సీఎంఏ కోర్సు


Sun,April 15, 2018 10:43 PM

-మేనేజ్‌మెంట్, ప్రొఫెషనల్ కోర్సులు అందించే సంస్థల్లో సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ)లకు పీహెచ్‌డీ హోదాతో సమానమైన హోదా కలిగిన లెక్చరర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, ప్రొఫెసర్స్‌గా ఉద్యోగం లభిస్తుంది. అంతేగాక అనేక ప్రభుత్వరంగ సంస్థల్లోనూ, ప్రభుత్వేతర సంస్థల్లోనూ ఈ సీఎంఏలు చీఫ్ ఇంటర్నల్ ఆడిటర్, కాస్ట్ కంట్రోలర్, చీఫ్ అకౌంటెంట్, ఫైనాన్షియల్ కంట్రోలర్ వంటి పదవులను నిర్వర్తించవచ్చు.
-సీఏ కోర్సు కష్టం, చదవలేము అనుకునేవారికి నిజంగా సీఎంఏ కోర్సు ఒక వరం అని చెప్పవచ్చు. సీఏ కష్టం అనుకునే విద్యార్థులు సాధారణంగా బీకామ్ గానీ, ఎంబీఏ గానీ చేస్తారు. కానీ అదే సమయంలో సీఎంఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సును పూర్తిచేయవచ్చని, త్వరగా జీవితంలో స్థిరపడవచ్చని విద్యార్థుల్లో అవగాహన పెరిగి ఈ కోర్సువైపు ఆకర్షితులవుతున్నారు.
-10వ తరగతి తర్వాత అయితే కేవలం నాలుగేండ్లలో, ఇంటర్ ఎంఈసీతోపాటు సీఎంఏ చదివిన విద్యార్థులు ఇంటర్ తర్వాత కేవలం రెండేండ్లలో, ఇంటర్ తర్వాత సీఎంఏ చదవడం మొదలుపెట్టిన విద్యార్థులు అయితే రెండున్నరేండ్లలో సీఎంఏ పూర్తిచేసి మంచి ఉద్యోగాలు పొందవచ్చు. సీఎంఏ చదవడానికి ఇంటర్‌లో ఏ గ్రూప్ వారైనా అర్హులే.
-సీఎంఏ చదవాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. విద్యార్థి ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమానమైన పరీక్ష ఉత్తీర్ణులు కావాలి. రిజిస్ట్రేషన్ చేయించుకున్న విద్యార్థులకు ఇన్‌స్టిట్యూట్ వారు ఐడీ కార్డు పంపిస్తారు. వారిని మాత్రమే పరీక్షలకు అనుమతిస్తారు.
-క్యాంపస్ ప్లేస్‌మెంట్స్: సీఎంఏ పూర్తిచేసిన వారికి సీఎంఏ ఇన్‌స్టిట్యూట్ వారే స్వయంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో చాలామంది సీఎంఏలు, ముఖ్యంగా 25 ఏండ్లలోపే సీఎంఏ కోర్సు పూర్తిచేసినవారు మంచి అవకాశాలు పొందుతున్నారు.

cma-foundation

సీఎంఏ కోర్సులోని దశలు

-సీఎంఏలో ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ అనే మూడు దశలు ఉంటాయి.
-సీఎంఏ ఫౌండేషన్ కోర్సు: ఈ కోర్సులోని మొదటి దశను ఫౌండేషన్ అంటారు. ఇంటర్ ఏ గ్రూపు చదివినవారైనా సీఎంఏ ఫౌండేషన్ కోర్సు చదవవచ్చు. అదే ఇంటర్ ఎంఈసీ విద్యార్థులైతే ఇంటర్‌తోపాటే సీఎంఏ ఫౌండేషన్ కోర్సును సమాంతరంగా పూర్తిచేయవచ్చు. సీఎంఏ ఫౌండేషన్ కోర్సులో మొత్తం 8 సబ్జెక్టులను 4 పేపర్లుగా విభజించారు. అంటే 2 సబ్జెక్టులు కలిపి ఒక పేపర్. సీఎంఏ ఫౌండేషన్‌లో 4 పేపర్లు విడివిడిగా రోజుకో పేపర్‌కు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌లో 100 మార్కులకు ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తారు. (టేబుల్ 1 చూడండి)
-సీఎంఏ ఫౌండేషన్ పరీక్షను 4 పేపర్లు కలిపి మొత్తం 400 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణత సాధించాలంటే విద్యార్థి 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు రావాలి. అలాగే ప్రతి పేపర్‌లోనూ 40 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలి. సీఎంఏ ఫౌండేషన్ పరీక్షను ప్రతి ఏటా జూన్, డిసెంబర్ నెలల్లో నిర్వహిస్తారు.
-ఫౌండేషన్ కోర్సులో ఉత్తీర్ణులైన విద్యార్థులు సీఎంఏ ఇంటర్మీడియట్ చదవడానికి అర్హత సాధిస్తారు.
-సీఎంఏ-ఇంటర్ కోర్సు (సీఎంఏ-ఎగ్జిక్యూటివ్ కోర్సు): సీఎంఏ ఫౌండేషన్ కోర్సును పూర్తిచేసిన విద్యార్థులు సీఎంఏ ఇంటర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఏడాది తర్వాత సీఎంఏ పరీక్ష రాయడానికి అర్హులు.
-ప్రతి ఏడాది జూన్, డిసెంబర్ మాసాల్లో సీఎంఏ ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారు. సీఎంఏ ఇంటర్మీడియట్ కోర్సు రెండు గ్రూపులుగా ఉంటుంది.
-సీఎంఏ ఇంటర్‌లోని మొదటి గ్రూప్‌లో 4 పేపర్లు ఉంటాయి. ఈ నాలుగు పేపర్లలో పరీక్ష 400 మార్కులకు జరిగితే ఒక్కొక్క సబ్జెక్టులో కనీసం 40 మార్కులు సాధించి మొత్తంగా 50 శాతం మార్కులు అంటే 200, ఆపైన మార్కులు సాధించాలి. (టేబుల్ 2 చూడండి)

cma-foundation2
-సీఎంఏ ఇంటర్ గ్రూప్-2లో కూడా 4 పేపర్లు ఉంటాయి. కనీసం 40 మార్కులు ప్రతి సబ్జెక్టులో సాధించాలి. అలాగే గ్రూప్ మొత్తం మీద 50 శాతం మార్కులు అంటే 200, ఆపైన మార్కులు సాధించాలి. వీలునుబట్టి రెండు గ్రూపులు ఒకేసారి లేదా విడివిడిగా 6 నెలల వ్యత్యాసంతో రాయవచ్చు. సీఎంఏ ఇంటర్మీడియట్‌లో నమోదుచేసుకున్నవారు ఒక ఏడాది తర్వాత సీఎంఏ ఇంటర్ పరీక్ష రాయవచ్చు. (టేబుల్ 3 చూడండి)
-ప్రాక్టికల్: సీఎంఏ ఫైనల్ పరీక్ష రాయాలంటే ఆరు నెలల ప్రాక్టికల్ తప్పనిసరి. సీఎంఏ ఎగ్జిక్యూటివ్ (సీఎంఏ ఇంటర్) ప్రోగ్రామ్‌లో ఉత్తీర్ణత సాధించినవారు.. గుర్తింపు పొందిన సంస్థల్లో నిర్దేశించిన విభాగాల్లో లేదా ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్ దగ్గర 6 నెలలపాటు ప్రాక్టికల్ ట్రెయినింగ్ తీసుకోవాలి.
-సీఎంఏ ఫైనల్: 6 నెలల ప్రాక్టికల్ ట్రెయినింగ్ పూర్తయిన విద్యార్థి ఫైనల్ పరీక్ష రాయవచ్చు.
-సీఎంఏ ఫైనల్‌లో కూడా రెండు గ్రూపులు (గ్రూప్-3, గ్రూప్-4) ఉంటాయి. (టేబుల్ 4 చూడండి)
cma-foundation3

cma-foundation4

787
Tags

More News

VIRAL NEWS

Featured Articles