జాతీయ కోటాలోకి తెలుగు రాష్ర్టాలు


Sun,February 11, 2018 11:17 PM

medical
ఎట్టకేలకు తెలుగు రాష్ర్టాలు వైద్యకోటాలో నేషనల్ పూల్‌లో చేరాయి. దేశంలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో ఒకే పరీక్ష నీట్‌ను నిర్వహిస్తున్న విషయం విదితమే. దీంతో ఇప్పటివరకు ఆర్టికల్ 371 డీ కారణంగా నేషనల్ పూల్‌లో చేరలేదు. ఈ ఆర్టికల్ వల్ల తెలుగు రాష్ర్టాల వారికి ఇతర రాష్ర్టాల్లో సీట్లు ఇవ్వరు. ఇతరులకు ఈ రెండు రాష్ర్టాల్లో సీట్లు ఇవ్వరు. జాతీయస్థాయిలో నిర్వహించే పరీక్షలో విద్యార్థులకు నష్టం వాటిల్లుతుండటంతో రెండురాష్ర్టాలు జాతీయ కోటాలో చేరుతామని కేంద్రాన్ని కోరాయి. ఈసారి నుంచి రెండురాష్ర్టాలకు జాతీయ కోటాలో స్థానం లభించింది. దీంతో తెలుగు రాష్ర్టాలకు చెందిన విద్యార్థులకు 15 శాతం కోటా కింద అదనపు సీట్లు వస్తాయి. రెండు రాష్ర్టాల్లో 450 సీట్లు జాతీయ కోటాకు వదులుకున్నా సుమారు 1100 సీట్లు అదనపు కోటాలో తెలుగు విద్యార్థులకు లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయి.

463
Tags

More News

VIRAL NEWS

Namasthe Telangana Property Show

Featured Articles