అంతర్జాతీయ పప్పుదినుసుల ఏడాది?


Tue,June 12, 2018 11:43 PM

ఈమధ్యకాలంలో అన్నిపోటీ పరీక్షల్లోనూ భూగోళశాస్త్రంలో భాగంగా వ్యవసాయ విస్తరణ, పంటల ఉత్పత్తిపై విరివిగా ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల ఆయా అంశాలకు ప్రాధాన్యమిస్తూ నిపుణ పాఠకులకోసం ఈ వ్యాసం..
insert

సోయాబీన్

-ప్రపంచంలో: సోయాబీన్ ఉత్పత్తిలో అమెరికా మొదటి స్థానంలో ఉంది.
-దేశంలో: మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నాయి.
-తెలంగాణలో: నిజామాబాద్‌లో అత్యధిగా ఉత్పత్తి అవుతుంగా, కామారెడ్డి రెండో స్థానంలో ఉన్నది.

-రాష్ట్రంలో సోయాబీన్ సాగు విస్తీర్ణంలో, ఉత్పాదకతలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా: కామారెడ్డి

పప్పుదినుసులు

-బఠాణి, చిక్కుడు, పప్పుదినుసులు ఇవి లెగ్యుమిలేసి/ఫాబేసి కుటుంబానికి చెందినవి. ఈ మొక్కల్లోని వేరు బొడిపెల్లో రైజోబియం అనే బ్యాక్టీరియా ఉండి నత్రజని స్థాపన చేస్తాయి. అంటే నత్రజనిని నైట్రేట్‌ల రూపంలో నిల్వచేసి మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతాయి.
నోట్: పప్పుధాన్యాల పరిశోధనా సంస్థ- కాన్పూర్ (ఉత్తరప్రదేశ్)
-అంతర్జాతీయ పప్పుదినుసుల సంవత్సరం- 2016
-దేశంలో అన్నిరకాల పప్పుధాన్యాలను అధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం- మధ్యప్రదేశ్
-వాణిజ్య పంటలు: వీటిని నగదు పంటలు అని కూడా అంటారు.

పత్తి

-ఈ పంటకు నల్లరేగడి నేలలు అనుకూలం
-ఇది మొదటి నారపంట
-దీన్ని తెల్లబంగారం అని పిలుస్తారు.
- పత్తి జన్మస్థలం- సింధునదీలోయ

ఉత్పత్తి:

-ప్రపంచంలో: పత్తిని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉన్నది.
-భారత్‌లో: మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉన్నది.
-తెలంగాణలో: ఆదిలాబాద్ ప్రథమ స్థానంలో ఉంగా, నిర్మల్, నల్లగొండ జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
-పత్తి ఉత్పత్తిలోనూ, సాగు విస్తీర్ణంలోనూ అగ్రస్థానంలో ఉన్న జిల్లా: ఆదిలాబాద్
-పత్తి ఉత్పాదకతలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా: ఖమ్మం
నోట్: కేంద్ర పత్తి పరిశోధనా కేంద్రం- నాగ్‌పూర్ (మహారాష్ట్ర)
-మాంచెస్టర్ ఆఫ్ ఇండియా- అహ్మదాబాద్
-కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా- ముంబై
-మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా- కాన్పూర్
-మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా- కోయంబత్తూర్

జనుము

-ఈ పంటకు వరద మైదానాల్లోని డెల్టాలు, ఒండ్రునేలలు అనుకూలం.
-ఇది రెండో నారపంట
-దీన్ని బంగారు పీచు అంటారు.
-జనుము కాండాలను కోసి నీళ్లలో నానబెట్టి దాని నుంచి నారను తీయడాన్ని రోటింగ్ అంటారు.

ఉత్పత్తి

-ప్రపంచంలో: జనుము ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానం, బంగ్లాదేశ్ రెండో స్థానంలో ఉన్నది.
-దేశంలో: పశ్చిమబెంగాల్, అసోం తొలి రెండు సానాల్లో ఉన్నాయి.
-తెలంగాణలో: ఖమ్మం మొదటి స్థానంలో ఉండగా, మహబూబ్‌నగర్ రెండో స్థానంలో ఉన్నది.
-2009ను యూఎన్‌వో అంతర్జాతీయ పీచు పదార్థాల సంవత్సరంగా ప్రకటించింది.
-జనపనారను బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ల తయారీలో ఉపయోగిస్తారు.
-కేంద్ర జూట్ టెక్నాలజికల్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్- కోల్‌కతా
పొగాకు
-పొగాకు సాగును దేశంలో మొదట ప్రారంభించినది- పోర్చుగీసువారు (1508)
-ఇది రబీకాలం పంట.

ఉత్పత్తి:

-ప్రపంచంలో: పొగాకు ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉన్నది.
-దేశంలో: ఆంధ్రప్రదేశ్, గుజరాత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
-తెలంగాణలో: పొగాకు గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి.
-దేశంలో రెండు రకాల పొగాకును పండిస్తున్నారు.
1) నికోటినా టొబాకమ్
2) నికోటినా రస్టికా
-ఏపీలో ఉత్పత్తయ్యే నికోటినా టొబాకమ్‌ను వర్జీనియా పొగాకు అంటారు.
-ఇది ఏపీలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో లభిస్తుంది.
-పొగాకులోని ఆల్కలాయిడ్- నికోటిన్
-కేంద్రప్రభుత్వం 2008 నుంచి ప్రతి ఏడాది మే 31ని ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తున్నది.
-2009 అక్టోబర్ 2 నుంచి బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడంపై నిషేధం విధించారు.
నోట్: 1) జాతీయ పొగాకు పరిశోధన కేంద్రం- రాజమండ్రి
1) కేంద్ర పొగాకు బోర్డు - గుంటూరు

చెరుకు

-ఇది గడ్డిజాతి మొక్క
-ఇది ఉష్ణమండల పంట
-చెరుకు ఏడాది పంట

ఉత్పత్తి

-ప్రపంచంలో: బ్రెజిల్ మొదటి స్థానంలో ఉంగా, భారత్ రెండో స్థానంలో నిలిచింది.
-దేశంలో: చెరుకు ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
-రాష్ట్రంలో: మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చెరుకు అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నది.
-దేశంలో చక్కెరను అధికంగా ఉత్పత్తిచేసే రాష్ర్టాలు: మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్
-భారతీయ చెరుకు పరిశోధన సంస్థ- లక్నో (ఉత్తరప్రదేశ్)
-చెరుకు వంగడాల సంస్థ- కోయంబత్తూర్ (తమిళనాడు)
నోట్: 1) ప్రపంచ పంచదార గిన్నె- క్యూబా
2) భారత పంచదార గిన్నె- ఉత్తరప్రదేశ్
-దక్షిణ భారతదేశంలో పండే చెరుకులో సుక్రోజ్ శాతం ఎక్కువగా ఉంటుంది.
కారణాలు: 1) చెరుకు కోసే సమయం- శీతాకాలం కావడం
2) ఇక్కడి నేలల్లో లవణశాతం ఎక్కువగా ఉండటం

నూనెగింజలు

1) వేరుశనగ 2) ఆముదం
3) పొద్దతిరుగుడు 4) పామోలిన్
5) నువ్వులు 6) కుసుమలు

వేరుశనగ

-పపంచంలో: వేరుశనగ ఉత్పత్తిలో భారత్, చైనా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
-దేశంలో: గుజరాత్ మొదటి స్థానంలో ఉండగా, తమిళనాడు రెండో స్థానంలో ఉన్నది.
-తెలంగాణలో: ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి వరంగల్
-వేరుశనగ పరిశోధన సంస్థ- జునాగఢ్ (గుజరాత్)

ఆముదం

-ప్రపంచంలో: ఆముదం ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానంలో ఉండగా, బ్రెజిల్ రెండో స్థానంలో ఉన్నది.
-ఇండియాలో: గుజరాత్, రాజస్థాన్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
-రాష్ట్రంలో: ఉమ్మడి మహబూబ్‌నగర్ మొదటి స్థానంలో, నల్లగొండ రెండో స్థానంలో ఉన్నది.

పొద్దుతిరుగుడు

-ప్రపంచంలో: ఉక్రెయిన్‌లో పొద్దుతిరుగుడు అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నది.
-ఇండియాలో: కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా, మహారాష్ట్ర రెండో స్థానంలో ఉన్నది.
-తెలంగాణలో: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు పొద్దుతిరుగుడు ఉత్పత్తిలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

ఆయిల్‌పామ్

-ఆయిల్‌పామ్ ఉత్పత్తిలో రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం మొదటి స్థానంలో ఉంగా, దేశంలో ఆంధ్రప్రదేశ్, ప్రపంచంలో ఇండోనేషియా ప్రథమస్థానాల్లో ఉన్నాయి.
నువ్వులు
ప్రపంచంలో ఇండియాలో తెలంగాణలో
ఉత్పత్తి: 1) మయన్మార్ 1) గుజరాత్ 1) పెద్దపల్లి 2) జగిత్యాల
కుసుమలు ప్రపంచంలో ఇండియాలో తెలంగాణలో
ఉత్పత్తి: 1) భారతదేశం 1) ఆంధ్రప్రదేశ్ 1) సంగారెడ్డి 2) మెదక్
-అన్నిరకాల నూనెగింజలను ప్రపంచంలో అధికంగా ఉత్పత్తిచేసే దేశం- భారతదేశం
-అన్నిరకాల నూనెగింజలను దేశంలో అధికంగా ఉత్పత్తిచేసే జిల్లా- ఉమ్మడి మహబూబ్‌నగర్

తోట పంటలు

1) కాఫీ 2) తేయాకు 3) రబ్బరు
4) సుగంధ ద్రవ్యాలు: మిరప, పసుపు, మిరియాలు, లవంగాలు, యాలకులు
4) ఉద్యానపంటలు
-వ్యవసాయరంగంలో ఉద్యానపంటలు ఒక ఉపరంగానికి చెందినవి. ఉద్యాన విభాగం నైపుణ్యంలేని, పాక్షిక నైపుణ్యంగల గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తుంది.
-రాష్ట్రంలో ఉద్యానపంటల సాగు విస్తీర్ణం పెంచడం కోసం 2005, నవంబర్ 3న రాష్ట్ర హార్టికల్చర్ మిషన్‌ను ప్రారంభించారు.
-ఉద్యాన పంటలు: పండ్లు, పూలు, కూరగాయలు

సీతాఫలం

-తెలంగాణలో అధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో ఉత్పత్తవుతున్నాయి.
-జాతీయ నిమ్మజాతి ఫలాల పరిశోధనా కేంద్రం- నాగ్‌పూర్ (మహారాష్ట్ర)
-ప్రపంచంలో అత్యధికంగా పండ్లను ఉత్పత్తిచేసే దేశం- 1) చైనా, 2) భారతదేశం
-పండ్ల తోటల ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ 8వ స్థానంలో ఉండగా, సాగు విస్తీర్ణంలో 3వ స్థానంలో ఉంది.
-పండ్లు, పండ్లతోటల అధ్యయనాన్ని (పెంపకాన్ని) పొమికల్చర్ అంటారు.

పూలు

-పూల అధ్యయనాన్ని ఫ్లోరికల్చర్ అంటారు.
-రాష్ట్రంలో అన్నిరకాల పూలు అధికంగా ఉత్పత్తిచేసే జిల్లా- రంగారెడ్డి
-కేంద్ర పూల పెంపక పరిశోధన కేంద్రం- పుణె (మహారాష్ట్ర)

కూరగాయలు

-కూరగాయలు, మొక్కల పెంపకాన్ని ఆర్బొరి కల్చర్ అంటారు.
-తెలంగాణలో అన్నిరకాల కూరగాయలను అధికంగా పండించే జిల్లాలు- 1) రంగారెడ్డి 2) వికారాబాద్ 3) మెదక్
-తెలంగాణలో మొత్తం కూరగాయల ఉత్పత్తిలో టమాటాలు 39 శాతం, ఉల్లిగడ్డలు 15 శాతం ఉన్నాయి.
-టమాట, వంకాయ, క్యాబేజి, ఆకుకూరలను అధిక మొత్తంలో సాగుచేసే జిల్లా- రంగారెడ్డి
-టమాట ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది.
-భారత కూరగాయల పరిశోధనా సంస్థ- వారణాసి (ఉత్తరప్రదేశ్)
-కేంద్ర బంగాళాదుంపల పరిశోధన సంస్థ- సిమ్లా (హిమాచల్‌ప్రదేశ్)
-అన్ని ఉద్యానపంటల సాగు విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లా- భద్రాద్రి కొత్తగూడెం
-కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం- ములుగు (సిద్దిపేట)
నోట్: సుగంధ ద్రవ్య పంటలు- పసుపు, మిరప, మిరియాలు, లవంగాలు, ఉల్లి, యాలకులు మొదలైనవి.
kamesam-ramesh

1181
Tags

More News

VIRAL NEWS

Featured Articles