డీఎల్‌ఆర్‌ఎల్‌లో జేఆర్‌ఎఫ్


Sun,April 15, 2018 12:15 AM

హైదరాబాద్‌లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రిసెర్చ్ ల్యాబొరేటరీ (డీఎల్‌ఆర్‌ఎల్) ఖాళీగా ఉన్న జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
DRDO_Scientist

వివరాలు:

డీఎల్‌ఆర్‌ఎల్ డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) పరిధిలో పనిచేస్తుంది.
-జేఆర్‌ఎఫ్-9 ఖాళీలు (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్-5, కంప్యూటర్ సైన్స్-2, మెకానికల్-2)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. గేట్‌లో అర్హత సాధించాలి.
-వయస్సు: గరిష్టంగా 28 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 25,000+ హెచ్‌ఆర్‌ఏ తదితర అలవెన్సులు ఉంటాయి.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత అర్హత, ఎక్స్‌పీరియన్స్ తదితర సర్టిఫికెట్లను జతచేసి పర్సనల్ అధికారికి పంపాలి.
-చిరునామా: డైరెక్టర్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రిసెర్చ్ ల్యాబొరేటరీ (డీఎల్‌ఆర్‌ఎల్), చాంద్రాయణ గుట్ట లైన్స్, హైదరాబాద్-500005
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (ఏప్రిల్ 14-20)లో వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి.
-వెబ్‌సైట్: www.drdo.gov.in

501
Tags

More News

VIRAL NEWS

Featured Articles