స్త్రీనిధిలో మేనేజర్లు


Tue,June 12, 2018 10:54 PM

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్‌లో మేనజర్లు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
sreenidhi-mangers

వివరాలు:

గ్రామీణ అభివృద్ధి శాఖ పరిధిలో ఈ సంస్థ పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం, సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్ ఫెడరేషన్ సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి.
-మొత్తం ఖాళీల సంఖ్య - 141మేనేజర్లు - 19, అసిస్టెంట్ మేనేజర్లు - 122

అర్హతలు:

-మేనేజర్ - కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఎంబీఏ/పీజీడీబీఎంలలో ఫైనాన్స్ లేదా ఎంఎస్‌డబ్ల్యూ/ఎంకాం చదివినవారికి ప్రాధాన్యం ఇస్తారు.ఎస్‌హెచ్‌జీ ఫెడరేషన్‌లో కనీసం 2 -3 ఏండ్లు లేదా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్/మైక్రో ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూట్స్ లేదా ఎన్‌జీవో రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 2018, మార్చి 31 నాటికి 28 - 35 ఏండ్ల మధ్య ఉండాలి.
-అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు - కనీసం 50 శాతం (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు 40 శాతం. బీసీలకు 45 శాతం) మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్‌హెచ్‌జీ గ్రూప్‌లో కనీసం 6 నెలల అనుభవం లేదా ఎంఎస్ అకౌంటెంట్స్/వీవోఏ/ఆర్‌పీలో పనిచేసి ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్ రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.
-వయస్సు: ఎస్‌హెచ్‌జీ/జెడ్‌ఎస్ అకౌంటెంట్స్/కంప్యూటర్ ఆపరేటర్స్ లేదా తత్సమాన సంస్థల్లో పనిచేసినవారికి 25 - 40 ఏండ్లు. ఇతరులకు 25- 5 ఏండ్ల వయస్సు ఉండాలి.
-జీతభత్యాలు: మేనేజర్ - నెలకు రూ. 25,000/- ఎఫ్‌టీఏ - రూ. 3,500/- వెహికిల్ మెయింటెనెన్స్ అలవెన్స్ కింద రూ. 700/- ఇస్తారు. అసిస్టెంట్ మేనేజర్- నెలకు రూ. 13,000/-, ఎఫ్‌టీఏ - నెలకు రూ. 3,500/-, వెహికిల్ మెయింటెనెన్స్ అలవెన్స్‌కు రూ. 700/- ఇస్తారు.
నోట్: ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఆరునెలలు ప్రొబేషనరీ పీరియడ్. కాంట్రాక్టు కాలపరిమితి ఐదేండ్లు.
-పరీక్ష కేంద్రం: హైదరాబాద్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూన్ 30
-వెబ్‌సైట్: www.streenidhi.telangana.gov.in

-ఎంపిక: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్ ద్వారా
-రాతపరీక్ష: 80 మార్కులకు ఉంటుంది. దీనిలో 65 మార్కులు ఆబ్జెక్టివ్. 10 మార్కులు డిస్క్రిప్టివ్. 5 మార్కులు కాంప్రహెన్షన్.
-అర్థమెటిక్, రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జీకే, కరెంట్ అఫైర్స్, జనరల్ ఇంగ్లిష్, ఎస్‌హెచ్‌జీ అంశాలపై ప్రశ్నలు ఇస్తారు.
-పరీక్ష కాలవ్యవధి గంటన్నర. పరీక్ష తెలుగులో ఉంటుంది.
-గ్రూప్ డిస్కషన్‌కు 20 మార్కులు.

2133
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles