ఈఐఎల్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీలు


Sun,April 15, 2018 12:13 AM

-ఇంజినీరింగ్ అభ్యర్థులకు అవకాశం
-గేట్ స్కోర్ ఆధారంగా ఎంపిక
-మంచి జీతభత్యాలు, ఉద్యోగభద్రత
EIL-LIMITED
న్యూఢిల్లీలోని ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:

నవరత్న హోదా ఉన్న ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌ను 1965 మార్చి 15న న్యూఢిల్లీలో ఏర్పాటుచేశారు.
-పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ
-మొత్తం ఖాళీల సంఖ్య- 67 ( సివిల్-17, మెకానికల్-35, కెమికల్-15)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్, కెమికల్, సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్/ తత్సమాన పరీక్షలో 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత. 2017, 2018 విద్యాసంవత్సరాల్లో కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. సంబంధిత బ్రాంచిలో గేట్-2018లో అర్హత సాధించాలి.
-వయస్సు: 2018 జూలై 1 నాటికి 25 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది
-పే స్కేల్: శిక్షణాకాలంలో రూ. 35,000/- అదనంగా అకామిడేషన్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్‌కు రూ. 5000/- స్టయిఫండ్ చెల్లిస్తారు. ట్రెయినింగ్ పూర్తయిన తర్వాత నెలకు జీతం రూ. 60,000-1,80,000/-, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, మెడికల్ తదితర సౌకర్యాలు కల్పిస్తారు.
-ఎంపిక: గేట్-2018 స్కోర్+ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 2
-వెబ్‌సైట్: www.engineersindia.com

542
Tags

More News

VIRAL NEWS

Featured Articles