తెలంగాణ ఉద్యమం- ప్రజా సంఘాలు


Wed,November 28, 2018 04:15 AM

పీపుల్స్ కేంద్ర కమిటీ విధాన ప్రకటన- ప్రత్యేక తెలంగాణ
-1997, జూన్ 1న సీపీఐ (ఎంఎల్) పీపుల్స్ కేంద్ర కమిటీ ‘తెలంగాణ ఉద్యమం-తెలంగాణ అభివృద్ధి- మా కార్యక్రమం’ పేరుతో (43 పేజీల బుక్ విధాన ప్రకటనను విడుదల చేసింది.
-ప్రాంతీయ అసమానతల మూలంగానే తెలంగాణ ఉద్యమం ముందుకు వచ్చిందని అభిప్రాయపడింది.
-1920 నుంచి కోస్తాంధ్ర నుంచి తెలంగాణకు పెరిగిన వలసల గురించి, ఉద్యోగాలను కోస్తా జిల్లాల వారు కొల్లగొట్టడం, పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘనలు, ఆరు సూత్రాల పథకం ఉల్లంఘనలు, సీమాంధ్ర పారిశ్రామికవేత్తల దోపిడీ, నీటిపారుదల రంగంలో తెలంగాణపై నిర్లక్ష్యం, విద్యుచ్ఛక్తి, విద్యారంగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఇందులో కళ్లకు కట్టినట్లు వివరించింది.
తెలంగాణ ఐక్యవేదిక
-రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేసే 28 సంస్థలు కలిసి 1997, అక్టోబర్ 14న ఉస్మానియా లైబ్రెరీలో ‘తెలంగాణ ఐక్యవేదిక’ను ఏర్పాటు చేశాయి.
-1997, అక్టోబర్ 16న ఐక్యవేదిక ఆవిర్భావాన్ని ప్రకటిస్తూ ఒక పత్రికా ప్రకటనను ప్రొ. జయశంకర్, ప్రొ. కేశవరావ్ జాదవ్ మీడియాకు విడుదల చేశారు. ఇందులో సమిష్టి నాయకత్వం ప్రాధాన్యతను వివరిస్తూ తెలంగాణ రాష్ట్రమే తెలంగాణ సమస్యలకు పరిష్కారం అని పేర్కొన్నారు.
-రెండంచెల కమిటీ నిర్మాణంతో కార్యక్రమాలు నిర్వహించాలని ఐక్యవేదిక నిర్ణయించింది. అవి..
1. ఆర్గనైజింగ్ కమిటీ: దీనిలో వేదిక భాగస్వామ్య సంస్థలన్నింటికి స్థానం కల్పించారు. ఆయా సంస్థలు తమ ప్రతినిధులను కమిటీకి నామినేట్ చేశాయి.
2. స్టీరింగ్ కమిటీ: విధాన నిర్ణయాలు చేస్తూ ఉద్యమానికి మార్గదర్వకత్వాన్ని కల్పించేందుకు స్టీరింగ్ కమిటీ రూపొందింది. ఇందులో ప్రొ. జయశంకర్, ప్రొ. కేశవరావ్ జాదవ్, రాపోలు ఆనంద భాస్కర్, వీ ప్రకాశ్, ఎస్ విజయ ప్రశాంత్, బీ రాజ్యవర్ధన్ సీ సతీష్ కుమార్, భూపతి కృష్ణమూర్తి, నాగారం అంజయ్య, ఎల్ మురళీధర్ దేశ్ తేజావత్ బెల్లయ్య నాయక్ సభ్యులుగా ఉన్నారు.
-పారదర్శకంగా, ఎలాంటి భేదాలు లేకుండా ఉద్యమ సంస్థల ద్వారా తెలంగాణ ప్రజలను చైతన్య పర్చడానికి వివిధ జిల్లాల్లో మిగిలి ఉన్న సంస్థలకు ఐక్యవేదికలో భాగస్వామ్యం కల్పించారు. ఆయా సంస్థల ఆసక్తిని బట్టి వాటి పనితీరును గమనించి, ఐక్యవేదికలో చేర్చుకునే అంశాన్ని స్టీరింగ్ కమిటీ పరిశీలించేది.
-1997, నవంబర్ 1న తెలంగాణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిజాంకాలేజీ మైదానం నుంచి సికింద్రాబాద్ క్లాక్ పార్క్ హిమాయత్ నారాయణగూడ, ముషీరాబాద్ మీదుగా సుమారు 3వేల మందితో భారీ ర్యాలీ జరిగింది. 1969 తెలంగాణ ఉద్యమం తర్వాత రాష్ట్ర రాజధానిలో జరిగిన తెలంగాణ ఉద్యమ ర్యాలీ ఇదే అని చెప్పవచ్చు.
-ఈ ర్యాలీ క్లాక్ పార్క్ అమరవీరుల స్తూపం వద్దకు చేరిన తర్వాత జరిగిన బహిరంగ సభలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు, కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొ. జయశంకర్, ప్రొ. కేశవరావు జాదవ్, వీ ప్రకాశ్, చెరుకు సుధాకర్, భరత్ కుమార్, బెల్లయ్య నాయక్ తదితరులు ప్రసంగించారు.
-కొండా లక్షణ్ బాపూజీ జలదృశ్యంలోని తన ఇంటిని తెలంగాణ ఐక్యవేదిక కార్యాలయంగా వాడుకోవడానికి ఇచ్చారు.
-అప్పటివరకు ఐక్యవేదిక కార్యాలయం కాచిగూడ లింగంపల్లి రోడ్డులో ఉన్న సుప్రభాత్ కాంప్లెక్స్ ఉండేది.
-ఐక్యవేదిక ఆధ్వర్యంలో ‘తెలంగాణ పత్రిక’ను వీ ప్రకాశ్, సామ జగన్ నడిపారు.
-1997, నవంబర్ 1న గన్ వద్ద ఈ పత్రికను కాళోజీ ఆవిష్కరించారు.
-ఉద్యమాలతోపాటు సేవా కార్యక్రమాలను కూడా ఐక్యవేదిక నిర్వహించేది. వాటిలో ముఖ్యమైనవి..
-స్వచ్ఛంద సంస్థల నుంచి విరాళాలు సేకరించి ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు రూ. 3వేలు ఆర్థిక సహాయంగా అందించింది (1998-99).
-కరువు బారినపడిన మహబూబ్ జిల్లా గట్టు మండలంలోని రాయపూర్ గ్రామాన్ని ఐక్యవేదిక దత్తత తీసుకుంది. సీఈసీ గోపాల్ ఆధ్వర్యంలోని స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఎండాకాలంలో మూడు నెలలపాటు బియ్యం, గోధుమలు, జొన్నలు మొదలైనవాటిని ఆ గ్రామాల్లోని ప్రతి కుటుంబానికీ పంపిణీ చేసింది.
-1998 జూలైలో ఆదిలాబాద్ జిల్లాలో కలరా వ్యాపించి వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. అయితే ప్రభుత్వం దాన్ని అతిసారా వ్యాధిగా గుర్తించింది. దీనిపై ఐక్యవేదిక తరఫున బీఎన్ శంకర్, వీ ప్రకాశ్, మల్లేపల్లి లక్ష్మయ్యలతో కూడిన నిజ నిర్ధారణ సంఘం వెళ్లి కలరాగా నిర్ధారించి 2500 మంది మరణించారని తెలిపింది.
-ఈ సమస్య బీ జనార్దనరావు చొరవతో వాల్ (యూఎస్ జర్నల్ కూడా ప్రచురితమైంది. దీంతో వెంటనే స్పందించిన ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. అంతర్జాతీయ సంస్థల నుంచి కూడా సహాయం లభించింది.
-అయితే తెలంగాణ ఐక్యవేదిక అనేక సదస్సులు, సమావేశాలు నిర్వహించినప్పటికీ తెలంగాణ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చలేకపోయింది. దీంతో జనాకర్షణ గల నాయకుడు ఉంటే తెలంగాణ వాదం ప్రజల్లోకి వెళ్తుందని వేదిక నాయకులు భావించారు.
-రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడైన పీ జనార్దన్ (పీజేఆర్)కి ఉద్యమ నాయకత్వం అప్పగించాలని ఐక్యవేదిక ప్రయత్నం చేసింది. కానీ ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు.
-2000 ఆగస్టు 11న ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ హైదరాబాద్ పర్యటించారు. పీజేఆర్ సలహాతో సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ తెలంగాణ ఐక్యవేదిక ఒక నివేదికను రూపొందించింది.
-తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమంటూ తెలంగాణ కాంగ్రెస్ చెందిన 41 మంది ఎమ్మెల్యేలలో 38 మంది సంతకాలు సేకరించింది. వీటిని జీ చిన్నారెడ్డి, పాల్వాయి గోవర్ధన్ నాయకత్వంలో సోనియా గాంధీకి అందించారు.
-ఐక్యవేదిక నివేదికపై సోనియాగాంధీ సానుకూలంగా స్పందించారు.
-ఇదే సమయంలో తెలంగాణ ప్రాంతంలో తీవ్రమైన కరుపు పరిస్థితులు నెలకొన్నాయి. దీనికితోడు నాటి అధికార తెలుగుదేశం పార్టీ తరచు విద్యుత్ చార్జీలను పెంచుతూ పోయింది.
-ఈ సమయంలో తెలంగాణ ప్రజల ఇబ్బందులకు స్పందిస్తూ నాటి డిప్యూటీ స్పీకర్ కే చంద్రశేఖర్ పెంచిన విద్యుత్ చార్జీలను నిరసిస్తూ ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు.
-దీంతో ఐక్యవేదిక నాయకులు ప్రొ. జయశంకర్ నేతృత్వంలో కేసీఆర్ కలిసి తెలంగాణలో విద్యుత్ అనేక సమస్యలు ఉన్నాయని, వాటికి గల కారణాలను వివరించి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించాలని కోరారు.
-ఐక్యవేదిక కృషితో కేసీఆర్ 2001, ఆగస్టు 27న తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు.

మహాసభ లక్ష్యాలు-ఆశయాలు


1. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం ఉద్యమించడం
2. భావ సారూప్యం కలిగిన ప్రజా సంఘాలు, నాయకులతో పనిచేయడం
3. 1/70 చట్టం అమలుకోసం కృషి చేయడం
4. తెలంగాణలోని పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం.
5. పెండింగ్ ఉన్న తెలంగాణ ప్రాజెక్టులను నిర్మించడం కోసం కృషి చేయడం
6. 610 జీఓ అమలుకు ఉద్యమించడం

తెలంగాణ స్టడీస్ ఫోరం


-తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా తెలంగాణ స్టడీస్ ఫోరం గాదె ఇన్నయ్య, పిట్టల శ్రీశైలం మొదలైన వారి ఆధ్వర్యంలో 1998లో ఏర్పడింది. దీనికి గాదె ఇన్నయ్య అధ్యక్షుడిగా, పిట్టల శ్రీశైలం ఉపాధ్యక్షునిగా వ్యవహరించారు.
-ఈ ఫోరం తెలంగాణకు సంబంధించిన వివిధ సమస్యల గురించి కరపత్రాలు, పుస్తకాలు ప్రచురించింది. తెలంగాణ వ్యాప్తంగా సదస్సులు, సమావేశాలు నిర్వహించింది.
తెలంగాణ ఉద్యమ కమిటీ- జై తెలంగాణ పార్టీ
-ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి పీ ఇంద్రారెడ్డి చైర్మన్ ‘తెలంగాణ ఉద్యమ కమిటీ’ 1997, జూన్ 18న ఏర్పడింది. ప్రొ. జయశంకర్, ప్రొ. కేశవరావ్ జాదవ్, మాజీ మంత్రి మేచినేని కిషన్ జిస్టిస్ కొండా మాధవరెడ్డి, పండిట్ నారాయణరెడ్డి, టీ ప్రభాకర్, చుంచు లక్ష్మయ్య తదితరులు ఇంద్రారెడ్డిని ప్రోత్సహించారు.
-తెలంగాణ ఉద్యమ కమిటీ ఏర్పడిన తర్వాత తెలంగాణ నినాదం రాజకీయ ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.
-వివిధ రాజకీయ పార్టీలు (పీపుల్స్ బీజేపీ), సంస్థలు తెలంగాణ పోరాటానికి మద్దతు ప్రకటించాయి. ఇది తెలంగాణ ప్రజల తొలి విజయంగా ఉద్యమ కమిటీ సెప్టెంబర్ 1997లో ప్రచురించిన కరపత్రంలో పేర్కొంది.
-దాదాపు అన్ని జిల్లాల్లో ఉద్యమ కమిటీలను ప్రకటించి ప్రణాళిక, ఉద్యమ నిర్మాణం కోసం ఇంద్రారెడ్డి సన్నాహాలు ప్రారంభించారు.
-ఇందులో భాగంగా సెప్టెంబర్ 13, 14 తేదీల్లో హైదరాబాద్ చంపాపేటలోని సామ నర్సింహారెడ్డి గార్డెన్ తెలంగాణ ఉద్యమ ప్రతినిధుల సదస్సు నిర్వహించారు.
-తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి సుమారు రెండు వేల మంది పాల్గొన్న ఈ సదస్సుకు శిబూసోరెన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
-చంపాపేటలో నిర్వహించిన సదస్సు తర్వాత ఇంద్రారెడ్డి ‘జై తెలంగాణ పార్టీ’ని ప్రారంభించారు. హైదరాబాద్ కాచిగూడలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటుచేసి తెలంగాణ ఉద్యమ పునర్నిర్మాణం కోసం పని చేశారు.
-అయితే ఇంద్రారెడ్డి హోంమంత్రిగా ఉన్న కాలంలో తెలంగాణలో ఎన్ జరగడం, గతంలో చెన్నారెడ్డి తెలంగాణకు ద్రోహం చేశాడనే అపవాదు విపరీతంగా ప్రచారం కావడం తదితర కారణాల వల్ల ఇంద్రారెడ్డిపై సానుకూలత రాలేదు.
-అతని వ్యవహారశైలి నచ్చనివారు సహచరులు, మేధావులు ఒక్కొక్కరుగా ఆయనకు దూరమయ్యారు.
-ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చేసేది ఏమీలేక తన రాజకీయ మనుగడ కోసం కాంగ్రెస్ చేరారు.

తెలంగాణ ప్రగతి వేదిక


-ప్రముఖ జర్నలిస్టు రాపోలు ఆనంద భాస్కర్ నేతృత్వంలో హైదరాబాద్ 1997, జూలై 12, 13 తేదీల్లో తెలంగాణ సదస్సు జరిగింది.
-ఇందులో తెలంగాణ ప్రజల ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ వెనుకబాటుతనంపై దృష్టిని కేంద్రీకరించి చర్చించారు.
-ఈ సమావేశాల్లో దాశరథి రంగాచార్య, ప్రొ. జయశంకర్, బీఎస్ రాములు, సుంకిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు ప్రసంగించారు.
-ఆనంద భాస్కర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రగతి వేదిక 1997, జూలై 13న ఆవిర్భవించింది.
-తెలంగాణ ప్రగతి వేదిక బతుకమ్మ పండుగ కాలాన్ని తెలంగాణ సంసృ్కతి పరిరక్షణ దినోత్సవాలుగా ప్రకటించి పలుచోట్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించి తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తిని పెంపొందించింది.
-తెలంగాణ ఐక్యవేదిక ఆవిర్భావంతో తెలంగాణ ప్రగతి వేదిక అందులో భాగస్వామ్య సంస్థగా పనిచేసింది.

తెలంగాణ మహాసభ (1997)


-మలిదశ ఉద్యమ చరిత్రలో తెలంగాణ మహాసభ ఆవిర్భావం ఒక మలుపుగా చెప్పవచ్చు. భువనగిరి సభ తర్వాత గద్దర్ కాల్పులు జరగడంతో తెలంగాణ గురించి మరెవ్వరూ గొంతెత్తలేరు, గజ్జెకట్టి ఆడలేరని భావించిన చంద్రబాబు ప్రభుత్వాన్ని సవాలు చేస్తూ వేలాది గొంతులతో సూర్యాపేట తెలంగాణ మహాసభ గర్జించింది.
-తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగుతున్న ప్రజా ఉద్యమంలో భాగంగా అణగారిన కులాలు, తెగలను ఐక్యం చేస్తూ మారోజు వీరన్న దళిత బహుజన మహాసభను ఏర్పాటుచేశాడు.
-చిన్న రాష్ర్టాల స్థాపన ద్వారానే దళిత, బహుజనులకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని భావించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేశాడు.
-భౌగోళిక తెలంగాణలో బహుజన రాజ్యం కావాలనే లక్ష్యంతో తెలంగాణ మహాసభను స్థాపించాడు.
-అప్పటి ప్రభుత్వాల నిర్బంధాలవల్ల వీరన్న తెరవెనుక ఉండి 1997, ఆగస్టు 11న సూర్యాపేట సదస్సును నిర్వహించాడు. దీనికి చెరుకు సుధాకర్ అధ్యక్షుడిగా, వీ ప్రకాశ్ కార్యదర్శిగా కొనసాగారు.
-ఈ సదస్సుకు కాళోజీ, ప్రొ. జయశంకర్, నారం కృష్ణారావు, హరగోపాల్, బెల్లి లలిత, రాపోలు ఆనంద భాస్కర్ తదితరులు హాజరయ్యారు.
-బహుజన కులాల నుంచి వచ్చిన నాయకత్వమే తెలంగాణ ఉద్యమంలో నిజాయితీగా పోరాడగలదని ఈ సంస్థ విశ్వసించింది.
-సదస్సు అనంతరం జరిగిన బహిరంగ సభకు ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు, అధ్యాపకులు, వివిధ జిల్లా కేంద్రాల నుంచి మేధావులు, పాత్రికేయులు, వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా హాజరై సభను విజయవంతం చేశారు.
-తెలంగాణ మహాసభలో లంబాడి పోరాట హక్కుల సమితి, చాకిరేవు, తుడుం దెబ్బ, డోలు దెబ్బ మొదలైన వాటితోపాటు అనేక కులసంఘాలు కలిశాయి.
mallikarjun

410
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles