స్పార్క్


Wed,November 7, 2018 01:12 AM

స్కీం ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకడమిక్ అండ్ రిసెర్చ్ కొలాబరేషన్ (స్పార్క్)
cpat
కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ప్రారంభించిన కొత్త స్కీం స్పార్క్. దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధనలను పెంచడమే దీని ప్రధాన లక్ష్యం. దీనికోసం దేశంలోని విద్యాసంస్థలు ప్రపంచంలో అత్యుత్తమ 28 విద్యాసంస్థలతో కలిసి పనిచేస్తున్నాయి. 2019లో మొదటి దఫా 600 ప్రాజెక్టులకు నిధులు సమకూర్చాలని స్పార్క్ లక్ష్యంగా పెట్టుకున్నది.

- స్పార్క్ పరిశోధన టీం: కనీసం ఇద్దరు అంతర్జాతీయ ఫ్యాకల్టీ సభ్యులు, ఇద్దరు భారతీయ ఫ్యాకల్టీలు, పీహెచ్‌డీ, పోస్టు డాక్టోరల్ చేస్తున్న 2+2 రిసెర్చర్స్ ఉంటారు.
- ఫండమెంటల్ రిసెర్చ్: బేసిక్ సైన్సెస్, అప్లయిడ్ అండ్ ఇంటర్‌డిసిప్లినరీ సైన్సెస్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, కంప్యుటేషనల్ అండ్ మ్యాథమెటికల్ సైన్సెస్, ఎర్త్, అట్మాస్ఫియర్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్.
- ఎమర్జెంట్ ఏరియాస్ ఆఫ్ ఇంపాక్ట్: అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అడ్వాన్స్‌డ్ ఫంక్షనల్ అండ్ మెటా మెటీరియల్స్, స్ట్రక్చరల్ జీనోమిక్స్ అండ్ ఎవల్యూషనరీ బయాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ అండ్ కాగ్నిటివ్ సైన్స్, డిజిటల్ హ్యుమానిటీస్, ఇన్‌ఫెక్టస్ డిసీజెస్ అండ్ క్లినికల్ రిసెర్చ్.
- కన్వర్జెన్స్: ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆఫర్డబుల్ హెల్త్‌కేర్, అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎనర్జీ అండ్ వాటర్ సస్ట్టెయినబిలిటీ.
- యాక్షన్ ఓరియంటెడ్ రిసెర్చ్: ఫ్యూచర్ ఆఫ్ ఎర్త్, గ్రీన్ అండ్ రెన్యువబుల్ టెక్నాలజీస్, రివర్స్, ఓషన్, ఏవియేషన్ అండ్ స్పేస్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ, ఇన్‌క్లూడింగ్ అసెస్టివ్ టెక్నాలజీ, టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్, అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ సస్టెయినబిలిటీ, టెక్నాలజీస్ ఫర్ రూరల్ అండ్ ఉమె న్ ఎంపవర్‌మెంట్, లా అండ్ సొసైటీ.
- ఇన్నోవేషన్-డ్రైవెన్ రిసెర్చ్: టెక్నాలజీస్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, టెక్నాలజీస్ ఫర్ ఫోరెన్సిక్, సెక్యూరిటీ అండ్ సేఫ్టీ, రోబోటిక్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, నానో, బయోటెక్నాలజీ అండ్ అప్లికేషన్స్, టెక్నాలజీస్ ఫర్ స్వచ్ఛ్ భారత్, డిజైన్ ఇన్నోవేషన్.

స్పార్క్ మొదటిదశలో దేశంలోని కింద పేర్కొన్న విద్యాసంస్థలు నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరించనున్నాయి. cpat1
ఎవరు అర్హులు..?
- దేశంలో ఎన్‌ఐఆర్‌ఎఫ్ ఓవరాల్ ర్యాంకింగుల్లో టాప్-100లోపు ఉన్న సంస్థలు. క్యాటగిరీల వారీగా టాప్-100లోపు సంస్థలు. యూజీసీ యాక్ట్ 12(బి) ప్రకారం గుర్తింపు పొందిన సంస్థ అయి ఉండాలి. ప్రపంచంలోని ఆయా దేశాలకు చెందిన విద్యాసంస్థలతో కలిసి పనిచేస్తాయి. ఈ సంస్థలు క్యూఎస్ ఓవరాల్ ర్యాంకింగ్‌లో టాప్-500లోపు లేదా సబ్జెక్టులవారీగా టాప్-200లోపు ఉన్న సంస్థలు.
ఎవరు సమన్వయం చేస్తారు...?
- స్పార్క్‌కు సంబంధించిన అన్ని అంశాలను ఐఐటీ ఖరగ్‌పూర్ సమన్వయం చేస్తుంది. నేషనల్ కోఆర్డినేటింగ్ ఇన్‌స్టిట్యూట్‌గా ఐఐటీకేజీపీని ఎంపికచేశారు.

ముఖ్యతేదీలు:- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- ప్రపోజల్స్ పంపడానికి చివరితేదీ: నవంబర్ 15

వివరాలకు:SPARC cellIndian Institute of Technology Khargpur
వెబ్‌సైట్: http://www.sparc.iitkgp.ac.in

482
Tags

More News

VIRAL NEWS

Featured Articles