ప్రజాస్వామ్మ ఒరవడి


Mon,March 12, 2018 01:27 AM

భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలకు పునాది పడింది బెంగాల్ విభజన సమయంలోనే ఆ తర్వాత క్రమంగా ప్రజా ఉద్యమాలన్నీ కలిసి స్వాతంత్రోద్యమంగా మార్పుచెందాయి. ఆ ఉద్యమాలకు మూలంగా నిలిచిన నాటి గవర్నర్ జనరళ్ల కొన్ని ముఖ్య నిర్ణయాలు నిపుణ పాఠకుల కోసం...
QuitIndia_Movement

లార్డ్ రెండో మింటో (1905-10)

-ఇతని కాలంలో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమం జరిగింది.
-ఢాకాలో ముస్లిం లీగ్ (1906)ను స్థాపించారు.
-ఇతను 1909లో మింటోమార్లే సంస్కరణలుగా పేరుగాంచిన భారత శాసనసభల చట్టాన్ని జారీ చేశారు.
-ఖుదీరామ్ బోస్‌ను ఉరితీశారు.

లార్డ్ రెండో హార్డింజ్ (1910-16)

-ఇతని కాలంలో ఐదో జార్జి రాజు భారతదేశాన్ని సందర్శించాడు. ఇతని గౌరవార్థం 1911లో ఢిల్లీలో పట్టాభిషేక దర్బార్‌ను ఏర్పాటు చేశారు.
-ఇతను బెంగాల్ విభజనను రద్దు చేశాడు.
-రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చాలని 1911లో ప్రకటించి, 1912లో మార్చారు.
-రవీంద్రనాథ్ ఠాగూర్‌కు సాహిత్యంలో నోబెల్ (1913) బహుమతి వచ్చింది.
-మొదటి ప్రపంచ యుద్ధం (1914) ప్రారంభమైంది.
-1915లో హిందూ మహాసభ ఏర్పడింది.

లార్డ్ ఛేమ్స్‌ఫర్డ్ (1916-21)

-ఇతని కాలంలో తిలక్, అనిబీసెంట్‌లు హోంరూల్ లీగ్‌ను (1916) స్థాపించారు.
-కాంగ్రెస్‌లోని అతివాదులు, మితవాదులు 1916లో లక్నో సమావేశంలో ఒకటయ్యారు (1907 సూరత్ సమావేశంలో విడిపోయారు).
-1919లో భారతీయులు నల్లచట్టంగా అభివర్ణించిన రౌలత్ చట్టాన్ని జారీ చేశాడు.
-1917లో చంపారన్ సత్యాగ్రహం, 1919లో ఖిలాఫత్ ఉద్యమం, 1919, ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ మారణకాండలు జరిగాయి.
-ప్రసిద్ధి చెందిన సహాయ నిరాకరణోద్యమం 1920లో ప్రారంభమైంది.
-మాంటేగ్-ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణలుగా ప్రసిద్ధిగాంచిన 1919 భారత శాసనసభల చట్టం చేశారు.
-వేల్స్ యువరాజు ఎడ్వర్డ్ భారతదేశాన్ని సందర్శించాడు.
-ఇతను పూనాలో మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. 1917లో విద్యాభివృద్ధి కోసం సాడ్లర్ కమిషన్‌ను ఏర్పాటు చేశాడు.

లార్డ్ రీడింగ్ (1921-26)

-ఇతని కాలంలో చౌరీచౌరాలో అల్లర్లు జరగడంతో సహాయ నిరాకరణ ఉద్యమం నిలిచిపోయింది.
-1920-21లో కేరళలో మోప్లా తిరుగుబాటు వచ్చింది.
-1921లో భారత కమ్యూనిస్టు ఆఫ్ ఇండియా కాన్పూర్‌లో స్థాపించారు.
-ఇతని కాలంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) నాగ్‌పూర్‌లో ఏర్పాటైంది.
-1925లో కాకోరి దోపిడీ కేసు జరిగింది.
-1923 నుంచి భారతదేశం, ఇంగ్లండ్‌లోను ఒకేసారి ఐసీఎస్ పరీక్షలు నిర్వహించే విధానం ఏర్పాటు చేశారు.
-వైస్రాయ్‌లలో ఈయన ఒక్కడే యూదు జాతికి చెందినవాడు.

లార్డ్ ఇర్విన్ (1926-31)

-ఇతని కాలంలో సైమన్ కమిషన్ భారతదేశాన్ని 1927లో సందర్శించింది.
-1927లో స్వదేశీ సంస్థానాధీశులకు, బ్రిటిష్ వారికి మధ్య సంబంధాలను పెంపొందించడానికి బట్లర్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
-1928లో ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఏర్పాటైంది.
-1928లో మోతీలాల్ నెహ్రూ రాజ్యాంగ నివేదికను తయారు చేశాడు.
-1929లో లాహోర్‌లో నెహ్రూ అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ ప్రతిపాదనను అంగీకరించారు.
-ప్రసిద్ధిగాంచిన శాసనోల్లంఘన ఉద్యమం 1930లో ప్రారంభమైంది.
-మొదటి రౌండ్ టేబుల్ సమావేశం 1930లో జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ నుంచి ఎవరూ హాజరు కాలేదు.
-గాంధీ-ఇర్విన్ ఒడంబడిక (1931) జరిగింది.
-ఇతడిని క్రైస్తవ వైస్రాయ్ అని అంటారు.

లార్డ్ వెల్లింగ్‌టన్ (1931-36)

-ఇతని కాలంలో రెండో, మూడో రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి.
-రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి మాత్రమే గాంధీ హాజరయ్యారు.
-మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైంది- డాక్టర్ బీఆర్ అంబేద్కర్
-ఇతని కాలంలోనే బ్రిటిష్ ప్రధాని రామ్‌సే మెక్ డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించారు. దీని ప్రకారం షెడ్యూల్డ్ తెగలు, తరగతులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పడ్డాయి.
-ప్రత్యేక నియోజకవర్గాలను వ్యతిరేకించిన గాంధీ, అంబేద్కర్‌కు మధ్య పూనాలోని ఎరవాడ జైలులో పూనా ఒప్పందం జరిగింది.
-ఈ ఒప్పందం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నియోజకవర్గాలు కాకుండా రిజర్వు నియోజకవర్గాలు ఉంచాలనే అంశాన్ని నిర్ణయించుకున్నారు.
-కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ, ఆల్ ఇండియా కిసాన్ సభ ఏర్పడింది.
-డెహ్రాడూన్‌లో భారత సైనిక అకాడమీని స్థాపించారు.
-1935 భారత ప్రభుత్వ చట్టం రూపొందింది.

లార్డ్ లిన్ లిత్‌గో (1936-42)

-ఇతని కాలంలో 1935 చట్టం ప్రకారం ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ ఐదు రాష్ర్టాల్లో పూర్తి మెజారిటీ సాధించింది.
-కానీ, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జాతీయ కాంగ్రెస్ నాయకులను సంప్రదించకుండానే భారతదేశానికి జర్మనీ శత్రువుగా బ్రిటన్ ప్రకటించడంతో రాష్ర్టాల్లోని మంత్రివర్గాలు రాజీనామా చేశాయి.
-దీన్ని ముస్లిం లీగ్ విమోచన దినంగా పాటించింది.
-ఇతని కాలంలోనే ఆరో జార్జి ఇంగ్లండ్‌కు చక్రవర్తి అయ్యాడు.
-1939లో సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్‌ను ఏర్పాటు చేశాడు.
-క్రిప్స్ రాయబారం (1942) జరిగింది. దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమం (1942) ప్రారంభమైంది.

లార్డ్ వేవెల్ (19430-47)

-ఇతని కాలంలో 1944లో సీఆర్ ఫార్ములా (చక్రవర్తుల రాజగోపాలచారి ఫార్ములా) వచ్చింది.
-1945లో వేవెల్ ప్రణాళిక, సిమ్లా సమావేశం జరిగింది.
-1946లో క్యాబినెట్ మిషన్ (మంత్రివర్గ త్రయం) భారత్‌ను సందర్శించింది.
-ముస్లింలీగ్ ప్రత్యక్ష చర్యాదినాన్ని పాటించింది (1946, ఆగస్టు 16).
-ఇతని కాలంలోనే రాజ్యాంగ పరిషత్ ప్రథమ సమావేశం జరిగింది.
-ఆజాద్ హింద్ ఫౌజ్, జపాన్ దళాలు భాతరదేశ భూభాగం నుంచి ఉపసంహరించబడ్డాయి.
-ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్‌ఏ) సైనికులపై విచారణ జరిగింది.

లార్డ్ మౌంట్‌బాటన్ (1947-48)

-బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్, స్వతంత్ర భారత తొలి గవర్నర్ జనరల్.
-దేశ విభజన పథకాన్ని (1947) ప్రవేశపెట్టాడు. ఫలితంగా దేశం ఇండియా, పాకిస్థాన్‌లుగా విడిపోయింది.
-1947, ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్య్రం పొందింది.

చక్రవర్తుల రాజగోపాలచారి (1948-50)

-స్వతంత్ర భారతదేశ చివరి గవర్నర్ జనరల్. గవర్నర్ జనరల్ పదవి చేపట్టిన మొదటి భారతీయుడు.
-1948, జూన్ 21 నుంచి 1950, జనవరి 25 వరకు గవర్నర్ జనరల్‌గా ఉన్నాడు.
sasala

బ్రిటిష్ ఈస్టిండియా కాలంలో పత్రికారంగం

-బెంగాల్ గెజిట్ (1780): దీని ప్రచురణకర్త జేమ్స్ అగస్టన్ హిక్కీ. ఇంగ్లిష్ భాషలో వెలువడిన ఈ పత్రిక భారతదేశంలో ప్రచురించిన మొదటి రాజకీయ వాణిజ్య పత్రిక.
-ఇండియా గెజిట్ (1780): దీని ప్రచురణకర్తలు పీటర్ రీడ్, బెర్నార్డ్ మెసింక్. వెలువడిన భాష- ఇంగ్లిష్. వీరు తమ ప్రతిక ద్వారా వ్యాపారాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించారు.
-కలకత్తా గెజిట్ (1784): ప్రచురణకర్త- ఈస్టిండియా కంపెనీ. బెంగాలీ, పర్షియన్, ఇంగ్లిష్ తదితర భాషల్లో నోటీసుల ముద్రణ.
-మద్రాస్ కొరియర్ (1785): ప్రచురణకర్తలు- రిచర్డ్ జాన్సన్, హ్యూగ్ బాయ్డ్. వెలువడిన భాష- ఇంగ్లిష్. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ప్రకటనల కోసం ప్రచురించిన పత్రిక.
-బాంబే కొరియర్ (1790): ప్రచురించింది- లుక్ ఆష్ బర్నర్. వెలువడిన భాష- ఇంగ్లిష్. 1838లో బాంబే కొరియర్ రాబర్ట్ నైట్ సంపాదకత్వంలో బాంబే టైమ్స్‌గా మారింది.
-బాంబే హర్కార్ (1795): ప్రచురించింది- విలియం హంటర్. వెలువడిన భాష- ఇంగ్లిష్. ఈ పత్రిక ద్వారకానాథ్ ఠాగూర్ నేతృత్వంలో బ్రహ్మ సమాజానికి మద్దతుగా పనిచేసింది.
-మద్రాస్ గెజిట్ (1795): ప్రచురణకర్త- విలియం. వెలువడిన భాష- ఇంగ్లిష్. ప్రభుత్వం తరఫున మద్రాస్, బాంబేల నుంచి వెలువడిన పత్రిక.
-కలకత్తా మార్నింగ్ పోస్ట్ (1798): ప్రచురణకర్త- ఆర్బి బాల్డ్. వెలువడిన భాష- ఇంగ్లిష్. 1799లో జారీచేసిన పత్రికా నిబంధనలను పాటించిన మొదటి పత్రిక.
-సోమ్‌ప్రకాష్ (1858): ప్రచురణకర్త- ద్వారకానాథ్ విద్యాభూషణ్. వెలువడిన భాష- బెంగాలీ. కలకత్తా నుంచి ప్రచురించిన రాజకీయ పత్రిక.
-పయనీర్ (1865): ప్రచురణకర్త- ఎస్‌ఎస్ ఘోష్. వెలువడిన భాష- ఇంగ్లిష్. సమాకాలీన సంఘటనలపై వార్తలు, వ్యాసాలు ప్రచురించే దినపత్రిక.
-ది ఇండియన్ రివ్యూ (1900): ప్రచురణకర్త ఏ నటేశన్. వెలువడిన భాష- ఇంగ్లిష్. ప్రఖ్యాత భారతీయుల రాజకీయ చరిత్రలపై వ్యాసాలు ప్రచురించే మాసపత్రిక.

788
Tags

More News

VIRAL NEWS

Featured Articles