కెరీర్ @ డిజైనింగ్


Wed,October 10, 2018 01:02 AM

Life
సాంకేతికత ఎంత వేగంగా పురోగతి సాధిస్తుందో అంతే వేగంగా నూతన అవకాశాలు వస్తుంటాయి. రోజుకో కొత్తదనం కోసం ఎదురుచూసే ఈ నవీన ప్రపంచానికి క్రియేటివిటీతో కొత్తదనాన్ని అందించే నిపుణులు అవసరం. ప్రపంచంలో వాడే ప్రతి వస్తువును కొంగొత్తగా రూపొందించే వారికోసం ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి. సరిగ్గా ఇలాంటి వారినే తయారుచేయాలనే సంకల్పంతో విక్రం సారాబాయ్ కుంటుంబం ప్రారంభించిన విద్యాసంస్థ నేడు జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా ఎదిగి ఎందరో నిష్ణాతులను దేశానికి అందిస్తున్నది. అదే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ). దీనిలో యూజీ,
పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ప్రారంభమైన నేపథ్యంలో క్యాంపస్‌లు, కోర్సులు, అవకాశాలపై సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం..

- ఎన్‌ఐడీ నేపథ్యం: స్వాతంత్రం వచ్చిన తరుణంలో జరిగిన మేధోమదనం సందర్భంగా 1957లో భారత ప్రభుత్వం దేశంలో పారిశ్రామికీకరణకు తోడ్పడే సూచనలు, సలహాలు ఇవ్వమని ఫోర్డ్ ఫౌండేషన్‌ను ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా ఆయా రంగాలకు చెందిన వేలాదిమందిని కలిసిన ఫోర్డ్ ఫౌండేషన్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదికల ఆధారంగా సారాభాయ్ కుంటుంబం 1961లో అహ్మదాబాద్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిజైన్‌ను ప్రారంభించింది. మొదట దీన్ని స్వతంత్ర సంస్థగా అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేశారు. గౌతమ్ సారాభాయ్, గిరా సారాబాయ్ దీని ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు.
Life1

ఎక్కడెక్కడ ఏ ప్రోగ్రామ్స్...? బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బీ.డిజైన్):

- అహ్మదాబాద్ క్యాంపస్. సీట్ల సంఖ్య -100.
- స్పెషలైజేషన్స్: 1. కమ్యూనికేషన్ డిజైన్ 2. ఇండస్ట్రియల్ డిజైన్ 3. టెక్స్‌టైల్, అప్పెరల్, లైఫ్‌ైస్టెల్ అండ్ యాక్ససరీ డిజైన్
- గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ డిజైన్ (జీడీపీడీ): ఇది నాలుగేండ్ల కాలవ్యవధిగల కోర్సు. విజయవాడ, కురుక్షేత్ర క్యాంపస్‌లు ఈ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తున్నాయి.
- దీనిలో 1. ఇండస్ట్రియల్ డిజైన్ 2. కమ్యూనికేషన్ డిజైన్ 3. టెక్స్‌టైల్ అండ్ అప్పెరల్ డిజైన్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి.
- విజయవాడలో 60 సీట్లు. కురుక్షేత్రలో 60 సీట్లు ఉన్నాయి.

ఎవరు అర్హులు...?

- 2019, జూన్ 30 నాటికి 20 ఏండ్లలోపు ఉన్నవారు. అంటే 1999, జూలై 1న లేదా తర్వాత జన్మించి ఉండాలి.
- ఇంటర్‌లో ఆర్ట్స్, సైన్స్, కామర్స్ తదితర ఏ స్ట్రీమ్‌లోనైనా ఉత్తీర్ణులైనవారు లేదా సెకండియర్ పరీక్షలు రాయబోతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రవేశాలు ఎలా కల్పిస్తారు...?

- రెండుదశల్లో నిర్వహించే టెస్ట్‌ల ద్వారా ఎంపికచేస్తారు.

డీఏటీ ప్రిలిమ్స్: 2019, జనవరి 6న నిర్వహించనున్నారు. - దీనిలో అర్హత సాధించినవారి మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి డీఏటీ మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపికచేస్తారు.
- రాష్ట్రంలో హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రం ఉంది.

డీఏటీ మెయిన్స్:

- ఇది రెండు రోజులు, 100 మార్కులకు ఉంటుంది.
- పరీక్ష కేంద్రాలు అహ్మదాబాద్, బెంగళూరు, గాంధీనగర్, కురుక్షేత్ర, విజయవాడ.
- తుది ఎంపిక: డీఏటీ ప్రిలిమ్స్‌లో వచ్చిన మార్కులకు 30 శాతం, మెయిన్స్‌లో వచ్చిన మార్కులకు 70 శాతం చొప్పున కేటాయించి తుది ఎంపికచేస్తారు.

మాస్టర్ ఆఫ్ డిజైన్ (ఎం.డిజైన్)

- ఇది రెండేండ్ల పీజీ కోర్సు. ఈ కోర్సును అహ్మదాబాద్, బెంగళూరు, గాంధీనగర్ క్యాంపస్‌లలో ఆఫర్ చేస్తున్నారు.
- ఎం.డిజైన్‌లో కమ్యూనికేషన్ డిజైన్, ఇండస్ట్రియల్ డిజైన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ డిసిప్లినరీ డిజైన్ స్టడీస్, టెక్స్‌టైల్-అప్పెరల్-లైఫ్‌ైస్టెల్ అండ్ యాక్ససరీ డిజైన్ గ్రూపులు ఉన్నాయి.
- మొత్తం అన్ని క్యాంపస్‌లలో 275 సీట్లు ఉన్నాయి.
- 2019, జూన్ 30 నాటికి 30 ఏండ్లు మించరాదు.
- మూడేండ్ల/నాలుగేండ్ల డిగ్రీ ఉత్తీర్ణులు లేదా ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- రెండు దశల్లో నిర్వహించే డిజైనింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారా ఎంపిక చేస్తారు.

బీ.డిజైన్, ఎం.డిజైన్ కోర్సులకు...

- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్ 9
- పరీక్షతేదీ: 2019, జనవరి 6
- వెబ్‌సైట్: http://admissions.nid.edu

-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

763
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles