సీపీటీని ఇలా గెలవండి..


Tue,June 12, 2018 11:23 PM

సీఏ కోర్సుకు ప్రవేశ పరీక్ష అయిన సీఏ-సీపీటీ జూన్ 17న జరుగనుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే సీఏ చదివే వీలుంటుంది. సుదీర్ఘ ప్రణాళికతో సీపీటీ కోసం కష్టపడుతున్న విద్యార్థులు మరికొద్ది రోజుల్లో తుదిదశకు చేరుకోనున్నారు. ప్రణాళిక ప్రకారం ఈ కొద్దికాలం ప్రిపరేషన్ కొనసాగిస్తే సులువుగా విజయం సాధ్యమవుతుంది. సీపీటీ పరీక్షలు సమీపిస్తున్నందున సన్నద్ధతను వేగవంతం చేసుకుని గరిష్టంగా ప్రయోజనకరంగా మల్చుకునేదెలా? సీపీటీలో మంచి మార్కులు, ర్యాంకులు సాధించేదెలా? అనే అంశాలకు సంబంధించి కొన్ని సలహాలు సూచనలు..

ప్రణాళికతో చదివితే ప్రయోజనాలెన్నో

-సమయపాలన లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది చదవడం మంచిదికాదు. ఏ సమయంలో ఏ సబ్జెక్టు, ఏ చాప్టర్ చదవాలనే విషయంలో టైం టేబుల్ తయారు చేసుకోవాలి. ఒక క్రమపద్ధతిలో చదివితే సీపీటీలో ఉత్తీర్ణులవడం పెద్ద కష్టమేమీ కాదు.
1. మీరు ఇన్నాళ్లు టెక్ట్స్‌బుక్స్ లేదా ఏదైనా సీపీటీకి సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను చదివి ఉంటే తప్పకుండా మళ్లీమళ్లీ వాటినే చదవండి. కొత్త స్టడీ మెటీరియల్ లేదా టెక్ట్స్‌బుక్స్ చదవద్దు. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు M.Law సబ్జెక్టులోని కొన్ని కేస్ స్టడీస్ ఒక్కో పుస్తకంలో ఒక్కోలా ఉంటాయి. అందువల్ల ఐసీఏఐ వారి స్టడీ మెటీరియల్‌నే ప్రామాణికంగా తీసుకోండి. సీపీటీలోని అకౌంట్స్ అండ్ M.Law సబ్జెక్టులు చాలా ముఖ్యమైనవి. సీపీటీ మొదటి ప్రయత్నంలోనే పాసవ్వాలంటే ఈ రెండు సబ్జెక్టుల మీద మంచి పట్టు ఉండాలి. ప్రిపరేషన్ సమయంలో ఈ సబ్జెక్టులకు సింహభాగం కేటాయించాలి.
2. రోజుకు 10 నుంచి 12 గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాలి. ఈ నెల రోజుల్లో మీరు చేయాల్సినది మీకు బాగా వచ్చిన బహుళైచ్ఛిక ప్రశ్నలను ైస్ట్రెక్ ఆఫ్ చేసుకుంటూ రావాలి. ఇలా చేయడంవల్ల ఆ బహుళైచ్ఛిక ప్రశ్నలను మళ్లీ చదవాల్సిన అవసరం ఉండదు. మీకు మీపై ఆత్మైస్థెర్యం ఏర్పడుతుంది.
3. బహుళైచ్ఛిక ప్రశ్నలను ఎలా ప్రిపేర్ కావాలి?
ఎ. పొరపాటున కూడా బహుళైచ్ఛిక ప్రశ్నలను mugup చేయొద్దు. మీ మైండ్‌ను ఫైన్ ట్యూన్ చేసుకుని ఏకాగ్రతతో చదవాలి.
బి. బహుళైచ్ఛిక ప్రశ్నల భావనను అర్థం చేసుకుని చదవాలి.
సి. సీపీటీలో మీరు బహుళైచ్ఛిక ప్రశ్నలను mugup చేసి చదివితే ఐపీసీసీలో ఇబ్బందిపడే అవకాశం ఉంది.
డి. సీపీటీ మెయిన్ పరీక్షలో మీకు తెలిసిన బహుళైచ్ఛిక ప్రశ్నలనే చిన్నచిన్న మార్పులు చేసి కొత్త పద్ధతిలో అడిగే అవకాశం ఉంది. మీరు ప్రశ్నపత్రం ఎలా వచ్చినా జవాబు రాయగలిగేలా సన్నద్ధం కావాలి. అందుకే అంశాలవారీ ప్రిపరేషన్ తప్పనిసరి.
4. మీ మొదటి రివిజన్‌లో ైస్ట్రెక్ ఆఫ్ చెయ్యని బహుళైచ్ఛిక ప్రశ్నలను రివైజ్ చేయాలి. ఈ ప్రశ్నల్లో మీకు వచ్చినవి, అంతముఖ్యమైనవి కావనుకున్న వాటిని ైస్ట్రెక్ ఆఫ్ చెయ్యాలి. రెండో రివిజన్‌లో మరికొన్ని బహుళైచ్ఛిక ప్రశ్నలను ైస్ట్రెక్ ఆఫ్ చేసుకుంటూ వెళ్లండి. అలా మూడు లేదా నాలుగు రివిజన్స్ చేసే సమయానికి దాదాపు 80 నుంచి 90 శాతం ప్రశ్నలను ైస్ట్రెక్ ఆఫ్ చేసుకుని పరీక్షకు ఒకటిరెండు రోజుల ముందు మిగిలిన ఆ 10 శాతం బహుళైచ్ఛిక ప్రశ్నలపై దృష్టిసారిస్తే సరిపోతుంది.
5. టాప్ మార్కులు తెచ్చుకోవాలంటే రకరకాల పుస్తకాలు చదవకూడదు. ముందుగా ఏదైతే మెటీరియల్‌తో ప్రిపరేషన్ ప్రారంభించారో పదేపదే అదే మెటీరియల్ చదవాలి. తెలిసిన బహుళైచ్ఛిక ప్రశ్నలను ఏవిధంగా మార్చి అడిగినా జవాబు రాయగలిగేలా ఉంటే మంచి మార్కులు వస్తాయి. ఐసీఏఐ స్టడీ మెటీరియల్‌ను తప్పకుండా చదవాలి.
6. ప్రాబ్లమేటిక్ పేపర్లలో మీకు ఏవైనా ముఖ్యమైనవి అనిపిస్తే మెటీరియల్‌లో వాటిని అండర్‌లైన్ చేసుకోవాలి. అలాగే దాని సొల్యూషన్‌లో ఆ ఇంపాక్ట్ ఎక్కడ వస్తుందో మార్క్ చేసుకోవాలి. ప్రతి సబ్జెక్టు నుంచి సరైన స్టేట్‌మెంట్‌ను గుర్తించండి? సరికాని స్టేట్‌మెంట్‌ను గుర్తించండి? అని ప్రశ్నలు ఇస్తారు. అలాంటి ప్రశ్నలను ముఖ్యమైనవాటిగా పరిగణించాలి. అవి కన్ఫ్యూజ్డ్‌గా ఉంటాయి. కాబట్టి జవాబు గుర్తించేముందు ఒకటికి రెండుసార్లు చదవాలి.
7. డౌట్స్ బుక్ పెట్టుకొని మీకు వచ్చిన డౌట్స్ అన్ని దానిలో రాయాలి. మీరు ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతూ ఉంటే అక్కడి ఫ్యాకల్టీని అడిగి డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి. సొంతంగా ప్రిపేరవుతుంటే మీరు చదివిన టెక్ట్స్‌బుక్స్ లేదా స్టడీ మెటీరియల్ చూసుకుని డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి.
8. మీరు ఏ సబ్జెక్టునైతే కష్టం అనుకుంటారో దాన్ని ఎక్కువసేపు చదవాలి. వచ్చిన సబ్జెక్టునే చదువుతూ పోతే రాని సబ్జెక్టు చదివేందుకు సమయం సరిపోకపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలంటే పూర్తిగా 100 మార్కులే కాకుండా సబ్జెక్టులవారీగా 30 శాతం మార్కులు సాధించాలి. కాబట్టి అన్ని సబ్జెక్టులకు సమప్రాధాన్యం ఇస్తూ ప్రిపరేషన్ కొనసాగించాలి.
9. టెక్ట్స్‌బుక్స్, ఐసీఏఐ వారి మోడల్ టెస్ట్ పేపర్లలో ఉన్న బహుళైచ్ఛిక ప్రశ్నల పక్కన జవాబు రాయకూడదు. అలా చేస్తే మీరు రివిజన్ చేసుకునే సమయంలో ఆ బహుళైచ్ఛిక ప్రశ్నలకు సంబంధించిన జవాబులు పక్కనే ఉండటంవల్ల మీరు విశ్లేషించడానికి వీలుపడదు.
10. క్యాలిక్యులేటర్‌ను స్పీడ్‌గా ఉపయోగించేలా క్యాలిక్యులేటర్ టైపింగ్ ప్రాక్టీస్ చేయండి. మంచి కంపెనీకి చెందిన క్యాలిక్యులేటర్‌ను ముందే కొనండి. కనీసం రోజుకు అరగంట సేపైనా దానిపై స్పీడ్ టైపింగ్ ప్రాక్టీస్ చేయాలి.
-ఏ క్యాలిక్యులేటర్‌పై ప్రాక్టీస్ చేశారో దాన్నే పరీక్ష సమయంలో ఉపయోగించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నసైజు క్యాలిక్యులేటర్‌ను వాడవద్దు. దాంట్లో ఫింగరింగ్ సరిగా రాదు. సీపీటీలో ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ వాడరాదు.
11. మీరు చదివే పుస్తకాలను జాగ్రత్తగా భద్రపర్చుకోండి. ఎందుకంటే చదివేటప్పుడు కొంత రన్నింగ్ నోట్స్ తయారుచేసుకుని ఉంటారు. కాబట్టి అలా రాసుకున్న పుస్తకాలు మిస్ అయితే మళ్లీ రన్నింగ్ నోట్స్ రాసుకోవడం కష్టం. ప్రిపరేషన్‌కు వాడాల్సిన సమయమంతా కొత్తగా నోట్స్ రాసుకోవడానికే సరిపోతుంది. చివరి నిమిషంలో ఇబ్బందిపడుతారు. అంతేకాక కొత్త పుస్తకాలు చదవడంవల్ల కాన్సెప్ట్‌ని కూడా మరిచిపోయే అవకాశం ఉంది.
12. మీరు చదువుకునే ప్రదేశాన్ని మార్చకండి అప్పటికే మీకు అలవాటైన ప్రదేశమైతే నిశ్చింతగా, రివిజన్ చేసుకోవచ్చు. కొత్త ప్రదేశాల్లో అయితే మీరు ఆ ప్రదేశానికి అలవాటు పడటానికి సమయం పడుతుంది. తద్వారా సమయం వృథా అవుతుంది.

సీపీటీ పరీక్ష ఎలా నిర్వహిస్తారు?

-సీపీటీ పరీక్షను ఒకేరోజు (2018, జూన్ 17న ఆదివారం) రెండు విభాగాలుగా నిర్వహిస్తారు.
-ఉదయం 10.30 నుంచి 12.30 వరకు
- అకౌంట్స్ (60 మార్కులకు)
- M.Law (40 మార్కులకు)
-మధ్యాహ్నం 2.00 నుంచి 4.00 గంటల వరకు
- ఎకనామిక్స్ (50 మార్కులకు)
- క్యూ.టీ (50 మార్కులకు)

అకౌంట్స్: 60 మార్కులు

1. అకౌంట్స్ సబ్జెక్టు సీపీటీలోనే కాక, ఐపీసీసీ, సీఏ ఫైనల్‌లో కూడా చాలా ముఖ్యమైంది.
2. ఇది సీఏలో సీపీటీ నుంచి మొదలై ఐపీసీసీ సీఏ ఫైనల్ వరకు ప్రతి దశలోనూ ఈ సబ్జెక్టు ఉంటుంది. కాబట్టి అందులోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అభ్యసించాలి.
3. సీపీటీలో ఉన్న అన్ని సబ్జెక్టుల్లో అధిక మార్కులు సాధించగలిగిన సబ్జెక్టు.
4. అకౌంట్స్‌ను ఎప్పుడు చూసి చదివినట్లుగా ప్రిపేరవకూడదు. అలా చూసినప్పుడు అన్ని ప్రశ్నలు, సమస్యలకు సమాధానాలు వచ్చినట్లే ఉంటాయి. కానీ సబ్జెక్టుపై పట్టురాదు. సమస్యలను ఎంత సాధనచేస్తే అంత మంచిది.
5. అకౌంట్స్‌లో జర్నల్ ఎంట్రీస్ చాలా ముఖ్యమైనవి. ఇవి ప్రతి చాప్టర్‌లో ఉంటాయి.
6. ఎంట్రీస్ విషయంలో స్టూడెంట్స్ తప్పుగా సమాధానమిచ్చే అవకాశం ఉంది. పరీక్షలో ప్రతి క్వశ్చన్‌ను ఒకటికి రెండుసార్లు చదివిన తర్వాతే సమాధానం రాయాలి.
7. జర్నల్ ఎంట్రీస్ అన్ని పుస్తకాల్లో ఒకేచోట రాసుకుంటే పరీక్షలకు సన్నద్ధమవుతున్నప్పుడు పునశ్చరణ తేలికవుతుంది.
8. అకౌంట్స్‌లోని ఏ అంశాన్నీ బట్టీపట్టవద్దు. ప్రతి అంశంపట్ల తార్కిక ఆలోచనా దృక్పథాన్ని అలవర్చుకోవాలి.
9. థియరీ పార్ట్‌మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. అలాగే థియరీ, ప్రాబ్లమ్స్‌లో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
10. ఈ సబ్జెక్టులో ముఖ్యమైన చాప్టర్లు పార్ట్‌నర్‌షిప్ అకౌంట్స్, కంపెనీ అకౌంట్స్, అకౌంటింగ్ యాన్ ఇంట్రడక్షన్, ఫైనల్ అకౌంట్స్, కన్‌సైన్‌మెంట్ అకౌంట్స్.

M.Law: 40 మార్కులు

1. ఇది ఇంటర్ చదివిన అన్ని గ్రూపులవారికి కొత్త సబ్జెక్టే. పరీక్షల్లో ప్రతి ప్రశ్నను డొంకతిరుగుడు లేకుండా నేరుగా అడుగుతారు.
2. సబ్జెక్టుపరంగా వివాదాస్పద అంశాలు ఎక్కువ. కాబట్టి చదువుతున్న పుస్తకం తప్ప వేరే మెటీరియల్ గాని, పుస్తకం గాని పరీక్షల ముందు చదవద్దు.
3. పలు రకాల టెక్ట్స్‌బుక్స్‌ను రిఫర్ చేయవద్దు.
4. ప్రతి మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను కూలంకషంగా అనాలసిస్ చేయాల్సిన అవసరం ఉండదు.
5. M.Law అనే సబ్జెక్టు ఐపీసీసీలోనూ పునరావృతమవుతుంది. కాబట్టి ప్రతి అంశానికి ప్రాధాన్యమివ్వాలి.
6. M.Lawలో 40 మార్కులకుగాను 32 నుంచి 35 మార్కులు తేలికగానే తెచ్చుకోవచ్చు.
7. ఈ సబ్జెక్టులోని ప్రతి అంశంలోనూ విద్యార్థి అర్ధ వివరణ నైపుణ్యాన్ని పెంచుకోవాలి.
8. సీపీటీ పాసా లేక ఫెయిలా అని నిర్ధారించే సబ్జెక్టు M.Law.
9. సీపీటీ పరిధిలో సెక్షన్ నంబర్స్, కేస్ స్టడీస్, రచయితల పేర్లు, డెఫినిషన్స్ గుర్తుపెట్టుకోవాల్సిన పనిలేదు. గుర్తుపెట్టుకోగలిగితే సరే, కాని తప్పనిసరికాదు.
10. అన్ని చాప్టర్లలోనూ ఐడెంటిఫై ది కరెక్ట్/ఇన్‌కరెక్ట్/ఆల్ ఆఫ్ ది ఎబోవ్/నన్ ఆఫ్ ది ఎబోవ్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకటికి రెండుసార్లు చదివి సమాధానం రాయాలి.
11. ఈ సబ్జెక్టులో ముఖ్యమైన చాప్టర్లు ఇండియన్ పార్ట్‌నర్‌షిప్ యాక్ట్ అండ్ సేల్ గూడ్స్ యాక్ట్.

ఎకనామిక్స్: 50 మార్కులు

1. ఎకనామిక్స్ సబ్జెక్టును 1) మైక్రో ఎకనామిక్స్ 2) మ్యాక్రో ఎకనామిక్స్‌గా విభజించుకోవచ్చు.
2. పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే పరీక్షల్లో అడుగుతున్న ప్రశ్నల్లో 15 నుంచి 20 ప్రశ్నలు తేలికగాను, నేరుగా అడిగేవిగాను ఉంటున్నాయి.
3. ఎకనామిక్స్‌లోని అన్ని చాప్టర్లకు సమప్రాధాన్యమిచ్చి చదవాలి.
4. ఎకనామిక్స్‌లో ప్రతి అంశంలోనూ సంభావిత స్పష్టత ఉండాలి.
5. డయాగ్రమ్స్, డెఫినిషన్స్, రచయితల పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు.
6. మైక్రో ఎకనామిక్స్‌లో ప్రాబ్లమ్స్ వస్తే కన్ఫ్యూజ్ కాకుండా ఒకటికి రెండుసార్లు ప్రశ్నను చదివి సమాధానం గుర్తించండి.
7. మైక్రో ఎకనామిక్స్‌లో డయాగ్రమ్స్ ఉన్నాయి. డయాగ్రమ్స్‌ని అనలైజ్ చేయగలగాలి.
8. మ్యాక్రో ఎకనామిక్స్‌లో ఫ్యాక్ట్స్, ఫిగర్స్ (ఇయర్స్, పర్సంటేజెస్‌లకు సంబంధించిన డేటా) చాలా ముఖ్యమైనవి.
9. పరీక్షకు సన్నద్ధమయ్యేటప్పుడు పాత ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలను పునశ్చరణ చేస్తే మంచిది.
10. మైక్రో ఎకనామిక్స్‌లో ముఖ్యమైన చాప్టర్లు థియరీ ఆఫ్ కన్జ్యూమర్ బిహేవియర్, కాస్ట్ అనాలసిస్, ప్రొడక్షన్ అనాలసిస్, ప్రైస్, ఔట్‌పుట్ డిటర్మినేషన్.

మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్: 50 మార్కులు మ్యాథమెటిక్స్

-ఈ సబ్జెక్టులోని ఫార్ములాలు చాలా ముఖ్యమైనవి.
-సీఈసీ విద్యార్థులు తప్పకుండా బహుళైచ్ఛిక ప్రశ్నలను ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేసుకోవాలి.
-ఈ సబ్జెక్టులో చాలా ప్రశ్నలు ఎక్కువ సమయం తీసుకునేలా ఉంటాయి. అందువల్ల రివిజన్ చేసే సమయంలో ఎక్కువ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి.
-అన్ని చాప్టర్లకు సమంగా ప్రాధాన్యమివ్వాలి. వాటికి సంబంధించిన ఫార్ములాలు ఒకేదగ్గర రాసుకుంటే రివిజన్ తేలికవుతుంది.
-ప్రతి చాప్టర్‌లోని సమస్యలను ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ సమస్యలకు సంబంధించిన సూత్రాలను ఒకటికి రెండుసార్లు చూడకుండా రాస్తే మంచిది.
-పెద్దవిగా ఉన్న, కష్టమనిపించిన ప్రశ్నలకు చివర్లో జవాబులు గుర్తించాలి.
-క్యాలిక్యులేటర్ వేగంగా ఉపయోగించేలా ప్రాక్టీస్ చేయాలి. అత్యధిక వెయిటేజీగల చాప్టర్లలో నైపుణాన్ని సముపార్జించాలి.
-అన్ని చాప్టర్ల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. నిడివిగా ఉన్న చాప్టర్ల కంటే, సులభంగా తక్కువ పరిమాణంలో ఉండే చాప్టర్లకు అధిక ప్రాధాన్యమిస్తే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించుకోవచ్చు.
-పునశ్చరణ చేసుకునే అంశాలను లేదా సంబంధిత ఫార్ములాలను వేరొక పేపర్‌లో రాసుకుంటూ ప్రతిరోజు వాటికి తర్ఫీదు పొందుతూ వెళ్లాలి. అప్పుడే తుది పరీక్షలో బాగా రాయగలుగుతారు. పోటీ పరీక్షల్లో నిడివిగా ఉన్న లెక్కలను మొదట చేయడానికి ప్రయత్నించవద్దు. తెలిసినప్పటికీ ఆ ప్రశ్నలు మూడు సబ్జెక్టులు పూర్తిచేసుకున్న తర్వాతే ఆలోచించాలి.
-ఈ సబ్జెక్టులో లిమిట్స్, డెరివేటివ్స్, ఇన్‌గ్రేషన్స్, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, రేషియో, ప్రపోర్షన్స్, మ్యాథమెటిక్స్ ఆఫ్ ఫైనాన్స్.

స్టాటిస్టిక్స్

-ఈ సబ్జెక్టులో ఫార్ములాలు చాలా ముఖ్యమైనవి.
-ప్రతిరోజు ఫార్ములాలను రివైజ్ చేయడానికి కొంత సమయం కేటాయించాలి.
-చాలా ఫార్ములాలు దగ్గరి పోలికలు కలిగి ఉంటాయి. ఎన్నోసార్లు రివిజన్ చేస్తే తప్ప తేడా కనిపెట్టలేం. చాలా మంది విద్యార్థులు పరీక్షలో సరైన ఫార్ములాలు గుర్తుకురాక మార్కులు పోగొట్టుకుంటున్నారు. ఈ సబ్జెక్టులో ప్రాబ్లమ్స్‌కే కాకుండా థియరీకి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.
-ఇంటర్ మ్యాథ్స్ సబ్జెక్టు చదవని విద్యార్థులకు సీపీటీలో స్టాటిస్టిక్స్ సబ్జెక్టు చాలా ముఖ్యమైంది.
-పరీక్షల్లో 35-40 శాతం ప్రశ్నలు థియరీమీదే అడిగే అవకాశం ఉంది. అందువల్ల థియరీ మీద కూడా దృష్టిపెట్టాలి.
-ప్రతి చాప్టర్ ప్రిపేరయ్యేటప్పుడు ప్రాధాన్యం ఉన్న అంశాలు, సూత్రాలను హైలెట్ చేసుకోవాలి.
-ఈ సబ్జెక్టులో ప్రాబబిలిటీ, థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్స్, శాంప్లింగ్, స్టాటిస్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డాటా ముఖ్యమైన చాప్టర్లు.
Mattapalli-Prakashrao

877
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles