ఎంఆర్‌పీఎల్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు


Wed,March 14, 2018 12:08 AM

mrpl-factory
ఓఎన్‌జీసీ ఆధ్వర్యంలోని మంగళూరు రిఫైనరీ & పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:


మంగళూరు రిఫైనరీ & పెట్రోకెమికల్స్ లిమిటెడ్ చమురు శుద్ధి కర్మాగార కంపెనీ. మినీరత్న హోదాను కలిగిన ఎంఆర్‌పీఎల్‌ను ఓఎన్‌జీసీ అనుబంధంగా 1988లో మంగళూరులో ఏర్పాటుచేశారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 22
-విభాగాలవారీగా ఖాళీలు:
-ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే పోస్టులు (ప్రకటన నంబర్-73/2017)
-ల్యాబొరేటరీ సూపర్‌వైజర్-7, ఎగ్జిక్యూటివ్-10 (ఫైర్-1, ఫైనాన్స్-8, ఇంటర్నల్ ఆడిట్-1)
-అర్హత: ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) లేదా తత్సమాన సైన్స్‌లో పీజీ, ఫైర్ అండ్ సేఫ్టీలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్, ఏదైనా డిగ్రీతోపాటు సీఏ/ఐసీడబ్ల్యూఏ లేదా ఎంబీఏ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ. 60,000-1,80,000/-
-ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసే పోస్టులు (ప్రకటన నంబర్-74/2018)
-సీనియర్ మేనేజర్ (మెడికల్ సర్వీసెస్)-1 , అసిస్టెంట్ మేనేజర్ (సేఫ్టీ)-2, అసిస్టెంట్ మేనేజర్ (మెడికల్ సర్వీసెస్)-2
-అర్హత: బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ ఎంబీబీఎస్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ. 70,000-2,00,000/-
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
-అప్లికేషన్ ఫీజు: రూ. 750/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
-దరఖాస్తు: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 24
-వెబ్‌సైట్ : https://mrpl.co.in

730
Tags

More News

VIRAL NEWS

Featured Articles