డీఆర్‌డీఓ పరిశోధకుల గమ్యం


Wed,August 8, 2018 12:22 AM

DRDO
డీఆర్‌డీఓ.. (డిఫెన్స్ రిసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) దేశ రక్షణ వ్యవస్థతోపాటు వైద్య, సాంకేతిక రంగాల్లో విప్లవాన్ని సృష్టిస్తున్న సంస్థ. ఎందరో విద్యార్థులకు దీనిలో కొలువు చేయాలనేది కల. పరిశోధనలు, ఆయా సాంకేతికతల అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్న ఈ సంస్థలో ఏయే ఉద్యోగాలు ఉంటాయి.. ఎవరు అర్హులు.. ఉద్యోగ భర్తీకి ప్రకటనల వివరాలు ఎలా తెలుసుకోవాలి వంటి అంశాలు సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం..

- డీఆర్‌డీఓ: 1958లో చిన్న సంస్థగా ప్రారంభమై.. కాలక్రమేణా మహాసంస్థగా ఎదిగింది. ప్రస్తుతం 50 ల్యాబొరేటరీలతో రక్షణ రంగమే కాకుండా ఏరోనాటిక్స్, ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, యుద్ధ ట్యాంకులు, ఇంజినీరింగ్ సిస్టమ్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, క్షిపణులు, అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ అండ్ స్టిమ్యులేషన్, స్పెషల్ మెటీరియల్స్, నేవల్ సిస్టమ్స్, లైఫ్ సైన్సెస్, శిక్షణ, ఐటీ, అగ్రికల్చర్ రంగాల్లో విశేష పరిశోధనలతో దేశాన్ని అగ్రభాగాన నిలబెట్టేందుకు కృషిచేస్తుంది.

సంస్థలో ఉద్యోగాలు

- ఈ సంస్థలో పోస్టుల భర్తీని రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ (ఆర్‌ఏసీ) చేపడుతుంది. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. సైంటిఫిక్, ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించిన కొలువులతోపాటు పనిచేస్తున్నవారి పదోన్నతులు తదితరాలను కూడా ఆర్‌ఏసీ చూస్తుంది.
- సైంటిస్టులు: దీనిలో బీ, సీ, డీ, ఈ, ఎఫ్, జీ, హెచ్, డీఎస్ కేటగిరీలు ఉంటాయి. సైంటిస్ట్ బీగా జాయిన్ అయిన వారికి ప్రారంభ వేతనం రూ. 56,100/- ఉంటుంది. డీఎస్ (డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్) స్థాయిలో ప్రారంభవేతనం రూ. 2,05,400/- దీని తర్వాతి స్థాయిలో సెక్రటరీ డీడీ ఆర్&డీ, డీజీ ఆర్&డీ, రక్షణ మంత్రికి సైంటిఫిక్ అడ్వైజర్ వంటి పోస్టులకు ప్రారంభవేతనం రూ.2.25 లక్షలు.
- డీఆర్‌డీఓ కేవలం ఉద్యోగావకాశం కల్పించడమే కాకుండా పలు శిక్షణలు, ఉన్నత విద్యావకాశాలను కల్పిస్తున్నది. దీనికోసం డీఐఏటీ, ఐటీఎం, ఐఐటీ, ఐఐఎస్సీ వంటి సంస్థల్లో అవకాశం కల్పిస్తుంది.
- టెక్నికల్ స్టాఫ్- టెక్నీషియన్లు, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను డీఆర్‌డీఓ.. సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టమ్) చేపడుతుంది.
- అడ్మిన్ అండ్ ఐల్లెడ్: ఈ పోస్టులను కూడా సెప్టమ్ ద్వారా భర్తీ చేస్తారు.
- స్టూడెంట్ ట్రెయినింగ్/ప్రాజెక్టులు: ఇంటర్న్‌షిప్/ఇండస్ట్రియల్ ట్రెయినింగ్, ప్రాజెక్టు వర్క్ వంటి వాటికి డీఆర్‌డీఓ, దాని అనుబంధ ల్యాబొరేటరీల్లో అవకాశం కల్పిస్తుంది. వీటికోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
- రిసెర్చ్ ఫెలో: జూనియర్ రిసెర్చ్ ఫెలో, సీనియర్ రిసెర్చ్ ఫెలో, రిసెర్చ్ అసోసియేట్‌ల ద్వారా డిగ్రీ నుంచి పీహెచ్‌డీ వరకు పరిశోధన, అభివృద్ధిలో పాల్గొనేలా ప్రోత్సహిస్తుంది. ఈ సందర్భంలో విద్యార్థులకు స్టయిఫండ్ కూడా ఇస్తుంది.

494 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్లు

-డీఆర్‌డీఓలో 494 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సెప్టమ్-09 విడుదలైంది.
-ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్లలో డిగ్రీ, డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులకు అవకాశం.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 29
-వెబ్‌సైట్: https://www.drdo.gov.in/drdo/ceptam
-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

865
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles