నాల్కోలో 115 గ్రాడ్యుయేట్ ఇంజినీర్లు


Mon,May 14, 2018 12:42 AM

-ఇంజినీరింగ్ అభ్యర్థులకు అవకాశం
-ఉద్యోగ భద్రత, మంచి జీతభత్యాలు
-గేట్-2018 స్కోర్+ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
-మే 24 చివరితేదీ

businessmeeting

వివరాలు:

నాల్కో గనుల మంత్రిత్వశాఖలో పనిచేస్తుంది. 1981 జనవరి 7న భువనేశ్వర్‌లో ఏర్పాటుచేశారు.
- పోస్టు పేరు: గ్రాడ్యుయేట్ ఇంజినీర్
- మొత్తం ఖాళీల సంఖ్య: 115
(జనరల్-60, ఓబీసీ-30, ఎస్సీ-17, ఎస్టీ-8)
- విభాగాల వారీగా ఖాళీలు: మెకానికల్ ఇంజినీరింగ్-54, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్-32, మెటలర్జీ ఇంజినీరింగ్-18, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్-5, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్-6
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 65 శాతం (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు 55 శాతం) మార్కులతో బీఈ/బీటెక్ (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెటలర్జీ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత. గేట్-2018లో ఉత్తీర్ణత సాధించాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

- వయస్సు: 2018 మే 22 నాటికి 30 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
- పే స్కేల్: ట్రెయినింగ్ పీరియడ్‌లో రూ. 40,000-3%-1,60,000 పే స్కేల్‌తో విజయవంతంగా ప్రొబేషనరీ పీరియడ్ పూర్తయిన తర్వాత జూనియర్ మేనేజర్‌గా పే స్కేల్ రూ. 60,000-3%-1,80,000/- చెల్లిస్తారు.
- ఎంపికైన అభ్యర్థులకు ట్రెయినింగ్ పీరియడ్‌లో ఏడాదికి రూ. 10.52 లక్షలు, శిక్షణానంతరం రూ. 15.73 లక్షల జీతం చెల్లిస్తారు.
- సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ లేదా నాలుగేండ్లపాటు సంస్థలో పనిచేయాలి.
- అప్లికేషన్ ఫీజు: ఓసీ, ఓబీసీ అభ్యర్థులకు
రూ. 500/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ/డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు రూ. 100/-.
- ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది. ప్రొబేషన్ పీరియడ్‌లో చూపిన పర్‌ఫామెన్స్ ఆధారంగా దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తారు.
- ఎంపిక: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) 2018 స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా
- దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
- దరఖాస్తులకు చివరితేదీ: మే 22
(సాయంత్రం 5.30 గంటలకు)
- వెబ్‌సైట్:www.nalcoindia.com

1089
Tags

More News

VIRAL NEWS

Featured Articles