పేదరిక నిర్మూ లన పథకాలు


Wed,November 28, 2018 04:29 AM

computer

ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం


-2008 సెప్టెంబర్ నుంచి ప్రధానమంత్రి రోజ్ యోజనను ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ)గా మార్చారు.
-ఈ పథకం కింద 18 ఏండ్లు నిండిన యువకులకు స్వయం ఉపాధి కోసం సబ్సిడీతో కూడిన రుణం ఇస్తారు.
-ఈ పథకం కింద స్వయం ఉపాధిపొందే లబ్ధిదారుల్లో ఎస్సీలు 15 శాతం, ఎస్టీలు 7.5 శాతం, బీసీలు 27 శాతం, మైనార్టీలు 5 శాతం, విశ్రాంత సైనికులు 1 శాతం, వికలాంగులు 3 శాతం, 30 శాతం మహిళలు ఉండాలి.
-పీఎంఈజీపీ ద్వారా రూ. 20 లక్షలు గరిష్ఠంగా 15 శాతం సబ్సిడీ ఉంటుంది.
-పీఎంఆర్ 1993లో చదువుకున్న నిరుద్యోగులకు స్వయం ఉపాధిని కల్పించడానికి ప్రారంభించారు.
-పీఎంఆర్ 2008 సెప్టెంబర్ ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమంగా మార్చారు.
-ప్రపంచ ఆహార సంస్థ (ఎఫ్ మొదటి డైరెక్టర్ జనరల్ జాన్ బోయ్డ్ ఓర్ తొలిసారిగా 1945లో రోజుకు 2300 కేలరీల శక్తినిచ్చే ఆహారం పొందలేనివారిని పేదరికంలో ఉన్నవారుగా పేర్కొన్నారు.
-దీన్నే దారిద్య్రరేఖ లేదా పేదరికపురేఖగా పరిగణిస్తున్నారు.
-భారతదేశంలో పీడీ ఓజా మొదటిసారి కనీస తలసరి వినియోగ వ్యయం ఆధారంగా పేదరికాన్ని అంచనా వేశారు.
-ఎన్ నిర్వహించే వినియోగ వ్యయం అంచనా ఆధారంగా, ప్రణాళికా సంఘం నిపుణుల కమిటీ సూచించిన పద్ధతి ప్రకారం పేదరికాన్ని అంచనా వేస్తుంది.
పనిచేయగల సామర్థ్యం, పనిచేయాలనే ఆసక్తి ఉండి ప్రతిఫలంతో కూడిన పని దొరకని స్థితిని నిరుద్యోగం అంటారు.
-66వ ఎన్ సర్వే ప్రకారం సాధారణ స్థితి నిరుద్యోగిత రేటు అతి తక్కువగా గుజరాత్ ఉండగా, అతి ఎక్కువగా కేరళ, బీహార్ ఉంది.
-గ్రామాలలో అతి తక్కువగా నిరుద్యోగ రేటు రాజస్థాన్ (4)లో, అతి ఎక్కువగా కేరళ (75)లో ఉంది. రాజస్థాన్ మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సరిగ్గా అమలు చేయకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు అతితక్కువగా నమోదయ్యింది.
-కేరళలో నిరుద్యోగ రేటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అధికంగా ఉండటానికి శ్రామిక శక్తిలో విద్యావంతులు ఎక్కువగా ఉండటమే అని తేలింది.
-ప్రతి 1000 మంది శ్రామిక శక్తిలో నిరుద్యోగుల సంఖ్యను నిరుద్యోగిత రేటు అంటారు.

వేతన ఉపాధి పథకాల నేపథ్యం


-1977లో పనికి ఆహార పథకం ప్రారంభించారు.
-1980లో ఈ పథకాన్ని జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (ఎన్ మార్చారు.
-1983లో ఆర్ మార్చారు.
-1989లో ఎన్ ఆర్ కలిపి జవహర్ రోజ్ యోజన (జేఆర్ మార్చారు.
-1999లో జేఆర్ జవహర్ గ్రామీణ సమృద్ధి యోజన (జేజీఎస్ మార్చారు.
-2001లో జేజీఎస్ ఈఏఎస్ కలిపి సంపూర్ణ గ్రామీణ రోజ్ యోజన (ఎస్ ప్రారంభించారు.
-2004లో జాతీయ పనికి ఆహార పథకం ప్రారంభించారు.
-2008 ఏప్రిల్ ఎంజీఎన్ దేశం మొత్తం అమలులోకి రావడంతో పై రెండు పథకాలు రద్దయ్యాయి.
-స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్ యోజన (ఎస్
-ఎస్ 1999 నుంచి అమలు చేస్తున్నారు.
-వైయక్తికంగా, బృందాల వారీగా స్వయం ఉపాధి.
-లబ్ధిదారుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీలు ఉండాలి.
-మహిళలు 40 శాతం, మిగతావారు మైనార్టీలు, వికలాంగులు ఉండాలి.
-2011 మార్చి నాటికి దేశంలో మొత్తం 47.87 లక్షల స్వయం సహాయక బృందాలు ఏర్పడ్డాయి. అందులో 68 శాతం మహిళా బృందాలు ఉన్నాయి.
-ఎస్ కిందనే గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలను స్థాపిస్తున్నారు.

జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (ఎన్


-ఎస్ పథకాన్ని ఎన్ మార్చారు.
-సోనియాగాంధీ రాజస్థాన్ బనాస్ 2011 జూన్ 3న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
-గ్రామీణ నిరుపేదలను దారిద్య్రరేఖ ఎగువకు తీసుకురావడం ఈ మిషన్ లక్ష్యం.
-దీనికింద గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన కనీసం ఒక సభ్యుడిని ఎంపికచేసి స్వయం సహాయక బృందాల పరిధిలోకి తీసుకువస్తారు.
-దేశవ్యాప్తంగా 600 జిల్లాల్లోని 6000 బ్లాకుల్లో 6 లక్షల గ్రామాల్లో 7 కోట్ల బీపీఎల్ కుటుంబాలను ఎంపిక చేసి ఈ పథకం కింద సహాయం అందిస్తారు.
-లబ్ధిదారుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీలు, 15 శాతం మైనార్టీలు, 3 శాతం వికలాంగులు ఉండాలి.
స్వయం ఉపాధి పథకాల నేపథ్యం
-1972-73లో స్మాల్ ఫార్మర్స్ డెవలప్ ఏజెన్సీ (ఎస్ మార్జినల్ ఫార్మర్స్ అండ్ అగ్రికల్చరల్ లేబర్ (ఎంఎఫ్ పథకాలు ప్రారంభయ్యాయి.
-1978లో ఐఆర్ (సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం) ప్రారంభించారు. 1980లో ఐఆర్ అన్ని బ్లాకుల్లో ఆరంభించారు.
-1979లో టీఆర్
-1982లో డెవలప్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ (డీడబ్ల్యూసీఆర్ ప్రారంభమైంది.
-ఎస్సీ, ఎస్టీలకు భూములు ఇచ్చినప్పుడు వాటికి నీటి సౌకర్యం కోసం 1989లో 10 లక్షల బావుల కార్యక్రమం ప్రారంభమైంది.
-1999లో ఐఆర్ దాని అనుబంధ కార్యక్రమాలను కలిపి స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్ యోజనను ఏర్పాటు చేశారు.
-2011లో ఎస్ ఎన్ మార్చారు.
-స్వర్ణ జయంతి పట్టణ (షహరీ) రోజ్ యోజన (ఎస్
-దీనిని 1997లో ప్రారంభించారు.
-పట్టణాల్లో వేతన, స్వయం ఉపాధి, వైయక్తికంగా, బృందాల వారీగా పని కల్పిస్తారు.
-ఎస్ భాగంగా అర్బన్ సెల్ఫ్ ఎంప్లాయ్ ప్రోగ్రామ్ (యూఎస్ అర్బన్ వేజ్ ఎంప్లాయ్ ప్రోగ్రామ్ (యూడబ్ల్యూపీ), అర్బన్ కమ్యూనిటీ డెవలప్ నెట్ (యూసీడీఎన్), స్కిల్ ట్రెయినింగ్ ఫర్ డెవలప్ ప్రొమిషన్ అమాంగెస్ట్ అర్బన్ పూర్ ఉంటాయి.
-స్వర్ణజయంతి పట్టణ రోజ్ యోజనను 1997లో ఎన్ పీఎంఐయూపీఈపీలను కలిపి ప్రారంభించారు.
-1983లో సెల్ఫ్ ఎంప్లాయ్ టు ఎడ్యుకేటెడ్ అన్ యూత్ (ఎస్ అనే స్వయం ఉపాధి కార్యక్రమం ప్రారంభించారు.
-1989లో నెహ్రూ రోజ్ యోజన (ఎన్ ప్రారంభించారు. ఇందులో ఎస్ కలిపారు.
-1995లో ప్రధానమంత్రి సమగ్ర పట్టణ పేదరిక నిర్మూలన పథకం (పీఎంఐయూపీఈపీ) ఫ్రారంభమైంది.
womens

