ఆర్‌ఐఎన్‌ఎల్‌లో 664 జూనియర్ ట్రెయినీలు


Wed,September 5, 2018 11:36 PM

భారత ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ జూనియర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
RINL.jpg
-పోస్టు: జూనియర్ ట్రెయినీ
-మొత్తం ఖాళీలు: 664
-విభాగాల వారీగా.. మెకానికల్-344, ఎలక్ట్రికల్-203, మెటలర్జీ-98, ఇన్‌స్ట్రుమెంటేషన్-19 ఖాళీలు ఉన్నాయి.
-వయస్సు: 2018, జూలై 1 నాటికి జనరల్ అభ్యర్థులకు 27 ఏండ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్)-30, ఎస్సీ/ఎస్టీలకు 32 ఏండ్లు. పీహెచ్‌సీలకు, ఎక్స్‌సర్వీస్‌మెన్, ప్రతిభావంతులైన క్రీడాకారులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అర్హతలు: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఫుల్‌టైం ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు 50 శాతం మార్కులు వస్తే సరిపోతుంది.
-శిక్షణ & స్టయిఫండ్: ఎంపికైన అభ్యర్థులకు 24 నెలలు శిక్షణనిస్తారు. శిక్షణ సమయంలో మొదటి ఏడాది నెలకు రూ. 10,700/-, రెండో ఏడాది నెలకు రూ. 12,200/- స్టయిఫండ్‌గా చెల్లిస్తారు.
-విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి టెక్నీషియన్ లేదా తత్సమాన హోదాలో పోస్టింగ్ ఇస్తారు.
-పేస్కేల్: రూ. 16,800-24,110/- (ఏడాదికి సుమారుగా ప్రారంభంలో 4.84 లక్షల జీతం వస్తుంది)

ఎంపిక విధానం:

-ఆన్‌లైన్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వైద్యపరీక్షల ద్వారా చేస్తారు.
-పరీక్ష విధానం: పరీక్షలో రెండు సెగ్మెంట్లు ఉంటాయి. మొదటి దానిలో 75 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో జనరల్ ఆప్టిట్యూడ్ (అర్థమెటిక్, రీజనింగ్, డాటా ఇంటర్‌ప్రిటేషన్ తదితర అంశాల నుంచి), జనరల్ అవేర్‌నెస్/జీకే, ఇంగ్లిష్ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
-సెగ్మెంట్ -2లో సంబంధిత ట్రేడ్/సబ్జెక్టు నుంచి ఇస్తారు.
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, కాకినాడ, ముంబై, రాంచీ, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
-శారరీరక ప్రమాణాలు: పురుషులు ఎత్తు - 150 సెం.మీ., ఛాతీ 75 సెం.మీ, గాలిపీల్చినప్పుడు కనీసం 80 సెం.మీ. ఉండాలి. మహిళలు- 143 సెం.మీ. ఎత్తు ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 25
-ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.300/- ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు ఎటువంటి ఫీజు లేదు.
-ఫీజు చెల్లించడానికి చివరితేదీ: సెప్టెంబర్ 26
-నోట్: 3/2017 నోటిఫికేషన్ ద్వారా 2018, మేలో పరీక్ష రాసినవారు దరఖాస్తు చేసుకోనసరం లేదు.
-వెబ్‌సైట్: www.vizagsteel.com

1415
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles