పది తర్వాత కామర్స్ కెరీర్


Sun,April 15, 2018 11:06 PM

ఐటీతోపాటు దాదాపు సమాంతరంగా ఎదుగుతున్నది కామర్స్‌రంగం. కంప్యూటర్ కోర్సుల అలజడివల్ల కొంతకాలం వెనక్కితగ్గినా మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకున్నది. సరైన కామర్స్ కోర్సు ఎంపికతోపాటు నేటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన సామర్థ్యాలను పెంపొందించుకుంటే ఈ రంగంలో రాణించవచ్చు. పదోతరగతి వార్షిక పరీక్షలు రాసిన చాలామంది విద్యార్థులు తర్వాత ఏ కోర్సు చదువాలి? కెరీర్ ఎంపికలో ఎటువైపు అడుగులు వేయాలి? అనే సందిగ్థంలో ఉంటారు. వారి సౌకర్యార్థం ఈ వివరాలు..
commerce-career
ఎంఈసీ-ఇదొక ప్రత్యేకమైన గ్రూపుగా చెప్పవచ్చు. మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ వంటి రెండు విభిన్న సబ్జెక్టుల కలయికే ఎంఈసీ గ్రూపు.
-మ్యాథ్స్ అంటే మక్కువ కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే భయం అనుకునేవారు కామర్స్ అంటే ఇష్టం ఉండి లాజికల్‌గా ఉండే మ్యాథ్స్ కూడా కావాలి, భవిష్యత్తులో ఏ కోర్సు చదవాలనుకున్నా అవకాశం ఉండాలనుకునేవారు ఎంఈసీ గ్రూపు తీసుకోవచ్చు.
-ఇంటర్‌లో సైన్స్ గ్రూపులు చదివి ఇంజినీరింగ్, మెడిసిన్, ఐఐటీ కోర్సులు చదవాలంటే మనకు వచ్చిన ర్యాంకుని బట్టి కౌన్సెలింగ్‌లో కేటాయించిన కాలేజీలో మాత్రమే చదవాల్సి ఉంటుంది. అదే ఇంటర్‌లో ఎంఈసీ వంటి కామర్స్ గ్రూపు చదివితే ఇష్టం వచ్చిన కాలేజీలో చదవచ్చు. ఉదాహరణకు ఇంటర్ ఎంఈసీ పూర్తిచేసినవారికి ఒకవేళ సీఏ లేదా సీఎంఏ వంటి కోర్సులు చదవాలంటే దేశంలో ఎక్కడైనా కాలేజీలను ఎంపిక చేసుకోవచ్చు.
-ఎంఈసీ తర్వాత- సీఏ, సీఎంఏ, సీఎస్, లా వంటి ప్రొఫెషనల్ కోర్సులు, బీకామ్, బీబీఎం, బీఏ, బీఎస్సీ, ఎంబీఏ, ఎంకామ్, ఎంసీఏ, ఎమ్మెస్సీ వంటి జనరల్ కోర్సులు చేయవచ్చు. గ్రూప్స్, సివిల్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, డీఎస్సీ వంటి పోటీపరీక్షలు రాయవచ్చు.

సీఈసీ

-సీఈసీ అంటే కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ వంటి మూడు ప్రధాన సబ్జెక్టుల కలయిక చాలామంది సైన్స్ గ్రూపువారికి ఉన్నన్ని ఉద్యోగ అవకాశాలు సీఈసీ గ్రూపు చదివిన వారికి ఉండవని భావిస్తుంటారు. కానీ అది అవాస్తవం. ఇంటర్‌లో సీఈసీ చదివి డిగ్రీ పూర్తి చేసి అనేక రంగాల్లో ప్రవేశించవచ్చు. లా పూర్తి చేయడానికి, సివిల్స్ రాయడానికి అన్ని రకాల కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయడానికి ఈ గ్రూపులోని సబ్జెక్టులే కీలకం. ఎక్కువ శాతం జనరల్ నాలెడ్జ్, సమాజానికి సంబంధించి, రాజ్యాంగానికి సంబంధించి, ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థ అంశాలతో కామర్స్‌ను కూడా అనుసంధానం చేయడం వల్ల ఈ గ్రూపుకి ప్రాధాన్యం పెరిగింది. సీఏ కోర్సు
-అవకాశాలు: సీఏ కోర్సులో వచ్చిన నూతన సంస్కరణల వల్ల సీఏలకు ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభించనున్నాయి.
-దేశంలోనే కాదు విదేశాల్లో కూడా మన సీఏలకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కంపెనీలకు మేనేజింగ్ డైరెక్టర్లుగా, ఫైనాన్స్ కంట్రోలర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, మార్కెటింగ్ మేనేజర్, ఫైనాన్స్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్స్, ప్లాంట్ అకౌంటెంట్స్, సిస్టమ్ ఇంప్లిమెంటర్స్, టెక్నో ఫంక్షనిస్టులుగా అవకాశాలు పొందవచ్చు.
వేతనాలు
-సీఏలు ప్రారంభంలోనే నెలకు కనీసం రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకు, తర్వాత లక్షల్లో జీతాలు పొందవచ్చు.

