కెమిస్ట్రీ


Sun,February 11, 2018 11:04 PM

గతవారం తరువాయి
htmetro

45. ప్రయోగశాలలో రాగి ముక్కలను గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంలో వేడిచేసి చర్య జరపడంవల్ల వచ్చే వాయువు?

1) CO2 2) NH3
3) Cl2 4) SO2

46. H2SO4తో సంబంధం లేనిది?

1) రసాయనాల్లో రాజు 2) నిర్జల కారణి
3) ఒక ఆక్సికారణి 4) త్రిక్షారత ఆమ్లం

47. SO2 వాయువు తడి సమక్షారంలో ఏ ప్రక్రియ ద్వారా విరంజన చర్యను జరుపుతుంది?

1) క్షయకరణం 2) ఆక్సీకరణం
3) పైరెండూ
4) విరంజన కారిణిగా పనిచేయదు

48. సల్ఫ్యూరిక్ ఆమ్లం కింది ఏ లోహాలతో

చర్యజరుపవు?
1) బంగారం 2) ప్లాటినం
3) పైరెండు 4) జింక్

49. సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని విలీనపరిచేటప్పుడు?

1) H2SO4ను నీటికి చుక్కలు, చుక్కలుగా కలపాలి
2) H2SO4కు నీటిని చుక్కలు, చుక్కలుగా కలపాలి
3) ఏ విధంగా కలిపినా సరైనదే
4) అసలు కలుపకూడదు

50. H2S వాయువును సేకరించే పద్ధతి?

1) ఊర్ధముఖ స్థానచలనం
2) అధోముఖ స్థానచలనం
3) పైరెండు
4) ఏదీకాదు

51. అమ్మోనియా వాయువును సేకరించే పద్ధతి?

1) అధోముఖ స్థాన చలనం
2) ఊర్ధముఖ స్థానచలనం
3) పైరెండు
4) ఏ పద్ధతి అవసరం లేదు

52. బ్రౌన్ వలయ పరీక్షలు బ్రౌన్ వలయ రసాయనం ఏది?

1) FeSO4 2) FeSO4.NO2
3) FeSO4.NO 4) FeSO4.NO3

53. కాపర్‌పై సజల నైట్రిక్ ఆమ్ల చర్యవల్ల ఏర్పడే నైట్రోజన్ ఆక్సైడ్స్?

1) NO 2) NO2
3) N2O3 4) N2O

54. నైట్రైట్‌లను నైట్రేట్లుగా మార్చే బ్యాక్టీరియా?

1) నైట్రిఫయింగ్ 2) నైట్రోసోఫయింగ్ 3) అమ్మోనిఫయింగ్ 4) డీనైట్రిఫైయింగ్

55. వాతావరణపు నైట్రోజన్, నైట్రేట్లు లవణాలుగా మార్చడాన్ని ఏమంటారు?

1) నత్రజని వలయం
2) నత్రజని స్థాపన
3) నైట్రిఫయింగ్ 4) డీనైట్రిఫయింగ్

56. కింది వాటిలో యూరియా?

1) NH2 - O-NH2
2) NH2- C॥O-NH2
3) NH2 - C॥s - NH2
4) NO2 - C - NO2

57. కృత్రిమ సిల్క్ అనేది?

1) నైట్రోగ్లిజరిన్ 2) సెల్యులోజ్
3) సెల్యులోజ్ నైట్రేట్
4) సెల్యులోజ్ నైట్రయిల్

58. I2 + 10 HNO3D 2IO3 + 10NO2 + 4H2O ఈ చర్యలో అయోడిన్?

1) క్షయీకరించబడింది
2) రంగు పోగోట్టబడింది
3) ఆక్సీకరించబడింది
4) తటస్థీకరించబడింది

59. NH3 + 3Cl2 D X + Hcl ఈ చర్యలో X అనేది పేలుడు పదార్థం?

1) NO2 2) CO2
3) NCl3 4) N2O3

60. అమ్మొటాల్ అంటే?

1) NH4NO3 + TNT
2) NH4NO3 + Al
3) NH4NO3+ C6H6
4) NH4NO3 + C6 H5 - NH2

61. ఫాస్ఫరస్ ఎందులో లభిస్తుంది?

1) కోడిగుడ్డు 2) ఎముకలు
3) మెదడు, ఎముక మజ్జ 4) పైవన్నీ

62. వెల్లుల్లి వాసన కలిగి, విష స్వభావం ఉన్నది?

1) సల్ఫర్ 2) ఫాస్ఫరస్
3) ఫ్లోరిన్ 4) నైట్రోజన్

63. మెటా ఫాస్ఫరిక్ ఆమ్లం, ఆర్ధోఫాస్పరిక్ ఆమ్లం ఫార్ములాలు వరుసగా?

