నాజీ నైజం గ్రంథ రచయిత?


Wed,September 5, 2018 02:18 AM

books
610 జీఓ అమలులో వైఫల్యం, స్థానికేతరులను వెనక్కి పంపించాలని టీఎన్‌జీవోల డిమాండ్‌తో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం గిర్‌గ్లానీ అధ్యక్షతన 2001, జూన్ 26న ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల నాటి నుంచి 2004, సెప్టెంబర్ 30 వరకు జరిగిన అక్రమ నియామకాలు, పదోన్నతులు, బదిలీల గురించి కమిటీ పరిశీలించి 2004, సెప్టెంబర్ 30న నివేదికను సమర్పించింది.

1. కిందివారిలో ఎవరి జన్మదినోత్సవాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం?

1) ప్రొ. జయశంకర్
2) కాళోజీ నారాయణరావు
3) దాశరథి రంగాచార్య
4) దాశరథి కృష్ణమాచార్య

2. ఒడువని ముచ్చట ఎవరి జీవిత చరిత్ర?

1) ప్రొ. జయశంకర్
2) కే చంద్రశేఖర్‌రావు
3) కొండా లక్ష్మణ్ బాపూజీ
4) కేశవరావ్ జాదవ్

3. గిర్‌గ్లానీ కమిటీని నియమించిన ముఖ్యమంత్రి?

1) కాసు బ్రహ్మానందరెడ్డి
2) ఎన్‌టీ రామారావు
3) చంద్రబాబు నాయుడు
4) జలగం వెంగళరావు

4. కింది కమిటీలను వరుస క్రమంలో అమర్చండి.

ఎ. జస్టిస్ వాంఛూ కమిటీ
బి. జస్టిస్ వశిష్ట భార్గవ కమిటీ
సి. కుమార్ లలిత్ కమిటీ
డి. జస్టిస్ జగన్‌మోహన్ రెడ్డి కమిషన్
1) డి, సి, ఎ, బి 2) ఎ, బి, సి, డి
3) డి, సి, బి, ఎ 4) సి, డి, బి, ఎ

5. అష్టసూత్ర పథకంలో భాగంగా నియమించబడని కమిటీ?

1) తెలంగాణ అభివృద్ధి కమిటీ
2) వాంఛూ కమిటీ
3) జస్టిస్ వశిష్ట భార్గవ కమిటీ
4) ఆఫీసర్స్ కమిటీ

6. ఆఫీసర్స్ కమిటీలో సభ్యులు కానివారు?

1) జయభారత్ రెడ్డి
2) జగన్‌మోహన్‌రెడ్డి
3) కమలనాథన్
4) ఉమాపతి రావు

7. ఏ కమిటీ సూచనల ప్రకారం 610 జీఓను ఎన్‌టీ రామారావు ప్రభుత్వం విడుదల చేసింది?

1) ఆఫీసర్స్ కమిటీ
2) సుందరేశన్ కమిటీ
3) పింగళి జగన్‌మోహన్‌రెడ్డి కమిషన్
4) కుమార్ లలిత్ కమిటీ

8. రాష్ట్రపతి ఉత్తర్వులు 126 పద్ధతుల్లో ఉల్లంఘనకు గురయ్యాయని వెల్లడించిన కమిటీ?


1) రోశయ్య కమిటీ 2) ప్రణబ్ ముఖర్జీ కమిటీ
3) గిర్‌గ్లానీ కమిషన్ 4) సుందరేశన్ కమిటీ

9. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆరు సూత్రాల పథకాన్ని ఎప్పుడు ప్రకటించారు?

1) 1973, సెప్టెంబర్ 21
2) 1972, సెప్టెంబర్ 21
3) 1973, అక్టోబర్ 21
4) 1972, అక్టోబర్ 21

10. కిందివాటిలో సరైనవి?

1) పెద సోమభూపాలుడు- రతిరహస్యం,అష్టపదులు, మదాలస ప్రబంధం
2) ఏదుట్ల శేషాచార్యులు- మైథిలీ పరిణయం
3) శ్రేష్టలూరి నారాయణాచార్యులు- ప్రతాప రుద్రీయం
4) పైవన్నీ

11. కిందివాటిని జతపర్చండి.

ఎ. దారుల్-ఉల్-ఉలూమ్
1. 1870
బి. మదరసా-ఇ-అలియ
2. 1872
సి. సిటీ హైస్కూల్
3. 1855
డి. చాదర్‌ఘాట్ హైస్కూల్
4. 1873
1) ఎ-3, బి-4, సి-1, డి-2
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-4, బి-3, సి-2, డి-1

12. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వానికి సంబంధించి సరైనది?

1) ఫూల్‌చంద్ గాంధీ- విద్య, ఆరోగ్య శాఖలు
2) జీఎస్ మెల్కొటే- ఆర్థికశాఖ
3) చెన్నారెడ్డి- ఆహార, వ్యవసాయ శాఖలు
4) పైవన్నీ

13. కొత్తగూడెం థర్మల్‌పవర్ స్టేషన్‌లోని నాన్‌ముల్కీలను తొలగించాలనే డిమాండ్‌తో ఆమరణ నిరాహార దీక్ష చేసినవారు?

1) రవీంద్రనాథ్
2) పోటు కృష్ణమూర్తి
3) సత్యనారాయణ
4) కొలిశెట్టి రామదాసు

14. క్విట్ తెలంగాణ నినాదాన్నిచ్చిన మొదటి వ్యక్తి?


1) మల్లికార్జున్
2) మదన్‌మోహన్
3) శ్రీధర్ రెడ్డి
4) చెన్నారెడ్డి

15. తెలంగాణ ప్రజా సమితి పునరుద్ధరణ ఎవరి అధ్యక్షతన జరిగింది?

1) భూపతి కృష్ణమూర్తి
2) చెన్నారెడ్డి
3) సదాలక్ష్మి
4) మదన్ మోహన్

16. కిందివాటిని జతపర్చండి.

ఎ. కువలయ మాల
1. మల్లియ రేచన
బి. కవిజనాశ్రయం
2. కొలను గణపతి దేవుడు
సి. శివయోగసారం
3. కాసె సర్వప్ప
డి. సిద్దేశ్వర చరిత్ర
4. ఉద్యోతనుడు
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-1, సి-2, డి-3
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-2, బి-3, సి-1, డి-4

17. తెలంగాణ సాయుధ పోరాటం- నా అనుభవాలు గ్రంథ రచయిత?

1) పుచ్చలపల్లి సుందరయ్య 2) చండ్ర రాజేశ్వరరావు
3) నల్లా నరసింహులు 4) దేవులపల్లి వెంకటేశ్వరరావు

18. కిందివాటిలో సరైనవి?

1) గణపవరం శాసనం- కాకతీ రుద్రదేవుడు
2) ఖాజీపేట శాసనం- రెండో బేతరాజు
3) శనిగరం శాసనం- నారాయణ మంత్రి
4) పైవన్నీ

19. నాజీ నైజం గ్రంథ రచయిత?

1) కేవీ రంగారెడ్డి
2) అయ్యపు వెంకటరమణ
3) వట్టికోట ఆళ్వారు స్వామి
4) ఆరుట్ల రాంచంద్రారెడ్డి

20. సతీసహగమనాన్ని నిషేధించిన నిజాం నవాబు?

1) నాసిర్-ఉద్-దౌలా 2) అఫ్జల్ ఉద్ దౌలా
3) మీర్ మహబూబ్ అలీఖాన్ 4) నిజాం అలీఖాన్

21. ఏ నిజాం కాలంలో రస్సెల్ బ్రిగేడ్ ఏర్పడింది?

1) నిజాం అలీఖాన్
2) సికిందర్ ఝా
3) నాసిర్-ఉద్-దౌలా
4) మీర్ ఉస్మాన్ అలీఖాన్

22. ఇంద్రపాల నగర తామ్రశాసన నిర్మాత?

1) ఇంద్రవర్మ
2) విక్రమేంద్రవర్మ
3) మొదటి గోవింద వర్మ
4) రెండో గోవింద వర్మ

23. కొల్లిపర శాసనం వేయించినవారు?

1) మొదటి అరికేసరి
2) రెండో అరికేసరి
3) బీరన్న గృహుడు
4) వినయాదిత్య యుద్ధమల్లుడు

24. వీర తెలంగాణ-విప్లవ పోరాటం గ్రంథ రచయిత?

1) రావి నారాయణ రెడ్డి
2) ఆరుట్ల రాంచంద్రారెడ్డి
3) చండ్ర రాజేశ్వరరావు
4) దేవులపల్లి రామానుజారావు

25. ఆంటోనీ విభజన కమిటీలో సభ్యులు కానివారు?

1) అహ్మద్ పటేల్ 2) వీరప్ప మొయిలీ
3) దిగ్విజయ్ సింగ్ 4) గులాంనబీ ఆజాద్

26. పద్మనాయక రాజ్యాన్ని స్థాపించినవారు?

1) మొదటి సింగమ నాయకుడు
2) అనపోత నాయకుడు
3) సింగ భూపాలుడు
4) రెండో సింగమనాయకుడు

27. శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది?

1) 2010, డిసెంబర్ 31
2) 2010, డిసెంబర్ 30
3) 2010, నవంబర్ 30
4) 2010, అక్టోబర్ 30

28. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి నియమించిన కమిటీ?

1) ఆంటోనీ కమిటీ
2) ఉత్తమ్‌కుమార్ రెడ్డి కమిటీ
3) గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్
4) ప్రణబ్ ముఖర్జీ కమిటీ

29. అడవి గ్రంథ రచయిత?

1) వట్టికోట ఆళ్వారు స్వామి
2) కేవీ రంగారెడ్డి
3) రేపాల నరసింహుడు
4) దాశరథి

30. ద పంచమ అనే ఆంగ్ల మాసపత్రికను స్థాపించినవారు?

1) జేఎస్ ముత్తయ్య
2) పీ శ్యాంసుందర్
3) బీఎస్ వెంకట్రావు
4) అరిగె రామస్వామి

31. పూల్‌బన్ గ్రంథ రచయిత?

1) మీర్జా మహ్మద్ అమీన్
2) మహ్మద్ కులీకుతుబ్ షా
3) ఇబ్నే నిషాతి
4) గవాసి

32. రాజధానిని అమరావతి నుంచి దెందులూరుకు మార్చిన విష్ణుకుండిన రాజు?

1) మొదటి మాధవవర్మ 2) రెండో మాధవవర్మ
3) ఇంద్ర భట్టారక వర్మ 4) రెండో విక్రమేంద్రవర్మ

33. కార్తికేయుని భక్తునిగా చెప్పుకున్న ఇక్షాక రాజు?

1) రుద్ర పురుషదత్తుడు
2) శ్రీశాంత మూలుడు
3) వీరపురుష దత్తుడు
4) రెండో శాంతమూలుడు

34. కింది వాటిలో సరైనవి?

1) శాతవాహన రాజ్య స్థాపకుడైన శ్రీముఖుడు మొదట్లో జైనమత అభిమాని
2) శాతవాహనుల కాలంలో జగిత్యాల జిల్లాలోని
మునుల గుట్ట ఒక ప్రముఖ జైన క్షేత్రం
3) ఎ సరైనది
4) పై రెండూ సరైనవే

35. కాకతమ్మకు సైదోడు ఏకవీర అని ఏ గ్రంథంలో పేర్కొన్నారు?

1) ప్రతాపరుద్ర యశోభూషణం
2) క్రీడాభిరామం
3) నీతిసారం
4) ప్రేమాభిరామం

36. వేములవాడ చాళుక్యులు సూర్యవంశ క్షత్రియులని తెలిపే శాసనం?

1) పర్బనీ తామ్ర శాసనం
2) వేములవాడ శాసనం
3) కుర్క్యాల శాసనం
4) ఏదీకాదు

37. మొదటి ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించినవారు?

1) రామచంద్రరావు
2) బూర్గుల రామకృష్ణారావు
3) రావి నారాయణరెడ్డి
4) సురవరం ప్రతాపరెడ్డి

38. అబ్దుల్ రజాక్ లారీ అనే సేనాపతి ఏ కుతుబ్‌షాహీ తరపున వీరోచిత పోరాటం చేసి మరణించాడు?

1) అబుల్‌హసన్ తానీషా
2) ఇబ్రహీం కుతుబ్‌షా
3) మహ్మద్ కులీ కుతుబ్‌షా
4) జంషీద్
Mallikarjun
Mallikarjun1

927
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles