62,907గ్రూప్ -డి జాబ్స్ భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్


Sun,February 11, 2018 11:22 PM

తక్కువ విద్యార్హతలు ఉన్న నిరుద్యోగులకు కల్పతరువుగా కొనసాగుతున్న భారతీయ రైల్వే మరోసారి భారీగా ఉద్యోగా భర్తీకి పూనుకున్నది. పదోతరగతి, ఐటీఐ కనీస అర్హతలతో 62,907 గ్రూప్-డీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. దక్షిణమధ్యరైల్వే పరిధిలో 6523 పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలోని నిరుద్యోగులకు గొప్ప అవకాశంగా లభించిన ఈ నోటిఫికేషన్ వివరాలు మీకోసం...
group-d

మొత్తం పోస్టుల సంఖ్య: 62,907

-జనరల్-31,889, ఓబీసీ-16502, ఎస్సీ-9453, ఎస్టీ-5061అత్యధిక పోస్టులు ఉన్న ఆర్‌ఆర్‌బీలు
-చండీగఢ్ ఆర్‌ఆర్‌బీ -7832,
-సికింద్రాబాద్ ఆర్‌ఆర్‌బీ-6523,
-పాట్నా ఆర్‌ఆర్‌బీ-5981,
-అలహాబాద్ ఆర్‌ఆర్‌బీ-4762,
-ముంబై ఆర్‌ఆర్‌బీ-4625

భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా ఉన్న 16 రైల్వే బోర్డుల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-డి పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
-భర్తీచేసే ఆర్‌ఆర్‌బీ బోర్డులు: అహ్మదాబాద్, అజ్మీర్, అలహాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్‌పూర్, గువాహటి, కోల్‌కతా, ముంబై, పాట్నా, రాంచీ, సికింద్రాబాద్.
-అర్హత: పదోతరగతి లేదా ఏదైనా ఐటీఐ ట్రేడ్‌లో ఉత్తీర్ణత.
-వయస్సు: 2018 జూలై 1 నాటికి 18 నుంచి 31 ఏండ్ల మధ్య ఉండాలి.
-పే స్కేల్: రూ. 18,000/- (7వ వేతన కమిషన్, లెవల్ -1 పే స్కేల్, అనుసరించి ఇతర సౌకర్యాలు ఉంటాయి)
-అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 500, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళ, ట్రాన్స్‌జెండర్, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన అభ్యర్థులకు రూ. 250.
-ఎంపిక: రెండు దశల్లో జరుగుతుంది. మొదటిది రాతపరీక్ష, రెండోది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ), ఈ రెండు పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు చివరగా డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసి తుదిఫలితాలను ప్రకటిస్తారు.
-రాతపరీక్షను ఆన్‌లైన్‌లో (కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్- సీబీటీ) ద్వారా నిర్వహిస్తారు.
-పీఈటీ పరీక్షకు ప్రకటించిన మొత్తం ఖాళీలకు 1: 2 నిష్పత్తిలో అనుమతిస్తారు.
-జనరల్ అభ్యర్థులు 40 శాతం, ఓబీసీ/ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 30 శాతం కనీస అర్హత మార్కులను సాధించాల్సి ఉంటుంది. పీహెచ్‌సీ అభ్యర్థులకు 2 శాతం వరకు మినహాయింపు ఉంటుంది.
-రాతపరీక్ష ఇంగ్లిష్/ హిందీ లేదా తెలుగులో ఉంటుంది. అభ్యర్థులు నచ్చిన భాషలో పరీక్ష రాయవచ్చు.
-సికింద్రాబాద్‌తోపాటు భువనేశ్వర్ బెంగళూరు, చెన్నై ఆర్‌ఆర్‌బీల్లోనూ తెలుగులో పరీక్ష రాయవచ్చు.
-పీఈటీ పరీక్షలో పురుషులు 35 కేజీల బరువును రెండు నిమిషాల్లో 100 మీ. వరకు కింద పెట్టకుండా తీసుకెల్లాలి, 4 నిమిషాల 15 సెకండ్లలో 1000 మీ. దూరాన్ని పరుగెత్తాలి. మహిళలు 20 కేజీల బరువును రెండు నిమిషాల్లో 100 మీ. వరకు తీసుకెళ్లాలి, 5 నిమిషాల 40 సెకండ్లలో 1000 మీ. దూరాన్ని పరుగెత్తాలి.

రాత పరీక్ష విధానం

-ఈ సీబీటీ పరీక్షలో 100 ప్రశ్నలు ఇస్తారు. 90 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది.
-సిలబస్: మ్యాథమెటిక్స్‌లో నంబర్ సిస్టమ్, బాడ్‌మాస్, డెసిమల్స్, భిన్నాలు, కసాగు గసాభా, నిష్పత్తి అనుపాతం, శాతాలు, క్షేత్ర గణితం, పని కాలం, పని దూరం, చక్రవడ్డీ, బారువడ్డీ, లాభనష్టాలు, ఆల్‌జీబ్రా, జామెట్రీ, త్రికోణమితి, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, వర్గమూలాలు, వయస్సుపై, క్యాలెండర్స్, గడియారాలు, పైపులు-గొట్టాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
-జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌లో అనాలిసిస్, ఆల్ఫాబెటికల్ అండ్ నంబర్ సిరీస్, కోడింగ్ డికోడింగ్, మ్యాథమెటిక్ ఆపరేషన్స్, సంబంధాలు, సిలాజిసమ్, జంబ్లింగ్, వెన్ డయాగ్రమ్, డాటా ఇంటర్‌ప్రిటేషన్, డాటా సఫిషియన్సీ, కన్‌క్లూజన్ అండ్ డెసిషన్ మేకింగ్, సిమిలారీటీస్ అండ్ డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్‌మెంట్, ఆర్గ్యుమెంట్స్ అండ్ అసంప్షన్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
-జనరల్ సైన్స్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్ అంశాల నుంచి పదోతరగతి స్థాయిలో ప్రశ్నలను ఇస్తారు.
-జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటీ, ముఖ్యమైన ఏదైనా ఆంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
-ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులను తగ్గిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.
-నోట్: అర్హత కలిగిన అభ్యర్థులు కేవలం ఏదైనా ఒక ఆర్‌ఆర్‌బీ నుంచి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
-చివరితేదీ: మార్చి 3
-వెబ్‌సైట్: www.rrbsecunderabad.nic.in

దక్షిణ మధ్య రైల్వే (సికింద్రాబాద్)

-మొత్తం పోస్టులు- 6,523. జనరల్-3,254, ఓబీసీ-1,723, ఎస్సీ-1,016, ఎస్టీ-530.
-వివరాలు: హెల్పర్ ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లోని జనరల్ సర్వీసెస్-165, టీఆర్‌డీ-165, టీఆర్‌ఎస్-79, బ్రిడ్జ్-119, పీ అండ్ వే-188, ట్రాక్ మెయింటెనర్ గ్రేడ్ 4లో-3940, హెల్పర్ మెకానికల్ డిపార్ట్‌మెంట్‌లోని క్యారెజ్ అండ్ వ్యాగన్-451, డీజిల్ ఎలక్ట్రికల్-54, మెకానికల్ డీజిల్-172, హెల్పర్ (ఎస్ అండ్ టీ -237, సిగ్నల్-16), హాస్పిటల్ అటెండెంట్-53, అసిస్టెంట్ పాయింట్స్‌మెన్-884 ఖాళీలు ఉన్నాయి.
...?తన్నీరు వెంకటేశ్వర్లు

8194
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles