కర్ణాటక (మైసూర్)లోని బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్టయిఫండరీ ట్రెయినీ, టెక్నీషియన్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

-మొత్తం ఖాళీలు: 102
విభాగాలవారీగా ఖాళీలు:
-స్టయిఫండరీ ట్రెయినీ ( క్యాటగిరీ I)-26, స్టయిఫండరీ ట్రెయినీ (క్యాటగిరీ II)- 52 , టెక్నీషియన్/బాయిలర్ అటెండెంట్-3, సబ్ ఆఫీసర్-1, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ కమ్ ఫైర్‌మ్యాన్-3, డ్రైవర్ (ఓజీ)-3, సెక్యూరిటీ గార్డ్-9, ఫార్మసిస్ట్-1, స్టెనో (గ్రేడ్ III)-1, అప్పర్ డివిజన్ క్లర్క్-3 ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: స్టయిఫండరీ ట్రెయినీ గ్రేడ్-I పోస్టులకు సంబంధిత విభాగంలో డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్, స్టయిఫండరీ ట్రెయినీ గ్రేడ్2 పోస్టులకు ఇంటర్, పదోతరగతి, ఎస్సీవీటీ/ఎన్సీవీటీ నుంచి సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో ఉత్తీర్ణత.
గమనిక: పోస్టులను బట్టి వివిధ అర్హతలు ఉన్నాయి.
-ఎంపిక: ఆబ్జెక్టివ్ రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా
-స్టయిఫండరీ ట్రెయినీ పోస్టులకు ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదటిది ప్రిలిమినరీ (మ్యాథమెటిక్స్, సైన్స్, జనరల్ అవేర్నెస్) రెండోది అడ్వాన్స్డ్ (సంబంధిత ట్రేడ్ టెస్ట్), మూడోవది-స్కిల్ టెస్ట్
-దరఖాస్తు: ఆన్లైన్లో
-చివరితేదీ: సెప్టెంబర్ 12
-వెబ్సైట్: www.barcrecruit.gov.in