ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీచర్లు


Mon,May 14, 2018 12:40 AM

సికింద్రాబాద్ (ఆర్‌కే పురం)లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ 2018-19 అకడమిక్ ఇయర్‌గాను వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Future

వివరాలు:

ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీ (అవేస్) ఆధ్వర్యంలో ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ నడుస్తున్నాయి.

అర్హతలు, వివరాలు

-పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్(పీజీటీ)- ఫిజిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్
-అర్హత: పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఫిజిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్)లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సీనియర్ సెకండరీ క్లాసెస్ (9, 10వ తరగతి సీబీఎస్‌ఈ సిలబస్)లో బోధించిన అనుభవం ఉండాలి.
-గ్రాడ్యుయేట్ టీచర్స్(టీజీటీ)- సోషల్ సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లిష్, హిందీ
-అర్హత: సంబంధిత గ్రాడ్యుయేట్ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత బీఈడీతోపాటు సెకండరీ క్లాసెస్ (6 నుంచి 10వ తరగతి) బోధించిన అనుభవం ఉండాలి.
-కంప్యూటర్ సైన్స్ టీచర్
-అర్హత: ఎంటెక్/ఎంసీఏ, ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్)లో ఉత్తీర్ణత.
-ప్రైమరీ టీచర్ (పీఆర్‌టీ)-ఆల్ సబ్జెక్ట్స్
-అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు బీఇడీ ఉండాలి.
-యాక్టివిటీ టీచర్స్ (మ్యూజిక్ టీచర్ (వెస్ట్రన్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్)
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం మార్కులతోపాటు సంబంధిత సబెక్టుల్లో సర్టిఫికెట్ ఉండాలి.
-స్పెషల్ ఎడ్యుకేటర్
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్)లో ఉత్తీర్ణత.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. దరఖాస్తులను పూర్తిగా నింపి, సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 1
-వెబ్‌సైట్:www.apsrkpuram.edu.in

1124
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles