ఐడీబీఐలో 760 ఎగ్జిక్యూటివ్‌లు


Sun,February 11, 2018 11:52 PM

ఐడీబీఐ బ్యాంక్‌లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
idbi
-డిగ్రీ అభ్యర్థులకు అవకాశం
-ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా ఎంపిక
-మొదటి మూడేండ్లు కాంట్రాక్టు, తర్వాత అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగావకాశం

వివరాలు:

మొదట్లో అపెక్స్ డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ సంస్థగా ఉన్న ఐడీబీఐ 2004 నుంచి పూర్తిస్థాయి బ్యాంక్‌గా మారింది. ప్రస్తుతం దేశంలోని పెద్దబ్యాంక్‌ల్లో ఇది ఒకటి.
-పోస్టు: ఎగ్జిక్యూటివ్
-మొత్తం ఖాళీల సంఖ్య - 760. వీటిలో ఎస్సీ - 122, ఎస్టీ - 56, ఓబీసీ - 202, వీహెచ్ - 13, హెచ్‌హెచ్ - 56, ఓహెచ్ - 8 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు వస్తే సరిపోతుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
-వయస్సు: 2018, జనవరి 1 నాటికి 20 -25 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్టీ, ఎస్సీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
-మొదటి ఏడాది: నెలకు రూ. 17,000/-
-రెండో ఏడాది: నెలకు రూ. 18,500/-
-మూడో ఏడాది: నెలకు రూ. 20,000/-
-ఎగ్జిక్యూటివ్‌లకు ఎటువంటి అలవెన్స్‌లు, డీఏ, హెచ్‌ఆర్‌ఏలు ఇవ్వరు.
-ఈ పోస్టులను మొదట ఏడాది కాలానికి తర్వాత మరో రెండేండ్లు కాంట్రాక్టు పొడగిస్తారు. మూడేండ్ల కాంట్రాక్టు కాలాన్ని విజయవంతంగా పూర్తిచేసిన తర్వాత గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు అర్హులు. బ్యాంక్ నియమనిబంధనల ప్రకారం అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు అర్హులు. బ్యాంక్ ఎంపికప్రక్రియ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా
ఆన్‌లైన్ టెస్ట్:
-ఈ పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు - 150 మార్కులు. దీనిలో రీజనింగ్ -50 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ -50 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 50 ప్రశ్నలు ఇస్తారు.
-పరీక్ష కాలవ్యవధి 90 నిమిషాలు
-పరీక్ష ప్రశ్నపత్రం ఇంగ్లిష్/హిందీలో ఉంటాయి.
-నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కుల కోత విధిస్తారు.
-పరీక్షతేదీ: ఏప్రిల్ 28
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, అహ్మదాబాద్, అమృత్‌సర్, భోపాల్, బెంగళూరు, బెల్గాం, భువనేశ్వర్, కోయంబత్తూరు, చెన్నై, చండీగఢ్, గువాహటి, గ్వాలియర్, జైపూర్, కాన్పూర్, కోల్‌కతా, కొచ్చి, లక్నో, మధురై, మంగళూరు, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పుణె, పాట్నా, రాయ్‌పూర్, రాజ్‌కోట్, రాంచీ, తిరువనంతపురం, విజయవాడ, విశాఖపట్నం.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 28
-ఫీజు చెల్లించడానికి చివరితేదీ: ఫిబ్రవరి 28
-వెబ్‌సైట్: https://www.idbi.com

2472
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles