ఏఐసీటీఈలో ఫెలోషిప్స్


Mon,May 14, 2018 12:29 AM

న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) నేషనల్ డాక్టోరల్ ఫెలోషిప్స్ (ఎన్‌డీఎఫ్) కోసం ఇంజినీరింగ్/ఫార్మసీలో పీజీ చదువుతున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
FELLOWSHIPS
-ఈ ఫెలోషిప్స్ 2018-19 విద్యాసంవత్సరానికిగాను ఇస్తున్నారు. టెక్నికల్/పరిశోధనలో ఔత్సాహికగల అభ్యర్థులకు ప్రతి ఏడాది 150 మందికి ఈ ఫెలోషిప్స్ అందజేస్తారు.
నేషనల్ డాక్టోరల్ ఫెలోషిప్స్ (ఎన్‌డీఎఫ్)
-అర్హతలు: బీఈ/బీటెక్/బీఫార్మసీతో పాటు ఎంఈ/ఎంటెక్/ఎంఫార్మసీలో 75 శాతం (ఎస్సీ/ఎస్టీలకు 70 శాతం) మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. గేట్/జీప్యాట్ స్కోర్ (గత ఐదేండ్లలో) ఉత్తీర్ణత సాధించాలి. 2018 ఆగస్టు 31 నాటికి 30 ఏండ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీ, మహిళ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఐదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఫెలోషిప్ వ్యవధి: మూడేండ్లు (అవసరం మేరకు మరో ఆరు నెలల వరకు పొడిగిస్తారు)
-స్టయిఫండ్: రూ. 28,000+హెచ్‌ఆర్‌ఏ, కంటిన్‌జెన్సీ గ్రాంట్ కింద ఏడాదికి రూ. 15,000/- చెల్లిస్తారు.
-ఎంపిక: నేషనల్ నోడల్ సెంటర్ ఆధ్వర్యంలో జూన్ 18 నుంచి జూలై 10 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఫలితాలను ప్రకటిస్తుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులు ప్రారంభం: మే 12
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 10
-వెబ్‌సైట్: http://aicte-ndf.psgtech.ac.in

1325
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles