బీఎస్‌ఎఫ్‌లో 204 ఉద్యోగాలు


Wed,September 5, 2018 12:35 AM

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) నాన్ మినిస్టీరియల్ ఇంజినీరింగ్
(ఎలక్ట్రికల్) విభాగంలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్/సబ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
bsf
-పోస్టు పేరు: జూనియర్ ఇంజినీర్/సబ్ ఇన్‌స్పెక్టర్
-మొత్తం పోస్టులు : 139
-సబ్ ఇన్‌స్పెక్టర్ (వర్క్స్)-103 ఖాళీలు (జనరల్-67, ఓబీసీ-23, ఎస్సీ-10, ఎస్టీ-3)
-జూనియర్ ఇంజినీర్/సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎలక్ట్రికల్)-36 ఖాళీలు (జనరల్-27, ఓబీసీ-6, ఎస్సీ-1, ఎస్టీ-2)
-అర్హత: ఎస్‌ఐ (వర్క్స్) పోస్టులకు సివిల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా, జూనియర్ ఇంజినీర్/సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత. సంస్థ
నింబంధనల ప్రకారం శారీరక కొలతలు కలిగి ఉండాలి.
-వయస్సు: 30 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ. 35,400-1,12,400/-
-ఎంపిక: రాతపరీక్ష, పీఎస్‌టీ, పీఈటీ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (సెప్టెంబర్ 1-7)లో వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి.
ఇంజినీరింగ్ సెటప్ (ఎలక్ట్రికల్) విభాగంలో
గ్రూప్ సీ పోస్టులు ..
-ఖాళీలు - 65
-కానిస్టేబుల్ (జనరేటర్ మెకానిక్)- 30 ఖాళీలు
-కానిస్టేబుల్ (లైన్‌మెన్)- 12
-కానిస్టేబుల్ (జనరేటర్ ఆపరేటర్)-23
-పేస్కేల్:రూ. 21,700-69,100/-
-అర్హతలు: పదోతరగతితోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్, మూడేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 18 - 25 ఏండ్ల మధ్య ఉండాలి.
-పరీక్ష ఫీజు: రూ. 100/- ఎస్సీ, ఎస్టీ, బీఎస్‌ఎఫ్ ఉద్యోగులకు, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: ప్రకటన విడులైన 30 రోజుల్లో పంపాలి.
-వెబ్‌సైట్: www.bsf.nic.in

499
Tags

More News

VIRAL NEWS

Featured Articles