నిత్య నూతనం టూరిజం


Sun,September 9, 2018 11:22 PM

టూరిజంలో విద్య, ఉపాధి అవకాశాలు ప్రకృతి అందాలకు, చారిత్రక, సాంస్కృతిక సౌధాలకు నిలయమైన భారతదేశంలో అడుగడుగునా అంతులేని వింతలు గోచరిస్తాయి. దేశంలోని వింతలు విశేషాలు ప్రత్యక్ష్యంగా చూసేందుకు ఎన్నో శతాబ్దాలుగా ప్రపంచం నలుమూలల నుంచి యాత్రికులు వస్తూనే ఉన్నారు. ముఖ్యంగా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశీయ, విదేశీ పర్యాటకంపై ప్రభుత్వాలు క్రమంగా శ్రద్ధపెడుతూ వస్తున్నాయి. అందుకు కారణం భారత దేశ విశేషాలను ప్రపంచానికి ఎప్పటికప్పుడు గొప్పగా పరిచయం చేయటం ఒకటి కాగా, దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన విదేశీ మారక నిధులను సమకూర్చుకోవటం రెండో కారణం. ఈ రెండు కారణాలతో ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలూ టూరిజాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నాయి. దాంతో టూరిస్టు గైడ్లకు ఈ మధ్యకాలంలో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ మార్పులు యువతను టూరిస్టు గైడ్లుగా కెరీర్‌ను ఎంచుకొనేలా ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టూరిజం విద్య, ఉద్యోగావకాశాలపై నిపుణ పాఠకుల కోసం ఈ వ్యాసం..
tourism
-ఏ దేశ ఆర్థికాభివృద్ధికైనా పర్యాటక రంగం కీలకం. అందుకే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. చారిత్రక ప్రదేశాలకు నెలవైన మనదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యాటకాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాయి. ఈ క్రమంలో టూరిజం విద్యకు ప్రాధాన్యత పెరుగుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాలతోపాటు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు, స్వయం ఉపాధికి అవకాశాలు ఉండటం ఇందుకు కారణం.
-మన దేశంలోని యూనివర్సిటీలు గ్రాడ్యుయేషన్ స్థాయిలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష న్‌లో భాగంగా టూరిజం ట్రావెల్ మేనేజ్‌మెంట్ (బీటీటీఎం) కోర్సును అందిస్తున్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు బీబీఏ టూరిజం అండ్ హాస్పిటాలిటీలో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఆయా కళాశాలలు ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీచేసి, ప్రవేశపరీక్ష నిర్వహించి, మెరిట్ ఆధారంగా పర్సనల్ ఇంటర్వ్యూ చేపట్టి ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కొన్ని కళాశాలలు 10+2లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు కామర్స్ చదివిన వారికీ ప్రాధాన్యం ఇస్తున్నాయి. మరికొన్ని కళాశాలలు 10+2లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారికి ప్రవేశాలు కల్పిస్తున్నాయి. బీటీటీఎం ఖర్చుతో కూడుకున్న కోర్సు. కళాశాలల స్థాయిని బట్టి రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి.

అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు

-హిందుస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (ఇండోర్), ఢిల్లీ కాలేజ్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ (ఢిల్లీ), హిందుస్థాన్ యూనివర్సిటీ (చెన్నై), సీజెడ్ పటేల్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ అండ్ మేనేజ్‌మెంట్, గోవా సెల్సియన్ సొసైటీస్ డాన్ బాస్కో కాలేజ్ (గోవా), ఢిల్లీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (ఢిల్లీ), గురు గోవింద్‌సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ (ఢిల్లీ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాజిస్టిక్స్ అండ్ ఏవియేషన్ మేనేజ్‌మెంట్ (మహారాష్ట్ర), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్ (గ్వాలియర్), మున్నార్ క్యాటరింగ్ కాలేజ్ (త్రివేండ్రం), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (హైదరాబాద్), ఠాగూర్ ఆర్ట్స్ కాలేజ్ (గోవా), రోజరి కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ (గోవా), షరాఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ (కేరళ), జీఐబీఎస్ బిజినెస్ స్కూల్ (బెంగళూరు).
-బీటీటీఎం ప్రొఫెషనల్ కోర్సు. మూడేండ్ల కోర్సులో భాగంగా ఆరు సెమిస్టర్లు ఉంటాయి. ఈ కోర్సు పూర్తిచేసిన వారు ఉద్యోగ విధుల్లో భాగంగా పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు, ప్రయాణ ఏర్పాట్లు, టూర్స్ షెడ్యూళ్ల రూపకల్పన తదితర ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని టూరిజం రిసార్ట్స్ ప్లానింగ్, ఎన్విరాన్‌మెంట్ అండ్ టూరిజం, ఫుడ్ సర్వీస్ మేనేజ్‌మెంట్, ఎకాలజీ, ఇంటర్ కల్చరల్ కమ్యూనికేషన్ పెంపొందించడంపై దృష్టి సారిస్తారు. ఎక్కువగా ఫీల్డ్ విజిట్‌కు ప్రాధాన్యం ఇస్తారు.

nithm

ఎన్‌ఐటీహెచ్‌ఎం, హైదరాబాద్

-హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐటీహెచ్‌ఎం)ను 2004, అక్టోబర్‌లో ప్రారంభించారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తాధ్వర్యంలో కొనసాగుతున్నది. ఈ సంస్థ ఎంబీఏ టూరిజం అండ్ హాస్పిటాలిటీ, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీని అందిస్తున్నది.
-జవహర్‌లాల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సహకారంతో ఎన్‌ఐటీహెచ్‌ఎం... బీబీఏ టూరిజం అండ్ హాస్పిటాలిటీ కోర్సును అందిస్తున్నది. ఇది నాలుగేండ్ల ప్రొఫెషనల్ కోర్సు. మొత్తం ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి. 10 నెలల కాలం ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఉంటుంది. ఈ కోర్సుకు 10 +2 లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత లేదా ట్రావెల్ అండ్ టూరిజంలో మూడేండ్ల డిప్లొమా లేదా హాస్పిటాలిటీ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీలో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణులైన వారు అర్హులు.
-ఎంసెట్, గేట్ లేదా ప్రతి ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్‌ఐటీహెచ్‌ఎం నిర్వహించే ప్రవేశ పరీక్షలో సాధించిన ప్రతిభ ఆధారంగా బీబీఏ టూర్స్ అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.

charminar

ఎంబీఏ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్

-ఎంబీఏ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ అనేది రెండేండ్ల కోర్సు. మొత్తం నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సహకారంతో ఎన్‌ఐటీహెచ్‌ఎం ఈ కోర్సును అందిస్తున్నది. గ్రాడ్యుయేషన్ స్థాయిలో టూరిజం అండ్ హాస్పిటాలిటీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. జాతీయ స్థాయిలో ఎంబీఏ ప్రవేశాల కోసం నిర్వహించే క్యాట్, మ్యాట్, ఏటీఎంఏ, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఐసెట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. ఆయా ప్రవేశ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

బీటీటీఎం ఉపయోగాలు

-ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను భారత్‌లోని దర్శనీయ, చారిత్రక ప్రాంతాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టూరిజం విద్యను అభ్యసించిన వారికి ఉద్యోగావకాశాలకు ఢోకా ఉండదు.
-ఇది ప్రత్యేకమైన టూరిజం ప్రొఫెషనల్ కోర్సు. దేశంలో పర్యాటక రంగం విస్తరిస్తున్న క్రమంలో బీబీఏ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్ చేసిన వారికి కెరీర్‌లో అత్యున్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది.
-హోటళ్లు, రిసార్ట్స్ వంటి సేవా రంగంలో విస్తృతంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
-డిగ్రీ పూర్తిచేసిన తర్వాత దేశ, విదేశాల్లో ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంటుంది.
-బీబీఏ టూరిజం తర్వాత ఎంబీఏ టూరిజం ఆపైన విద్యార్హతలు పొంది దేశంలో వివిధ విశ్వవిద్యాలయాలు లేదా కళాశాలల్లో అధ్యాపకులుగా స్థిరపడవచ్చు.

ఉద్యోగావకాశాలు

-ప్రభుత్వరంగంలో కేంద్ర, రాష్ర్టాల టూరిజం శాఖలు, డైరెక్టరేట్లలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రైవేటు రంగంలో ఇంటర్నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం ఇండస్ట్రీస్, ట్రావెల్ ఏజెన్సీ, హోటళ్లు, టూరిస్ట్ రిసార్ట్స్, ఎయిర్‌లైన్స్, ట్రాన్స్‌పోర్టు ఏజెన్సీలు లేదా కార్గో పరిశ్రమలు, ట్రావెల్ ఏజెన్సీలు, టూర్ ఆపరేషన్స్, ఆహార సంబంధిత పరిశ్రమలు, రిసార్టులు, హోటల్ సంబంధిత పరిశ్రమలు, రైల్వేలు, టూర్ ఆపరేటర్స్, ట్రావెల్ ఏజెన్సీలు, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమర్ సర్వీసులు, కార్గో కంపెనీల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి.
-ఆయా సంస్థల్లో ట్రావెల్ ఏజెన్సీ స్టాఫ్, ట్రావెల్ అండ్ టూరిజం కన్సల్టెంట్, ట్రావెల్ ఏజెంట్, టికెటింగ్ స్టాఫ్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్‌లైన్ ఎంప్లాయ్ లేదా ఎయిర్ స్టాఫ్, టూర్ గైడ్, కస్టమర్ సర్వీస్ మేనేజర్, ఈవెంట్ మేనేజర్, టూర్ మేనేజర్, టూరిజం ప్రమోటర్, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్, లాబీ మేనేజర్, టూర్ ఆపరేటర్, టూర్ ఆపరేషన్ మేనేజర్, ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్, ట్రావెల్ ఎగ్జిక్యూటివ్, ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్, ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, వీసా ఎగ్జిక్యూటివ్‌లుగా ఉద్యోగ కల్పన ఉంటుంది. ప్రతిభ ఆధారంగా తొలుత ఏడాదికి రూ.2 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు జీతం పొందడానికి అవకాశం ఉన్నది.

ఎంబీఏ టీ & టీ

-ఏదైనా డిగ్రీ అర్హతతో ఎంబీఏ టూరిజం అండ్ ట్రావెల్(టీ&టీ) మేనేజ్‌మెంట్ చేయవచ్చు. ఆయా కళాశాలల నిబంధనల బట్టి డిగ్రీలో 45 నుంచి 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
-ఎంబీఏ ప్రవేశాల కోసం దేశంలో నిర్వహించే అత్యున్నత పరీక్షలైన కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్), మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్), ఏటీఎం, రాష్ట్రస్థాయిలో నిర్వహించే మేనేజ్‌మెంట్ ప్రవేశపరీక్షల్లో మెరిట్ ఆధారంగా ఎంబీఏ (టీ&టీ)లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ప్రతి ఏడాది నవంబర్‌లో క్యాట్, సెప్టెంబర్‌లో మ్యాట్ నిర్వహిస్తున్నారు. ఎంబీఏ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్ అనేది రెండేండ్ల కోర్సు. నాలుగు సెమిస్టర్లు ఉంటాయి.

ప్రతిష్ఠాత్మక కళాశాలలు

-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్ (ఢిల్లీ, గ్వాలియర్, భువనేశ్వర్, నెల్లూరు), క్రిస్ట్ యూనివర్సిటీ (బెంగళూరు), వీఈఎల్‌ఎస్ యూనివర్సిటీ (చెన్నై), ది గ్లోబల్ ఓపెన్ యూనివర్సిటీ (నాగాలాండ్), రష్మీస్ ట్రాన్స్‌వరల్డ్ అకాడమీ (ముంబై), కేరళ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ స్టడీస్ (కేరళ).

795
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles