ఇంజినీరింగ్ ఎంట్రెన్స్‌లు


Wed,November 7, 2018 01:13 AM

engineer
ఇంజినీరింగ్.. ఎవర్‌గ్రీన్ కెరీర్. బెస్ట్ ఇంజినీరింగ్ కాలేజీలో సీటు కోసం దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు అహర్నిశలు శ్రమిస్తారు. ఐఐటీల నుంచి అటానమస్ కాలేజీల వరకు పలు పేరొందిన కాలేజీల్లో ప్రవేశాల కోసం ఆయా కళాశాలలులు నిర్వహించే ఎంట్రెన్స్‌లు రాస్తుంటారు. ఇప్పటికే ఐఐటీ, నిట్ తదితర సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ ప్రకటన విడుదలైంది. పరిమితమైన ఈ ప్రభుత్వ కాలేజీల తర్వాత దేశవ్యాప్తంగా కొన్ని ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీల నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రకటనలు విడుదలవ్వగా మరికొన్ని త్వరలో రానున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పేరుగాంచిన కొన్ని సంస్థల వివరాలు సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం...

- జేఈఈ అడ్వాన్స్‌డ్: ఈ ఎంట్రెన్స్ ద్వారా ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
- ఐఐటీ: దేశవ్యాప్తంగా 21 ఐఐటీలు ఉన్నాయి. వీటిలో ప్రవేశం లభించిందంటే విద్యార్థి దశ తిరిగనట్లుగానే భావిస్తారు. వీటిలో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించాలి. ఆ తర్వాత ఐఐటీ రూర్కీ నిర్వహించే అడ్వాన్స్‌డ్ పరీక్షలో మంచి ర్యాంకు సాధిస్తే ఐఐటీల్లో ప్రవేశం లభిస్తుంది.
- జేఈఈ మెయిన్: దీని ద్వారా నిట్, ఐఐఐటీ, సీఐఎఫ్‌టీలలో ప్రవేశాలు కల్పిస్తారు. వీటితోపాటు పలు ప్రముఖ డీమ్డ్ యూనివర్సిటీలు, కాలేజీలు ఇంజినీరింగ్‌లో ప్రవేశాలు కల్పిస్తాయి.
- నిట్: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్). దేశవ్యాప్తంగా 31 నిట్‌లు ఉన్నాయి. అదేవిధంగా 23 ఐఐఐటీలు, 22 సీఎఫ్‌టీఐలు ఉన్నాయి. వీటన్నింటిలో ప్రవేశానికి జేఈఈ మెయిన్ స్కోర్‌ను ప్రాతిపదికగా తీసుకుంటారు.
- ఇవేకాకుండా పలు ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తాయి.
- బిట్‌శాట్: ఐఐటీ, నిట్‌ల తర్వాత అంతస్థాయిలో పేరుగాంచిన విద్యాసంస్థ బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్). రాజస్థాన్‌లోని పిలానీలో ప్రారంభించిన ఈ సంస్థకు ప్రస్తుతం పిలానీ, హైదరాబాద్, గోవా, దుబాయిల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. దీనిలో ప్రవేశాల కోసం ఏటా బిట్‌శాట్‌ను నిర్వహిస్తుంది.

బిట్‌శాట్-2019

BITS
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 2018 డిసెంబర్ 19 నుంచి ప్రారంభం
- చివరితేదీ: 2019, మార్చి 13
- పరీక్ష కేంద్రాల ఎంపిక: 2019, మార్చి 21
- స్లాట్ బుకింగ్: 2019, మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 వరకు
- పరీక్ష తేదీలు: 2019, మే 16-31 మధ్య
- వెబ్‌సైట్: http://bitsadmission.com

వెల్లూరు ఇంజినీరింగ్ కాలేజీ

VIT
విట్‌గా పేరుగాంచిన వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్). విట్ ప్రవేశాల కోసం కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఎగ్జామ్ (విట్‌ఈఈఈ)ని నిర్వహిస్తుంది. వచ్చిన స్కోర్ ఆధారంగా వెల్లూరు, చెన్నై, భోపాల్, అమరావతి క్యాంపస్‌లలో అడ్మిషన్లు ఇస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో (ప్రారంభమైనవి)
- చివరితేదీ: 2019, ఫిబ్రవరి 28
- విట్‌ఈఈఈ-2019: 2019, ఏప్రిల్ రెండో/మూడో వారం
- ఫలితాల వెల్లడి: ఏప్రిల్ చివరివారం.
- వెబ్‌సైట్: http://www.vit.ac.in

ఎస్‌ఆర్‌ఎంజేఈఈ-2019

SRM
తమిళనాడులోని ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎస్‌ఆర్‌ఎంజేఈఈ) 2019లో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ ప్రకటన విడుదలైంది. ఈ సంస్థ కట్టన్‌కుల్తూర్, రామాపురం, వడపలనీ, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ఘజియాబాద్, ఢిల్లీ-ఎన్‌సీఆర్ సోనేపట్, అమరావతి, సిక్కిం క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తుంది.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో (ప్రారంభమైంది)
- చివరితేదీ: 2019, మార్చి 31
- పరీక్ష తేదీలు: 2019, ఏప్రిల్ 15-25 మధ్య ఉంటాయి.
- వెబ్‌సైట్: http://www.srmuniv.ac.in

మణిపాల్

Manipal
మణిపాల్ యూనివర్సిటీగా పేరొంది ప్రస్తుతం మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌గా పిలుస్తున్న ఈ సంస్థలో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం మణిపాల్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎంఈటీ)ని నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ద్వారా మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మణిపాల్. సిక్కిం మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సిక్కిం, మణిపాల్ యూనివర్సిటీ, జైపూర్.
- టెస్ట్ పద్ధతి: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో (ప్రారంభమైనవి)
- చివరితేదీ: 2019, మార్చి 15
- వెబ్‌సైట్: https://manipal.edu/mu.html

అమృత విశ్వవిద్యాపీఠం

amrita
అమృత స్కూల్స్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ప్రవేశాల కోసం అమృత ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్-ఇంజినీరింగ్-2019ను నిర్వహిస్తుంది. ఈ సంస్థ క్యాంపస్‌లు అమరావతి, అమృతపురి, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరుల్లో ఉన్నాయి,.
- ఎంపిక: ఏఈఈఈ 2019 ద్వారా 70 శాతం సీట్లు, జేఈఈ మెయిన్ స్కోర్ ద్వారా 30 శాతం సీట్లు భర్తీ చేస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ప్రారంభమైనవి
- చివరితేదీ: 2019, ఏప్రిల్ 5
- పరీక్షతేదీలు: ఏప్రిల్ 22-26 మధ్య
- వెబ్‌సైట్: https://www.amrita.edu

- అమిటీ యూనివర్సిటీ, లవ్‌లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, నిర్మా యూనివర్సిటీ, అంబానీ, బీఎల్ ముంజల్, క్రిస్ట్, కారుణ్య, ఎంకేఎస్, కంచి పరమాచార్య, గీతం, విజ్ఞాన్, కేఎల్‌యూ, శాస్త్ర తదితర కాలేజీల్లో కూడా తెలుగు రాష్ర్టాల విద్యార్థులు ఎక్కువగా ప్రవేశాలు పొందుతుంటారు. ఆయా తేదీలను నేరుగా విద్యాసంస్థల వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. పైన పేర్కొన్న సంస్థల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఇష్టాఇష్టాలను బట్టి అన్ని విషయాలు తెలుసుకుని జాయిన్ కావాలి. ఇవి కేవలం పలువురి విద్యావేత్తల అభిప్రాయాలు మాత్రమే. ప్రవేశాలు తీసుకోవడంలో విద్యార్థులదే తుది నిర్ణయం.

441
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles