జాతీయోత్పత్తిని ప్రభావితం చేయని అంశం?


Wed,September 5, 2018 02:02 AM

ప్రస్తుతం భారత జాతీయాదాయంలో తక్కువ వాటాగల రంగం- వ్యవసాయ రంగం అధిక వాటాగల రంగం- సేవా రంగంఅధిక వాటాగల వ్యవసాయ రంగ విభాగం- వ్యవసాయంఅధిక వాటాగల పారిశ్రామిక రంగ విభాగం- తయారీ రంగం (ఉత్పత్తులు)సేవారంగంలో అధిక వాటాగల రంగం- ప్రజల పాలన, రక్షణ, ఇతర సేవలు

1. దేశ జాతీయ ఆదాయంలో ఏ రంగం వాటా 1950-51 నుంచి 2016-17 మధ్యకాలంలో బాగా తగ్గిపోయింది?

1) పారిశ్రామిక రంగం
2) వ్యవసాయ రంగం
3) సేవా రంగం
4) మొత్తం మూడు రంగాల్లో

2. కింది వాటిలో జాతీయాదాయ మదింపు పద్ధతి?

1) ఉత్పత్తి మదింపు
2) ఆదాయ మదింపు
3) వ్యయ మదింపు
4) పైవన్నీ

3. తలసరి ఆదాయం దేని ద్వారా పొందుతారు?

1) జాతీయాదాయం జనాభా
2) జాతీయాదాయం + జనాభా
3) జాతీయాదాయం జనాభా
4) జాతీయాదాయం - జనాభా

4. కింది వాటిలో సరికానిది?

ఎ. జాతీయాదాయాన్ని భారత్‌లో శాస్త్రీయంగా తొలిసారి లెక్కించింది- వీకేఆర్‌వీ రావు
బి. కేంద్ర గణాంక సంస్థ (సీఎస్‌వో)- 1951
సి. జాతీయ గణాంక దినం- జూన్ 29
డి. భారత్‌లో జాతీయాదాయాన్ని తొలిసారి లెక్కించింది- నెహ్రూ
ఇ. దాదాభాయ్ నౌరోజీ జాతీయాదాయాన్నిలెక్కించింది- 1868
ఎఫ్. డ్రైన్ సిద్ధాంతాన్ని తెలిపింది- నౌరోజీ
1) డి, ఎఫ్ సరైనవికావు
2) డి మాత్రమే తప్పు
3) ఇ మాత్రమే తప్పు
4) అన్నీ సరైనవే

5. కింది వారిలో జాతీయాదాయాన్ని లెక్కించినవారిని కాల క్రమంలో అమర్చండి.

ఎ. విలియం డిగ్బీ
బి. షిండ్లే షిర్రాస్
సి. వీకేఆర్‌వీ రావు
డి. దాదాభాయ్ నౌరోజీ
ఇ. ఆర్‌సీ దేశాయ్
ఎఫ్. నటరాజన్
1) డి, ఎ, బి, సి, ఎఫ్, ఇ
2) ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్
3) సి, డి, ఇ, ఎఫ్, ఎ, బి
4) ఎ, బి, ఎఫ్, ఇ, డి, సి

6. స్థూల జాతీయోత్పత్తి, స్థూల నికర ఉత్పత్తుల మధ్య వ్యత్యాసం దేనికి సమానం?

1) స్థూల విదేశీయ పెట్టుబడి
2) విదేశీ నికర ఉత్పత్తి కారకాల ఆదాయం
3) నికర ఎగుమతులు
4) నికర విదేశీ పెట్టుబడి

7. ఉత్పత్తి కారకాల ధరల్లో జాతీయోత్పత్తి కంటే మార్కెట్ ధరల్లో జాతీయోత్పత్తి ఎక్కువగా ఉండే మొత్తం?

1) సబ్సిడీలు
2) పరోక్ష పన్నులు + సబ్సిడీలు
3) పరోక్ష పన్నులు - సబ్సిడీలు
4) పరోక్ష పన్నులు

8. వాస్తవిక జాతీయాదాయాన్ని కొలిచే సూత్రం?

1) (ప్రస్తుత ధరల్లో జాతీయాదాయం/ ప్రస్తుత సంవత్సర సూచీ సంఖ్య) 100
2) (ప్రస్తుత ధరల్లో జాతీయాదాయం/ ప్రస్తుత సంవత్సర సూచీ సంఖ్య) 100
3) (స్థూల జాతీయ ఉత్పత్తి/ ప్రస్తుత సంవత్సర సూచీ సంఖ్య) 100
4) (ప్రస్తుత ధరల్లో జాతీయాదాయం/జనాభా)

9. ఇతర ఆర్థిక వ్యవస్థల్లో లావాదేవీలు లేకుండా మూసివేసిన దేశం?

1) భారత్
2) రష్యా
3) జపాన్
4) ఏదీకాదు

10. జాతీయాదాయ గణనలో రాబడి, చెల్లింపుల ఖాతాల్లో చేర్చే లావాదేవీల పద్ధతి?

1) మాత్రికా పద్ధతి
2) చక్రీయ ప్రవాహ పద్ధతి
3) డబుల్ ఎంట్రీ పద్ధతి
4) కాస్ట్ అకౌంటింగ్ పద్ధతి

11. నమూనా లేక ప్రక్రియ సంబంధపరంగా వీకేఆర్‌వీ రావు వివరించిన అతిముఖ్య అంశం?

1) సంక్షేమ అర్థశాస్త్రం
2) పాక్షిక సమతుల్య విశ్లేషణ
3) జాతీయాదాయ గణన
4) సామాజిక స్వేచ్ఛా సిద్ధాంతం

12. స్థూల జాతీయోత్పత్తి గాని, నికర జాతీయోత్పత్తి గాని పరిగణనలోకి తీసుకోని అంశం?

1) తరుగుదల
2) ఉత్పత్తిచేసిన సేవలు
3) పర్యావరణ, కాలుష్య, సామాజిక వ్యయం
4) పైవన్నీ

13. దేశ మొదటి అధికారిక జాతీయాదాయ లెక్కలను తయారుచేసినవారు?

1) దాదాభాయ్ నౌరోజీ
2) వీకేఆర్‌వీ రావు
3) జాతీయాదాయ కమిటీ
4) కేంద్ర గణాంక సంస్థ (సీఎస్‌వో)

14. కింది వాటిలో ఏది జాతీయాదాయ మదింపు పద్ధతి కాదో గుర్తించండి.

1) ఆదాయ పద్ధతి
2) మ్యాట్రిక్స్ పద్ధతి
3) వ్యయ పద్ధతి
4) ఉత్పత్తి పద్ధతి

15. పెన్షన్లు కింది వాటిలో దేనికి ఉదాహరణగా చెప్పవచ్చు?

1) సబ్సిడీలు
2) గ్రాంట్లు
3) బదిలీ చెల్లింపులు
4) సాంఘిక భద్రత విరాళాలు

16. రెమిటెన్స్ అంటే?

1) విదేశీయుల బహుమతి సొమ్ము
2) భారతీయులు విదేశాల వారికి పంపే బహుమతి సొమ్ము
3) విదేశాల్లో స్థిరపడిన ప్రవాసులు తమ దేశంలోని తమవారికి పంపే బహుమతి సొమ్ము
4) విదేశాల్లో స్థిరపడిన విదేశీయులకు మనం పంపే మొత్తం

17. కింది వాటిలో ఆధార సంవత్సరం కానిదాన్ని గుర్తించండి.

ఎ. 1948-49
బి. 1960-61
సి. 1980-81
డి. 1993-94
ఇ. 1999-2000
ఎఫ్. 1970-71
1) అన్నీ సరైనవే
2) అన్నీ తప్పు
3) డి తప్పు
4) డి, ఎఫ్‌లు సరైనవికావు

18. జాతీయాదాయం దేనికి సమానం?

1) ఆదాయాల మొత్తం
2) ఉత్పత్తుల మొత్తం
3) వ్యయాల మొత్తం
4) పైవన్నీ

19. నికర జాతీయోత్పత్తిలో లేనిది?

1) పెట్టుబడి
2) తరుగుదల
3) పన్నులు
4) పైవన్నీ

20. కింది వాటిలో జాతీయోత్పత్తిని ప్రభావితం చేయని అంశం?

1) ఆటోమొబైల్ డీలర్ ద్వారా కొత్తకారు విక్రయం
2) ఆటోమొబైల్ కంపెనీ ద్వారా కొత్తకారు విక్రయం
3) సెకండ్ హ్యాండ్ కారు విక్రయం
4) రుణ సౌకర్యంతో కొత్తకారును కొనుగోలు చేయడం

21. మార్కెట్ ధరల్లో నికర జాతీయోత్పత్తి - పరోక్ష పన్నులు + సబ్సిడీలు = ?

1) స్థూల దేశీయోత్పత్తి
2) జాతీయాదాయం
3) తలసరి ఆదాయం
4) నికర జాతీయోత్పత్తి

22. కింది వాటిలో జాతీయాదాయం అంటే?

1) మార్కెట్ ధరల వద్ద స్థూల దేశీయోత్పత్తి
2) ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి
3) ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర దేశీయోత్పత్తి
4) మార్కెట్ ధరల వద్ద నికర జాతీయోత్పత్తి

23. కింది వాటిలో సరికానిది.

ఎ. అంతిమ వస్తువుల మొత్తం- జాతీయాదాయం
బి. జాతీయాదాయం ఒక ప్రవాహం అందుకే దీన్ని ఒక నిర్ణీత కాలంలో లెక్కిస్తారు
సి. జాతీయాదాయ భావనలు - జాతీయాదాయాన్ని అధ్యయనం చేస్తాయి
డి. మార్కెట్ ధరల్లో పరోక్ష పన్నులు అంతర్భాగం
ఇ. ఉత్పత్తి కారకాల ధరల్లో సబ్సిడీలు అంతర్భాగం
1) అన్నీ సరైనవికావు
2) ఎ, ఇ సరైనవికావు
3) అన్నీ సరైనవి
4) ఎ, బి, డి, ఇ, ఎఫ్ సరైనవికావు

24. కింది వాటిలో సరికానిది.

1) సబ్సిడీలు- ప్రభుత్వ సంస్థలకు చేరే ఉచిత సొమ్ము
2) బదిలీ చెల్లింపులు- సమాజంలో కొందరు పొందే ఉచిత సొమ్ము
3) గ్రాంట్లు- సంస్థలు పొందే ఉచిత సొమ్ము
4) సాంఘిక భద్రత విరాళాలు- ప్రజలు చెల్లించే సొమ్ము

25. కింది వాటిలో బదిలీ చెల్లింపులు కానివి.

ఎ. విద్యార్థుల స్కాలర్‌షిప్స్
బి. భవిష్య నిధి జమ (పీఎఫ్‌సీ)
సి. బీమా ప్రీమియం డి. నిరుద్యోగ భృతి
ఇ. ప్రభుత్వ రుణాలపై వడ్డీ
ఎఫ్. బదిలీ స్కీం ద్వారా పొందే చెల్లింపు
1) అన్నీ సరైనవే
2) అన్నీ సరైనవికావు
3) బి, సి సరైనవికావు
4) డి, ఇ, ఎఫ్ సరైనవికావు

26. ఒక ఏడాదికాలంలో దేశంలోని వ్యక్తులకు, సంస్థలకు లభించిన మొత్తం

1) వ్యష్టి ఆదాయం
2) తలసరి ఆదాయం
3) వ్యయార్హ ఆదాయం
4) వ్యష్టి పొదుపు

27. ఆర్థికమాంద్యం సమయంలో కింది వాటిలో ఏది పెరగాలి?

1) వ్యయార్హ ఆదాయం
2) వ్యష్టి ఆదాయం
3) వ్యష్టి పొదుపు
4) తలసరి ఆదాయం

28. కింది వాటిలో సరికానిది.

ఎ. ఇన్వెంటరీ విధానం- ఉత్పత్తి మదింపు పద్ధతిని అంటారు
బి. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం అని- ఆదాయ మదింపు పద్ధతిని అంటారు
సి. వ్యయాల పద్ధతి- జేఎం కీన్స్
డి. వినియోగ పెట్టుబడి పద్ధతి- వ్యయాల మదింపు పద్ధతిని అంటారు
ఇ. సాధారణంగా రాష్ట్రం ఆదాయాన్ని- ఆవిర్భవించే పద్ధతిని ఉపయోగిస్తుంది
ఎఫ్. ప్రతి రాష్ట్రం సిద్ధించే పద్ధతిని ఉపయోగిస్తలేదు. కారణం ఇది జాతీయాదాయంలో లెక్కించబడుతుంది
1) అన్నీ సరైనవి
2) అన్నీ తప్పు
3) ఎ, బి, డి, ఎఫ్ తప్పు
4) ఇ, సి తప్పు

29. జాతీయాదాయ అంచనాల ప్రాధాన్యం కానిది?

1) దేశంలో ఆర్థిక పరిస్థితులు తెలుసుకోవచ్చు
2) ఆర్థికవృద్ధి రేటును అంచనావేయవచ్చు
3) ఆదాయ, అసమానతలు తెలుసుకోలేం
4) ఆర్థిక సంక్షేమం అంచనావేయవచ్చు

30. జాతీదాయాన్ని పరిగణించేటప్పుడు తీసుకోనివి?

ఎ. ఉచిత సేవల విలువ
బి. నల్లద్రవ్యం విలువ
సి. తరుగుదల
డి. విదేశాల నుంచి వచ్చే గ్రాంట్లు, విరాళాలు, బహుమతుల విలువ
ఇ. విశ్రాంతి సమయ విలువ
ఎఫ్. బదిలీ చెల్లింపులు
1) అన్నీ సరైనవే, అన్నీ లెక్కలోకి తీసుకోరు
2) అన్నీ తప్పు, అన్నీ లెక్కలోకి తీసుకుంటారు
3) ఇ, ఎ సరైనవికావు
4) ఎ, సి, ఇ, ఎఫ్ సరైనవికావు

31. కింది వాటిలో సరికానిది.

1) తలసరి ఆదాయం- ప్రజల జీవన ప్రమాణం తెలుపుతుంది
2) వ్యష్టి పొదుపు- ప్రజల పొదుపు శక్తిని,పెట్టుబడిని తెలుపుతుంది
3) వ్యయార్హ ఆదాయం- ప్రజల జీవన ప్రమాణం తెలుపుతుంది
4) తలసరి ఆదాయాన్ని లెక్కించేటప్పుడు జాతీయాదాయం అంటే NNP@FC

32. ప్రస్తుతం జాతీయాదాయానికి సంబంధించి సరికానిది గుర్తించండి.

ఎ. స్వాతంత్య్రం నుంచి నేటివరకు వ్యవసాయరంగం వాటా- బాగా తగ్గుతుంది
బి. ప్రస్తుతం భారత జాతీయాదాయంలో తక్కువ వాటాగల రంగం- వ్యవసాయ రంగం
సి. ప్రస్తుతం భారత జాతీయాదాయంలో అధిక వాటాగల రంగం- సేవా రంగం
డి. భారత జాతీయాదాయంలో అధిక వాటాగల వ్యవసాయ రంగ విభాగం- వ్యవసాయం
ఇ. భారత జాతీయాదాయంలో అధిక వాటాగల పారిశ్రామిక రంగ విభాగం- తయారీ రంగం (ఉత్పత్తులు)
ఎఫ్. భారత జాతీయాదాయంలో సేవారంగంలో అధిక వాటాగల రంగం- ప్రజల పాలన, రక్షణ, ఇతర సేవలు
1) పైవన్నీ సరైనవి
2) పైవన్నీ తప్పు
3) బి, సి తప్పు
4) ఇ, ఎఫ్, ఎ తప్పు

33. 2011-12 ప్రకారం దేశ జాతీయాదాయంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల వాటాలు

1) 92 శాతం, 8 శాతం
2) 26 శాతం, 74 శాతం
3) 20 శాతం, 80 శాతం
4) 10 శాతం, 90 శాతం

34. దేశంలో పొదుపులు చేస్తున్న వర్గాలేవి?

1) కుటుంబ రంగం
2) ప్రైవేటు రంగం
3) ప్రభుత్వ రంగం
4) పైవన్నీ సరైనవి

35. కింది వాటిలో సరికానిది.

ఎ. ప్రస్తుతం భారతదేశంలో పొదుపురేటు అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశం కంటే ఎక్కువ
బి. ప్రస్తుతం కుటుంబాల పొదుపు ఎక్కువ
సి. ప్రస్తుతం కుటుంబాల పొదుపు తగ్గుతూ ఉంది
డి. స్వాతంత్య్రం వచ్చే నాటికి భారత్ పొదుపు పెట్టుబడి రేటు- 5 శాతం
ఇ. అభివృద్ధి చెందుతున్న దేశాల పొదుపు రేటు, పెట్టుబడి రేటు- 10 శాతం నుంచి 15 శాతం వరకు ఉంటుంది
ఎఫ్. బాగా అభివృద్ధిచెందిన ధనిక దేశాల పొదుపు రేటు, పెట్టుబడి రేటు- 40 శాతం
1) అన్నీ తప్పు
2) అన్నీ సరైనవి
3) ఎ, ఎఫ్ తప్పు
4) ఎ, బి, ఇ, ఎఫ్ తప్పు

36. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం ప్రస్తుతం అతితక్కువ, అతిచిన్న ఆర్థికవ్యవస్థ గల దేశం?

1) భారతదేశం
2) తువాలు
3) బ్రెజిల్
4) కెనడా

37. కింది వాటిలో వ్యవసాయ రంగం (ప్రాథమిక)లో లేనివాటిని గుర్తించండి.

1) వ్యవసాయం
2) అడవులు
3) గనులు, తవ్వకాలు
4) చేపల ఉత్పత్తి

38. పారిశ్రామిక రంగానికి సంబంధంలేని అంశం?

1) తయారీ రంగం
2) నిర్మాణ రంగం
3) ఎలక్ట్రికల్స్, గ్యాస్, నీటి సరఫరా
4) వ్యాపారం, హోటళ్లు

39. సేవారంగానికి సంబంధంలేని అంశం?

1) అడవులు
2) ప్రజాపాలన, రక్షణ, సేవలు
3) రియల్ ఎస్టేట్స్
4) రవాణా, నిల్వ, కమ్యూనికేషన్స్
Ans
Usman

589
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles