జెన్‌కోలో 75 పోస్టులు


Mon,April 16, 2018 12:08 AM

తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్ జెన్‌కో) వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న జేఏవో, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
tsgenco

పోస్టుల వివరాలు:

టీఎస్ జెన్‌కో సంస్థ కంపెనీల చట్టం 2013 కింద 2014 మే 19న ఏర్పాటైంది. 2014 జూన్ 2 నుంచి తన కార్యాకలాపాలను ప్రారంభించింది.
-మొత్తం పోస్టుల సంఖ్య : 75
-జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్-42 పోస్టులు
-జోన్ - I పరిధి పాత జిల్లాలు: ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం
-జోన్ - Iలో ఖాళీలు: 22
-లోకల్-15, నాన్‌లోకల్ -7
-జోన్ -II పరిధి పాత జిల్లాలు: హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ.
-జోన్ -IIలో ఖాళీలు: 20
-లోకల్ -14, నాన్‌లోకల్ -6
-అర్హత: మాస్టర్ డిగ్రీ (ఎంకాం) లేదా బీకాంలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత. లేదా సీఏ ఇంటర్/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ. 34,630-56,760/-
-అసిస్టెంట్ మేనేజర్ (హెచ్‌ఆర్)-33 పోస్టులు
-జోన్-I పరిధి పాత జిల్లాలు: ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం
-జోన్ - Iలో ఖాళీలు:18
-లోకల్-11, నాన్‌లోకల్-7
-జోన్ -II పరిధి పాత జిల్లాలు: హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ.
-జోన్ -IIలో ఖాళీలు: 15
-లోకల్-9, నాన్‌లోకల్-6
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీఏ (హెచ్‌ఆర్), ఎంఎస్‌డబ్ల్యూఏ, రెండేండ్ల పీజీ డిప్లొమా (పర్సనల్ మేనేజ్‌మెంట్/హ్యూమన్ రిసోర్స్/ఇండస్ట్రియల్ రిలేషన్స్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. బ్యాచిలర్ డిగ్రీలో లా ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. పర్సనల్ మేనేజ్‌మెంట్‌లో ఎనిమిదేండ్ల అనుభవం ఉండాలి.
-పే స్కేల్: రూ. 41,155- 63,600/-
-వయస్సు: 2018 జనవరి 1 నాటికి 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేండ్లు, పీహెచ్ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు: ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు రూ. 150/-, ఎగ్జామినేషన్ ఫీజు రూ. 350/-
-ఎగ్జామినేషన్ ఫీజులో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజును ప్రతి ఒక్కరు చెల్లించాలి.
-ఎంపిక : రాత పరీక్ష
-పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, సికింద్రాబాద్.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరితేదీ: మే 9
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేది: మే 10 (సాయంత్రం 4.30 గం॥ వరకు)
-పరీక్ష తేదీ : మే 27
-వెబ్‌సైట్ : http://tsgenco.cgg.gov.in

రాతపరీక్ష విధానం:
-జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్: రాత పరీక్ష ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు ఉంటుంది. 60 ప్రశ్నలు సంబంధిత కోర్ సబ్జెక్ట్ నుంచి మిగతా 40 ప్రశ్నలు జనరల్ అవేర్‌నెస్, లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు వస్తాయి. రాతపరీక్ష కాలవ్యవధి 120 నిమిషాలు.
-అసిస్టెంట్ మేనేజర్: ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 100 మార్కులకు ఉంటుంది. పార్ట్ ఏ విభాగంలో 60 ప్రశ్నలు (హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ జనరల్ లా అండ్ లేబర్ లా) పార్ట్ బీ విభాగంలో 40 ప్రశ్నలు (కాంప్రహెన్షన్, జనరల్ అవేర్‌నెస్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్) వస్తాయి. రాతపరీక్ష కాలవ్యవధి 120 నిమిషాలు.

4345
Tags

More News

VIRAL NEWS

Featured Articles