ఫిజిక్స్ టిఆర్టీ ఫిజికల్ సైన్స్


Sun,February 11, 2018 11:08 PM

గతవారం తరువాయి
physical-science

45. ధ్వని తరంగాలు గాలిలో ప్రదర్శించని ధర్మం?

1) వివర్తనం 2) పరావర్తనం
3) వక్రీభవనం 4) దృవణం

46. కిందివాటిలో సరికానిది?

1) చంద్రునిపై గల ఇద్దరు వ్యక్తులు ఒకరి శబ్దాన్ని మరొకరు వినలేరు
2) గాలి పీడనంలో మార్పు, గాలిలో ధ్వని వేగంపై ఏ ప్రభావాన్ని చూపదు
3) గాలి ఉష్ణోగ్రతలో మార్పు, గాలిలో ధ్వని వేగంపై ఏ ప్రభావాన్ని చూపదు
4) నీటిలో ధ్వనివేగం గాలిలో ధ్వని వేగం కంటే ఎక్కువ

47. విస్పందనాలు ఏర్పడటానికి కారణం?

1) అసంబద్ధ తరంగాల అధ్యారోపణం
2) సంబద్ధ తరంగాల అధ్యారోపణం
3) తరంగాల పరావర్తనం
4) తరంగాల వక్రీభవనం

48. ఒక చివర మూసిన ఆర్గానె గొట్టం నీటితో నిండి ఉంది. గొట్టం పౌనఃపున్యం?

1) తగ్గుతుంది
2) పెరుగుతుంది 3) మారదు
4) మొదట పెరిగి తరువాత తగ్గుతుంది

49. ఒక సమతల దర్పణ తలంపై కేంద్రీకరణ కాంతి పుంజం పతనమైనప్పుడు ఏర్పడే ప్రతిబింబం?

1) తలకిందులుగా ఉండే నిజ ప్రతిబింబం
2) తలకిందులుగా ఉండే మిథ్యా ప్రతిబింబం 3) నిటారుగా ఉండే నిజ ప్రతిబింబం
4) నిటారుగా ఉండే మిథ్యా ప్రతిబింబం

50. ఒక తరంగం ఒక యానకం నుంచి మరొక యానకంలోకి ప్రయాణించినప్పుడు దాని...?

1) వేగం, పౌనఃపున్యం మారుతాయి
2) తరంగ దైర్ఘ్యం పౌనఃపున్యం మారుతాయి
3) వేగం, తరంగదైర్ఘ్యం మారుతాయి
4) పౌనఃపున్యం, తరంగదైర్ఘ్యం, వేగం మారుతాయి

51. ఒక వస్తువు పారదర్శక ద్రవంలో మునిగి ఉంది. ఆ వస్తువు ఆ ద్రవంలో కనబడకుండా ఉండాలంటే?

1) ఆ వస్తువు పరిపూర్ణ పరావర్తకంగా
పనిచేయాలి
2) ఆ వస్తువు తనపై పతనం చెందే మొత్తం
కాంతిని శోషించుకోవాలి
3) ఆ వస్తువు వక్రీభవన గుణకం విలువ ద్రవం
వక్రీభవన గుణకానికి సమానం కావాలి
4) వస్తువు వక్రీభవన గుణకం విలువ గాలి వక్రీ
భవన గుణకానికి (=1) సమానం కావాలి

52. ఒక యానకంలో ప్రయాణించే కాంతి వేగం?

1) ఆ యానకం జడత్వంపై మాత్రమే
ఆధారపడుతుంది
2) ఆ యానకం స్థితిస్థాపకతపై మాత్రమే
ఆధారపడుతుంది
3) ఆ యానకం జడత్వం, స్థితిస్థాపకతలపై
ఆధారపడుతుంది
4) ఆ యానకం జడత్వం, స్థితిస్థాపకతలపై
ఆధారపడదు

53. కాంతి ఒక యానకం నుంచి వేరొక యానకంలోకి వక్రీభవనం చెందినప్పుడు మారనిది దాని...?

1) వేగం 2) పౌనఃపున్యం
3) కంపన పరిమితి 4) తరంగదైర్ఘ్యం

54. బీకరులో గల నీటి అడుగు తలం నుంచి పైకి చలిస్తున్న గాలి బుడగ బీకరు దగ్గర నిలబడి ఉన్న పరిశీలకునికి వెండి వర్ణంలో కనిపిస్తే దీనిలో ఇమిడి ఉన్న దృగ్విషయం?

1) కాంతి సంపూర్ణాంతర పరావర్తనం
2) కాంతి వివర్తనం
3) కాంతి పరిక్షేపనం 4) కాంతి వక్రీభవనం

55. గాలిలో నుంచి గాజులోకి కాంతి ప్రవేశించినప్పుడు దాని తరంగదైర్ఘ్యం?

1) తగ్గుతుంది 2) పెరుగుతుంది
3) మారదు 4) అనంతం

56. సన్నని, తెల్లని కాంతి కిరణ పుంజం సమాంతర తలాలుగల గాజు దిమ్మె ద్వారా ప్రయాణిస్తుంది. అప్పుడు?

ఎ. బహిర్గామి కిరణ పుంజం తెల్లగా ఉంటుంది బి. కాంతి విభిన్న వర్ణాలుగా ఎప్పటికీ విడిపోదు
సి. గాజు దిమ్మెలోని కాంతి తెల్లని కాంతి
డి. గాజు దిమ్మెలోని కాంతి విభిన్న వర్ణాలుగా విడిపోతుంది
1) ఎ, డి 2) ఎ, బి
3) ఎ, బి, సి 4) సి

57. ఖగోళ ప్రయోగాల్లో ఉపయోగించేవి?

1) సూక్ష్మదర్శినిలు
2) దృశ్య దూర దర్శినులు
3) రేడియో దూరదర్శిని 4) 2, 3

58. ఖగోళ దూరదర్శినిలో వస్తుకటక నాభ్యాంతరం విలువ?

1) అక్షికటక నాభ్యాంతరం విలువలో సగం
2) అక్షికటక నాభ్యాంతరానికి సమానం
3) అక్షికటక నాభ్యాంతరం కంటే తక్కువ
4) అక్షికటక నాభ్యాంతరం కంటే ఎక్కువ

59. దూరదర్శినుల్లో హెచ్చు ద్వారం గల వస్తుకటకాలను ఉపయోగించడానికి కారణం?

1) కాంతివంతమైన ప్రతిబింబాన్ని పొందడం
2) హెచ్చు పృథక్కరణాన్ని పొందడం
3) తయారు చేయడంలో సులభతరం
4) చూడటానికి అందంగా ఉండటం

60. మనుషుల్లో ఏర్పడే హ్రస్వదృష్టికి కారణం?

1) ముసలితనం
2) అసమానమైన కంటి కటకం నాభ్యాంతరంలో మార్పు
3) కంటి గుడ్డు చిన్నది కావడం
4) కంటి గుడ్డు ఆకృతి పెరగడం

61. దూరదృష్టి కలిగిన కంటి విషయంలో?

1) దగ్గరగా ఉన్న వస్తువు ప్రతిబింబం రెటీనాకు వెనుక భాగంలో ఏర్పడుతుంది
2) దూరంగా ఉన్న వస్తువు ప్రతిబింబం రెటీనాకు వెనుక భాగంలో ఏర్పడుతుంది
3) దోషాన్ని పుటాకార కటకాన్ని ఉపయోగించి సరిచేయవచ్చు
4) దోషాన్ని నివారించడానికి ద్వినాభ్యాంతర కటకాలను ఉపయోగిస్తారు

62. కాంతి నిలకడ వ్యతికరణానికి, రెండు కాంతి జనకాలకు ఉండవలసిన ఆవశ్యకత నిబంధన?

1) అవి మారుతున్న దిశాభేదం కలిగి ఉండాలి
2) అవి సన్నగా ఉండాలి
3) అవి ఒకదానికొకటి సమీపంగా ఉండాలి
4) అవి సమాన దశను లేదా స్థిరదశ భేదం కలిగి ఉండాలి

63. కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి.

1) కాంతి తరంగాలు మాత్రమే వ్యతికరణం చెందుతాయి, ధ్వని తరంగాలు వ్యతికరణం చెందవు
2) అనుదైర్ఘ్య, తిర్యక్ తరంగాలు రెండు వ్యతికరణం చెందుతాయి
3) తిర్యక్ తరంగాలు మాత్రమే వ్యతికరణం చెందుతాయి. కానీ అనుదైర్ఘ్య తరంగాలు కాదు
4) అనుదైర్ఘ్య తరంగాలు మాత్రమే వ్యతికరణం చెందుతాయి, తిర్యక్ తరంగాలు కాదు

64. యంగ్ ద్విచీలిక ప్రయోగంలో తెల్లని కాంతిని ఉపయోగిస్తే కింది వాటిలో సరికాని ప్రవచనం?

1) కేంద్ర పట్టీ తెల్లగా ఉంటుంది
2) కేంద్ర పట్టీకి పక్కన ఉన్న పట్టీ ఎరుపుగా ఉంటుంది
3) కేంద్ర పట్టీకి పక్కన ఉన్న పట్టీ ఊదారంగులో ఉంటుంది
4) మొత్తం వ్యూహంలో పూర్తి చీకటి పట్టీ ఉండదు

65. వివర్తన వ్యూహంలో?

1) అన్ని పట్టీల వెడల్పు సమానం
2) అన్ని పట్టీల వెడల్పు సమానం కాదు
3) అన్ని పట్టీలను ఏర్పర్చలేం
4) అన్ని పట్టీల వెడల్పు సమానంగా ఉండవచ్చు లేదా లేకపోవచ్చు

66. కింది వాటిలో సరైన ప్రవచనం?

1) కాంతి తరంగాల వ్యతికరణం లేకుండా
వివర్తనం జరుగదు
2) కాంతి తరంగాల వివర్తనం లేకుండా
వ్యతికరణం జరుగదు
3) కాంతి తరంగాల ధృవణం ఫలితమే
వ్యతికరణం వివర్తనాలు
4) యంగ్ ద్విచీలిక ప్రయోగంలో పట్టీ వెడల్పు ఉపయోగించిన కాంతి తరంగ దైర్ఘ్ఘ్యాలపై ఆధారపడదు

67. రుణ బిందు ఆవేశం చుట్టూ ఉండే విద్యుత్ బలరేఖలు?

1) త్రిజ్యా బహిర్గతాలు
2) త్రిజ్యా అంతర్గతాలు
3) సవ్యదిశలో వృత్తాకారం
4) అపసవ్య దశలో వృత్తాకారం

68. ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ఒకే విలువగల బలాన్ని ఎదుర్కునే కణాల జంట?

1) ప్రోటాన్, డ్యుటిరాన్
2) డ్యుటిరాన్, ఆల్ఫాకణం
3) ఎలక్ట్రాన్, ప్రోటాన్
4) ప్రోటాన్, డ్యుటిరాన్, ఎలక్ట్రాన్, ఆల్ఫాకణం

69. కింది వాటిలో తప్పు ప్రవచనం ఏది?

1) ఆవేశాలు ద్రవ్యరాశి లేకుండా ఉండలేవు
2) వస్తువు ఆవేశం దాని వేగంపై ఆధారపడుతుంది
3) కూలుంబ్ బలం కేంద్రీయ బలం
4) ఆవేశం తనపై తాను బలాన్ని ప్రయోగించుకోదు

70. నిశ్చలంగా ఉండే విద్యుదావేశం?

1) అయస్కాంత క్షేత్రాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది
2) విద్యుత్‌క్షేత్రాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది
3) విద్యుత్, అయస్కాంత క్షేత్రాలు రెండింటిని ఉత్పత్తి చేస్తుంది
4) విద్యుత్, అయస్కాంత క్షేత్రాలు రెండింటినీ ఏర్పర్చదు

71. ఒక కూలుంబ్ ఆవేశం?

1) ఎలక్ట్రాన్ ఆవేశం కంటే ఎక్కువ
2) ఎలక్ట్రాన్ ఆవేశం కంటే తక్కువ
3) ఎలక్ట్రాన్ ఆవేశానికి సమానం
4) ఎలక్ట్రాన్ ఆవేశంతో సబంధం లేనిది

72. ఒక నియుక్త వాహక గోళానికి ధనావేశాన్ని ఇస్తే దాని ద్రవ్యరాశి?

1) పెరుగుతుంది 2) తగ్గుతుంది
3) మారదు 4) ద్రవ్యరాశి ప్రమేయం లేదు

73. రెండు సమాన ధనావేశాలను A, B బిందువుల వద్ద ఉంచారు. A నుంచి Bకి కదులుతున్నప్పుడు ఆ బిందువుల మధ్య పొటెన్షియల్ తేడాను అధ్యయనం చేశారు. పొటెన్షియల్.....?

1) అవిచ్ఛిన్నంగా పెరుగుతుంది
2) అవిచ్ఛిన్నంగా తగ్గుతుంది
3) మొదట పెరిగి తరువాత తగ్గుతుంది
4) మొదట తగ్గి తరువాత పెరుగుతుంది

74. అంతరాళంలో ఒక బిందువు వద్ద విద్యుత్ పొటెన్షియల్ V సున్నా. దీని అర్థం?

1) ఆ బిందువు వద్ద విద్యుత్ క్షేత్రం తప్పకుండా సున్నా కావాలి
2) ఆ బిందువువద్ద విద్యుత్ క్షేత్రం తీవ్రత అనంతం
3) ఆ బిందువు వద్ద విద్యుత్ క్షేత్రం సున్నా కాకుండా ఉండాలి
4) ఆ బిందువు వద్ద విద్యుత్ క్షేత్రం సున్నా కావచ్చు లేదా కాకపోవచ్చు

75. ప్రవచనం A: విద్యుత్‌క్షేత్రం సున్నా అయిన బిందువు వద్ద విద్యుత్ పొటెన్షియల్ ఉండవచ్చు
ప్రవచనం B: విద్యుత్ పొటెన్షియల్ సున్నా అయినచోట విద్యుత్ క్షేత్రం ఉండవచ్చు
ప్రవచనం C: ఆవేశపూరిత వాహక గోళం లోపల విద్యుత్ పొటెన్షియల్ స్థిరంగా ఉంటుంది

1) A, B 2) B, C
3) A, C 4) పైవన్నీ

76. సమ పొటెన్షియల్ తలంపై ఏకాంక ధనావేశం ఒక బిందువు నుంచి వేరొక బిందువు వైపు కదిలింది?

1) ఆవేశంపై పని జరిగింది
2) ఆవేశంపై పని జరుగలేదు
3) ఆవేశం వల్ల బాహ్య కారకంపై పని జరిగింది
4) జరిగిన పనిని ఊహించలేం

77. బిందు ఆవేశం వల్ల సమపొటెన్షియల్ తలం ఆకారం?

1) సమతలం 2) గోళాకారం
3) స్తూపాకారం 4) పరావలయం

78. విద్యుత్ ప్రవాహం, కాలం వక్ర వైశాల్యం?

1) విద్యుత్ పొటెన్షియల్‌ను ఇస్తుంది
2) విద్యుత్ ఆవేశాన్ని ఇస్తుంది
3) విద్యుత్ నిరోధాన్ని ఇస్తుంది
4) విద్యుత్ క్షేత్ర తీవ్రతను ఇస్తుంది

79. ఏకరీతిగా లేని విద్యుచ్ఛేదం గల తీగ గుండా విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు దాని పొడవు అంతా కూడా స్థిరంగా ఉండే రాశి లేదా రాశులు?

1) విద్యుత్ ప్రవాహం, విద్యుత్‌క్షేత్రం అపసరవడి
2) అపసరవడి మాత్రమే
3) విద్యుత్ ప్రవాహం, అపసర వడి
4) విద్యుత్ ప్రవాహం

80. వివృత (తెరచి ఉన్న) వలయం విద్యుత్ నిరోధం?

1) అనంతం 2) సున్న
3) రుణాత్మకం 4) కొన్నిసార్లు ధనాత్మకం

81. తీగ నిరోధకత ఆధారపడే అంశాలు?

1) తీగపొడవు 2) తీగ మధ్యచ్ఛేద వైశాల్యం
3) తీగ ఆకారం 4) తీగ పదార్థం

82. ఓమ్ నియమాన్ని కింది వాటిలో దేనికి అనువర్తించలేం?

1) ఇనుము 2) జర్మేనియం
3) బంగారం 4) వెండి

83. కాన్‌స్టాటన్ తీగను ప్రామాణిక నిరోధాలను తయారుచేయడానికి ఉపయోగించడానికి కారణం?

1) విశిష్ట నిరోధ గుణకం
2) సాంద్రత ఎక్కువ
3) ఉష్ణోగ్రత నిరోధ గుణకం ఉపేక్షణీయం
4) ద్రవీభవన స్థానం చాలా ఎక్కువ

84. అతి వాహక స్థితిలో విద్యుత్ వాహకత్వం?

1) అనంతం
2) ఉష్ణోగ్రతపై ఆధారపడుతుంది 3) సున్నా
4) ఆకారంపై ఆధారపడుతుంది

85. ప్రామాణిక నిరోధకాలను చేయడానికి ఉపయోగించే లోహం?

1) రాగి 2) వెండి
3) మాంగనీస్ 4) నిక్రోమ్

86. పరమ శూన్య ఉష్ణోగ్రత వద్ద జర్మేనియం?

1) వాహకంగా ప్రవర్తిస్తుంది
2) బంధకంగా ప్రవర్తిస్తుంది
3) అతి వాహకంగా ప్రవర్తిస్తుంది
4) అర్ధవాహకంగా ప్రవర్తిస్తుంది

87. వాహకం ఉష్ణోగ్రత పెరిగేకొద్ది నిరోధకత, వాహకత్వాల లబ్దం?

1) పెరుగుతుంది
2) అదేవిధంగా ఉంటుంది 3) తగ్గుతుంది
4) తగ్గవచ్చు లేదా పెరగవచ్చు
physical-science2
sreenivas

964
Tags

More News

VIRAL NEWS

Featured Articles