ఐబీపీఎస్ -ఆర్‌ఆర్‌బీ సంసిద్ధతా ప్రణాళిక


Tue,June 12, 2018 11:42 PM

గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ పల్లె ఖాతాదారుల వ్యవసాయ, ఆర్థిక అవసరాలను తీర్చేవి ప్రాంతీయ బ్యాంకులు. ప్రధానమంత్రి జనధన్ ఖాతాదారులు దాదాపుగా 31 కోట్ల పైచిలుకు దాటడం బ్యాంకు సేవల అవసరం గణనీయంగా పెరగడంతో బ్యాంకు ఉద్యోగాల కోసం పలు నోటిఫికేషన్లు రాబోతున్నాయి. బ్యాంకు రిక్రూట్‌మెంట్ సంస్థ ఐబీపీఎస్ తన మొదటి ప్రకటన గ్రామీణ బ్యాంకుతో మొదలుపెట్టింది. ఇంకా ఐబీపీఎస్-పీఓస్, ఐబీపీఎస్-క్లర్క్స్ విడిగా నోటిఫికేషన్ రావాల్సి ఉంది. బ్యాంకు ఉద్యోగం కోసం సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఇది చక్కటి అవకాశం. అన్ని బ్యాంకు పరీక్షలు ఒకే విధానం అనుసరిస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు ముందుగా సిలబస్‌పై పూర్తిపట్టు సాధించాలి. కాబట్టి ప్రతి విద్యార్థి ఓ ప్రణాళిక వేసుకుని దాన్ని అనుసరించడం వల్ల ఉద్యోగం పొందే అవకాశం ఉంది.

-2018 ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ-VIII నోటిఫికేషన్‌లో ఎలాంటి మార్పులు చేయకుండా పూర్వ నోటిఫికేషన్ మాదిరిగా ఎంపిక ప్రక్రియకు ఐబీపీఎస్ పూనుకుంది. సాధారణ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పరీక్షకు అర్హులు. మొత్తం 56 గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్ స్కేల్-I, ఆఫీస్ అసిస్టెంట్ కలిపి 8,561 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ఆఫీసర్ స్కేల్-I- 3,312, ఆఫీస్ అసిస్టెంట్లు (క్లర్కు)- 5,249 వరకు ఉన్నాయి. అభ్యర్థులు పై రెండు పోస్టులకు విడిగా దరఖాస్తు చేసుకోవచ్చు.
-ప్రాంతీయ బ్యాంకుల్లో ఉద్యోగం దాదాపుగా సొంత రాష్ట్రంలోనే ఉంటుంది. నియామకం కూడా పూర్తిగా ఆయా రాష్ట్ర భాషా ప్రాతిపదికన ఉంటుంది. అయితే, ఇక్కడ స్థానికత చాలా కీలకం. అభ్యర్థికి తాను చదువుకున్న ప్రాంతం (రాష్ట్రం) భాష కచ్చితంగా వచ్చి ఉండాలి. కాబట్టి చాలామంది అభ్యర్థులు తమతమ సొంత జిల్లాలు లేదా తమ గ్రామాల్లోనే కార్యనిర్వహణకు మొగ్గు చూపిస్తారు. చక్కటి జీతభత్యాలు, కెరీర్‌లో ఉన్నత స్థాయిని చేరుకునే అవకాశం ఉంటుంది.
-తాజాగా డిగ్రీ పూర్తిచేసిన వారితోపాటు, ఏ ఉద్యోగానుభవం లేని సాధారణ డిగ్రీ పట్టా ఉన్నవారు ఆఫీసర్ స్కేల్-I, క్లర్కు పోస్టులకు అర్హులు. స్కేల్-II, III ఆఫీసర్ పోస్టులకు మాత్రం 2 నుంచి 5 ఏండ్ల ఉద్యోగానుభవం తప్పనిసరి.
-అభ్యర్థులు ఆఫీసర్ స్కేల్-I, క్లర్కు పరీక్షలకు వేర్వేరుగా కాకుండా ఉమ్మడి ప్రణాళికతో ప్రిపేర్ కావాలి. ఇంకో రెండు నెలల్లో పరీక్షల నిర్వహణ మొదలవుతుంది. కాబట్టి ఈ రెండు నెలలు పూర్తిగా సబ్జెక్టు నేర్చుకోవడం, మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వంటివి చేయాలి. అన్ని బ్యాంకు పరీక్షలు ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు కొనసాగుతాయి.

పరీక్ష ప్రణాళిక

-ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ-VIII ఆఫీస్ అసిస్టెంట్లు, ఆఫీసర్ స్కేల్-I ఎంపిక రాత పరీక్ష తరహాలో ఉంటుంది. ఇది రెండంచెల పరీక్ష. ఇందులో ప్రాథమిక, ప్రధాన పరీక్ష ఉంటుంది. ఆఫీసర్స్ పోస్టులకు ఇంటర్వ్యూ ఉంటుంది. క్లర్కు పోస్టులకు ఇంటర్వ్యూ లేదు. కేవలం రాత పరీక్షలో సాధించిన మార్కులతో మాత్రమే తుది ఎంపిక చేస్తారు.
-ఇప్పటికే ప్రిపరేషన్‌లో ఉన్నవారు ఎస్‌బీఐ- 2018 పీవోస్, క్లర్కుతోపాటు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు కూడా ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమైతే 2018లో బ్యాంకు జాబ్ మీ సొంతమవుతుంది. కొత్తగా ప్రిపరేషన్ మొదలుపెట్టేవారు సిలబస్, పరీక్ష విధానంపై పూర్తిపట్టు సాధించి రోజుకు 12-15 గంటల సమయాన్ని కేటాయిస్తే ఉద్యోగం పొందే అవకాశం ఉంది. మొదటిసారి పరీక్ష రాసి బ్యాంకు జాబ్ పొందినవారు కూడా ఉన్నారు. నిరంతరం చదవడం, లెక్కలు, రీజనింగ్ వంటివి సమయానుసారంగా ప్రాక్టీసు చేయడంవల్ల సమర్థవంతంగా ఉత్తీర్ణత సాధించవచ్చు.

పరీక్ష విధానం

-గతేడాది మాదిరిగా ఈసారి కూడా ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో (రాత పరీక్ష, ఇంటర్వ్యూ) ఉంటుంది. క్లర్కు అభ్యర్థులకు మాత్రం రాతపరీక్షే కీలకం ఇంటర్వ్యూ లేదు. ఇది ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. రెండంచెల్లో మొదటిది ప్రిలిమినరీ పరీక్ష, రెండోది మెయిన్స్. ప్రిలిమినరీ ప్రాథమిక పరీక్ష కాబట్టి ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో ఉత్తీర్ణత సాధించినవారిని మెయిన్స్‌కు అనుమతిస్తారు. ప్రిలిమ్స్ ద్వారా అభ్యర్థులను జల్లెడ పడుతారు. కాబట్టి అభ్యర్థులు ప్రాథమిక పరీక్షను తేలికగా తీసుకోకూడదు.
-ప్రిలిమినరీలో కేవలం రెండు సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. ఇది క్లర్కు, ఆఫీసర్ పోస్టులకు ఒకే విధంగా ఉంటుంది. ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నల చొప్పున రెండు సబ్జెక్టులకు మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున మొత్తం 80 మార్కులు కేటాయించారు. కాలవ్యవధి 45 నిమిషాలు.

ఇందులో 1/4 నెగిటివ్ మార్కులు

-మొదటి దశలో కేవలం 45 నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది. కాబట్టి అభ్యర్థులు తక్కువ సమయంలో గరిష్ఠ మార్కులు సాధించేందుకు కీలక చాప్టర్లపై ఎక్కువ దృష్టి సారించాలి. రెండు పరీక్షలకు ఇంచుమించు కామన్ టాపిక్స్ ప్రిపేర్ కావడంవల్ల పూర్తి పరిజ్ఞానం పొందే అవకాశం ఉంది.
-రెండోదశ: ఇది ప్రధాన పరీక్ష. ఇందులో సాధించిన మార్కులు తుది ఎంపికకు ఉపయోగపడుతాయి. ఇందులో మొత్తం ఐదు విభాగాలు ఉంటాయి. 200 మార్కులకుగాను 200 ప్రశ్నలు కేటాయించారు. సమయం 2 గంటలు. ఈ దశ కూడా ఆన్‌లైన్ పద్ధతిలోనే ఉంటుంది.
-అభ్యర్థులు ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రెండు పోస్టులకు ఒకే విధానమైన పేపర్లు, మార్కులు కేటాయించినా ప్రశ్నల సరళిలో మార్పు ఉంటుంది. క్లర్కు పరీక్షకు కొద్దిగా తేలికైన ప్రశ్నలు, ఆఫీసర్ కేటగిరీలో మాత్రం కాస్త కఠిన స్థాయి ప్రశ్నలు వస్తాయి.
-ఇక్కడ అభ్యర్థి శక్తి సామర్థ్యాలు, సమయపాలన తదితర అంశాలను అంచనా వేయవచ్చు. ఇందులో ఒకే రకమైన చాప్టర్ల నుంచి 3-5 ప్రశ్నలు వస్తాయి.
-ప్రథమ పరీక్ష కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత విధిస్తారు. అభ్యర్థులు 2017 మోడల్ పేపర్, కటాఫ్ తెలుసుకోవడంవల్ల నెగెటివ్ మార్కులను తగ్గించుకోవచ్చు.

2017 క్లర్కు కటాఫ్

1. తెలంగాణ - 61.78 (ఓసీ), 60.69 (ఓబీసీ), 45 (ఎస్టీ), 49.66 (ఎస్సీ)
2. ఆంధ్రప్రదేశ్ - 59.88 (ఓసీ), 56.28 (ఓబీసీ), 40.32 (ఎస్టీ), 50.07 (ఎస్సీ)
-క్లర్కు పరీక్షలో మెయిన్స్ మార్కులే కీలకం. ఇంటర్వ్యూ లేదు కాబట్టి పై మార్కులే గరిష్ఠ మార్కులు
-ఇక ఆఫీసర్ లెవల్‌లో మాత్రం మూడో దశ ఉంటుంది. ఇంటర్వ్యూ దశ. కాబట్టి ప్రధాన పరీక్ష, ఇంటర్వ్యూ మార్కులు కలిపి తుది జాబితా తయారుచేస్తారు.

2017 ఆఫీసర్ స్కేల్-1 కటాఫ్

1) తెలంగాణ - 44.75 (ఓసీ) - 43.75 (ఓబీసీ) - 35.92 (ఎస్టీ) - 39.12 (ఎస్సీ)
2) ఏపీ - 44.12 (ఓసీ) - 41.75 (ఓబీసీ) - 30.98 (ఎస్టీ) - 36.65 (ఎస్సీ)

జాబ్ కొట్టాలంటే ఇలా చేయాలి

-తొలిసారి బ్యాంక్ పరీక్ష రాసే అభ్యర్థులు ఆన్‌లైన్ మాక్‌టెస్టులు తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడంవల్ల టైం వృథా కాకుండా నెగెటివ్ మార్కింగ్‌కి గురికాకుండా మంచి మార్కులు సాధించవచ్చు.
-కోచింగ్ తీసుకునే అభ్యర్థులు ప్రతిరోజు 2 నుంచి 4 గంటలు ఇంటివద్ద ప్రాక్టీస్ చేయాలి.
-సమయాన్ని ప్రతి సెక్షన్‌కు విభజించుకుని చదవాలి.
-ప్రిలిమినరీ, మెయిన్‌లకు విడివిడిగా కాకుండా కలిపి చదవడంవల్ల సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది.
-సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడంవల్ల ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్‌లో ఉత్తీర్ణత సాధించవచ్చు.

ప్రిపరేషన్ ప్లాన్

-ఐబీపీఎస్-ఆర్‌ఆర్‌బీ స్కేల్-1, క్లర్క్ పరీక్షలు ఆగస్టు 11, 12, 18, 19, 25, 01/09 మధ్య నిర్వహిస్తారు. కేవలం ఒక వారం తేడాతో రెండు పరీక్షలు నిర్వహించనున్నారు. కాబట్టి అభ్యర్థులు ఈ పరీక్షలకు సమయాన్ని రెండుగా విభజించి చదవాలి. అంటే కామన్ టాపిక్‌లను ఎంచుకుని టైం మేనేజ్‌మెంట్‌ను బట్టి సులువు, కఠిన ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి.
-సబ్జెక్టులవారీగా ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అభ్యర్థి సామర్థ్యాలను బట్టి మార్కుల ఆధారంగా ఒక ప్రణాళిక వేసుకుని సమయపాలనతో శ్రద్ధగా చదవాలి. ముందుగా తక్కువ సమయంలో అధిక మార్కులు పొందే చాప్టర్లు గుర్తించి వాటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.

న్యూమరికల్ ఎబిలిటీస్/క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్

-ఈ విభాగం నుంచి ప్రిలిమ్స్‌లో 40, మెయిన్స్‌లో 50 మార్కులకుగాను ప్రశ్నలు వస్తాయి. వీటిలో సింప్లిఫికేషన్స్ నుంచి 10-15 ప్రశ్నలు, నంబర్ సిరీస్ నుంచి 5 ప్రశ్నలు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి 5, డేటా ఇంటర్‌ప్రిటేషన్స్ నుంచి 5 వస్తాయి. మిగిలిన ప్రశ్నలు శాతాలు, సగటులు, లాభనష్టాలు, వడ్డీలు, పని-కాలం వంటి అర్థమెటిక్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆఫీస్ అసిస్టెంట్ పరీక్ష కాస్త సులభతరంగా ఉన్నా ఆఫీసర్ పరీక్షలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి క్లిష్టతరహా ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులకు ఇది కష్టమైన సెక్షన్. కాబట్టి ముందుగా చాప్టర్లవైజ్‌గా మొదలుపెట్టి బేసిక్ ప్రశ్నల నుంచి కాఠిన్యస్థాయి ప్రశ్నల వరకు ఎక్కువగా సాల్వ్ చేయాలి.

రీజనింగ్

-ఈ విభాగం నుంచి ప్రిలిమ్స్‌లో 40 మార్కులు, మెయిన్స్‌లో 50 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. కొన్ని సులభతరమైన ప్రశ్నలతో నాన్-మ్యాథ్స్ అభ్యర్థులు కూడా ఉత్తీర్ణత మార్కులు పెంచుకోవడానికి ఉపయోగపడే విభాగం ఇది. అయితే అభ్యర్థులు రీజనింగ్ టాపిక్స్‌పై సరైన అవగాహన కలిగి ఉండాలి. లేకపోతే సమయం వృథాతో పాటు నెగెటివ్ మార్కులుపడే ప్రమాదం ఉంది.
-ఇందులో ముఖ్యంగా కోడింగ్-డికోడింగ్, సిరీస్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, సిలాజిసమ్స్, సీటింగ్ అరెంజ్‌మెంట్స్ వంటి అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. వీటితో పాటు అనలిటికల్ రీజనింగ్, క్రిటికల్ రీజనింగ్ నుంచి ఇన్‌పుట్-అవుట్‌పుట్, స్టేట్‌మెంట్స్, పజిల్‌టెస్ట్ మొదలైనవి కూడా అవపోసన పట్టాలి.
-రీజనింగ్ స్కోరింగ్ సెక్షన్ కాబట్టి ఫాస్ట్ రీడింగ్, సాల్వింగ్ పద్ధతిని పాటించాలి. ఇందుకోసం ఇంగ్లిష్ పరిజ్ఞానం కూడా తప్పనిసరి.

ఇంగ్లిష్ లాంగ్వేజ్

-ఇది మెయిన్స్‌లో మాత్రమే అడిగే సెక్షన్, 40 ప్రశ్నలకు 40 మార్కులు కేటాయించారు. ప్రిలిమినరీలో లేనందున తెలుగు మీడియం అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
-ఇందులో 10-15 ప్రశ్నలు రీడింగ్ కాంప్రహెన్షన్స్ నుంచి 5 ప్రశ్నలు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, 5 ప్రశ్నలు వొకాబులరీ నుంచి వస్తాయి. కోడ్ టెస్ట్, జంబుల్డ్ సెంటెన్స్ వంటివాటిపై దృష్టిపెట్టాలి. ఇక గ్రామర్ విషయానికి వస్తే ఎర్రర్, కరెక్షన్ నుంచి కొన్ని ప్రశ్నలు వస్తాయి.
-ఇంగ్లిష్‌పై పట్టు సాధించాలంటే అభ్యర్థులు తప్పకుండా వ్యాకరణం, వొకాబులరీపై ఎక్కువ దృష్టి సారించాలి. ఇక పూర్వ, ప్రాక్టీస్ ప్రశ్నపత్రాలు ఎక్కువగా సాధన చేయడంవల్ల ఇంగ్లిష్‌లో మంచి స్కోర్ చేయవచ్చు.

జనరల్ అవేర్‌నెస్

-ఇందులో బ్యాంకింగ్ అంశాలు, ఎకానమీ, ఫైనాన్షియల్ అవేర్‌నెస్‌తో పాటు వర్తమాన అంశాలు కూడా అడుగుతారు. బ్యాంకింగ్ రంగంలోని తాజా పరిణామాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగం నుంచి 40 ప్రశ్నలకు 40 మార్కులు కేటాయించారు. రోజువారీ బ్యాంకింగ్ సేవలు, విధి నిర్వహణ, ఆర్బీఐ కీ పాలసీలు, నోట్ల రద్దు, కరెన్సీ ప్రింటింగ్, మానిటరీ పాలసీ వంటివి కరెంట్ అఫైర్స్‌తో ముడిపెట్టి చదవాలి. ప్రపంచ బ్యాంకు విధి విధానాలు, స్థాపన/ట్యాగ్‌లైన్ గుర్తుంచుకోవాలి.
-ఎకానమీలో బడ్జెట్, నీతి ఆయోగ్, ఫైనాన్స్ కమిషన్ ట్యాక్స్ (జీఎస్టీ), పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి టాపిక్స్‌తో పాటు వ్యవసాయ, పారిశ్రామిక, సేవ రంగాల్లో అప్‌డేట్ వార్తలు చదవాలి.
-ఈ విభాగంలో మంచి మార్కులు సాధించాలంటే అభ్యర్థులు ప్రతిరోజు జాతీయ, ప్రాంతీయ దినపత్రికలు చదివి ముఖ్యాంశాలను నోట్ చేసుకోవాలి. ఏదైనా ఒక మాసపత్రికను ఫాలో కావాలి. కరెంట్ అఫైర్స్ కోసం గత ఆరు నెలల అంశాలను బాగా చదవాలి. వీలైతే జాతీయ, అంతర్జాతీయ, వ్యక్తులు, క్రీడలు, పుస్తకాలు-రచయితలు, అవార్డులు, ముఖ్యమైన రోజులు, తాజా కమిటీలు, వాటి ప్రాక్టీస్ బిట్స్‌పై ఫోకస్ చేయాలి.

కంప్యూటర్ నాలెడ్జ్

-ఈ విభాగం నుంచి 40 ప్రశ్నలకు 20 మార్కులు కేటాయించారు. ఇందులో సులభతర ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులకు మంచి మార్కులు సంపాదించిపెట్టే సబ్జెక్టు ఇది. ఇందులో బేసిక్స్, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్, షార్ట్‌కట్ కీ వంటివి బాగా చదవాలి.
-వర్తమాన అంశాలపై కూడా ప్రశ్నలు వస్తున్నాయి. అవి.. సాఫ్ట్‌వేర్-హార్డ్‌వేర్, టచ్‌స్క్రీన్, కొత్త వైరస్ హ్యాకింగ్, గూగుల్ వైఫై, మొబైల్ యాప్స్, ఏటీఎం పనితీరు వంటి అంశాలపై కూడా దృష్టిపెట్టాలి.

సబ్జెక్టులు క్లర్కు స్కేల్-I
1. రీజనింగ్ 40 40
2. న్యూమరికల్ ఎబిలిటీ/ 40 40
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
80 80

2017 ఐబీపీఎస్-ఆర్‌ఆర్‌బీ స్కేల్-I కటాఫ్ మార్కులు
సబ్జెక్టులు
1. తెలంగాణ - 45.50 1. రీజనింగ్ - 8.25
2. ఆంధ్రప్రదేశ్ - 47.20 2. క్వాంట్స్- 7.00

2017 ఐబీపీఎస్-ఆర్‌ఆర్‌బీ క్లర్క్ కటాఫ్ మార్కులు
1. తెలంగాణ - 57.75 1. రీజనింగ్ - 12.75
2. ఆంధ్రప్రదేశ్ - 63 2. న్యూమరికల్
ఎబిలిటీ - 10.75

మెయిన్స్‌లో
సబ్జెక్టులు ప్రశ్నలు మార్కులు
1. న్యూమరికల్
ఎబిలిటీ/ క్వాంట్స్ 40 50
2. రీజనింగ్ 40 50
3. జనరల్ అవేర్‌నెస్ 40 40
4. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 40
5. కంప్యూటర్ నాలెడ్జ్ 40 20
మొత్తం 200 200
S.-Madhukiran

1023
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles