రాష్ట్రంలో అత్యధిక జలవిద్యుత్ సామర్థ్యంగల ప్రాజెక్టు?


Wed,May 16, 2018 05:43 AM

1. గోదావరి నది పొడవు?

1) 1440 కి.మీ. 2) 1465 కి.మీ.
3) 1200 కి.మీ. 4) 2500 కి.మీ.

2. కిందివాటిలో గోదావరి నది పరీవాహక రాష్ట్రం కానిది?

1) మహారాష్ట్ర 2) తెలంగాణ
3) ఛత్తీస్‌గఢ్ 4) మధ్యప్రదేశ్

3. రాష్ట్రంలో గోదావరినది మొత్తం పొడవు (సుమారుగా)?

1) 500 కి.మీ. 2) 250 కి.మీ.
3) 600 కి.మీ. 4) 1000 కి.మీ.

4. దేశంలో మొదటి, రెండో పొడవైన నదులు వరుసగా?

1) గోదావరి, గంగానది 2) బ్రహ్మపుత్ర, గంగానది 3) గంగానది, కృష్ణానది 4) గంగానది, గోదావరి

5. తెలివాహ నది అని దేన్ని పిలుస్తారు?

1) కావేరి 2) యమున 3) గోదావరి 4) కృష్ణా

6. గోదావరి నది కింది ఏ పేరు కలిగిలేదు?

1) వృద్ధగంగ 2) దక్షిణగంగ
3) ఇండియన్‌రైన్ 4) నేత్రావతి

7. ఏ మూడు నదుల కలయికతో గోదావరి నదికి మొదటి త్రివేణి సంగమం ఏర్పడుతుంది?

1) మంజీర, హరిద్ర, గోదావరి
2) మంజీర, మానేరు, గోదావరి
3) గోదావరి, ప్రాణహిత, మానేరు
4) గోదావరి, మానేరు, పెద్దవాగు

8. గోదావరి, ప్రాణహిత, మానేరు అనే మూడు నదుల కలయికగల ప్రదేశం?

1) కంతనపల్లి 2) కాళేశ్వరం
3) కందుకుర్తి 4) భద్రాచలం

9. గోదావరి నది రాష్ట్రంలోకి ఎక్కడ ప్రవేశిస్తుంది?

1) ఆదిలాబాద్ 2) నిర్మల్
3) నిజామాబాద్ 4) కామారెడ్డి

10. కిన్నెరసాని ఏ నదికి ఉపనది?

1) కావేరి 2) కృష్ణా
3) పెన్నా 4) గోదావరి

11. మూసీనది ఎక్కడ ప్రారంభమవుతుంది?

1) సత్మాల కొండలు 2) హార్స్‌లీ కొండలు 3) బాలాఘాట్ కొండలు 4) అనంతగిరి కొండలు

12. హైదరాబాద్‌కు నీటిసరఫరా మొదట ఎక్కడి నుంచి జరిగింది?

1) ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్
2) సింగూరు ప్రాజెక్టు
3) నాగార్జునసాగర్ 4) నిజాంసాగర్

13. కొత్తగూడెం థర్మల్‌పవర్ స్టేషన్‌కు అవసరమైన నీరు ఏ నది నుంచి అందుతున్నది?

1) శబరి 2) గోదావరి 3) కిన్నెరసాని 4) మున్నేరు

14. దిగువ మానేరు డ్యాం ఏ నదిపై నిర్మించారు?

1) కృష్ణా ఉపనది 2) గోదావరి ఉపనది
3) మంజీర ఉపనది 4) తుంగభద్ర ఉపనది

15. నిజాంసాగర్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?

1) కృష్ణా 2) కావేరి
3) మంజీర 4) గోదావరి

16. కృష్ణానది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది?

1) మక్తల్, మహబూబ్‌నగర్ జిల్లా
2) కొత్తకోట, వనపర్తి జిల్లా
3) డిండి, నల్లగొండ జిల్లా
4) పరిగి, వికారాబాద్ జిల్లా

17. కుంటాల జలపాతం ఏ నదిపై ఉంది?

1) కిన్నెరసాని 2) పాలేరు
3) మానేరు 4) కడెం

18. కింది వాటిలో సరికానిది?

1) రాష్ట్రంలో ప్రధాన నదులు గోదావరి, కృష్ణా
2) కృష్ణానదిపై నిజాంసాగర్ నిర్మించారు
3) కృష్ణానది పరీవాహకంలో హైదరాబాద్ నగరం ఉంది
4) గోదావరి ఉపనది మంజీర

19. రాష్ట్రంలోని పూర్వపు కరీంనగర్ జిల్లాలో కింది ఏ నదులు ప్రవహిస్తున్నాయి?

1) గోదావరి, మానేరు 2) మంజీర, హల్ది
3) మూసీ, డిండి 4) కృష్ణా, ప్రాణహిత

20. లక్నవరం ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?

1) మహబూబ్‌నగర్ 2) భద్రాద్రి కొత్తగూడెం 3) జయశంకర్ భూపాలపల్లి 4) మెదక్

21. హైదరాబాద్‌లోని పురానాపూల్ బ్రిడ్జి ఏ నదిపై ఉంది?


1) వైరా 2) మంజీరా 3) ఆలేరు 4) మూసీ

22. కిందివాటిని జతపర్చండి.

నది ఉపనది
ఎ. గంగ 1. భీమ
బి. బ్రహ్మపుత్ర 2. ప్రాణహిత
సి. గోదావరి 3. తీస్తా
డి. కృష్ణా 4. కోసి
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-1, బి-2, సి-4, డి-3

23. కిందివాటిని సరిగా జతపర్చండి.

జలపాతం జిల్లా
ఎ. పొచ్చెర 1. జయశంకర్ భూపాలపల్లి
బి. బొగత 2. పెద్దపల్లి
సి. సబితం 3. నాగర్‌కర్నూల్
డి. మల్లెల తీర్థం 4. ఆదిలాబాద్
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-4, బి-1, సి-2, డి-3
3) ఎ-1, బి-3, సి-2, డి-4
4) ఎ-2, బి-3, సి-4, డి-1

24. కిందివాటిని జతపర్చండి.

నది జన్మస్థలం
ఎ. మంజీర 1. సిరిసిల్ల కొండలు
బి. గోదావరి 2. మహాబలేశ్వరం
సి. కృష్ణ 3. నాసిక్ త్రయంబకేశ్వర్
డి. మానేరు 4. జామ్‌ఖేడ్ కొండలు
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-4, బి-1, సి-2, డి-3
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-2, బి-1, సి-3, డి-4

25. కింది ప్రాజెక్టులు, జిల్లాలను జతపర్చండి.

ప్రాజెక్టు జిల్లా
ఎ. సింగూరు ప్రాజెక్టు 1. కామారెడ్డి
బి. లోయర్ జూరాల 2. సంగారెడ్డి
సి. నిజాంసాగర్ ప్రాజెక్టు 3. నిజామాబాద్
డి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 4. వనపర్తి
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-4, సి-1, డి-3
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-4, బి-2, సి-1, డి-3

26. తెలంగాణలో కృష్ణా, గోదావరి నదులు ప్రవహించని జిల్లా ఏది?

1) నిర్మల్ 2) నల్లగొండ
3) జయశంకర్ భూపాలపల్లి 4) మెదక్

27. ఏ జిల్లాల గుండా కృష్ణానది పరీవాహక ప్రాంతం వెళ్తుంది?

1) మహబూబ్‌నగర్, నల్లగొండ, హైదరాబాద్
2) ఖమ్మం, ఆదిలాబాద్, నల్లగొండ
3) కరీంనగర్, నల్లగొండ, హైదరాబాద్
4) వరంగల్, మహబూబ్‌నగర్, హైదరాబాద్

28. కింది ఏ రెండు జిల్లాలు ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకం పరిధిలోకి రావు?

1) ఖమ్మం, మహబూబ్‌నగర్
2) మహబూబ్‌నగర్, మెదక్
3) నల్లగొండ, రంగారెడ్డి 4) ఖమ్మం, నిజామాబాద్

29. రాష్ట్రంలో అత్యధిక జలవిద్యుత్ సామర్థ్యంగల ప్రాజెక్టు?

1) శ్రీశైలం ఎడమగట్టు 2) నాగార్జునసాగర్
3) శ్రీరాంసాగర్ 4) జూరాలప్రాజెక్టు

30. జోగుళాంబ దేవాలయం ఏ నది ఒడ్డున ఉన్నది?

1) కృష్ణా 2) గోదావరి
3) మూసీ 4) తుంగభద్ర

31. ఉస్మాన్‌సాగర్ రిజర్వాయర్‌ను ఏ నదిపై నిర్మించారు?

1) మంజీర 2) మూసీ 3) గోదావరి 4) ఆలేరు

32. కిందివాటిలో కృష్ణానదికి ఉపనది కానిది?

1) ఘటప్రభ 2) భీమ
3) మలప్రభ 4) ఇంద్రావతి

33. కిందివాటిలో హైదరాబాద్‌లో ఉన్న చెరువు?

1) హిమాయత్‌సాగర్ 2) హుస్సేన్‌సాగర్
3) ఉస్మాన్‌సాగర్ 4) మీర్ ఆలం చెరువు

34. తెలంగాణలో గోదావరికి ఉపనది కానిది?

1) మానేరు 2) మంజీర
3) హాలియా 4) ఇంద్రావతి

35. రాజోలిబండ మళ్లింపు పథకం ఏ నదిపై ఉంది?

1) కృష్ణా 2) గోదావరి 3) తుంగభద్ర 4) భీమ

36. కృష్ణాపరీవాహక ప్రాంతంలోని ఏ జిల్లాకు గోదావరి నీటిని అందిస్తున్నారు?

1) సంగారెడ్డి 2) హైదరాబాద్
3) కరీంనగర్ 4) మహబూబ్‌నగర్

37. చిరకాలంలో ఫ్లోరైడ్ కాలుష్యం, కరువుతో విలవిల్లాడుతున్న నల్లగొండ జిల్లా, పూర్వపు మహబూబ్‌నగర్ జిల్లాలోని కొన్ని భాగాల్లో సాగునీరు అందించడానికి ప్రభుత్వం ప్రతిపాదించిన పథకం?

1) స్వర్ణప్రాజెక్టు 2) మూలవాగు ప్రాజెక్టు
3) జూరాల ప్రాజెక్టు 4) నక్కలగండి ప్రాజెక్టు

39. తెలంగాణ నయగారా జలపాతంగా పిలువబడే బొగత జలపాతం ఏ జిల్లాలో ఉంది?

1) ఖమ్మం 2) జయశంకర్ భూపాలపల్లి
3) భద్రాద్రి కొత్తగూడెం 4) ఆదిలాబాద్

40. రాష్ట్రంలో ఉన్న అతిపురాతన ఆనకట్ట ఏది?

1) లోయర్ మానేరు డ్యాం 2) జూరాల డ్యాం 3) సింగూరు డ్యాం 4) నిజాంసాగర్ డ్యాం

41. గండిపేట చెరువును ఏమని పిలుస్తారు?

1) అలీసాగర్ 2) హిమాయత్‌సాగర్
3) ఉస్మాన్‌సాగర్ 4) హుస్సేన్‌సాగర్

42. మున్నేరు నది ఏ జిల్లాలో ప్రవహిస్తుంది?

1) కరీంనగర్ 2) ఆదిలాబాద్
3) ఖమ్మం 4) మెదక్

43. కిందివాటిలో కృష్ణానదితో సంబంధం లేని ప్రాజెక్టు?

1) నాగార్జునసాగర్ 2) శ్రీశైలం
3) పులిచింతల 4) ఎల్లంపల్లి

44. తెలంగాణలో ఎన్ని జిల్లాల్లో గోదావరి నది ప్రవహిస్తున్నది?

1) ఐదు 2) ఏడు 3) ఆరు 4) ఎనిమిది

45. కంతానపల్లి ఎత్తిపోతల పథకం ఏ నదిపై నిర్మిస్తున్నారు?

1) కృష్ణా 2) మంజీర 3) శబరి 4) గోదావరి

46. తమ్మిడిహట్టి ఏ ప్రాంతంలో ఉంది?

1) కర్ణాటక 2) మహారాష్ట్ర 3) తెలంగాణ 4) ఒడిశా

47. ప్రాణహిత అనేది?

1) ఒక నది 2) ఒక ఆరోగ్య పథకం
3) సరస్సు 4) పువ్వు

48. అమరావతి నది దేని ఉపనది?

1) కృష్ణా 2) గోదావరి 3) తుంగభద్ర 4) కావేరి

49. ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?

1) జయశంకర్ భూపాలపల్లి 2) వరంగల్ రూరల్ 3) జగిత్యాల 4) భద్రాద్రి కొత్తగూడెం

50. అలీసాగర్ ఎత్తిపోతల ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?

1) మెదక్ 2) నల్లగొండ
3) నిజామాబాద్ 4) హైదరాబాద్
list1

1191
Tags

More News

VIRAL NEWS

Featured Articles