కెన్‌ఫిన్‌లో 125 జూనియర్ ఆఫీసర్లు


Mon,May 14, 2018 12:39 AM

బెంగళూరులోని కెన్‌ఫిన్ హోమ్స్ లిమిటెడ్ వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఆఫీసర్ (కాంట్రాక్ట్ ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
can-fin-homes
వివరాలు:
కెన్‌ఫిన్ హోమ్స్ లిమిటెడ్ అనేది కెనరా బ్యాంక్ అనుబంధ సంస్థ. 133 బ్రాంచి ఆఫీస్‌లు, 20 ఏహెచ్‌ఎల్‌సీ, 20 శాటిలైట్ ఆఫీసులు ఉన్నాయి.
-పోస్టు పేరు: జూనియర్ ఆఫీసర్
-మొత్తం పోస్టుల సంఖ్య: 125
-ప్రాంతాలవారీగా ఖాళీలు: తెలంగాణ-11, కర్ణాటక-20, ఆంధ్రప్రదేశ్-10, ఛత్తీస్‌గఢ్-2, గుజరాత్-8, హర్యానా-10, జార్ఖండ్-2, కేరళ-2, మధ్యప్రదేశ్-7, మహారాష్ట్ర-14, పుదుచ్చేరి-1, పంజాబ్-2, తమిళనాడు-17, ఉత్తరాఖండ్-1, ఉత్తరప్రదేశ్-12
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. డాటా ఎంట్రీ, కంప్యూటర్ అప్లికేషన్‌లో పరిజ్ఞానం ఉండాలి. ప్రాంతీయ/లోకల్ లాంగ్వేజ్‌లో రాయడం, మాట్లాడటం, చదవడం తప్పనిసరిగా రావాలి.
గమనిక: ఈ పోస్టులను మొదట ఏడాది వ్యవధికి తీసుకుంటారు. అవసరం మేరకు మరో రెండేండ్ల వరకు పొడగిస్తారు.
-వయస్సు: 2018 ఫిబ్రవరి 1 నాటికి 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. (1988 మే 1 నుంచి 1997 మే 1 మధ్య జన్మించి ఉండాలి).
-పే స్కేల్: మొదటి ఏడాదిలో నెలకు రూ. 18,000/- చొప్పున ఏడాదికి రూ. 2.50 లక్షలు, రెండో ఏడాది నుంచి రూ. 2.72 లక్షలు, మూడో ఏడాది నుంచి రూ. 3.08 లక్షల జీతం చెల్లిస్తారు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
-ఎంపిక: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 15
-వెబ్‌సైట్: www.canfinhomes.com.

1227
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles