ఆసియాలో అత్యుత్తమ వర్సిటీలు


Sun,February 11, 2018 11:11 PM

iit-kanpur
ఆసియాలోనే అత్యుత్తమ యూనివర్సిటీల జాబితాను టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్‌ఈ) విడుదల చేసింది. ఏషియన్ యూనివర్సిటీస్-2018 పేరుతో రూపొందించిన ఈ లిస్ట్‌లో భారత్‌కు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) 29వ ప్లేస్‌లో, ఐఐటీ బాంబే 44వ, ఐఐటీ ఖరగ్‌పూర్ 60వ, ఐఐటీ రూర్కీ 65వ, ఐఐటీ కాన్పూర్ 81వ, ఐఐటీ ఢిల్లీ 86వ, తేజ్‌పూర్ యూనివర్సిటీ 100వ ర్యాంక్‌తో టాప్-100లో నిలిచాయి. మొత్తం 25 దేశాల్లోని 350కిపైగా యూనివర్సిటీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో సింగపూర్‌కు చెందిన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, చైనాకు చెందిన సింగువా యూనివర్సిటీ, పెకింగ్ వర్సిటీలు తొలి మూడు స్థానాల్లో నిలువగా, హాంకాంగ్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ (4వ), హాంకాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (5వ), చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ (7)లు టాప్-10లో ఉన్నాయి. మన దేశానికి చెందిన 42 వర్సిటీలు ఇందులో స్థానం సంపాదించగా గతేడాది 46వ స్థానంలో ఉన్న మద్రాస్ ఐఐటీ 103వ స్థానానికి పడిపోయింది. కొత్తగా ర్యాంకులు పొందిన ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (141వ), బెనారస్ హిందూ యూనివర్సిటీ (194వ)లు టాప్ 200లో నిలిచాయి.

310
Tags

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018