మేనేజ్‌మెంట్‌కు మేటి ఐఐఎఫ్‌టీ


Wed,September 5, 2018 01:13 AM

IIFT
మంచి భవిష్యత్‌ను అందించే భిన్నమైన కోర్సులు. జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలకు రాస్తా.. కార్పొరేట్ రంగంలో అత్యున్నత స్థానాలకు వెళ్లే ప్రత్యేకమైన కోర్సులు.. ఇవన్నీ అందిస్తూ వేలాదిమంది మేనేజ్‌మెంట్ రంగ నిపుణులను తయారుచేస్తున్న సంస్థ ఐఐఎఫ్‌టీ. ఈ సంస్థ ఆఫర్ చేస్తున్న కోర్సులు.. ఉపాధి అవకాశాలు.. క్యాంపస్‌లు తదితర వివరాలు సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం..

ఐఐఎఫ్‌టీ

-అంతర్జాతీయ వ్యాపార సంబంధ రంగంలో ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్‌తోపాటు మోడరన్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్‌తో నిపుణులను తయారుచేయడానికి 1963లో స్థాపించిన విద్యా సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ). పరిశోధన, శిక్షణ కోర్సులు అందించడం దీని ప్రధాన కర్తవ్యం. ఇది 2002లో డీమ్డ్ యూనివర్సిటీ స్థాయిని చేరుకుంది. గ్రేడ్ ఏ సంస్థగా న్యాక్ గుర్తించింది. ప్రస్తుతం జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ సంస్థ వేలాదిమంది ప్రొఫెషనల్స్‌ను అందిస్తున్నది. ఢిల్లీ, కోల్‌కతా, కాకినాడలో క్యాంపస్‌లు ఉన్నాయి.

ఆఫర్ చేస్తున్న కోర్సులు

- పీహెచ్‌డీ ప్రోగ్రామ్ (ఢిల్లీ, కోల్‌కతా క్యాంపస్‌లలో)
- రెండేండ్ల కోర్సులు: ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్(ఢిల్లీ, కోల్‌కతా).
- ఎంబీఏ (ఎకనామిక్స్, స్పెషలైజేషన్ ఇన్ ట్రేడ్ అండ్ ఫైనాన్స్) (ఢిల్లీ, కోల్‌కతా).
- ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్)- టాంజానియా.
- ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ - న్యూఢిల్లీ
- ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్- న్యూఢిల్లీ
- ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ & స్ట్రాటజీ - న్యూఢిల్లీ.
- ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ (హైబ్రిడ్)
- పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ మేనేజ్‌మెంట్
- సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ మేనేజ్‌మెంట్

ఐఐఎఫ్‌టీతో ఎంవోయూలు కుదుర్చుకున్న సంస్థలు/దేశాలు

- యూకే, దక్షిణ కొరియా, స్పెయిన్, యూఎస్‌ఏ, కెనడా, ఫ్రాన్స్, మియామి, ఈజిప్ట్, వియత్నాం, ఫిన్‌లాండ్, టాంజానియా, బ్రెజిల్, థాయిలాండ్, రష్యా, స్విట్జర్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, చైనా తదితర దేశాలకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాలతో ఐఐఎఫ్‌టీ అకడమిక్ ఎంవోయూలను కుదుర్చుకుంది.

ప్లేస్‌మెంట్

- ఇక్కడ చదివిన విద్యార్థులకు దేశ, విదేశాలకు చెందిన పలు కార్పొరేట్, ఎంఎన్‌సీలు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. వీటిలో ప్రముఖమైనవి ఏబీసీ, ఆదిత్యబిర్లా, ఎయిర్‌టెల్, యాక్సిస్, బజాజ్, బ్రిటిష్ టెలికం, బ్రిటానియా, బ్రిగేడ్, క్యాప్‌జెమినీ, సీబీసీ, సిటీ, క్రిసిల్, డాబర్, డెకథ్లాన్, డెలాయిట్, ఫ్లిప్‌కార్ట్, జీఈ, హీరో, గోల్డ్‌మ్యాన్, గూగుల్, ఎల్ అండ్ టీ, ఐబీఎం, హెచ్‌ఎస్‌బీసీ, హెచ్‌పీ, ఐసీఐసీఐ, ఐవోసీఎల్, ఓయో, షాపూర్‌జీ, షెల్, సినర్జీ, టీసీఎస్, టాటా, టైటాన్, వీఎఫ్, విప్రో, వొడాఫోన్, ఎస్ బ్యాంక్, వ్యాల్యూల్యాబ్స్ తదితర కంపెనీలు ఉన్నాయి.

స్కాలర్‌షిప్ స్కీం

- ఈ విద్యాసంస్థలో చదివే విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.4.50 లక్షలకు మించకుంటే ఎడ్యుకేషన్ లోన్ సౌకర్యం కల్పిస్తారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కాలర్‌షిప్స్ ఉన్నాయి.

ప్రవేశాలు ఎలా కల్పిస్తారు..?

- పీజీ కోర్సులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మూడేండ్ల కాలపరిమితిగల డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు 45 శాతం మార్కులు వస్తే సరిపోతుంది. ఎటువంటి వయోపరిమితి లేదు.
- ఐఐఎఫ్‌టీ నిర్వహించే ప్రవేశపరీక్ష ద్వారా ఆయా కోర్సుల్లోకి అభ్యర్థులను ఎంపికచేస్తారు.
- ఆయా కోర్సుల ఎంపిక విధానాల కోసం సంస్థ వెబ్‌సైట్ చూడవచ్చు.

- ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్) కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యతేదీలు..
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: సెప్టెంబర్ 14
- రాతపరీక్ష: 2018, డిసెంబర్ 2
- వెబ్‌సైట్: www.iift.edu

-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

661
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles