జీఐసీలో మేనేజర్లు


Mon,May 14, 2018 12:37 AM

-జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ)లో స్కేల్-
- ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

general

వివరాలు:


జీఐసీ భారత ప్రభుత్వ రంగ సంస్థ. ప్రపంచంలో 12వ అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ.
-పోస్టు: అసిస్టెంట్ మేనేజర్ (స్కేల్-I)
-మొదట పోస్టింగ్ ముంబై ప్రధానకార్యాలయంలో ఇస్తారు. తర్వాత అవసరాన్ని బట్టి దేశ/విదేశాల్లో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వొచ్చు.
-మొత్తం ఖాళీల సంఖ్య: 25. వీటిలో జనరల్ స్ట్రీమ్- 24, హిందీ- 1 ఉన్నాయి.
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ/పీజీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం మార్కులు వస్తే సరిపోతుంది.
-హిందీ పోస్టుకు కనీసం 60 శాతం మార్కులతో హిందీలో పీజీతోపాటు డిగ్రీస్థాయిలో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. లేదా పీజీలో ఇంగ్లిష్‌తోపాటు డిగ్రీలో హిందీ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
-వయస్సు: 2018 మే 8 నాటికి 21 - 30 ఏండ్ల మధ్య ఉండాలి.
-జీతం: ప్రారంభ వేతనం నెలకు
రూ. 53,400/- (సుమారుగా)
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ . దీనిలో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రాతపరీక్ష, జీడీ, ఇంటర్వ్యూలకు కేటాయించిన మార్కులు 200.
-ఆన్‌లైన్ టెస్ట్ జూన్/జూలైలో నిర్వహిస్తారు.
-హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, తిరువనంతపురం, ముంబై/నవీముంబై, థానే, కోల్‌కతా, గ్రేటర్ కోల్‌కతా, న్యూఢిల్లీ ఎన్‌సీఆర్‌లలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 29
-వెబ్‌సైట్: www.gicofindia.com

766
Tags

More News

VIRAL NEWS

Featured Articles