మూఢత్వం నుంచి జ్ఞానోదయం వైపు..


Sun,April 15, 2018 10:45 PM

సంఘ సంస్కరణలు

ఛత్రపతి సాహూమహరాజ్ (1874-1922)

-శివాజీ మునిమనుమడిగా ప్రసిద్ధి చెందిన సాహూ కొల్హాపూర్ సంస్థానాన్ని కొత్త పుంతలు తొక్కించాడు.
-సాహూ స్వయంగా తన రాజ్యంలోని గ్రామాలను సందర్శించి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి, ఏ భేషజాలు లేకుండా దళితులు, పేద రైతుల ఇండ్లకు వెళ్లి వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకునేవాడు.
-ఇలా వారి వాడల్లోకి వెళ్లిన తొలి మరాఠా రాజు సాహూమహరాజ్. అందుకే అతనిపై ప్రజలందరికీ ఆరాధన భావం ఉండేది.
-అప్పట్లో సనాతన ధర్మం పేరుతో బ్రాహ్మణులు దేశంలోని బ్రాహ్మణేతరుల దరికి విద్యను చేరనివ్వలేదు. ఇలాంటి సమయంలో ఛత్రపతి సాహూ బ్రాహ్మణేతరుల దగ్గరికి విద్యాబుద్ధులు తీసుకెళ్లడం కోసం దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి, తానే అధ్యక్షుడిగా వ్యవహరించాడు.
-సామాన్య జనానికి తమకున్న అధికారాలు, కర్తవ్యాలపై కనీస జ్ఞానం కలిగించాలంటే ప్రాథమిక విద్య ఒక్కటే మార్గమని నమ్మి విద్యావ్యాప్తికి అత్యంత ప్రాముఖ్యం ఇచ్చేవాడు.
-సాహూమహరాజ్ ఒకరోజు పంచగంగ స్నానమాచరించడం కోసం వెళ్లగా మంత్రోచ్ఛారణ కోసం వచ్చిన బ్రాహ్మణ పండితుడు స్నానమాచరించకుండానే మంత్రపఠనం చేశాడు.
-ఎందుకంటే ఛత్రపతి సాహూ కున్చీకాపు (శూద్రుడు) కాబట్టి. శూద్రులకు మంత్రపఠనం చేసేటప్పుడు స్నానం చేయాల్సిన అవసరం లేదని వాదించాడు.
-ఈ విషయంలో సాహూ తన రాజ్యంలోని దళిత, బలహీనవర్గాల పరిస్థితులపై ఎంతో ఆవేదన చెందాడు.
-దళిత, బలహీనవర్గాల వారికి శిక్షణ ఇచ్చి రాజ్య శాసన వ్యవహారాల్లో ఉన్నత పదవులు ఇవ్వడం మొదలుపెట్టాడు.
-దళిత, బలహీనవర్గాల పిల్లల విద్య కోసం మొదట తన రాజమహల్లోనూ, కొల్హాపూర్‌లోనూ హాస్టళ్లను ఏర్పాటు చేశాడు.
-బహుజన సమాజ వసతి గృహాల కోసం ఆర్థికసాయం చేశాడు.
-సాహూ మహరాజ్ 1902, జూలై 26న ప్రభుత్వ గెజిట్‌లో విప్లవాత్మక ప్రకటన జారీ చేశాడు. ప్రభుత్వ ఉద్యోగాల్లో బడుగు, బలహీన వర్గాల్లో విద్యాధికులకు 50 శాతం ఉద్యోగాలు కేటాయించి భర్తీ చేయాలని నిర్ణయించాడు.
-సాహూజీ చేసిన ఈ ప్రకటన భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.
-తన రాజ్యంలో ప్రజల ఆర్థిక స్థితులు మెరుగవ్వాలని, పనిచేసే వారికి పని దొరకాలని శ్రీ సాహూ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్లును 1906, సెప్టెంబర్ 27న కొల్హాపూర్‌లో స్థాపించాడు.
-సాహూజీ ఆర్థిక సహకారం మూలంగానే బీఆర్ అంబేద్కర్ మూక్ నాయక్ అనే ప్రత్యేక సంచికను వెలువరించాడు. ఈ విధంగా తన సంస్థానంలో శూద్ర, అతి శూద్రుల విద్య కోసం పరితపించి, రైతుల పరిస్థితుల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుని, సంస్థానంలో వితంతు పునర్వివాహ చట్టం తెచ్చిన ఛత్రపతి సాహూమహరాజ్ 1922, మే 6న మృతిచెందాడు.

నారాయణగురు (1854-1928)

-ఇతడు కేరళలోని తిరువనంతపురంలో ఎఝావ కులంలో జన్మించాడు.
-సమానత్వం, న్యాయం ప్రాతిపదికలపై ఆధారపడిన నవ సమాజ నిర్మాణానికి నారాయణగురు కృషి చేశారు.
-కేరళలో మత సంస్కరణోద్యమానికి, సాంఘిక దృక్పథాన్ని రూపొందించారు.
-ఇతడు సంస్కృత, తమిళ, మలయాళ భాషల్లో పండితుడు. భక్తి గీతాలను రాశాడు.
-వెనుకబడిన తరగతుల నైతిక, సాంఘికాభివృద్ధికి నిరంతరం కృషిచేసి, వర్ణవ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు.
-మతం పేరిట జరిగే జంతుబలులను నిషేధించగలిగాడు. సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ఎఝావ, వెనుకబడిన తరగతుల ప్రగతికి, 1903లో శ్రీమన్నారాయణ ధర్మ పరిపాలనా యోగాన్ని నెలకొల్పాడు.
-నీ కులం చెప్పవద్దు - ఒకరి కులం అడగవద్దు అని నారాయణగురు ప్రచారం చేసి, వర్ణాంతర వివాహాలను సమర్థించాడు.

బీఆర్ అంబేద్కర్ (1891-1956)

-బాబా సాహెబ్‌గా ప్రసిద్ధి చెందిన భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ ఏప్రిల్ 14న అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్‌లో సైనిక స్థావరమైన మహో అనే గ్రామంలో రామ్‌జీ మలోజీ సక్పాల్, భీమాబాయి దంపతుల చివరి సంతానం(14వ)గా జన్మించాడు.
-ఈయన మహర్ కులానికి చెందిన వారు. తండ్రి బ్రిటిష్ సైన్యంలో పనిచేశాడు.
-అంబేద్కర్ చిన్నతనంలో అనేక రకాల వివక్షలను ఎదుర్కొన్నాడు.
-సంస్కరణలు: 1927లో మహద్‌లో అంబేద్కర్ దళిత జాతుల మహాసభ జరిపాడు. ఆ రోజుల్లో చెరువులోని నీరు దళితులు తాగడానికి వీల్లేదు.
-అంబేద్కర్ నాయకత్వంలో వేలమంది దళితులు మహద్ చెరవు నీరు తాగారు. ఈ సంఘటన మహారాష్ట్రలో సంచలనం కలిగించింది.
-1927లో అంబేద్కర్ బహిష్కృత భారత్ అనే మరాఠీ పక్ష పత్రికను ప్రారంభించాడు. ఆ పత్రికలో ఒక వ్యాసం రాస్తూ తిలక్ గనుక అంటరానివాడిగా పుట్టి ఉంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అని అనడు, అస్పృశ్యత నివారణే నా ధ్యేయం, నా జన్మహక్కు అని ప్రకటించేవాడని రాశాడు.
-అంబేద్కర్ 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించాడు. 1937లో కేంద్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీ 15 సీట్లు గెలుచుకుంది.
-ది ప్రాబ్లం ఆఫ్ ది రూపీ, ప్రొవిన్షియల్ డే సెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా, ది బుద్ధ అండ్ కార్ల్‌మార్క్స్, ది బుద్ధ అండ్ హిజ్ ధర్మ అంబేద్కర్ రాసిన పుస్తకాల్లో ప్రధానమైనవి.
-అంబేద్కర్ తన జీవితాంతం సామాజిక వివక్ష, కుల వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. హిందూ మతంలోని కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అంబేద్కర్ వేలమందితో కలిసి 1956, అక్టోబర్ 14న నాగ్‌పూర్‌లో బౌద్ధమతాన్ని స్వీకరించాడు.
-మేధావిగా, సంఘసంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా, రాజ్యాంగ శిల్పిగా, భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రిగా కీర్తి వహించిన అంబేద్కర్ 1956, డిసెంబర్ 5న మరణించాడు.

ఎన్‌ఎం జోషి (1879-1955)

-నారాయణ్ మల్హర్ జోషి సాంఘిక సంస్కరణవాది, కార్మిక నాయకుడు.
-1911లో బాంబేలో సోషల్ సర్వీస్ లీగ్‌ను నెలకొల్పి అనేక సాంఘిక చర్యలు చేపట్టాడు.
-1920లో బొంబాయిలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ)ను నెలకొల్పి కార్మికుల అభ్యున్నతి కోసం కృషిచేశాడు.

గోపాల్ హరిదేశ్‌ముఖ్ (1823-92)

-ఇతను మహారాష్ట్రలో సాంఘిక సంస్కరణ అంశంలో పేరొందిన వ్యక్తి.
-గోపాల్ హరిదేశ్‌ముఖ్ లోక హితవాదిగా పేరుపొందాడు.
-సాంఘిక, మతపర సమానత్వాన్ని చాటాడు.
-హిందూ సంప్రదాయాలను ఖండించాడు.

శివనారాయణ్ అగ్నిహోత్రి (1850-1929)

-ఈయన 1887లో లాహోర్‌లో దేవసమాజాన్ని నెలకొల్పాడు.
-దేవ సమాజం, బ్రహ్మ సమాజం అంశాలను పాటిస్తుంది. తేడా ఏమిటంటే ఒక గురువును ఎన్నుకుని ఆయనను పూజించేవారు.
mallikarjun

582
Tags

More News

VIRAL NEWS

Featured Articles