టెండూల్కర్ కమిటీ ఆహారం, ఆరోగ్య, విద్య, వస్ర్తాలపై చేసిన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోగా రంగరాజన్ కమిటీ పై అంశాలతో పాటు రవాణా, కిరాయిలను కూడా పరిగణనలోకి తీసుకుంది.

సాంఘిక భద్రత కార్యక్రమాలు


ఆమ్ ఆద్మీ బీమా యోజన (ఏఏబీవై)
-దీన్ని 2007, అక్టోబర్ 2న ప్రారంభించారు.
-భూమిలేని గ్రామీణ కుటుంబాలకు చెందిన కుటుంబ పెద్ద సహజంగా గానీ, ప్రమాదవశాత్తు గానీ, పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ అంగవైకల్యానికి గురైతే ఈ పథకం కింద బీమా సౌకర్యం ఉంటుంది.
-2012-13లో జనశ్రీ బీమా యోజన (జేబీవై)ని ఏఏబీవైలో కలిపారు.

రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన


-దీన్ని 2007, అక్టోబర్ 1న ప్రారంభించారు.
-ఈ పథకం కింద స్మార్ట్ కార్డ్ ఆధారంగా పేదరికంలో ఉన్న కుటుంబానికి ప్రతి ఏడాది రూ. 30వేల ఆరోగ్య బీమా సౌకర్యం ఉంటుంది.
-2008 ఏప్రిల్ నుంచి ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు. బీమా ప్రీమియాన్ని కేంద్ర, రాష్ర్టాలు 75:25 నిష్పత్తిలో భరిస్తాయి. ఈశాన్య రాష్ర్టాలు, జమ్ముకశ్మీర్ 90:10 నిష్పత్తిలో భరిస్తాయి. అసంఘటిత రంగ కార్మికుల సాంఘిక భద్రతా చట్టం
-2008లో ఈ చట్టం చేశారు. ఇది 2009 మే 16 నుంచి అమల్లోకి వచ్చింది.
-ఈ చట్టం అసంఘటితరంగ కార్మికులకు సాంఘిక భద్రతను కల్పిస్తుంది.
-జాతీయ సాంఘిక భద్రతా బోర్డులు, రాష్ట్ర సాంఘిక భద్రతా బోర్డులు ఏర్పాటు చేస్తారు. ఈ బోర్డులు అసంఘటితరంగ కార్మికుల కోసం అమలుపర్చాల్సిన సాంఘిక భద్రతను సూచిస్తాయి.
-ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం (1995) కింద వృద్ధులకు పెన్షన్లు ఇస్తున్న తీరులోనే భవనాలు, ఇతర నిర్మాణ పనులు చేసే కార్మికులకు, ఎంజీఎన్ కార్మికులకు, అంగన్ కార్యకర్తలకు, గ్యాంగ్ రోజువారీ కూలీలకు కూడా పెన్షన్ ఇవ్వాలని జాతీయ సాంఘిక భద్రతా బోర్డు సూచిస్తుంది.

village

టెండూల్కర్ కమిటీ ఆహారం, ఆరోగ్య, విద్య, వస్ర్తాలపై చేసిన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోగా రంగరాజన్ కమిటీ పై అంశాలతో పాటు రవాణా, కిరాయిలను కూడా పరిగణనలోకి తీసుకుంది. ఈ పథకంలో 33 శాతం మహిళల భాగస్వామ్యం ఉండాలి.

ఎంజీఎన్


-మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (ఎంజీఎన్ 2005 సెప్టెంబర్ చట్టం చేశారు. 2006, ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చింది.
-మొదటగా 200 జిల్లాల్లో ప్రవేశపెట్టారు.
-2007-08లో మరో 130 జిల్లాల్లో విస్తరించారు.
-2008 ఏప్రిల్ 1 నుంచి దేశంలోని అన్ని గ్రామీణ జిల్లాల్లో అమలు చేస్తున్నారు.
-గ్రామీణ ప్రాంతంలో ఏడాదికి కనీసం 100 రోజుల వేతన ఉపాధి ఈ పథకం లక్ష్యం. దాన్ని 2012-13లో 150 రోజులకు పెంచారు.
-నైపుణ్యం అవసరం లేని, శ్రమ చేయడానికి సిద్ధపడిన గ్రామీణులందరూ అర్హులే.

చేపట్టే పనులు


1. భూమి అభివృద్ధి ప్రాజెక్టులు
2. కాల్వల నిర్మాణ పనులు
3. నీటిపారుదల సంబంధిత ప్రాజెక్టులు
4. సుస్థిర వ్యవసాయాభివృద్ధి ప్రాజెక్టులు
5. హార్టికల్చర్, తోటల పెంపకాలకు సంబంధించినవి
6. రక్షిత నీటి ట్యాంకుల నిర్మాణం
7. రోడ్ల నిర్మాణం
8. సామాజిక అడవుల పెంపకం, అటవీ సంరక్షణ
-ఈ చట్టం ప్రకారం గ్రామస్థులు ఉపాధి కోసం దరఖాస్తు చేసిన 15 రోజుల్లో వేతన ఉపాధి కల్పించాలి. లేనట్లయితే మొదటి నెలరోజులకు 1/4వ వంతు వేతనాన్ని, ఆ తర్వాత రోజలకు సగం వేతనాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
-మహిళలకు పురుషులతో సమాన వేతనాన్ని చెల్లించాలి.
-వేతనాలను గరిష్ఠంగా 15 రోజుల్లోపు చెల్లించాలి.
-ఈ పనుల్లో కాంట్రాక్టర్లు, యంత్రాల వాడకం నిషిద్ధం.

నిర్మల్ గ్రామ్ పురస్కార్ పథకం


-స్వచ్ఛమైన పర్యావరణాన్ని కలిగి ఉండేలా ప్రోత్సహించడానికి నిర్మల్ గ్రామ్ పురస్కార్ అందిస్తున్నారు.
-100 శాతం స్వచ్ఛమైన పర్యావరణాన్ని సాధించిన పంచాయతీరాజ్ సంస్థలకు ఇస్తారు.
-22,443 గ్రామపంచాయతీలు, 165 మాధ్యమిక పంచాయతీలు, 10 జిల్లా పంచాయతీలు గత ఐదేండ్లలో ఈ పురస్కారాన్ని అందుకున్నాయి.
-దేశంలో మొదటి నిర్మల్ రాష్ట్రంగా సిక్కిం అవతరించింది.
డా. సీ రంగరాజన్ కమిటీ ప్రకారం దేశంలో పేదరికం 2009-10లో 38.2 శాతం ఉండగా 2011-12లో 29.5 శాతం ఉంది. ఈ కమిటీని 2012లో నియమించారు. నివేదికను 2014లో ఇచ్చింది.
giridhar

971
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles