ఇస్రోలో పర్సనల్ అసిస్టెంట్లు


Sun,April 15, 2018 12:17 AM

- బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులకు అవకాశం
- ఇండియన్ స్పేస్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం
- రాతపరీక్ష+స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక
- ఉద్యోగ భద్రత, మంచి జీతభత్యాలు
- చివరితేదీ: ఏప్రిల్ 30
ISRO-SATELLITE
డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ పరిధిలో పనిచేస్తున్న ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) వివిధ జోన్లవారీగా ఖాళీగా ఉన్న జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఐసీఆర్‌బీ) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:

బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఏర్పాటుచేసిన ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)ను విక్రమ్ సారాభాయ్ 1969 ఆగస్టు 15న స్థాపించారు. అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం నెలకొల్పిన సంస్థ ఇస్రో.
- మొత్తం పోస్టుల సంఖ్య: 171
- పోస్టు పేరు: జూనియర్ పర్సనల్ అసిస్టెంట్
- మొత్తం ఖాళీల సంఖ్య- 166 (జనరల్- 100, ఓబీసీ- 35, ఎస్సీ- 21, ఎస్టీ- 10) ఇస్రో సెంటర్/ యూనిట్ల వారీగా ఖాళీలు..
- హైదరాబాద్- 16 పోస్టులు (జనరల్-10, ఓబీసీ-3, ఎస్సీ-2, ఎస్టీ-1)
- అహ్మదాబాద్- 19 పోస్టులు (జనరల్-12, ఓబీసీ-2, ఎస్సీ-1, ఎస్టీ-4)
- బెంగళూరు - 61 పోస్టులు (జనరల్-34, ఓబీసీ-14, ఎస్సీ-10, ఎస్టీ-3)
- శ్రీహరికోట - 25 పోస్టులు (జనరల్-15, ఓబీసీ-5, ఎస్సీ-3, ఎస్టీ-2)
- తిరువనంతపురం - 44 పోస్టులు (జనరల్-28, ఓబీసీ-11, ఎస్సీ-5)
- న్యూఢిల్లీ - 1 ఖాళీ ఉన్నాయి.

- స్టెనోగ్రాఫర్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ బెంగళూరు)
- మొత్తం ఖాళీల సంఖ్య- 5 (జనరల్- 4, ఓబీసీ- 1)
- అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ప్రథమశ్రేణిలో ఆర్ట్స్/కామర్స్ లేదా మేనేజ్‌మెంట్ /సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణత లేదా ఫస్ట్‌క్లాస్‌లో డిప్లొమా ఇన్ కమర్షియల్/సెక్రటేరియల్ ప్రాక్టీస్ ఉత్తీర్ణత, ఏడాది స్టెనో- టైపిస్ట్/స్టెనోగ్రాఫర్‌గా అనుభవం, ఇంగ్లిష్ స్టెనోగ్రఫీలో నిమిషానికి 80 పదాల వేగంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
- వయస్సు: 2018, ఏప్రిల్ 30 నాటికి 18 నుంచి 26 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 31 ఏండ్లు, ఓబీసీలకు 29 ఏండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
- ఎంపిక: దరఖాస్తు చేసుకున్నవారి అకడమిక్ ప్రతిభ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరందరికి రాతపరీక్ష నిర్వహిస్తారు. దీనిలో ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విభాగాల్లో కనీసం 50 శాతం మార్కులు సాధించినవారిని స్కిల్‌టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. ఇంగ్లిష్ స్టెనోగ్రఫీలో స్కిల్‌టెస్ట్ నిర్వహిస్తారు.
- నోట్: షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు జూలై చివరివారం లేదా ఆగస్టు మొదటివారంలో సమాచారాన్ని ఈ-మెయిల్ ద్వారా పంపిస్తారు.
- అప్లికేషన్ ఫీజు: రూ. 100/- ఎస్సీ, ఎస్టీ, మహిళ, ఎక్స్‌సర్వీస్‌మెన్, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు.
- పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, భోపాల్, చండీగఢ్, డెహ్రాడూన్, గువాహటి, కోల్‌కతా, లక్నో, ముంబై, న్యూఢిల్లీ, తిరువనంతపురం సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తారు.
- పేస్కేల్: లెవల్ 4 పే మ్యాట్రిక్స్ ప్రకారం జీతభత్యాలు చెల్లిస్తారు. జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టుకు రూ. 25,500/- వీటికి అదనంగా హెచ్‌ఆర్‌ఏ, టీఏ తదితర అలవెన్సులు చెల్లిస్తారు.

693
Tags

More News

VIRAL NEWS

Featured Articles