ఎవరు చదవవచ్చు

-సీఏ చదవాలంటే ఒకప్పుడు డిగ్రీ తర్వాత అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఇంటర్‌తో పాటు సీఏ కోర్సు చదవడం ప్రారంభించవచ్చు.
-ఇంటర్ ఎంఈసీ, ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ ఇలా ఏ గ్రూప్‌వారైనా సీఏ కోర్సు చదవచ్చు. అయితే సీఏ చేయానుకునే చాలామంది విద్యార్థులు ఇంటర్‌లో ఎంఈసీ గ్రూపుతో పాటు సీఏ కూడా ఏకకాలంలో చదవడానికి సుముఖత చూపిస్తున్నారు.
-ఇలా ఇంటర్‌తోపాటు సీఏ చదవడంవల్ల ప్రాథమిక అంశాలపై పట్టు సాధించడంతోపాటు భవిష్యత్తులో చదవబోయే సీఏ కోర్సులోని మిగిలిన దశలకు గట్టి పునాది ఏర్పడుతుంది.

దశలు

-మొదటి దశ సీఏ ఫౌండేషన్: ఇంజినీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు ఎంసెట్, నీట్‌లు ఎలాగో.. సీఏ చదవాలనుకునేవారికి సీఏ ఫౌండేషన్ ప్రవేశపరీక్ష అలాగే.
-ఇంటర్, 10+2 లేదా తత్సమాన పరీక్ష రాసినవారు ఎవరైనా సీఏ ఫౌండేషన్ కోర్సుకు నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న నాలుగు నెలలకు సీఏ ఫౌండేషన్ పరీక్ష రాయవచ్చు.
-సహజంగా ప్రతి ప్రవేశ పరీక్షను మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల రూపంలో నిర్వహిస్తారు. కానీ సీఏ ఫౌండేషన్ పరీక్షలో 50 శాతం డిస్క్రిప్టివ్, మరో 50 శాతం మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి.
-సీఏ ఫౌండేషన్ సిలబస్‌లో పేపర్ 2లో ఇంగ్లిష్ గ్రామర్, రైటింగ్ స్కిల్స్, లెటర్ రైటింగ్, నోట్ మేకింగ్ వంటి కమ్యూనికేషన్ స్కిల్స్‌కు సంబంధించిన అనేక అంశాలను పొందుపర్చారు. దీనివల్ల విద్యార్థి కమ్యూనికేషన్ స్కిల్స్‌పై పట్టు సాధించవచ్చు. డ్రాఫ్టింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి.
-సీఏ ఫౌండేషన్ పరీక్ష 4 పేపర్లుగా, ఒక్కో పేపర్ 100 మార్కుల చొప్పున మొత్తం 400 మార్కులకు రోజుకో పేపర్ చొప్పున నాలుగు రోజులు నిర్వహిస్తారు. (టేబుల్ 1 చూడండి)
-ఈ పరీక్షలు ప్రతి ఏడాది మే, నవంబర్‌లలో నిర్వహిస్తారు.
-సీఏ ఫౌండేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి పేపర్‌లో కనీసం 40 శాతం మార్కులు రావాలి. అలాగే నాలుగు పేపర్లు కలిపి 400 మార్కులకుగాను 50 శాతం అంటే 200 మార్కులు సాధించాలి.
-రెండో దశ సీఏ ఇంటర్: ఈ కోర్సును గతంలో సీఏ-ఐపీసీసీ అని పిలిచేవారు.
-సీఏ ఫౌండేషన్ పూర్తిచేసినవారు సీఏ ఇంటర్మీడియట్ చదవడానికి అర్హులు.
-గతంలో సీఏ-ఐపీసీసీ గ్రూపు-1 నాలుగు పేపర్లు, గ్రూపు-2 మూడు పేపర్లుగా ఉండేది. కానీ మారిన సీఏ ఇంటర్మీడియట్ గ్రూపు-1లో నాలుగు పేపర్లు, గ్రూపు-2లో నాలుగు పేపర్లు మొత్తం ఎనిమిది పేపర్లుగా సిలబస్‌ను రూపొందించారు. (టేబుల్ 2 చూడండి)
-నూతన విధానంలో కూడా విద్యార్థి వీలును బట్టి రెండు గ్రూపులు ఒకేసారి లేదా విడివిడిగా ఒక్కో గ్రూపు 6 నెలల వ్యత్యాసంతో రాయవచ్చు.
-సీఏ ఇంటర్మీడియట్ పరీక్ష ఏడాదికి రెండుసార్లు మే, నవంబర్‌లో ఉంటుంది.
-సీఏ ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి పేపర్‌లో 40 శాతం మార్కులు, గ్రూపు మొత్తం మీద 50 శాతం మార్కులు సాధించాలి.
-సీఏ ఇంటర్మీడియట్ పూర్తిచేసినవారు మూడేండ్ల ఆర్టికల్‌షిప్ చేయాలి.
ఆర్టికల్‌షిప్ (ప్రాక్టికల్ ట్రెయినింగ్)
-సీఏ ఇంటర్మీడియట్ పూర్తిచేసినవారు ఒక ప్రాక్టిసింగ్ సీఏ వద్దగానీ, ఆడిట్ సంస్థలోగానీ మూడేండ్లపాటు ప్రాక్టికల్ ట్రెయినింగ్ పొందాలి.
-ప్రాక్టికల్ ట్రెయినింగ్ సమయంలోనే ఒక ఏడాది ముగిసిన తర్వాత సీఏ ఫైనల్ పరీక్ష రాసేలోగా సీఏ ఇన్‌స్టిట్యూట్ వారి 4 వారాల ఏఐసీఐటీఎస్‌ఎస్ (అడ్వాన్స్‌డ్ ఇంటిగ్రేటెడ్ కోర్సు ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్ స్కిల్స్) శిక్షణ కూడా తీసుకోవాలి.
-రెండున్నరేండ్ల ప్రాక్టికల్ ట్రెయినింగ్ పూర్తిచేసినవారు సీఏ ఫైనల్ పరీక్ష రాయడానికి అర్హులు.

మూడో దశ - సీఏ ఫైనల్

-సీఏ ఇంటర్మీడియట్ పూర్తిచేసి రెండున్నరేండ్ల ప్రాక్టికల్ ట్రెయినింగ్ పూర్తిచేసినవారు సీఏ ఫైనల్ పరీక్ష రాయవచ్చు. ఈ పరీక్ష ఏడాదికి రెండుసార్లు మే, నవంబర్ నెలల్లో నిర్వహిస్తారు. (టేబుల్ 3 చూడండి)
-విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి పేపర్‌లో 40 శాతం మార్కులు, గ్రూప్ మొత్తం మీద 50 శాతం మార్కులు సాధించాలి.
-ఎలక్టీవ్ పేపర్ విధానంవల్ల విద్యార్థి తనకిష్టమైన పేపర్‌నే ఎంచుకుని దాన్ని బాగా చదివి ఆ సబ్టెక్టులో నైపుణ్యం సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది.
commerce-career2
-పదో తరగతి పరీక్షలు ముగిశాయి. తర్వాత ఏ కోర్సు చేయాలి, ఏది చదివితే భవిష్యత్ బాగుంటుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు తీసుకునే నిర్ణయమే విద్యార్థి భవిష్యత్తును నిర్ణయిస్తుందనడంలో సందేహం లేదు.
-దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చింది. దీనివల్ల చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ)లకు, ఇతర కామర్స్ ప్రొఫెషనల్స్‌కు కనీసం 3 నుంచి 5 రెట్లు ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పవచ్చు.
-ఐటీతోపాటు దాదాపు సమాంతరంగా ఎదుగుతున్నది కామర్స్‌రంగం. కంప్యూటర్ కోర్సుల అలజడివల్ల కొంతకాలం వెనక్కితగ్గినా మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకున్నది. కామర్స్ కోర్సులు కూడా పోటీపడి నూతన జవసత్వాలు సమకూర్చుకుంటున్నాయి. సరైన కామర్స్ కోర్సు ఎంపికతోపాటు నేటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన సామర్థ్యాలను పెంపొందించుకుంటే ఈ రంగంలో రాణించవచ్చు.
-భవిషత్తులో కామర్స్ నిపుణులుగా, వ్యాపారవేత్తలుగా ఎదగాలంటే పదోతరగతి తరువాతే కామర్స్ గ్రూపులు ఎంచుకుని ప్రణాళికా బద్ధంగా చదివితే తక్కువ సమయంలోనే మంచి నిపుణులుగా ఎదగవచ్చు. అంటే ఇంటర్‌లో ఏదో ఒక కామర్స్ గ్రూపు తీసుకువాలి. ఇంటర్‌లో ఉన్న కామర్స్ గ్రూపుల్లో ఇప్పుడు అత్యంత ఆదరణ ఉన్నవి ఎంఈసీ (మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్), సీఈసీ (సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్).
mohan-rao

740
Tags

More News

VIRAL NEWS

Featured Articles