కొలువుల నెలవు బ్యాంకింగ్


Wed,June 13, 2018 12:27 AM

ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని తపనపడేవారికి కల్పతరువు బ్యాంకింగ్ రంగం. ఇతర ఏ రంగంలో లేనివిధంగా బ్యాంకింగ్ సెక్టార్‌లో ఏడాదిపొడవునా ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. ఈ ఉద్యోగాల సాధనకు భారీ స్థాయిలో కష్టపడాల్సిన పనికూడా లేదు. ఓ ఆర్నెల్లపాటు క్రమశిక్షణతో చదివితే తేలికగా సాధించవచ్చు. గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులు తమ అకడమిక్ చదవుతోపాటు బ్యాంకింగ్‌పై కూడా దృష్టి పెడితే డిగ్రీ అయిపోగానే ఆలస్యం లేకుండా ఉద్యోగం సాధించవచ్చు. గణితంపై పట్టున్నవారికి ఈ ఉద్యోగాలు సాధించటం మరీ తేలిక. గ్రామీణ బ్యాంకుల్లో 10,190 ఉద్యోగాల భర్తీకి ఇటీవలే ఐబీపీఎస్ నోటిఫికేషన్ వెలువడింది.ఈ ఉద్యోగాలకు సిలబస్ ఏమిటి? ఎలాంటి ప్రణాళికతో చదివితే ఉద్యోగం సాధించవచ్చు అనే అంశాలు నిపుణ పాఠకుల కోసం ప్రత్యేకం..
bank-jobs

-రూరల్ బ్యాంకుల్లో భారీగా కొలువులు
-డిగ్రీ, పీజీ అభ్యర్థులకు అవకాశం
-ఆన్‌లైన్ టెస్ట్‌ల ద్వారా ఎంపిక
-దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో మల్టీ పర్పస్ ఆఫీస్ అసిస్టెంట్ (క్లరికల్), ఆఫీసర్ (పీవో, ఆపై స్థాయి) పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ సీఆర్‌పీ-ఆర్‌ఆర్‌బీఎస్ VII నోటిఫికేషన్ విడుదల చేసింది.
-వయస్సు: 2018, జూన్ 1 నాటికి ఆఫీసర్ స్కేల్- III
(సీనియర్ మేనేజర్): 21-40 ఏండ్లు, ఆఫీసర్ స్కేల్- II (మేనేజర్): 21- 32 ఏండ్లు, ఆఫీసర్ స్కేల్- I
(అసిస్టెంట్ మేనేజర్): 18-30 ఏండ్లు, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 18-28 ఏండ్ల మధ్య ఉండాలి.

అర్హతలు:

-ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
-ఆఫీసర్ స్కేల్ -I: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, పిసి కల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కో ఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, లా, ఎకనామిక్స్, అకౌంటెన్సీ డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
ఆఫీసర్ స్కేల్-II
-జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ పోస్టుకు- డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. బ్యాంకింగ్, ఫైనాన్స్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
-ఐటీ ఆఫీసర్ పోస్టుకు- సీఎస్‌ఈ, ఈసీఈ,ఐటీలో 50 శాతం మార్కులతో బీఈ/బీటెక్.
-చార్టెర్డ్ అకౌంటెంట్: ఐసీఏఐ నుంచి సీఏ
-లా ఆఫీసర్: లా డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-ట్రెజరీ మేనేజర్: సీఏ లేదా ఎంబీఏ ఫైనాన్స్ ఉత్తీర్ణత.
-మార్కెటింగ్ ఆఫీసర్: ఎంబీఏ మార్కెటింగ్
-అగ్రికల్చర్ ఆఫీసర్: డిగ్రీలో అగ్రికల్చర్, డెయిరీ, యానిమల్ హజ్బెండరీ, ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్ లేదా తత్సమాన కోర్సుల్లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
నోట్: కొన్ని పోస్టులకు పై అర్హతలతోపాటు అనుభవం కూడా ఉండాలి. వాటి వివరాలను వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 100/-, ఇతరులకు రూ. 600/-
-ఎంపిక విధానం: ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకు- ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్. ఇంటర్వ్యూ లేదు.

మెయిన్స్ పరీక్ష విధానం:

-ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ - I: మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు, కాలవ్యవధి రెండు గంటలు.
-ఆఫీసర్ స్కేల్ - II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్): సింగిల్ లెవల్ ఎగ్జామినేషన్. ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు.
-ఆఫీసర్ స్కేల్-II, III పోస్టులకు సింగిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
-ఆఫీసర్ స్కేల్-I,II, III పోస్టులకు ఇంటర్వ్యూ ఉంటుంది.
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో జూన్ 8 నుంచి ప్రారంభం
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 2 వరకు
-దరఖాస్తు ఫీజు: ఆఫీసర్ స్కేల్- I, II, III పోస్టులకు- ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 100, ఇతరులకు రూ. 600
-ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)- ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 100/-, ఇతరులకు రూ. 600/-
-వెబ్‌సైట్: http://ibps.in
-ప్రిలిమినరీ ఎగ్జామ్- ఆఫీసర్ స్కేల్ I పోస్టులకు ఆగస్టు 11, 12, 18, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు- ఆగస్టు 19, 25, సెప్టెంబర్ 1 తేదీల్లో నిర్వహిస్తారు.
-ప్రిలిమినరీ ఫలితాలు విడుదల: సెప్టెంబర్‌లో
-ఆఫీసర్ స్కేల్- I, II, III మెయిన్/సింగిల్ ఎగ్జామ్ తేదీ: సెప్టెంబర్ 30, ఆఫీస్ అసిస్టెంట్ - అక్టోబర్ 7
-మెయిన్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల: అక్టోబర్‌లో
-ఇంటర్వ్యూ: నవంబర్‌లో

రాష్ట్రంలో ఖాళీల వివరాలు:


ఆఫీస్ అసిస్టెంట్ ఖాళీలు:
-ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ - 212,
-తెలంగాణ గ్రామీణ బ్యాంక్- 84
ఆఫీసర్ స్కేల్ - I:
-ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్- 120
-తెలంగాణ గ్రామీణ బ్యాంక్- 55
ఆఫీసర్ స్కేల్ -II ఖాళీలు:
-ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (అగ్రికల్చర్ ఆఫీసర్ -44, ట్రెజరీ మేనేజర్-2, చార్టెడ్ అకౌంటెంట్-2, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-5, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్-79)
-తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ( మార్కెటింగ్ ఆఫీసర్-9, లా ఆఫీసర్-1, చార్టెడ్ అకౌంటెంట్-2, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-8, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్-20)
ఆఫీసర్ స్కేల్ - III:
-ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ -22, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ -5

-మొత్తం ఖాళీల సంఖ్య- 10190
-ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)- 5249
-ఆఫీసర్ (స్కేల్ I)- 3312
-ఆఫీసర్స్ (స్కేల్ II )- 1469 ఖాళీలు (జనరల్ బ్యాంకింగ్-1208, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-88, చార్టెర్డ్ అకౌంటెంట్-21, లా-32, ట్రెజరీ మేనేజర్-17, మార్కెటింగ్ ఆఫీసర్-38, అగ్రికల్చర్ ఆఫీసర్-65)
-ఆఫీసర్స్ (స్కేల్ III ): 160
...వెంకటేశ్వర్లు తన్నీరు

2305
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles