జీప్యాట్-2019


Wed,November 7, 2018 01:18 AM

GPAT-2019
ఫార్మా.. దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న రంగం. మానవజాతి ఉన్నంతవరకు ఈ రంగానికి ఢోకాలేదు. ఫార్మా పీజీస్థాయి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయస్థాయి ప్రవేశపరీక్ష జీప్యాట్-2019 ప్రకటన విడుదలైన నేపథ్యంలో వివరాలు సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం...

- దేశవ్యాప్తంగా 841కి పైగా ఫార్మా కాలేజీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయస్థాయి పరీక్ష గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ - జీప్యాట్. ఇప్పటివరకు ఈ పరీక్షను ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) నిర్వహించేది. ఈ ఏడాది నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది.
- కోర్సు: ఎం.ఫార్మా / తత్సమాన కోర్సు (పీజీస్థాయి)

ఏయే విశ్వవిద్యాలయాలు/కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు...?

- దేశవ్యాప్తంగా ఏఐసీటీఈ అనుమతి పొందిన సంస్థలు, విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీల అనుబంధ కాలేజీలు. దీనిలో భాగస్వామ్యం ఉన్న కొన్ని ప్రముఖ సంస్థలు.. నైపర్-మొహాలి, న్యూఢిల్లీలోని జామియా హామ్‌డార్డ్, చండీగఢ్-యూనివర్సిటీ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, జాదవ్‌పూర్ యూనివర్సిటీ-కోల్‌కతా, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ-ముంబై, డిపార్ట్‌మెంట్

నోట్: జీప్యాట్ రాసే అభ్యర్థులకు ఎటువంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.

ఆఫ్ ఫార్యాస్యూటిక్స్, ఐఐటీ బీహెచ్‌యూ-వారణాసి, మహరాజ సయాజీరావ్ యూనివర్సిటీ ఆఫ్ బరోడా-వడోదర, నైపర్-హైదరాబాద్, ఢిల్లీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్-న్యూఢిల్లీ, ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం.

ఎవరు అర్హులు...?

- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఫార్మసీలో బ్యాచిలర్ డిగ్రీ (ఇంటర్ తర్వాత నాలుగేండ్ల కోర్సు, లేటరల్ ఎంట్రీ విద్యార్థులు కూడా అర్హులే) లేదా బీఫార్మసీ (10+2+4) ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయనున్నవారు/బీటెక్ (ఫార్మాస్యూటికల్ అండ్ ఫైన్ కెమికల్ టెక్నాలజీ) లేదా తత్సమానకోర్సు ఉత్తీర్ణులు.
- ఎంపిక ఎలా: దేశవ్యాప్తంగా నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా

పరీక్ష విధానం:
- ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.
- ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. 3 గంటల కాలవ్యవధి. 125 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 500 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి సరైన జవాబుకు నాలుగు మార్కులు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1 మార్కు కోత విధిస్తారు.

నోట్: జీప్యాట్ రాసేవారికోసం ఎన్‌టీఏ దేశవ్యాప్తంగా టెస్ట్ ప్రాక్టీస్ సెంటర్ల (టీపీసీ)ను ప్రారంభించింది. టీపీసీలో అభ్యర్థులకు అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్ నోడల్ ఆఫీసర్, స్టాఫ్ అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

- జీప్యాట్ స్కోర్ మూడేండ్లు వ్యాలిడిటీ ఉంటుంది.
- రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, వరంగల్. ఏపీలో గుంటూరు, కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.

ముఖ్యతేదీలు

- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్ 30
- ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.1400/-
- మహిళలు, ట్రాన్స్‌జెండర్లు (ఏ కేటగిరీ అయినా)- రూ.700/-
- ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ (పురుష/మహిళ)-రూ.700/-
- పరీక్ష కేంద్రం: 2019, జనవరి 28 (మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు)
- ఫలితాల వెల్లడి: 2019, ఫిబ్రవరి 8
- వెబ్‌సైట్: https://ntagpat.nic.in

- కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

532
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles