను ఒకటికి రెండుసార్లు చదవాలి.
- జీఎస్టీపై దృష్టిసారిస్తే ఎక్కువ మార్కులు స్కోర్ చేయవచ్చు.

పేపర్ 19 కాస్ట్ అండ్ మేనేజ్ ఆడిట్ (100 మార్కులు)


-ఇది సీఎంఏ ఫైనల్ కఠినంగా ఉండే సబ్జెక్టు.
- కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, స్కానర్ ఉండే ప్రశ్నలపై ఎక్కువగా దృష్టిసారించాలి.
- ఆపరేషనల్ ఆడిట్, మేనేజ్ ఆడిట్ విషయాలపై కాన్ ఐడియా అవసరం.
- అధ్యాయం చివర్లో ఇచ్చే సారాంశంపై దృష్టి పెట్టాలి.
- సెక్షన్-సీ నుంచి సందర్భ పరిశీలన (కేస్ స్టడీ) ప్రశ్నలను 20 మార్కులకు పైగా ఆశించవచ్చు.
- 2017, డిసెంబర్ 20 వరకు కంపెనీ (కాస్ట్ రికార్డ్స్ అండ్ ఆడిట్) రూల్స్, 2014లో వచ్చిన ప్రతి సవరణ ఈ పరీక్షకు అప్లయ్ అవుతుంది. వివరాలకు..
http://icmai.in/upload/Students/Circulars/
Relevant-Info-Dec-2018.pdfను చూడవచ్చు.

పేపర్ 20 స్ట్రాటజిక్ పర్ఫార్మెన్స్ మేనేజ్ అండ్ బిజినెస్ వాల్యుయేషన్ (100 మార్కులు)


- రెండు అంశాలకు సమ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సబ్జెక్టులో ఈజీగా 60 మార్కులు సాధించవచ్చు.
- బిజినెస్ వాల్యుయేషన్ వాల్యుయేషన్స్ ఇన్ మర్జెర్స్ అండ్ అక్విజిషన్స్, వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబుల్టీస్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
- బిజినెస్ వాల్యుయేషన్ థియరీ ప్రశ్నల కంటే ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు.
- స్ట్రాటజిక్ పర్ మేనేజ్ పర్ ఎవాల్యుయేషన్ అండ్ ఇంపార్టెంట్ టూల్స్, ఎంటర్ రిస్క్ మేనేజ్ వంటి అంశాలపై దృష్టిసా రించాలి.
- స్టడీ మెటీరియల్, స్కానర్ ఉండే ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి.
- స్టడీ మెటీరియల్, ఆర్ ఎంటీపీలోని ప్రశ్నలకు జవా బులు ఎలా సూచించారో నిశితంగా పరిశీలించాలి.

కొన్ని సాధారణమైన సూచనలు


- సిలబస్ పూర్తి అంశాల గురించి అవగాహన ఉండాలి. ప్రతి చాప్టర్ వెయిటేజీని తెలుసుకోవాలి. ఇన్ మెటీరియల్ మొదటి పేజీలో వెయిటేజీకి సంబంధించిన వివరాలు ఉంటాయి. సీఎంఏ ఇన్ వారు వెయిటేజీని అనుసరిం చే ప్రశ్నపత్రం తయారుచేస్తారు. ప్రతి విద్యార్థి ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి.
- గత రెండు పరీక్షలకు సంబంధించి ప్రశ్న పత్రాలను పరిశీలించాలి. ప్రతి పేపర్ ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్, ప్రాక్టికల్, థియరీ, కేస్ లాస్) అని విశ్లేంచుకోవాలి. ఇలా చేయడం వల్ల పరీక్షా పత్రాల తారుమారులను మనం ముందుగానే విశ్లేషించుకోవచ్చు.
- స్కానర్ (గత ప్రశ్నపత్రాలు)ని విశ్లేషించుకోవడా నికి తగిన సమయాన్ని కేటాయించాలి.
- రివిజన్ టెస్ట్ పేపర్ (ఆర్ అటెంప్టులు, మోడల్ టెస్ట్ పేపర్ (ఎంటీపీ)- 3 అటెంప్టులు, వర్క్ తప్పకుండా పునఃశ్చరణ చేసుకోవాలి. ఇలా చేస్తే కనీసం 60 శాతం మార్కులు స్కోర్ చేయవచ్చు. వీటిని www.icmai.in నుంచి డౌన్ చేసుకోవచ్చు.
- ప్రిపరేషన్ ప్రతి అంశానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. అన్ని అంశాలను పునఃశ్చరణ చేయగలమా లేదా చూసుకోవాలి.
- 2018, డిసెంబర్ పరీక్షలకు సంబంధించి సీఎంఏ ఇన్ సీఎంఏ ఇంటర్, ఫైనల్ సబ్జెక్టులకు సంబంధించిన అదనపు స్టడీ మెటీరియల్ కొత్తగా విడుదల చేస్తుంది. ఎక్కువ మార్కులు సాధించడానికి దీన్ని తప్పకుండా చదవాలి.


విద్యార్థులు సాధారణంగా చేసే తప్పులు


-చాలా మందికి ప్రాథమిక అంశాలపై పట్టు ఉండదు. సీఏ, సీఎంఏ వంటి కోర్సుల్లో ఏ దశలోనైన రాణించాలంటే ముందు గా ప్రాథమిక అంశాలపై మంచి అవగాహన ఉండాలి.
-పరీక్ష రాసే సమయంలో చాలామంది విద్యార్థులు ఆందోళనకు గురవుతుంటారు. దీనివల్ల ఒక్కోసారి బాగా తెలిసిన జవాబులు కూడా తప్పుగా రాసే అవకాశం ఉంటుంది. పరీక్షలో దాదాపు మనం సమాధానం రాయగలిగే ప్రశ్నలు ఇస్తారు. కాబట్టి పరీక్షల గురించి కానీ, పరీక్ష రాసేటప్పుడు కానీ ఆందోళన పడకూడదు.
-సమయపాలన చాలా అవసరం. కొతమంది అనవసర విషయాల గురించి ఆలోచిస్తూ పరీక్ష సమయాన్ని వృథా చేస్తుంటారు. పరీక్షలో వచ్చిన జవాబులు ముందుగా రాసి చివర్లో రాని సమాధానాల గురించి ఆలోచించాలి.
-పరీక్షల సన్నద్ధత సమంలో కొంత మంది విద్యార్థులు వేరు వేరు పుస్తకాలు, మెటీరియళ్లు చదువుతూ ఉంటారు. దీంతో అనవసర ఆందోళనకు, అయోమయానికి లోనవుతుంటారు. సన్నద్ధత సమయంలో ఎలాంటి పుస్తకం లేదా మెటీరియల్ చదువుతున్నామనేది కూడా ముఖ్యమే. సీఎంఏ ఇన్ వారి మెటీరియల్ విద్యార్థికి అవసరమైనంత సమాచారం ఇవ్వటం జరిగింది.
-కొంత మంది విద్యార్థులు కొన్ని ప్రశ్నలకు సమాధానాలను ఎక్కువ పేజీల్లో రాస్తే బాగా మార్కులు వస్తాయని భావిస్తుంటారు. కానీ అది అపోహే. సీఎంఏ పరీక్షలో మనం ఎంత జవా బు రాశామనేదానికంటే రాసిన సమాధానం ఎంత సూటిగా రాశమన్నదే ముఖ్యం.
-పరీక్ష రాసేటప్పుడు జవాబును చక్కగా రాస్తూ అవసరమైన వర్కింగ్ నోట్స్, క్యాలిక్యులేషన్స్ పక్కకే రాయాలి. చాలా మంది విద్యార్థులు కేవలం సమాధానం మాత్రమే రాసి వర్కింగ్ నోట్స్ వేరే దగ్గర రాయడంవల్ల మార్కులు కోల్పోతున్నారు.
-అకౌంట్స్ వంటి సబ్జెక్టుల్లో విద్యార్థులు లెక్కకి ఇచ్చిన ప్రాధాన్యత ఫార్మాట్ ఇవ్వరు. దీనివల్ల కూడా మార్కులు కోల్పోయే అవకాశం ఉంది.
prakash

గమనిక


- సీఎంఏ ఇంటర్, ఫైనల్ పరీక్షలు రాసేవాళ్లు తప్పనిసరిగా సీఎంఏ ఇన్ మెటీరియల్ ప్రశ్నలు, వర్క్ గత 3 పరీక్షల ఆర్ ఎంటీపీలను కనీసం ఒక్కసారైనా చదవాలి.
- వర్క్ కాన్సెప్టులను తప్పకుండా చదవాలి.
- డిసెంబర్ జరిగే పరీక్షల నుంచి సీఎంఏ ఇంటర్, ఫైనల్ పరీక్షా విధానంలో కొన్ని మార్పులు చేశారు. వీటిలో రెండు గ్రూపులు ఉన్నాయి. విద్యార్థులు పాత పరీక్షా విధానం ప్రకారం గ్రూప్-1 పరీక్షలు మొత్తం అయిపోయిన తరువాత గ్రూప్-2 పరీక్షలు రాసేవారు. కానీ నూతన పరీక్షా విధానం ప్రకారం విద్యార్థి గ్రూప్-1లో మొదటి పరీక్షను రాసిన తర్వాత మరుసటిరోజు గ్రూప్-2లో మొదటి పరీక్ష, ఇదే పద్ధతి ప్రకారం మిగతా పేపర్లను కూడా విద్యార్థులు రాయాలి.
- పరీక్షకు సంబంధించిన ఎలాంటి సందేహాల నివృత్తికి exam.helpdesk@icmai.inకు ఈ-మెయిల్ చేయవచ్చు.

450
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles