ఎంఎస్‌ఐటీ ప్రోగ్రామ్-2018


Tue,March 13, 2018 12:15 AM

హైదరాబాద్‌లోని ట్రిపుల్ ఐటీ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ -ఎంఎస్‌ఐటీ ప్రోగ్రామ్ లో ప్రవేశాలకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
JEE-Mains

వివరాలు:

ఈ ప్రోగ్రామ్‌ను ఐఐఐటీహెచ్, జేఎన్టీయూ- హైదరాబాద్, కాకినాడ, అనంతపురం, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ లెర్నింగ్ సెంటర్‌లతో ఏర్పడిన కన్సార్టియం ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
-కోర్స్ పేరు: మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఎస్‌ఐటీ) ప్రోగ్రామ్
-విభాగాలు: మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ నెట్‌వర్క్స్, ఈ-బిజినెస్ టెక్నాజీస్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, సాప్ట్‌వేర్ ఇంజినీరింగ్, డాటా అనలిటిక్స్ అండ్ డాటా విజువలైజేషన్ అండ్ మొబైల్ టెక్నాలజీస్.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ (బీఈ/బీటెక్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.

ఎంఎస్‌ఐటీ సీట్ల వివరాలు

-మొత్తం సీట్ల సంఖ్య: 360
-ట్రిపుల్ ఐటీ హైదరాబాద్-110
-జేఎన్టీయూ హైదరాబాద్-100
-జేఎన్టీయూ కాకినాడ-50
-జేఎన్టీయూ అనంతపురం-50
-శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ-50

-ఫీజు: ఐఐఐటీహెచ్‌లో రూ. 2,00,000, జేఎన్టీయూహెచ్‌లో రూ. 1,70,000, జేఎన్టీయూకే,జేఎన్టీయూఏ, ఎస్‌వీయూలో రూ. 1,60,000/- వీటితోపాటు అడ్మిషన్ ఫీజు: రూ. 30,000, ప్రిపరేటరీ ఫీజు: రూ. 10,000/-
-గమనిక: ఐఐఐటీహెచ్, జేఎన్టీయూహెచ్ ఎంట్రెన్స్ టెస్ట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఎంఎస్‌ఐటీ మెయిన్ ప్రోగ్రామ్‌లో నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. జేఎన్టీయూకే, జేఎన్టీయూఏ, ఎస్‌వీయూల్లో 4 వారాల ప్రిపరేటరీ ప్రోగ్రామ్ తర్వాత ఎంఎస్‌ఐటీ మెయిన్ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్ కల్పిస్తారు

-అప్లికేషన్ ఫీజు: రూ. 1000/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 14
-రెగ్యులర్ జీఏటీ ఎంట్రెన్స్ టెస్ట్: మే 27
-వాక్‌ఇన్ ఆన్‌లైన్ పరీక్ష: మార్చి 15 నుంచి మే 19 వరకు (ప్రతి గురు, శుక్ర, శని, ఆదివారాల్లో నిర్వహిస్తారు)
-రెగ్యులర్ జీఏటీ ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలు విడుదల: జూన్ 3
-వెబ్‌సైట్: www.msitprogram.net

-ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష ద్వారా/గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీఏటీ)
-గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను రెండు విధాలుగా నిర్వహిస్తారు. మొదటిది అభ్యర్థులు వారి అనుకూలమైన తేదీల్లో ఆన్‌లైన్‌ల్లో www. msitprog ram.net లో స్లాట్ బుకింగ్ చేసికోవాలి. వాక్‌ఇన్ ఆన్‌లైన్ పరీక్షను హైదరాబాద్, కాకినాడలో నిర్వహిస్తారు. రెండోది రెగ్యులర్ జీఏటీ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్ణయించిన తేదీన హైదరాబాద్, వరంగల్, విజయవాడ, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం, అనంతపురంలో పరీక్ష ఉంటుంది.
-గమనిక: జీఆర్‌ఈ టెస్ట్‌ను 2015 జూలై తర్వాత జీఆర్‌ఈ స్కోర్ (301/3.5) ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎంట్రెన్స్ పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. వీరు డైరెక్టుగా ఎంఎస్‌ఐటీ మెయిన్ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందవచ్చు.
-అర్హత కలిగిన అభ్యర్థులు వాక్‌ఇన్ ఎంట్రెన్స్ టెస్ట్ లేదా రెగ్యులర్ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్ పొందవచ్చు. వీలైతే రెండు పరీక్షలకు హాజరుకావచ్చు.
-రెండు పరీక్షల్లో బెస్ట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు

1022
Tags

More News

VIRAL NEWS

Featured Articles