1) H3PO4, H3PO3
2) HPO3 , H3PO4
3) HPO3, H3PO3
4) H3PO4, H3PO2

64.H3PO4 + x NaOH D Y + 2H2O ఇందులో X, Yలు వరుసగా?

1) 3, NG2 HPO4
2) 2, NG2HPO4
3) 2, NG3PO4 4) ఏదీకాదు

65. కింది వాటిలో సరికానిది?

1) జిప్సం ఫార్ములా- CaSO4 2H2O
2) సూపర్ ఫాస్ఫేట్- [Ca(H2PO4)2 H2O]
3) H3PO2 అనేది త్రిక్షారత ఆమ్లం
4) H3PO4 అనేది త్రిక్షారత ఆమ్లం

66. ఫాస్ఫరస్ పరిశ్రమలో పనిచేసే శ్రామికులకు దవడ ఎముకలు నశిస్తాయి. దీన్ని ఏ జబ్బు అంటారు?

1) పాసీజో 2) జాసీపా
3) సీపాజా 4) ఏదీకాదు

67. ఎముకల బూడిద ఫార్ములా?

1) Ca3(PO4)4 2) Ca3(PO4)2
3) Ca2(PO4)5 4) ఏదీకాదు

68. కింది వాటిలో నిర్జల కారణి ఏది?

1) H2SO4 2) Al2O3
3) P2O5 4) పైవన్నీ

69. H3PO4,H3PO3, H3PO2ల క్షారతలు వరుసగా?

1) 3, 1, 2 2) 1, 2, 3
3) 3, 2, 1 4) 1, 2, 2

70. తెల్ల బాస్వరాన్ని గాలిలో ఉంచితే ఏర్పడేది?

1) ఫాస్ఫరిక్ ఆమ్లం 2) ఫాస్ఫరస్ ట్రైఆక్సైడ్ 3) మెటాఫాస్ఫరిక్ ఆమ్లం
4) ఫాస్ఫరస్ పెంటాక్సైడ్

71. నెల్సన్ ఘటం ద్వారా బ్రైన్ ద్రావణాన్ని విద్యుత్ విశ్లేషణం చేసినప్పుడు ఏర్పడే పదార్థాలు?

1) NaOH 2) Cl2
3) H2 4) పైవన్నీ

72. నెల్సన్ ఘటంలో ఆనోడ్స్, క్యాథోడ్స్‌లు వరుసగా..?

1) గ్రాఫైట్ ఆనోడ్స్‌గా, U- ఆకారపు కాథోడ్స్‌గా
2) U- ఆకారపు పాత్ర ఆనోడ్స్‌గా, గ్రాఫైట్ క్యాథోడ్స్
3) 1, 2 4) ఏదీకాదు

73. టర్పంటైన్ ఫార్ములా?

1) C10H16 2) C10H18 3) C10H20 4) C10H22

74. విరంజన చూర్ణం (బ్లీచింగ్ పౌడర్) ఫార్మూలా?

1) CaOcl2 2) Cacl2
3) Ca(OH)2 4) CaSO4

75. బ్రైన్ ద్రావణం అంటే?

1) NaCl ద్రావణం 2) KCl ద్రావణం
3) NaNO3 ద్రావణం 4) చక్కెర ద్రావణం

76. దూది, కాగితం, సిల్క్ మొదలైన వాటిని నిరంజనం చేయడానికి ఉపయోగించేది?

1) SO2 2) Cl2
3) CaOCl2 4) COCl2

77. నెల్సన్ ఘట పద్ధతిలో బ్రైన్ ద్రావణ విద్యుత్ విశ్లేషణలో ఆనోడ్స్ వద్ద వెలువడేది?

1) H2 2) NaOH
3) H2O 4) Cl2

78. గది ఉష్ణోగ్రత పీడనాల వద్ద 1 మి.లీ. నీటిలో ఎన్ని మి.లీ. HCl వాయువు కరుగుతుంది?

1) 158 ml 2) 168 ml
3) 178 ml 4) 188 ml

79. HClను సేకరించే పద్ధతి?

1) ఊర్ధముఖ స్థానచలనం
2) అధోముఖ స్థానచలనం
3) పైరెండూ 4) ఏదీకాదు

80. కాస్మిక్ సోడా, బట్టల సోడా, వంట సోడా ఫార్ములాలు?

1) NaOH, Na2CO3, NaHCO3
2) NaHCO3, Na2CO3, NaOH
3) Na2CO3, NaOH, NaHCO3
4) ఏదీకాదు
chemistry2
chandram

581
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles