సివిల్స్ ప్రిలిమ్స్- 2018 వర్తమానాంశాలు


Wed,May 16, 2018 06:08 AM

HEERA (హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంపవర్‌మెంట్ రెగ్యులేషన్ ఏజెన్సీ)

-దేశంలో ఉన్నత విద్యావ్యవస్థను నియంత్రించేందుకు ప్రస్తుతం ఉన్న ఏఐసీటీఈ, యూజీసీ స్థానంలో ఒకే సంస్థను

తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న దానికి హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంపవర్‌మెంట్ రెగ్యులేషన్ ఏజెన్సీగా నామకరణం చేస్తారని తెలుస్తుంది. ఏఐసీటీఈ, యూజీసీ విధులు పలు సందర్భాల్లో ఒకదానితో మరొకటి కలిసిపోతున్నాయి. ఒకే విధిని రెండు వ్యవస్థలు

నిర్వహిస్తుండటం గందరగోళానికి దారితీస్తుంది. ఈ సమస్యను నియంత్రించాలంటే ఏఐసీటీఈ, యూజీసీ స్థానంలో సమర్థవంతమైన ఒకే వ్యవస్థను రూపొందించాలని 2005లోనే శ్యాంపిట్రోడా నేతృత్వంలో ఏర్పాటైన నేషనల్ నాలెడ్జ్ కమిషన్ సూచించింది.

ఏసీఈఆర్ రిపోర్టు

-ప్రథమ్ అనే స్వచ్ఛంద సంస్థ ఏటా పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థులు, వారి అభ్యసన సామర్థ్యాలను సర్వే చేసి నివేదిక వెల్లడిస్తుంది. దీన్నే Annual status of

Education Report అంటారు. 2017 సర్వేలో 14 నుంచి 18 ఏండ్ల వయస్సు గల బాలబాలికల్లో అభ్యసన సామర్థ్యాలపై సర్వే నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో 14 శాతం బాలబాలికలు ప్రపంచ పటంలో భారతదేశాన్ని గుర్తించలేకపోయారు. 36 శాతం మందికి

ఢిల్లీ మన దేశ రాజధాని అని తెలియదు. 79 శాతం మంది తాము ఏ రాష్ట్రంలో ఉన్నామో చెప్పినా 42 శాతం మంది పటంలో ఆయా రాష్ర్టాలను గుర్తించలేకపోయారు.
-ప్రథమ్ సర్వే ప్రకారం 14 నుంచి 18 ఏండ్ల మధ్య వయస్సు గల పిల్లల్లో 25 శాతం మంది మాతృభాషలో పదాలను కూడా చదవలేకపోతున్నారు. 50 శాతంపైగా పిల్లలు చిన్నచిన్న భాగాహారాలు చేయలేకపోతున్నారు. 53 శాతం మంది మాత్రమే ఇంగ్లిషు వాక్యాలు

చదవగలిగారు.
-పాఠశాలల్లో పేరు నమోదు చేసుకోనివారు 14 ఏండ్ల వయస్సు గ్రూపులో 5.3 శాతం ఉండగా, 17 ఏండ్ల వయస్సు గ్రూపులో 20.7 శాతం, 18 ఏండ్ల వారు 30.2 శాతం ఉన్నారు.

యాక్షన్ ప్లాన్ ఫర్ చాంపియన్ సెక్టార్స్

-సేవారంగంలో మరింత వృద్ధి సాధించేందుకు వీలుగా ఎంపిక చేసిన విభాగాలపై మరింత శ్రద్ధ వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం 12

విభాగాలను చాంపియన్ సెక్టార్స్‌గా గుర్తించింది. అవి..
1. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్
2. టూరిజం అండ్ హాస్పిటాలిటీ సర్వీసెస్
3. మెడికల్ వాల్యూ ట్రావెల్
4. ట్రాన్స్‌పోర్ట్ అండ్ లాజిస్టిక్ సర్వీసెస్
5. అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్
6. ఆడియో విజువల్ సర్వీసెస్
7. లీగల్ సర్వీసెస్
8. కమ్యూనికేషన్ సర్వీసెస్
9. కన్‌స్ట్రక్షన్ అండ్ రిలేటెడ్ ఇంజినీరింగ్ సర్వీసెస్
10. ఎన్విరాన్‌మెంటల్ సర్వీసెస్
11. ఫైనాన్షియల్ సర్వీసెస్
12. ఎడ్యుకేషన్ సర్వీసెస్

సౌభాగ్యయోజన (ప్రధాన మంత్రి సహజ్ బిజిలి హర్ ఘర్ యోజన)

-దేశంలోని ప్రతి ఇంటికీ విద్యుత్ అందించే లక్ష్యంతో 2017, సెప్టెంబర్ 25న ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని దీన్‌దయాల్ ఉర్జా

భవన్‌లో సౌభాగ్య యోజనను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు రూ. 16,320 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తుండగా రూ. 12,320 కోట్లు కేంద్రం బడ్జెట్ కేటాయింపుల ద్వారా అందిస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ 31లోగా ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు రాష్ర్టాలు,

కేంద్ర పాలిత ప్రాంతాలు తమవంతు కృషిచేయాల్సి ఉంటుంది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్‌ఈసీ) ఈ ప్రాజెక్టుకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నది. 2011 సామాజిక, ఆర్థిక కులగణన ఆధారంగా లబ్ధిదారులను గుర్తిస్తారు. విద్యుత్ కనెక్షన్ లేని ఇతర

గృహాలకు కూడా సేవలు అందిస్తారు. కానీ, వారి నుంచి రూ. 500 రుసుంను నెలవారీ చార్జీలతో కలిపి 10 విడతల్లో వసూలు చేస్తారు. విద్యుత్ లైన్లు నిర్మించలేని మారుమూల ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి 300 వాట్ల సామర్థ్యం కలిగిన సౌరశక్తి బ్యాటరీలను అందిస్తారు.

దాంతో ఐదు ఎల్‌ఈడీ బల్బులు, ఒక ఫ్యాన్, ఒక పవర్ ప్లగ్ వాడుకోవచ్చు.

సౌభాగ్య ద్వారా ఆశిస్తున్న ప్రయోజనాలు

1. కిరోసిన్ దీపాల వాడకాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవడం
2. విద్యా సేవలను మెరుగుపర్చడం
3. మెరుగైన వైద్యసేవలు
4. టీవీ, రేడియో, మొబైల్ ద్వారా కనెక్టివిటీని పెంచడం
5. ఆర్థిక కార్యకలాపాలు, ఉద్యోగాలను పెంచడం
6. జీవన నాణ్యత (ముఖ్యంగా మహిళల్లో) పెంచడం
-సౌభాగ్య యోజన ద్వారా శీఘ్రగతిన విద్యుత్ కనెక్షన్లు అందించేందుకు స్థానిక పంచాయతీలు, ప్రభుత్వ సంస్థలకు బాధ్యతలు అప్పగిస్తారు. మొబైల్ యాప్ ద్వారా ఇండ్ల వద్దే వినియోగదారులు దరఖాస్తులను పూర్తిచేసే సౌకర్యం లభిస్తుంది.

ప్రధానమంత్రి చైర్మన్‌గా ఉండే సంస్థలు

1. నీతిఆయోగ్
2. నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్
3. సీఎస్‌ఐఆర్
4. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్
5. న్యూక్లియర్ కమాండ్ అథారిటీ
6. నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ
7. నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్
8. న్యూక్లియర్ కమాండ్ అథారిటీ
9. ఇండియన్ బోర్డ్ ఆఫ్ వైల్డ్‌లైఫ్
10. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ
11. నేషనల్ కమిషన్ ఫర్ పాపులేషన్ కంట్రోల్
12. కౌన్సిల్ ఆన్ ైక్లెమేట్ చేంజ్

రెసినా డైలాగ్

-Managing Disruptive Transitions: Ideas, Institutions and Idioms ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన రైసినా డైలాగ్ మూడో సదస్సును ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రారంభించారు. ఏటా

న్యూఢిల్లీలో భారత విదేశాంగశాఖ, అబ్జర్వర్ రిసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైసినా డైలాగ్ సదస్సును నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి భవన్ ఉండే రైసినా హిల్స్ ప్రాంతంలోనే ఈ సదస్సు జరుగుతుండడంతో ఆ పేరుతో పిలుస్తున్నారు. సింగపూర్‌లోని షంగ్రిల డైలాగ్ మాదిరిగానే

జియో పొలిటికల్ జియో ఎకనమిక్ అంశాలు అజెండాతో రైసినా డైలాగ్ సాగుతుంది. ఇందులో మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులు, వ్యాపారవేత్తలు పాల్గొని చర్చిస్తుంటారు. రైసినా డైలాగ్ మొదటిసారిగా 2016లో జరిగింది.
ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్-ఐఎస్‌ఏ (అంతర్జాతీయ సౌరశక్తి కూటమి)
-సౌరశక్తిని మరింత సమర్థవంతంగా వినియోగించుకుని విద్యుత్ అవసరాల్ని తీర్చుకునే లక్ష్యంతో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏర్పడింది. పారిస్ డిక్లరేషన్‌తో ఐఏఎస్ ఏర్పాటుకు బీజం పడింది. భారత్‌లోని గురుగ్రామ్ హెడ్‌క్వార్టర్‌గా ఏర్పాటైన ఈ కూటమికి

సంబంధించి ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్‌పై 48 దేశాలు సంతకాలు చేశాయి. 2030 నాటికి వెయ్యి బిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని, వెయ్యి గిగావాట్ల సౌరశక్తి స్థాపన సామర్థ్యాన్ని సాధించాలని ఐఏఎస్ భావిస్తోంది. సౌరశక్తి సామర్థ్యం కలిగిన దేశాలన్నింటిని ఏకతాటిపైకి

తీసుకువచ్చి పరిశోధనల్ని విస్తృతం చేయడం, చౌకగా సౌరశక్తి పరికరాల్ని రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
-జనవరిలో అబుదాబిలో జరిగిన వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్‌లో ఐఎస్‌ఏ పాలుపంచుకుంటుంది. ఇందులో ఆయా దేశాల మంత్రులు పాల్గొని సౌర విద్యుత్‌శక్తిని పెంచేందుకు వారి వ్యూహాలను వివరించారు. భారత్ 2020 నాటికి 175 గిగావాట్ల సౌరశక్తి సామర్థ్యాన్ని

సాధించగలదని, అలాగే సోలార్ డెవలప్‌మెంట్ ఫండ్ కోసం 350 మిలియన్ డాలర్లను సమకూరుస్తామని ప్రకటించింది.

ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్‌గా కుంభమేళా

-పన్నెండేండ్లకోసారి నిర్వహించే కుంభమేళాకు ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్‌గా గుర్తింపునిచ్చింది యునెస్కో. గతేడాది డిసెంబర్‌లో దక్షిణ కొరియాలో

జరిగిన యునెస్కో 12వ సమావేశంలో కుంభమేళాకు ఈ గుర్తింపునిచ్చారు. అంతకుముందు 2016లో యోగా, నౌరోజ్ పండుగ ఈ గుర్తింపును పొందాయి (వేద పఠన సంప్రదాయం, రామ్‌లీలా, కుటియాట్టం, రామ్మాన్ పండుగ, ముదియెట్టు, కల్‌బెలియ జానపద

గీతాలు, చౌ నృత్యం, బుద్ధిస్ట్ చాంటింగ్, సంకీర్తన, పంజాబ్‌లో తతేరాలు తయారుచేసే సంప్రదాయ రాగి, ఇత్తడి పాత్రల తయారీ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటివరకు ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో భారత్ నుంచి 13 అంశాలు స్థానం సాధించాయి).

కంబాల పోటీలు

-కర్ణాటకలో నవంబర్ నుంచి మార్చి మధ్య జరిగే కంబాల దున్నల పోటీలపై వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. రైతులు పంటలు బాగా పండాలని కోరుకుంటూ ఈ పోటీలు నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా దున్నలకు నాగలి కట్టి బురదలో పరుగెత్తిస్తారు. పోటీల్లో విజయం కోసం మూగజీవాల్ని హింసిస్తున్నారంటూ పెటా సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సంప్రదాయంగా సాగుతున్న ఈ పోటీల కొనసాగింపునకే కర్ణాటక ప్రభుత్వం మద్దతు పలుకుతుంది.

గతంలో తమిళనాడులోని జల్లికట్టుపైన విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం మూగజీవుల్ని హింసించడాన్ని అనుమతించలేమని చెప్పింది. ఇంకా మహారాష్ట్రలోనూ బైల్‌గాడి షరియత్ పేరుతో ఎద్దుల పోటీలు, రాజస్థాన్‌లో ఒంటెల పోటీలు, ఆంధ్రప్రదేశ్‌లో కోడిపందేలపై

వివాదం ఉంది.

ఆత్మహత్యాయత్నానికి శిక్ష నుంచి మినహాయింపు

-మెంటల్ హెల్త్‌కేర్ యాక్ట్-2017 ప్రకారం ఆత్మహత్యాయత్నాన్ని నేరం పరిధి నుంచి మినహాయించారు. గతంలో ఆత్మహత్యాయత్నం చేసినవారిని

ఐపీసీ-309 ప్రకారం శిక్షించేవారు. కానీ నూతన చట్టం ప్రకారం ఆత్మహత్యాయత్నం చేసినవారికి ప్రభుత్వం తగిన మానసిక చికిత్స, రిహాబిలిటేషన్, కేర్ అందించాలి. మానసిక దుర్బలత్వంతో తిరిగి ఆత్మహత్యాయత్నం చేయకుండా ఇది ఉపయోగపడుతుందని

భావిస్తున్నారు.

ఎక్సైటోనియం

-శాస్త్రవేత్తలు ఇటీవల న్యూ మ్యాటర్ (కొత్తరకమైన పదార్థం) ఎక్సైటోనియం ఉందని నిరూపించారు. 50 ఏండ్ల క్రితమే సిద్ధాంతాన్ని రూపొందించారు. ఎక్సైటోనియం ఉనికి గురించి

పరిశోధనలు సాగించిన కాలిఫోర్నియా, ఇల్లినాయస్ యూనివర్సిటీ పరిశోధకులు చివరకు విజయం సాధించారు. ఎక్సైటోనియం సూపర్ కండక్టర్ మాదిరిగా మాక్రోస్కోపిక్ క్వాంటమ్ లక్షణాల్ని ప్రదర్శిస్తుందని గుర్తించారు. ఎక్సైటోనియం పదాన్ని మొదటిసారిగా 1960లో

బెర్ట్ హాల్పెరిన్ ఉపయోగించారు.

S-CO2 బ్రెటన్ టెస్ట్ లూప్ ఫెసిలిటీ

-శుద్ధ ఇంధన వనరుల వినియోగాన్ని పెంచే దిశగా IISC శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధనలు ఫలించాయి. తాజాగా సూపర్ క్రిటికల్ కార్బన్ డై ఆక్సైడ్ బ్రెటన్

టెస్ట్ లూప్ ఫెసిలిటీని అభివృద్ధి చేశారు. సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ల ఏర్పాటులో ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో టర్బైన్లను తిప్పేందుకు నీటి ఆవిరిని వినియోగిస్తున్నారు. దానికి బదులు సూపర్ క్రిటికల్

కార్బన్ డై ఆక్సైడ్ వినియోగిస్తే విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరుగుతుంది. చౌకగా విద్యుత్ ప్లాంట్లను నిర్మించడం, తక్కువ ఖర్చుతోనే ఉత్పత్తిని ప్రారంభించడానికి వీలు కలుగుతుంది.

ప్రత్యూష్&మిహిర్

-అత్యధిక వేగంతో కచ్చితమైన వాతావరణ సమాచారం అందించే విధంగా హై పెర్ఫామెన్స్ కంప్యూటర్ (హెచ్‌పీసీ)ను రూపొందించారు భారత శాస్త్రవేత్తలు. 6.8 పెటాప్లాఫ్‌ల సామర్థ్యం

కలిగిన ఈ కంప్యూటర్ నోయిడాలోని NCMRWF, పుణెలోని IITMలో రెండు యూనిట్లుగా ఏర్పాటు చేయనుంది. నోయిడాలో ఏర్పాటుచేసే యూనిట్‌కు మిహిర్ (మిహిర్ అంటే సూర్యుడు అని అర్థం), పుణెలో ఏర్పాటుచేసే యూనిట్‌కు ప్రత్యూష్‌గా నామకరణం

చేసింది. హై పర్ఫామెన్స్ కంప్యూటర్ కలిగిన దేశాల్లో భారత్ 368వ స్థానం నుంచి 30వ స్థానానికి చేరుకుంది. అలాగే వాతావరణ సమాచారం కోసం హెచ్‌పీసీని కలిగిన దేశాల్లో జపాన్, యూకే, అమెరికా తర్వాత నాలుగో స్థానం భారతదేశానిదే. రుతుపవనాలుసహా

వాతావరణ మార్పులన్నింటినీ ముందస్తుగా రైతులకు అందించడం ద్వారా వారికి సహకారం అందించనున్నారు. ఈ కంప్యూటర్‌ను ఇతర రంగాల్లోనూ వినియోగించే విధంగా అభివృద్ధి చేయనున్నారు.

అగ్ని-5

-ఇది ఖండాంతర క్షిపణి, ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించవచ్చు. ఐదువేల కిలోమీటర్లు, ఆ పైన లక్ష్యాల్ని ఛేదించగల ఖండాంతర క్షిపణి వ్యవస్థ కేవలం అమెరికా, రష్యా, చైనా,

బ్రిటన్, ఫ్రాన్స్ వద్ద మాత్రమే ఉండేది. ఆ తర్వాత భారత్ కూడా ఈ సామర్థ్యాన్ని సాధించింది. అణు వార్‌హెడ్‌ను మోసుకెళ్లగల అగ్ని-5ని ఎక్కడినుంచైనా, ఏ క్షణమైనా ప్రయోగించే విధంగా తీర్చిదిద్దారు. దీనిలో రింగ్ లేజర్ గైరో బేస్డ్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్

(RINS), మైక్రో నావిగేషన్ సిస్టమ్ (MINS)లను ఉపయోగించడంవల్ల లక్ష్యాల్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. భారత్ అభివృద్ధిచేసిన నావిగేషన్ సిస్టమ్ నావిక్ ఆధారంగా కూడా అగ్ని-5 పనిచేయగలదు.

బరాక్ మిసైల్

-రక్షణ వ్యవస్థ బలోపేతం కోసం ఇజ్రాయెల్ ప్రభుత్వరంగ సంస్థ రాఫెల్ నుంచి భారత్ 131 బరాక్ మిసైళ్లను కొనుగోలు చేస్తున్నది. ఈ ఒప్పందం విలువ రూ. 460 కోట్లు. బరాక్

మిస్సైల్స్ రెండు రకాలున్నాయి. లాంగ్‌రేంజ్ సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్ (LR-SAM)ను యుద్ధ నౌకల నుంచి ప్రయోగించవచ్చు. అలాగే మీడియం రేంజ్ సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్‌ను భూతలం నుంచి ప్రయోగించవచ్చు. ఈ పరిజ్ఞానాన్ని డీఆర్‌డీఓ, ఇజ్రాయెల్

ఏయిరో స్పేస్ ఇండస్త్రీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఉత్పత్తి మాత్రం ఇజ్రాయెల్‌లోనే జరుగుతుంది. శత్రు దేశపు మిస్సైల్స్, యుద్ధ విమానాలను 100 కి.మీ. దూరంలోనే పసిగట్టి 70 కి.మీ. అవతలే నేలకూల్చగల సామర్ధ్యం బరాక్ మిస్సైల్స్‌కు ఉంది. (500 మి. డా.

విలువైన స్పైక్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైళ్లను కూడా ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేయాలని భారత్ ఆసక్తి చూపినప్పటికీ, దాన్ని విరమించుకుంది. ఇజ్రాయెల్ నుంచి కొనుగోలుకు బదులుగా డీఆర్‌డీఓ ద్వారా భారత్‌లోనే యాంటీ ట్యాంక్ మిస్సైళ్లను

తయారుచేసేందుకు చర్యలు చేపట్టింది)

సారస్

-అసంపూర్తిగా అభివృద్ధిచేసిన, పచ్చిక కలిగిన రన్‌వేపై లాండింగ్, టేకాఫ్ తీసుకోగల విమానాన్ని తయారుచేశారు భారత ఇంజినీర్లు. సీఎస్‌ఐఆర్ పర్యవేక్షణలో నేషనల్ ఎయిరోస్పేస్ లాబొరేటరీ

(ఎన్‌ఏఎల్) దీన్ని రూపొందించింది. 14 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ విమానాన్ని ప్రయాణికుల కోసమే కాకుండా సరుకు రవాణా కోసం కూడా వినియోగించవచ్చు. పౌరసేవలు, సైనిక అవసరాలకు సారస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. శాస్త్రవేత్తలు దీన్ని

విజయంతంగా పరీక్షించారు.

ప్రాజెక్టు- 75

-రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చేపట్టిన ప్రాజెక్టు 75లో భాగంగా మూడు జలాంతర్గాముల నిర్మాణం పూర్తయ్యింది. మరో మూడు నిర్మాణదశలో ఉన్నాయి. ఐఎన్‌ఎస్ కల్వరి

ఇప్పటికే నావికాదళానికి అందుబాటులోకిరాగా ఐఎన్‌ఎస్ ఖండేరి కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఐఎన్‌ఎస్ కరంజ్‌ను ఇటీవలే సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టారు. ఈ జలాంతర్గాముల నుంచి యాంటీ షిప్ మిసైళ్లు, టార్పెడోలను ప్రయోగించవచ్చు. స్టెల్త్ పరిజ్ఞానం

కలిగిన ఈ జలాంతర్గాములను శత్రు దేశపు రాడార్లు గుర్తించలేవు.
-స్కార్పియన్ శ్రేణికి చెందిన డీజిల్-ఎలక్ట్రిక్ జలాంతర్గాముల నిర్మాణానికి నావల్ గ్రూప్ ఆఫ్ ఫ్రాన్స్‌తో 2005లో ఒప్పందం కుదిరింది. దీని విలువ 3.7 బిలియన్ డాలర్లు. ఫ్రాన్స్ సంస్థ డీసీఎన్‌ఎస్ వీటి నిర్మాణంలో పాల్గొనడంతోపాటు టెక్నాలజీని బదిలీ చేస్తుంది.

ముంబైలోని మజ్‌గావ్‌డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌లో జలాంతర్గాముల నిర్మాణం జరుగుతున్నది. నిర్మాణదశలో ఉన్న జలాంతర్గాములకు వేల, వాగిరంద్, వాడేశ్వర్‌గా నామకరణం చేయనున్నారు. చివరి రెండు ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సాంకేతికతతో తయారవుతాయి.

తద్వారా చాలా సమయం వరకు సముద్ర గర్భంలోనే ఉండి విధులు నిర్వర్తిస్తాయి. 2020 నాటికి వీటి నిర్మాణం పూర్తవుతుందని అంచనా.

ఐఎన్‌ఎస్ అరిఘాంత్

-సముద్రగర్భం నుంచి బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించగల అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిఘాంత్ (అరిదమన్)ను గతేడాది నవంబర్‌లో సముద్రజలాల్లోకి ప్రవేశపెట్టారు. అరిహంత్

శ్రేణిలో ఇది రెండో జలాంతర్గామి. 1971లో పాకిస్థాన్ యుద్ధం సందర్భంగా ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అణుజలాంతర్గాముల నిర్మాణం కోసం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెసెల్ ప్రాజెక్టు (ఏటీవీ)ని 1990వ దశకంలో ప్రారంభించారు. ఇందులో భాగంగా

రూపొందించిన తొలి జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిహంత్‌ను 2016లో నావికా దళానికి అందించారు. రెండోది అరిఘాంత్. అరిఘాంత్‌ని అరిహంత్‌కంటే అధునాతన టెక్నాలజీతో అధిక సామర్థ్యంతో రూపొందించారు. ఆరువేల టన్నుల రియాక్టర్, 8 మిసైల్ లాంచ్ ట్యూబ్‌లు,

పంచేంద్రియ సోనార్‌ను అమర్చారు. సముద్రగర్భంలో కమ్యూనికేషన్ కోసం కూడా అరిఘాంత్‌ను ఉపయోగించుకోవచ్చు. అరిహంత్ శ్రేణిలో మరో రెండు జలాంతర్గాములు నిర్మాణదశలో ఉన్నాయి. విశాఖపట్నంలోని నేవీ షిప్ బిల్డింగ్ సెంటర్‌లో నిర్మాణం జరుగుతున్నది.

ఈ ప్రాజెక్టును రష్యాలోని ప్రాజెక్టు 971, అకుల శ్రేణి ఆధారంగా చేపట్టారు. ఈ అణు జలాంతర్గాముల్లో సేవలందించేందుకు నావికాదళ సిబ్బందికి రష్యా నుంచి లీజు తీసుకున్న ఐఎన్‌ఎస్ చక్రపై శిక్షణ ఇస్తున్నారు.

నావికాసాగర్ పరిక్రమ

-స్త్రీ శక్తి, సాధికారతను ప్రపంచానికి చాటుతూ భారత నావికాదళానికి చెందిన మహిళా బృందం సాహసయాత్ర చేపట్టింది. నావికాసాగర్ పరిక్రమ చేపట్టిన ఈ యాత్రను 2017,

సెప్టెంబర్ 10న రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ గోవాలో ప్రారంభించారు. ఐఎన్‌ఎస్ తరిణి నౌకలో ప్రారంభమైన యాత్ర ప్రపంచంలోని ప్రధాన ఖండాలన్నీ చుడుతూ ఏప్రిల్‌లో తిరిగి భారత్‌కు చేరుకుంది. లెఫ్టినెంట్ కమాండర్ వర్తికా జోషి ఈ బృందానికి నేతృత్వం

వహించగా మరో ఐదుగురు మహిళలు (ప్రతిభా జమ్వాల్, స్వాతి, విజయదేవి, ఐశ్వర్య, పాయల్ గుప్తా) ఇందులో పాలుపంచుకున్నారు.

ప్రపంచ ఆకలి సూచీ

-ప్రపంచ ఆకలి సూచీలో భారత్ 100వ స్థానంలో నిలిచింది. 2016లో 97వ స్థానంలో ఉండగా మూడు ర్యాంకులు దిగజారి 100వ స్థానానికి చేరింది. ఇంటర్నేషనల్ ఫుడ్

పాలసీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎఫ్‌ఆర్‌ఐ) 119 దేశాలతో చేపట్టిన ఈ సర్వేలో ఆసియాలో ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ మాత్రమే భారత్‌కన్నా దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతు ఉన్నాయి. మన పొరుగున ఉన్న దేశాల్లో చైనా 29, నేపాల్ 72, శ్రీలంక 84, బంగ్లాదేశ్ 88

మనకన్నా మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఆకలి సూచీ కోసం అండర్ నరీష్‌మెంట్, చైల్డ్ మోర్టాలిటీ, చైల్డ్ వాస్టింగ్, చైల్డ్ స్టంటింగ్‌ను ఇండికేటర్లుగా తీసుకుని ర్యాంకులు ఇచ్చారు. భారత్‌లో పోషకాహారలోపం కారణంగా పిల్లలు ఎదుగుదల సమస్యతో బాధపడుతున్నట్లు

ఐఎఫ్‌ఆర్‌ఐ వెల్లడించింది. 2022లోగా పౌష్టికాహారలోప రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు భారత్ రూపొందించిన ప్రణాళికపై సంతృప్తి వ్యక్తం చేసింది.


సోహమ్

-అప్పుడే పుట్టిన పిల్లల్లో వినికిడి లోపాల్ని గుర్తించేందుకు సోహమ్ అనే నూతన పరికరాన్ని బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బయోడిజైన్ ఇన్నోవేషన్

ల్యాబ్‌తో కలిసి రూపొందించారు. పిల్లల్లో వినికిడి లోపాల్ని గుర్తించేందుకు ఇప్పటివరకూ ఉన్న యంత్రాలు ఖరీదైనవే కాకుండా వాటి వినియోగం కూడా కష్టంతో కూడుకున్నవి. వాటి స్థానంలో సులభంగా వినికిడి శక్తిని గుర్తించగల పరికరాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు.

సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వారు స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బయోడిజైన్‌ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. సోహమ్ రూపకల్పనలో ఎయిమ్స్, ఐఐటీ-ఢిల్లీ కూడా సహకారాన్ని అందించాయి. ఏటా

ప్రపంచవ్యాప్తంగా 8 లక్షల మంది చిన్నారులు వినికిడి లోపాలతో జన్మిస్తుండగా.. కేవలం భారత్‌లోనే లక్షమందివరకూ చిన్నారులు ఈ సమస్యతో పుడుతున్నారు. శిశువు జన్మించగానే లోపాల్ని గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉంటుంది. సోహమ్ ద్వారా

ఏటా లక్షల మంది చిన్నారులకు మేలు చేకూరనుంది.

హార్ట్ ఆఫ్ ఏషియా సదస్సు

-హార్ట్ ఆఫ్ ఏషియా ఆరో సదస్సు పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ, ఆప్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో కలిసి సదస్సును ప్రారంభించారు.

Addressing Challenges, Achieving Prosperity ఇతి వృత్తంతో ప్రారంభమైన ఈ సదస్సులో 40 సభ్య దేశాలు, యూరోపియన్ యూనియన్ పాల్గొన్నాయి. ఉగ్రవాద నిర్మూలనకు అన్నిరకాల చర్యలు చేపట్టాలని, ఉగ్రవాదులకు

నిధులు సమకూరుస్తున్న డ్రగ్స్ వ్యాపారాన్ని కట్టడి చేయాలని, ఆఫ్ఘనిస్థాన్‌కు సభ్యదేశాలన్నీ ఆర్థిక సహకారాన్ని అందించాలని తదితర ప్రతిపాదనలతో అమృత్‌సర్ డిక్లరేషన్‌ను విడుదల చేశారు.
-2011లో ఇస్తాంబుల్ ప్రాసెస్ మొదలైంది. అందులో భాగంగానే హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సులు నిర్వహిస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్, దాని పొరుగు దేశాల మధ్య పరస్పర సహకారం దీని లక్ష్యం.
-భారత్‌కు ఇరువైపులా పలు దేశాల్లో చాలా పెద్ద మొత్తంలో డ్రగ్స్ వ్యాపారం జరుగుతుంది. ఆయా దేశాల భౌగోళిక అనుసంధానత ఆధారంగా వాటిని గోల్డెన్ క్రిసెంట్, గోల్డెన్ ట్రయాంగిల్‌గా వ్యవహరిస్తున్నారు. పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్- ఇరాన్‌కు కలిపి గోల్డెన్ క్రిసెంట్ అని,

మయన్మార్ - థాయ్‌లాండ్- లావోస్‌ను కలిపి గోల్డెన్ ట్రయాంగిల్‌గా పిలుస్తున్నారు. ఆయా దేశాల్లో డ్రగ్స్ వ్యాపారాన్ని నిర్మూలించాలని హార్ట్ ఆఫ్ ఆసియా భావిస్తున్నది.


ఆసియాన్ - భారత్

-ఆగ్నేయాసియా దేశాల కూటమిని ASEAN గా పిలుస్తున్నారు. 1967, ఆగస్టు 8న ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్ మధ్య ఒప్పందంలో

ఆసియాన్ అవతరించింది. అనంతరం 1984లో బ్రూనై, 1995లో వియత్నాం, 1997లో లావోస్, మయన్మార్, 1999లో కంబోడియా చేరడంతో సభ్యదేశాల సంఖ్య 10కి చేరింది. ఆసియాన్ ఏర్పాటులో సుహార్తో, మహతీర్ మహ్మద్, లీ కెన్ యూ కీలకపాత్ర

పోషించారు. ఆసియాలో భారత్‌కు సభ్యత్వం లేదు.
-భారత్, జపాన్, చైనా, దక్షిణకొరియా, రష్యా, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలను భాగస్వాములుగా చేసుకుని ఆసియాన్ ముందుకు సాగుతుంది. 2017 నాటికి విజయవంతంగా 50 ఏండ్లు పూర్తి చేసుకుంది.
-భారత్- ఆసియాన్ మధ్య 1992లో అంశాల వారీగా సంప్రదింపులు, 1996లో పూర్తిస్థాయి చర్చలు, 2002 నుంచి సదస్సుల్లో భాగస్వామ్యం, 2012 నుంచి ఆసియాన్‌తో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం మొదలైంది.
-భారత్- ఆసియాన్ మధ్య చర్చల భాగస్వామ్యానికి ఇటీవల 25 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా భారత్ ఆయా దేశాల అధినేతలను గణతంత్ర వేడుకలకు ఆహ్వానించి గౌరవ అతిథ్యం ఇచ్చింది.
-2018, జనవరి 25న ఢిల్లీలో ఆసియాన్ దేశాల అధినేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. Shared Values, Common Destiny (విలువల భాగస్వామ్యం, ఉమ్మడి లక్ష్యం) అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సమావేశ వేదికపై 36 అంశాలతో

కూడిన తీర్మాన పత్రాన్ని విడుదల చేశారు. దీన్నే ఢిల్లీ డిక్లరేషన్‌గా పిలుస్తున్నారు. రాజకీయ, భద్రత, సామాజిక-సాంస్కృతి రంగాల్లో సహకారం మరింత విస్తృతం చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలో ప్రవర్తనా నియమావళిని తక్షణమే అమల్లోకి

తీసుకురావాలని నిర్ణయించారు.

ఆలీవ్ రిడ్లే తాబేళ్లు

-సముద్ర తాబేళ్లలోని ఒకరకమైన ఆలీవ్ రిడ్లే తాబేళ్లు ఏటా నవంబర్ నుంచి మార్చి మధ్యకాలంలో ఒడిశాలోని రుషికుల్యా, గహిర్మాతా బీచ్‌కు చేరుకుని గుడ్లను పొదుగుతాయి.

పెద్దసంఖ్యలో ఇలా గుడ్లు పెట్టడాన్ని అర్రిబడ అంటారు. ఒడిశా తర్వాత మెక్సికో, కోస్టారికాను కూడా ఇవి గుడ్లను పొదిగేందుకు అనువైన ప్రదేశాలుగా ఎంచుకుంటాయి. ఒక తాబేలు ఒకసారి గుడ్లు పెడితే మరుసటి ఏడాది తిరిగి అక్కడికే చేరుకుని గుడ్లు పెడుతుందని

పరిశోధకులు గుర్తించారు. ఇందుకోసం వేల కిలోమీటర్లు ప్రయాణించి వస్తాయి. వెయ్యి గుడ్లను పొదిగితే పిల్ల దశను దాటుకుని కేవలం ఒక్క తాబేలు మాత్రమే ప్రౌఢదశకు చేరుకుంటుంది. మిగతావి రకరకాల కారణాలవల్ల చనిపోతున్నాయి. ఫలితంగా వీటిని ఐయూసీఎన్

ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న జీవుల జాబితా చేర్చింది. ఈ తాబేళ్లను లెదర్‌తో పాటు మాంసం కోసం జాలర్లు చంపేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
-సముద్ర తాబేళ్లలో ఏడు రకాలు ఉండగా వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ సంస్థ ఐదు రకాల తాబేళ్ల సంరక్షణపై దృష్టి సారించింది. అవి.. గ్రీన్, ఆలీవ్ రిడ్లే, లెదర్ బ్యాక్, హాక్స్‌బిల్, లాగర్‌హెడ్ తాబేళ్లు.

అగ్ని సిరీస్‌లో మిగతా క్షిపణుల రేంజ్

-అగ్ని-1: 700 కి.మీ.
-అగ్ని-2: 2000 కి.మీ.
-అగ్ని-3, 4: 2500 కి.మీ. నుంచి 3500 కి.మీ.పైగా లక్ష్యాల్ని ఛేదించగలవు.
-అగ్ని-3 వరకూ సైన్యానికి అందుబాటులోకి వచ్చాయి. అగ్ని-4, 5లను పలుమార్లు పరీక్షించారు. పదివేల కిలోమీటర్ల లక్ష్యాల్ని ఛేదించగల అగ్ని-6 తయారీ దశలో ఉంది.
-ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా భారత్ నాలుగు రకాల మిసైళ్లను అభివృద్ధి చేసింది. పృథ్వీ, ఆకాశ్, నాగ్, త్రిశూల్.
-పృథ్వీ: భూతలం నుంచి భూతలంపైకి ప్రయోగించే షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ (SRBM) ఇది. అణువార్ హెడ్‌లను మోసుకెళ్లగల ఈ మిసైళ్లను ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు అనుగుణంగా మూడు రకాలుగా అభివృద్ధి చేశారు.
-పృథ్వీ-1: ఆర్మీ వెర్షన్- వెయ్యి కేజీల పేలోడ్, 150 కి.మీ. రేంజ్
-పృథ్వీ-2: ఎయిర్‌ఫోర్స్ వెర్షన్- 500 కేజీల పేలోడ్, 350 కి.మీ. రేంజ్
-పృథ్వీ-3: నేవల్ వెర్షన్- వెయ్యి కేజీల పేలోడ్, 350 కి.మీ. రేంజ్
-ఆకాశ్: భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే మీడియం రేంజ్ క్షిపణి. 60 కేజీల పేలోడ్‌తో 30 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను చేధిస్తుంది.
-నాగ్: ఇది మూడో తరానికి చెందిన మిస్సైల్. 7 నుంచి 8 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో చేధిస్తుంది. అందుకే దీన్ని ఫైర్ అండ్ ఫర్‌గెట్ మిస్సైల్ అని పిలుస్తారు. నాగ్ మిస్సైల్‌ను నేలపై నుంచే కాకుండా గగనతలం నుంచి కూడా ప్రయోగించవచ్చు.

గగనతలం నుంచి ప్రయోగించే క్షిపణిని హెలీనా (Helina)గా పిలుస్తారు.
-త్రిశూల్: ఇది భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే షార్ట్‌రేంజ్ మిస్సైల్. 15 కిలోల పేలోడ్, 9 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను చేధింస్తుంది.

రిపోర్టులు-జారీ చేసే సంస్థలు

-ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్- ప్రపంచబ్యాంకు (భారత్ ర్యాంకు 100)
-వరల్డ్ డెవలప్‌మెంట్ రిపోర్ట్- ప్రపంచబ్యాంకు
-ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్- ప్రపంచబ్యాంకు
-లాజిస్టిక్స్ పర్ఫార్మెన్సెస్ ఇండెక్స్- ప్రపంచబ్యాంకు (35వ ర్యాంకు)
-క్రాస్ బార్డర్ ట్రేడ్- వరల్డ్ ఎకనమిక్ ఫోరం
-వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్- ఐఎంఎఫ్
-గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్- ఐఎంఎఫ్
-గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిపోర్ట్- వరల్డ్ ఎకనమిక్ ఫోరం
-నెట్‌వర్క్ రెడీనెస్ ఇండెక్స్‌లో భారత్ ర్యాంకు- 91
-ఎన్విరాన్‌మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్- వరల్డ్ ఎకనమిక్ ఫోరం
-రిపోర్ట్ తయారీలో యేల్, కొలంబియా యూనివర్సిటీలు పాలుపంచుకుంటాయి. ఇందులో 180 దేశాలను పరిగణనలోకి తీసుకోగా భారత్ 177వ ర్యాంకులో ఉంది.
-గ్లోబల్ కాంపిటేటివ్‌నెస్ ఇండెక్స్- వరల్డ్ ఎకనమిక్ ఫోరం (భారత్ 40వ ర్యాంకు)
-ఇన్‌క్లూజివ్ డెవలప్‌మెంట్ ఇండెక్స్- వరల్డ్ ఎకనమిక్ ఫోరం (భారత్ ర్యాంకు 62)
-గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్- వరల్డ్ ఎకనమిక్ ఫోరం (భారత్ 108వ ర్యాంకు)
-వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్- యూఎన్ ఎస్‌డీఎస్‌ఎన్ (భారత్ ర్యాంకు 122)
-హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్- యూఎన్‌డీపీ (భారత్ ర్యాంకు 131)
-గ్లోబల్ అసెస్‌మెంట్ రిపోర్ట్- యూఎన్‌ఐఎస్‌డీఆర్
-లివింగ్ ప్లానెట్ రిపోర్ట్- వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్
-గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్- యునెస్కో
-వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ రిపోర్ట్- ఆర్థికవేత్తలు థామస్ పికెటీ, లుకాస్ ఛాన్సెల్ (ఈ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోని ఒక్క శాతం ధనవంతుల వద్ద 20 శాతం సంపద, 10 శాతం మంది వద్ద 56 శాతం సంపద పోగుబడి ఉంది)
-గవర్నమెంట్ ఎట్ గ్లాన్స్- ఓఈసీడీ (స్విట్జర్లాండ్ మొదటి స్థానం, ఇండోనేషియా, భారత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి
-వరల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ రిపోర్ట్- యూఎన్‌సీటీఏడీ (భారత్ 9వ స్థానం)
-టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రిపోర్ట్- యూఎన్‌సీటీఏడీ
-లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ రిపోర్ట్- యూఎన్‌సీటీఏడీ
-గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్- డబ్ల్యూపీఓ (భారత్ ర్యాంకు-60)
-నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్- సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్
-ఇంటర్నెట్ రెడీనెస్ ఇండెక్స్- ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా

సైనిక విన్యాసాలు

-భారత్ వివిధ దేశాలతో కలిసి సైనిక విన్యాసాలు చేపడుతుంది. వివిధ దేశాలతో నిర్వహించే విన్యాసాలను వివిధ పేర్లతో పిలుస్తున్నారు. అవి..
-మలబార్ - భారత్, జపాన్, అమెరికా సంయుక్తంగా
-విన్‌బాక్స్ - భారత్, వియత్నాం
-అజయ వారియర్ - భారత్, యునైటెడ్ కింగ్‌డమ్
-యుద్ధ్ అభ్యాస్ - భారత్, అమెరికా
-అక్వైరీ - భారత్, మాల్దీవులు
-మైత్రి - భారత్, థాయ్‌లాండ్
-ఇంద్ర - భారత్, అమెరికా
-ప్రబల్ దోస్తిక్ - భారత్, కజకిస్తాన్
-సంకట్ మోచన్ - భారత్, దక్షిణ సూడాన్
-గరుడశక్తి - భారత్, ఇండోనేషియా
-సహయోగ్ కైజిన్ - భారత్, జపాన్
-కొంకణ్ - భారత్, బ్రిటన్
-మిత్రశక్తి - భారత్, శ్రీలంక
-నొమాడిక్ ఎలిఫెంట్ - భారత్, మంగోలియా
-లామైట్ - భారత్, సీషెల్స్
-ఇంబాక్స్ - భారత్, మయన్మార్
-ఆస్ట్రాఇండ్ - భారత్, ఆస్ట్రేలియా
-సంప్రీతి - భారత్, బంగ్లాదేశ్
-హ్యాండ్ ఇన్ హ్యాండ్ - భారత్, చైనా
-శక్తి - భారత్, ఫ్రాన్స్
-సూర్యకిరణ్ - భారత్, నేపాల్
-అగ్ని వారియర్ - భారత్, సింగపూర్

1069
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles