ఎన్‌హెచ్‌ఏఐలో యంగ్ ప్రొఫెషనల్స్


Wed,November 28, 2018 12:47 AM

న్యూఢిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఫైనాన్స్ విభాగంలో ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్ (కాంట్రాక్ట్ ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
nhai-logo
-మొత్తం పోస్టులు: 70 (జనరల్-37, ఓబీసీ-18, ఎస్సీ-10, ఎస్టీ-5)
-ఖాళీలు ఉన్న రీజినల్ ఆఫీస్‌లు: తెలంగాణ, ఏపీ, బీహార్, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, హర్యానా అండ్ పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్ము అండ్ కశ్మీర్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర అండ్ గోవా, నార్త్ ఈస్ట్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్, చత్తీస్‌గఢ్
-పోస్టు పేరు: యంగ్ ప్రొఫెషనల్ (ఫైనాన్స్)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీకాం లేదా కామర్స్/అకౌంట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఐసీఏఐ/ఐసీడబ్ల్యూఏఐ లేదా ఎంబీఏ (ఫైనాన్స్)లో ఉత్తీర్ణత. ఫైనాన్షియల్ విభాగం (ఫైనాన్షియల్ అకౌంటింగ్, బడ్జెటింగ్, ఇంటర్నల్/అడిట్, కాంట్రాక్టు/ఫండ్ మేనేజ్‌మెంట్, స్వయంప్రతిపత్తి గల ఏదైనా సంస్థ)లో అనుభవం ఉండాలి.
-వయస్సు: 2018 డిసెంబర్ 11 నాటికి 32 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-కాలవ్యవధి: రెండేండ్లు
-పే స్కేల్: రూ. 60,000/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. సంబంధిత రీజినల్ ఆఫీస్/ప్రాంతీయ కార్యాలయాల్లో ఇంటర్వ్యూ రోజున హాజరుకావాలి.
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 11
-వెబ్‌సైట్: www.nhai.org

333
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles