సెంట్రల్ సెక్టార్ స్కీమ్ స్కాలర్‌షిప్స్


Thu,September 6, 2018 10:53 PM

న్యూఢిల్లీలోని హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తున్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (స్కాలర్‌షిప్ బ్యూరో) సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ స్కాలర్‌షిప్స్ కింద 2018-19కిగాను డిగ్రీ/వృత్తివిద్య మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
college-students
-సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ స్కాలర్‌షిప్స్
-విభాగాలు: బీఏ, బీకాం, బీఎస్సీ, బీఈ/బీటెక్, ఎంబీబీఎస్, బీడీఎస్, ఏజీబీఎస్సీ
-అర్హత: ఇంటర్/10+2లో 80 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు ఏదైనా డిగ్రీ/వృత్తి విద్యలోప్రథమ సంవత్సరం చదువుతున్న ప్రతిభ కలిగిన విద్యార్థులు. తల్లిదండ్రుల ఆదాయం రూ. 8 లక్షలలోపు ఉన్నవారు, మరేఇతర స్కాలర్‌షిప్ తీసుకొననివారు మాత్రమే అర్హులు.
గమనిక: రెగ్యులర్ విధానంలో చదివినవారే అర్హులు. డిప్లొమా విద్యార్థులకు అవకాశం లేదు.
-మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 82,000
-స్టయిఫండ్: డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ పీజీలు చదువుతున్నవారికి ఏడాదికి రూ. 10,000 చొప్పున మొదటి మూడేండ్లపాటు చెల్లిస్తారు. ఆ తర్వాత పీజీలో చేరినప్పుడు ఏడాదికి రూ. 20,000/- చొప్పున రెండేండ్లపాటు చెల్లిస్తారు.
-ఎంపిక: ఇంటర్ మార్కులు
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 31
-వెబ్‌సైట్: www.scholarships.gov.in

1356
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles