గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామ్ (జీఆర్‌ఈ)


Sun,February 11, 2018 11:20 PM

college-student
అమెరికాలో మాస్టర్స్ చేయడం కోసం (ఇంజినీరింగ్, డిగ్రీ తర్వాత) ఎక్కువ మంది విద్యార్థులు రాసేది గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామ్ (జీఆర్‌ఈ). అమెరికాలోని కొన్ని బిజినెస్ స్కూళ్లు కూడా ఈ పరీక్షలో వచ్చే స్కోర్ ఆధారంగా అడ్మిషన్ ఇస్తాయి. కొంత మంది వైద్య విద్యార్థులు కూడా ఈ పరీక్ష రాస్తుంటారు. యూనివర్సిటీలో అడ్మిషన్, ఫెలోషిప్, స్కాలర్‌షిప్‌ల కోసం జీఆర్‌ఈ స్కోర్ ఆధారమవుతుంది. అందరికీ కామన్ పరీక్ష కాబట్టి ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. యూనివర్సిటీకి దరఖాస్తు చేసిన విద్యార్థులందరూ రాస్తారు కాబట్టి పోల్చడం కూడా తేలిక. దీంతోపాటు విద్యార్థికి డిగ్రీ దశలో వచ్చిన మార్కులు, రికమండేషన్ ఆధారంగా అడ్మిషన్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 5 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాస్తుంటారు. భారత్ నుంచి 75 వేల నుంచి లక్ష మంది వరకు రాస్తుంటారు. ఏ పరీక్షకు సిద్ధమవుతున్నా సంబంధిత సబ్జెక్టుకు అవసరమైన జ్ఞానం, పరీక్షలో స్పష్టంగా రాయడం అనే అంశాలపై శ్రద్ధ వహించాలి. జీఆర్‌ఈ కూడా అంతే.
-పరీక్షలో అన్‌స్కోర్డ్ సెక్షన్ మొత్తం అనలిటికల్ రైటింగ్ అసెస్‌మెంట్ తర్వాత ఎప్పుడైనా రావొచ్చు. కానీ, రిసర్చ్ సెక్షన్ చివరగా వస్తుంది.

పరీక్షలో కింది సదుపాయాలు

-ఒక సెక్షన్ లోపల ప్రివ్యూ, రివ్యూ చేయొచ్చు.
-మార్క్, రివ్యూ కూడా ఒక సెక్షన్ లోపల ఉంటాయి. కష్టమైన ప్రశ్న స్కిప్ చేసి వాటిని మార్క్ చేసి, చివరలో సమయం ఉన్నప్పుడు మళ్లీ చూడవచ్చు.
-సెక్షన్‌కి కేటాయించిన సమయం లోపల సమాధానాలు మార్చవచ్చు.
-క్వాంటిటేటివ్ సెక్షన్‌కి ఆన్‌స్క్రీన్ క్యాలిక్యులేటర్ కూడా అందుబాటులో ఉంటుంది.
-అనలిటికల్ రైటింగ్ అసెస్‌మెంట్: దీనితోనే పరీక్ష ప్రారంభమవుతుంది. ఇందులో ఇష్యూ అండ్ ఆర్గ్యుమెంట్ టాస్క్ ఉంటాయి. ప్రతి టాస్క్‌కి 30 నిమిషాల సమయం ఉంటుంది. ఇక్కడ ఎలాంటి చాయిస్ లేదు. ఇచ్చిన టాస్క్‌కి సమాధానం రాయాలి. అనలిటికల్ రైటింగ్ అసెస్‌మెంట్ స్కోర్ 0-6 మధ్యలో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా జీఆర్‌ఈ రాసిన విద్యార్థుల సగటు స్కోర్ 3.5. విద్యార్థులు కనీసం 3.5 స్కోర్ టార్గెట్ చేయాలి.
అనలిటికల్ రైటింగ్ అసెస్‌మెంట్‌లో మార్కులు

ఎలా పెంచుకోవాలి?

-ప్రతి టాస్క్‌లో ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది. దాన్ని పూర్తిగా చదివి దానికి తగిన జవాబు రాయాలి. ఇష్యూటాస్క్‌లో మీ అభిప్రాయం వ్యక్తపర్చాలి. ఆర్గ్యుమెంట్ టాస్క్‌లో ఇచ్చిన ఆర్గ్యుమెంట్‌ని విశ్లేషించి సమాధానం రాయాలి.
-ప్రతి టాస్క్‌కి మీకున్న 30 నిమిషాలు కేటాయించుకోవాలి. ముందుగా సమాధానం ఎలా రాయాలి? అనేది నిర్ణయించుకుని ముఖ్యమైన పాయింట్లు ఒక కాగితంలో రాసుకోవాలి. ఆ తర్వాత దానినే మరింత వివరంగా రాసి తర్వాత మరోసారి పూర్తిగా చదువుకోవాలి.
-స్పెల్లింగ్, గ్రామర్ పొరపాట్లు లేకుండా చెక్ చేసుకోవాలి. చెప్పాల్సిన పాయింట్లకు సరైన ఉదాహరణలు ఇవ్వాలి.
-నోట్‌పాడ్‌తో కనీసం ఒక ఇష్యూ, ఐదు ఆర్గ్యుమెంట్ టాస్క్‌లు ప్రాక్టీస్ చేయాలి.
-వెర్బల్ రీజనింగ్: ఇందులో రెండు సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్‌లో 20 పశ్నలు ఉంటాయి. కేటాయించిన 30 నిమిషాల్లో సెక్షన్ పూర్తిచేయాలి. వెర్బల్ రీజనింగ్ స్కోర్ 130 నుంచి 170 ఉంటుంది. అంటే తక్కువలో తక్కువ 130, ఎక్కువలో ఎక్కువ 170 వస్తాయి. మన దేశంలో జీఆర్‌ఈ రాసిన విద్యార్థుల సగటు స్కోరు 143.9. ఇందులో అమెరికన్ విద్యార్థులు మనకంటే ఎక్కువగా మార్కులు సాధిస్తారు. ఇంజినీరింగ్ విద్యార్థులు కనీసం 148 స్కోరు చేయాలి. స్కోరింగ్ గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. ఎందుకంటే ఇది కంప్యూటర్ ఆధారిత పరీక్ష కాబట్టి, నార్మలైజ్ చేసి స్కోర్ ఇస్తారు. ఎన్ని ఎక్కువగా కరెక్ట్ చేస్తే అంత ఎక్కువ వస్తాయి.
jre

ప్రశ్నలు- రకాలు

-సెంటెన్స్ ఈక్వాలెన్స్: ఇందులో ఇచ్చిన వాక్యంలో ఒక ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీకి సరిపడే రెండు పదాలను, అక్కడ ఇచ్చిన 6 ఆప్షన్ల నుంచి సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన రెండు పదాలను సెంటెన్స్‌లో పెట్టిన తర్వాత, ఆ సెంటెన్స్ అర్థం ఒకే విధంగా ఉండాలి. మీరు సెలెక్ట్ చేసిన జవాబులో రెండు ఆప్షన్స్ సరైనవి అయితేనే మార్కులు వస్తాయి.
-టెక్ట్స్ కంప్లీషన్: ఇందులో ఒకటి నుంచి ఐదు సెంటెన్సులు, ఒకటి నుంచి మూడు ఖాళీలు ఉండవచ్చు. ఒక ఖాళీ ఉంటే ఐదు ఆప్షన్స్ ఇస్తారు. ఒక జవాబు సెలెక్ట్ చేయాలి. ఎక్కువ ఖాళీలు ఉంటే, ఖాళీకి మూడు ఆప్షన్స్ ఇస్తారు. అన్ని ఖాళీలకు సరైన జవాబు సెలెక్ట్ చేస్తేనే మార్కు ఇస్తారు.
-రీడింగ్ కాంప్రహెన్షన్: ఒక పేరా ఇచ్చి దానికి సంబంధించి ప్రశ్న అడుగుతారు. ఒక ప్రశ్న ఐదు ఆప్షన్స్, ఒక జవాబు లేదా ఒక ప్రశ్న మూడు ఆప్షన్స్ ఒకటి లేదా ఎక్కువ జవాబులు (అన్ని జవాబులు కరెక్ట్ అయితే మార్కులు ఇస్తారు) ఒక ప్రశ్న - ఆప్షన్స్ ఉండవు. ప్యాసేజ్‌లో ఆ ప్రశ్నకు ఉన్న జవాబు ఉన్న సెంటెన్స్‌పై క్లిక్ చేయాలి.
sirisha

847
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles